May 29, 2010

రెచ్చగొడితే రెచ్చిపోయి చచ్చిపోయే పిచ్చి జనం!


రాష్ట్ర ప్రజలు అన్నీ మరచి కొద్దిగా ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, టీవీ చానల్స్ కేవలం ఎండవేడి, వడగాడ్పుల విశేషాలు మాత్రమే ప్రసారం చేస్తున్నవేళ రాష్ట్రంలో మరో సంఘటన. కులాల కుంపటి నెత్తినపెట్టుకొని గ్రూపు రాజకీయాలతో ఒకరు, ఆ ప్రాంతంలో తమ ప్రాభవానికి గండిపడుతుందేమోనని మరొకరు పోటిపడి అసలే ఎండలతో మండుతున్న రాష్ట్రాన్ని మరింత వేడెక్కించడం సాధారణ ప్రజలను ఉక్కిరుబిక్కిరి చేస్తోంది. ఒకరిని ఒక ప్రాంతంలో తిరగొద్దని అనడానికి ఇది ఎవడబ్బా జాగీరు కాదు. భారత ప్రజలు దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా తిరగొచ్చు. పిచ్చి ప్రేలాపనలు చేసేవాళ్ళని కట్టడి చేసే శక్తి ప్రభుత్వానికి లేకుండా పోయింది.ప్రచారం అనేది లేకుండా ఏ రాజకీయ నాకుడు ప్రజలకి సాయం చెయ్యడని అందరికీ తెలిసిన విషయమే. తమ గ్రూపును బలోపేతం చేసుకోవాడానికి యాత్రలు చేస్తూ చనిపోయిన కుటుంబ సభ్యులకు కొంత సాయడం చేయడం రాజకీయ నాయకులకు ప్రచారం అయినా నష్టపోయిన కుటుంబానికి ఆ చిన్న మొత్తం పెన్నిధే అవుతుంది. ఆ విధంగా జగన్ యాత్ర ఆగిపోవడం చనిపోయిన కుటుంబ సభ్యులకు నష్టమే. యాత్రవల్ల అతడు బలపడి తద్వారా తెలంగాణా ఉద్యమం నీరుగారిపోతుందేమోనని సదరు కేసీఅర్‌కు ఇతర కాంగ్రెస్ నాయకులకు కూడా భయమే. ఆ భయమే పిచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా చేసింది. జగన్ తెలంగాణాలో అడుగు పెడితే ప్రజలు ఊరుకోరు, తెలంగాణా అగ్నిగుండం అవుతుంది అంటూ నాయకులు పేలితే (కొంతమంది) ప్రజలు "అహ ఊరుకోకూడదుగాబోలు" అనుకుంటూ రోడ్డునపడ్డారు. వారికి తోడు కిరాయి కార్యకర్తలు సాగించిన విద్వంసం రాష్ట్రాన్ని మరోసారి ఉద్రేకంలోకి నెట్టింది. సాధారణ ప్రజలెవ్వరూ రైలు పట్టాలని పీకి జనాన్ని చంపుదామని అనుకోరు. దానికిసైతం తెగించారంటే దీని రాష్ట్రాన్ని అస్థిరపరచే రాజకీయ కుట్ర దీనివెనుక జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమాయకుల శరీరాల్లోకి బుల్లెట్ట్లు దూసుకువెళ్ళాయి. మరి ఈ పాపం ఎవరిది? ప్రజాహక్కులను రక్షించలేని ప్రభుత్వానిదా లేక సొంత జాగీరులను ఏర్పాటు చేసుకుంటూ నా ప్రాంతానికి మరొకరు రావద్దని శాశించే మూర్ఖ నాయకులదా? లేక పదిరూపాయల ఖర్చుతో రూపాయి పంచిపెట్టీ ప్రజా సేవకులమని భ్రమించే నాయకులదా?