September 23, 2011

వీళ్ళిద్దరు!!

సకల జనుల సమ్మె బాగానే సా..గుతోంది. జనాన్ని మూకుమ్మడిగ ఎలా ముంచచ్చో పులకేసికి తెలిసినంతబాగా మరెవ్వరికీ తెలియదు. ఎవరి చేత్తో వారికే వాతలు పెట్టుకోవడం చక్కగా నేర్పిస్తున్నాడు. వీరికితోడు నత్తి సత్తిబాబు, ఎల్కేజీ టీచర్. ఇకపై మిలటెంటు కార్యక్రమాలు మొదలు పెట్టాలిట. పైగా గాంధీజి కూడా మిలటెంట్ కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. అంటే తనని తాను గాంధిజితో పోల్చుకుంటున్నాడేమో? ఖర్మ. మొత్తం మీద చాలావర్గాల్ని సమ్మెలో భాగస్తులని చేశారు. మొదటగా టీచర్లని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో మొట్టమొదటి ఏబ్రాసులు వీళ్ళే(ప్రాంతీయ బేధం లేకుండా). అత్యంత తక్కువ సమయం పని చేస్తూ మొత్తం కాలానికి జీతం తీసుకొనే ఒక వర్గం. ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు కేవలం చులకన, అసహ్యం(క్షమించాలి తప్పదు). ఇక తరువాత రెవెన్యూ తదితర విభాగాల ఉద్యోగాలు. వీరిలో ఎంతమంది బల్లకింద చేతులు పెట్టకుండా పని చేస్తారంటారు? ఎన్ని కధలు వినలేదు, ఎన్ని సినిమాలు చూడలేదు. అందులో సెక్రటేరియట్. వీరి నాయకుడు ప్రభుత్వాన్ని వందసార్లు ఉరి తీయాలని అన్నారు. పిల్లి గుడ్డిదైతే అన్న సామేత గుర్తుకొచ్చింది. మిగిలిన వారిలో ఒకటో తారీకుకి జీతాలు రాకపోతే ఎంతమంది తాట్టుకోగలరో తెలియనిది కాదు. ఇక అసహ్యకరంగా పురోహితులు, డాక్టర్లు సమ్మె చేయడం. వీళ్ళకి ఏమి పోయికాలం వచ్చింది. సర్వే జనాహ్ సుఖినో భవన్‌తు అని ఆకంక్షించే వర్గం దేవుడి ధూప దీప నైవేద్యాలు మానేసి క్రికెట్ ఆడడం!! అది ఖచ్చితంగా విపరీత పోకడలే. పోయేకాలం దాపురించినవాడికి మంచి చెడు తెలియదు అన్నట్టు ఉంది వీరి తీరు. భగవంతుడి తరువాత అంతటి స్థానం డాక్టర్లది. ముక్కుకి మసి రాసుకొని ఎప్పుడు సమ్మె చేద్దామని ఎదురుచూసే సిబ్బంది హైదరాబాదు ప్రభుత్వ డాక్టర్లు. డ్యూటీలు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీసు చేసుకోడానికి మంచి తరుణం. మొత్తం మోద వీళ్ళందరూ యుద్ధం ప్రకటించింది తెలంగాణా ప్రజలమీద. వాతలు పెడుతున్నది తెలంగాణా ప్రజల వంటిమీద. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నది తెలంగాణా ప్రజలే. ప్రత్యేక రాష్ట్రం వస్తే భూతల స్వర్గమే అంటూ అందరినీ నమ్మించిచ ఘనత పులకేసిదే. నిజమేగాబోలు అనుకొని ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఎలా ముగుస్తుందో మరి?