July 28, 2009

హేతువాదము - కాకిరెట్ట!!

హేతువాదం అంటే ఏమిటి? హేతువాదులేవరు?
నాస్తికులనా? విఙ్నాన సంపన్నులనా? లేక వితండవాదులా?
నాస్తికత్వం లేదా ఈ నాస్తికులు అనేవాళ్ళు ఆస్తికత్వం ఆరంభం నుండే ఉన్నారు.
ఆస్తికత్వం ఎప్పటినుండి ఉంది? వేదకాలం నుండి ఉంది.
మరి వేదాలు ఎప్పుటినుండి ఉన్నాయి? ఎవరు రాసేరు?
దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి.
దీనిపై నాస్తికులు కూడా కొంత అధ్యయనాలు చేసారు.
19వ శతాబ్దంలో సర్ విలియం జొన్స్ చేసిన అధ్యయనంలో వేదాలు క్రీ.పూ. 1500లో రాయబడ్డాయి అని తీర్మానించాడు. కానీ దానికి తగ్గ అధారాలు చూపించలేక పొయాడు.
బాలగంగాధర్ తిలక్ చేసిన అధ్యనంలో క్రీ.పూ.4500కు పూర్వమే ఈ వేదాలు రాయబడ్డాయని అనడానికి కొని రుజువులు దొరికాయి. మరి అప్పుడు ఎవరు రాసి ఉంటారు?
ఙ్నాన వంతులైన ఋషులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,అధర్వణవేదం.
ఈ నాలుగు వేదాలు హిందూ మతానికి పునాదులు.
హిందూ మతం యొక్క మూల సుత్రం "మానవుడిలోనే మాధవుడున్నాడు".
అంటే సాటి మనిషిలోనే భగవంతుడిని దర్శించడం.
ఆ విధంగా హిందూ మతం యొక్క ఆదిని కనుగొనడం ఎవరివల్ల కాలేదు.
మనువు నాస్తికుడు అంటే వేదాలు నమ్మనివాడు అని అర్ధం చెప్పాడు.
అంటే అప్పటినుందే ఈ నాస్తికులున్నరన్నమాట.
ఒక ఉదాత్తామైన లక్ష్యంతో మరెంతో ఘనమైన చరిత్రతో ఆది అంతాలు లేని ఏకైక మతం
హిందూ మతం.
కాలగతిన కొంతమంది దానిని వక్రీకరించి తమ స్వార్ధానికి వాడుకున్నంత మాత్రాన
దాని మూలాలను తప్పుబట్టడం సరియైనది కాదు.
తప్పు జరిగినప్పుడు దానిని ఖండిచడానికి ఏ మతమూ అడ్డు రాదు.
హిమవత్ పర్వతాల కీర్తికి అసూయ చెందిన ఒక కాకి ఆ పర్వతంపై రెట్ట వేసి
"ఆహ నేను హిమాలయాల తెల్లదనాన్ని పోగెట్టేను" అనుకున్నదట.
అలా ఉంటాయి ఈ హేతువాదుల చేష్టలు.
హేతువాదులమనుకొనే ఓ వితండవాదులారా
మనిషియొక్క నడవడికను తప్పుబట్టండి, మతాన్ని కాదు.

11 comments:

Anonymous said...

well said.

Bhãskar Rãmarãju said...

:):)

Malakpet Rowdy said...

LOL .. The so called atheists believe the things without proof too!

మంచు said...

:):).. well said.

భాస్కర రామిరెడ్డి said...

:-D
:)
;)

అన్ని రకాల నవ్వులూ ఒక్కసారే ... బాగుంది టపా.

అశోక్ చౌదరి said...

your example is too good...

మరువం ఉష said...

నాకు "ఒళ్ళు మండినప్పుడు, తిక్క పుట్టినప్పుడు, పక్కవాడిని చంపాలన్నంత కోపం వచ్చినప్పుడు.." ఈ multiple choice లో మీకు ఈ టపా వ్రాసేముందు ఏ మూడ్ వచ్చిందో నాకు తెలిసిపోయిందోచ్..

విశ్వామిత్ర said...

పైన కామెంట్ సేసినోళ్ళందిరికి రొంబ థాంక్స్. ఇది రాసేసాకా మా గొప్ప రిలీఫ్ వచ్చేసినాది!! బ్లాగ్‌లోకపు కె ఏ పాల్స్ రాసే రాతలకి ఎవ్వడికైనా తిక్క పుడుతుంది కదండీ!! కాకి గోల భరించడం మా చెడ్డ కష్టం సుమీ!!

Vani said...

.మనం కూడా మన మనః శాంతి కోసం ఒక తీర్మానం చేసుకొందాం! ప్రతి ఎదవ బ్లాగ్ లోకి వెళ్లి వాడి చెత్త చదివి కామెంట్ పెట్టి వాడి హిట్స్ పెంచకుడా, వాళ్ళ బ్లాగ్ ఓపెన్ చెయ్య కుండ ఉందాం.
మరీ మండితే ఇలా ఒక పోస్ట్ రాస్తే సరి.
నాస్తికం నాస్తికం అని అరవ వాళ్ళు ఏమి పీకారు. దేవుళ్ళని ఒదిలి రాజకీయ నాయకులకు , సినిమా హీరో హీరోయిన్ లకు పూజలు చేస్తున్నారు, గుళ్ళుకడుతున్నారు.

Vani said...

ఇప్పుడే రౌడి, శ్రీకర్ మొ|| వాళ్ళు ఇన్నయ్య బ్లాగ్ లో ఇచ్చిన కామెంట్లు చదివాను.
నా పై అభిప్రాయం అందరికీ వర్తించదేమో అనిపిస్తోంది.
మీ అందరి పోరాట పటిమ కు నా అభినందనలు [:)]

విశ్వామిత్ర said...

మైత్రేయి గారూ మీ సూచన బాగుంది. ఇంకోలా కూడా చేయచ్చేమో
చూడండి...చెత్త రాతలు అనే కేటగిరీ పెట్టి కూడలి, జల్లెడ లో ఈ బ్లాగులను వేరేగా చూపిస్తే?