April 15, 2010

మీడియా చేసేది వ్యాపారమే...!!


ఈ మద్యకాలంలో చర్చలకు వేదిక కల్పించాల్సిన మీడియానే చర్చనీయాశమైంది. ముఖ్యంగా బ్లాగుల్లో మీడియా ముఖ్యవిషయమైంది. మీడియాపైన ఎక్కువమంది వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు అన్నది సత్యం. వీరికీ వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్నయం వచ్చినా పత్రికా స్వాతంత్ర్యం మంటగలిసిపోతోంది అని పెడబొబ్బలు పెట్టే వ్యక్తులు దానికి కారణాలు శొధించాల్సినప్పుడు ఆ బాధ్యతను యాజమాన్యంపై నెట్టివేస్తూ అందులో తమ బాధ్యత లేదంటూ కప్పదాటుధోరిణి ప్రదర్శించడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రజా పక్షాన నిలబడవలసిన పత్రికలు లేద చానల్స్ ప్రభుత్వ పక్షమో లేక ప్రతిపక్షంవైపో ఉంటున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇలాటి సమయంలో పత్రికా విలువలు అంటూ అంటూ సూక్తులు చెప్పడం ప్రజల్ని వెర్రివాళ్లని చేయడమే. మీడియా అనేది ఒక సేవాసంస్థ కాదు అందులో పనిచేసేవాళ్ళు ప్రజా సేవకులు కాదు. మీడియాలో అన్నీ వ్యాపార సంస్థలే అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదికూడా ఒక రియల్ ఎస్టేట్ లాంటిదే. ఒక పత్రిక బలపరిచే పార్టీ అధికారంలో ఉంటే ఆ పత్రికకు మంచి బూం ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనలలో సింహభాగం ఆ పత్రికకే వస్తాయి. అందులో పనిచేవాళ్ళంత కేవలం ఉద్యోగస్తులు. కేవలం ఉద్యోగస్తులు. తమ పత్రికకు చదువరులు ఎక్కువ ఉంటే ప్రకటనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అందులో పనిచేవాళ్లంత చదువరులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో సేవాతత్పరత, విలువలు అనేవి ప్రస్తుతం లేవు. ఇది కాదని ఏ ఒక్కరైనా చెప్పగలరా? మరి అటువంటప్పుడు జర్నలిస్టులంటూ వీరికి ప్రత్యేక హోదాగానీ ప్రత్యేక సదుపాయాలు గానీ ఎందుకు? మీడియా అనేది నిజానికి ఒక "వాచ్ డాగ్" (తెలుగులో చెపితే కొంతమంది బాధ పడతారెమోనని)లాగ పనిచేయాలి. మీడియా నిజంగా ఆపని చేస్తోందా? దానిలో ఎన్నో స్వలాభాలు ఉంటాయి. ఆ లాభాన్ని పంచుకోవడం జర్నలిస్టుతో మొదలై యాజమాన్యంతో ముగుస్తుంది. ఆ లాభాన్ని పొందుతున్నప్పుడు కష్టాన్ని కూడా భరించాలి. ఆ కష్టం నిజంగా ప్రజలకోసం పడితే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు మీడియా వెంట ఉంటారు. కానీ జర్నలిస్టులంతా ప్రజలకోసం పనిచేస్తున్నారు, ప్రజలకోసం కష్టపడుతున్నారు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీరు మాకు దూరంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాము అనేది ప్రస్తుత పరిస్తితి.
ఒక మిత్రుడు మద్యపానం చేసి రాత్రి బైక్‌మీద ఇంటికి వెడుతూ ఉంటే ఒక పోలీసు అతడిని అపేడు. నేను జర్నలిస్టును నన్ను ఆపడానికి నీకెంత దమ్ము అని ప్రస్నిస్తే తిక్కపుట్టిన పోలిసులు అతగాడిని స్టేషన్‌కు తీసుకుపోయారు. అతడు మరో సీనియన్ జర్నలిస్టుకు ఫోన్ చేసి విడిపించమని చెపితే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్‌తొ మాట్లాడటమేమిటి? నాది ఎస్పీ లెవెల్..రేపు ఎస్పీతో మాట్లాడతాను అని చెప్పేడు. అది సంగతి!!

జర్నలిస్టులు వేరు పత్రికా యాజమాన్యం వేరు అంటూ జరుగుతున్న తతంగంలో మా బాధ్యత లేదు మేము నిమిత్త మాత్రులమంటే కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

విలువలను పాటిస్తూ ప్రజాభిప్రాయాన్ని మన్నించే, ప్రజాహితం కోసం పాటుబడే నిజమైన జర్నలిస్టులు ఒక శాతమైనా ఉండిఉంటే వారికి నా వందనాలు.


April 1, 2010

మీడియా ట్రెండ్ మారుతోందా?


గత కొన్నిరోజులుగా హైదరాబాదులో జరుగుతున్న అల్లర్లకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చెప్పకపోయినా పండగ చేసుకొనేది మాత్రం మీడియానే. ఈ అల్లర్లలో కేవలం ఇద్దరే చనిపోయారు. పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనైతేనేమి ప్రభుత్వ కృతనిత్చ్యయం వల్లనైతెనేమి బాగానే అదుపులోకి తేసుకొచ్చారు. కానీ జరిగిన అల్లర్లు మీడియాకు తగినంత వార్తలను అందించలేకపోయింది. అందువల్ల జరుగుతున్న అల్లర్లలో మషలా సరిపోక ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు తవ్వి ఆ క్లిప్పింగులను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు కలిపి బంపర్లు చేసి చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే. కాని వీటికి భిన్నంగా "జీ-24 గంటలు" స్పందించడం కొంత సంతోషకరం. "NO EXCLUSIVE, NO SENSATION" అంటూ మీడియా బాధ్యతను అందరికీ గుర్తు చేస్తోంది. సందులో సడేమియాలా దీనికి తెలంగాణా రంగు పులమడానికి అరాచకీయ నేతలు ప్రయత్నాలు నిజంగా సిగ్గుచేటు. కోదండరాం, గద్దర్ " ఇది సమైక్యవాదుల కుట్ర" అని ప్రకటించి వారి కుటిల రాజకీయాన్ని బయటపెట్టుకున్నారు. ఇలాటి సందర్భాలలో ప్రజలకు బాసటగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన తరుణంలో ఇలాటి పేలాపనలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయని తెలియని ఈయన ప్రజా గాయకుడెలా అయ్యాడో? ఏది ఏమైనా ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా ఎంతో సంయమనం పాటించాలి. దానిలో తొలి అడుగు జీ-24 గంటలుదైతే అది శుభ పరిణామమే.