ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు వీసీకి కూడా మెదడు అరికాలినుండీ మోకాలుకు చేరిపోయిందదని అనిపిస్తోంది. ఎందుకంటే జరిగిన దానిని తప్పు అని చెప్పే దమ్ము లేకపోయినా, వారిపై చర్య తీసుకునెందుకు మనసు రాకపోయినా పర్వాలేదు, కానీ దీనిని మీడియా దుశ్చర్య అని మీడియా అనవసర ప్రచారం చేసిందని చెప్పడం సిగ్గుమాలిన తనం. తెలంగాణా గొడవల్లో కూడా మీడియా అదే పాత్రను పోషించింది. సదరు వీసీని ఎవరైనా చెప్పులతో సత్కరించి ఉంటే వీరికి అభిమానం అంటే ఏమిటో తెలిసి ఉండేది. పైగా విద్యార్ధులకు నష్టం జరగకుండా వీరు చూస్తారుట. అంటే దీని అర్ధం ఆంధ్రా ప్రాంతం నుండీ వచ్చిన లెక్చరర్లు వీరికి నష్టం కలుగ చేశారనా వీరి ఉద్దేశ్యం? తోటి లెక్చరర్లను చెప్పులతో కొడితే సానుభూతి తెలపవల్సింది పోయి విద్యార్ధులపై కేసులనెత్తి వేయాలని అక్కడి లెక్చరర్లు ఆందోళన చేశారట. వీళ్ళు లెక్చరర్లా? వీళ్ళ బతుకులు చెడ! వీసి పదవికి, లెక్చరర్ మాటకి తలవంపులు తీసుకు వచ్చారు. ఇంతకన్న వెధవలు ఉండరేమో? చదువుకున్నవాళ్ళే ఇలా చస్తే, చదువు లేనివాళ్ళు మరింత మూర్ఖంగా ప్రవర్తించడం పెద్దవిషయం కాదేమో? ఇది కేవలం కాష్టాని రగిలించడానికి చేసిన ప్రయత్నమేగానీ మరోటి కాదని అనిపిస్తోంది. దానిలో కిరాయి విద్యార్ధులతోబాటు లెక్చరర్లు చేరడమే మారుతున్న విలువలకు నిదర్శనం.
August 31, 2010
August 26, 2010
బ్లాగర్లూ జర జాగ్రత్త !!
తెలుగు భాషాభివృద్ధికోసం బ్లాగర్లంతా "తెలుగు బాట" కార్యక్రమం చేబట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. గిడుగు రామ్మూర్తిగారి జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని చేబట్టడం మరింత ఆనందించాల్సిన విషయం. నాక్కూడా ఆరోజు బ్లాగర్లందరితోనూ పాల్గొని నేనేగాకుండా మరింతమందిని తీసుకురావాలని ఉంది. కానీ కొంతమంది వక్రదృష్టి దీనిమీద పడుతుందేమో అనే సందేహం కలుగుతోంది. మొదటిది తెలుగుభాష అంటే "తెలంగాణా తెలుగా?" లేక "ఆంధ్రా తెలుగా?" అనేది మొదటి సందేహం. మరి ఏ తెలుగుభాషో తెలియకుండా నేనెలా పాల్గొనేది? రెండూ ఒక్కటే అని మీరంటే నాకేమాత్రం అభ్యంతరం లేదుసుమండీ! కానీ అంతా ఒక్కటే అంటే మరి మా తెలంగాణా పులకేసి ఒప్పుకుంటాడా? కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాడా? పైగా కార్యక్రమం మొదలుపెట్టేది తెలుగు తల్లి విగ్రహం నుండి. అదే తెలంగాణా తల్లి విగ్రహంనుండి ఐతే మా పులకేసికి అభ్యంతరం ఉండదేమో బ్లాగర్లంతా ఆలోచించాలి. దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇదికూడా సమైక్యవాదుల కుట్ర, తెలుగు భాష ముసుగులో వీరంతా తెలంగాణా వ్యతిరేకంగా ఉద్యమం చేబడుతున్నారంటూ దాడిచేస్తేమాత్రం నా భాద్యత లేదు. కాబట్టి బ్లాగర్లంతా తగుజాగ్రత్తలతో "తెలుగు బాట"లో పాలొనాలని నా విన్నపం.
Subscribe to:
Posts (Atom)