అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. స్క్రేన్ ప్లే ప్రకారం కధ నడుస్తోంది. అరెస్టు చేయగానే అంతకన్న సేఫ్ ప్లేస్ దొరకదన్నట్టు కేసీఆర్ వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఆమరణ దీక్ష కూడా తప్పింది అనుకొని ఉంటాడు. తరువాత ఆ బాధ్యత హరీష్ రావు తీసుకున్నాడు. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఊరుకోరుట. ప్రజలు సరే మరి ఈయన ఏమి చేస్తాడుట? ప్రభుత్వం కేసీఆర్ ని మరల తీసుకొచ్చి వేదిక వద్ద దింపి ఆయనను దీక్షలో కూర్చొబెట్టాలిట. మైకు ముందు హరీష్ చెప్పే మాటలు నాకైతె భలే నవ్వు తెప్పించాయి. మధ్యలో నాగం జనార్ధన రెడ్డి గారు కేసీఆర్ ని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం అంటూ కేకలు. వీరి కప్పదాటు నిర్నయాలకి ప్రజలు చీ కొట్టినా సిగ్గు రాలేదు. ఇటువంటి పరిస్తుతులలో సులువుగా భావొద్వేగానికి గురయ్యేది విద్యార్ధులే. ఉద్రిక్త వాతవరణం ఉన్నప్పుడు పోలీసు కాపలా సర్వసాధారణం. వారిలో ఒకరు పోలీసుపై రాయి విసరడంతో యూనివర్సిటీ కేంపస్ లో ఒక పోలీసుకు మొఖం పగిలి రక్తం కారడం స్పస్టంగా కనబడింది. వాళ్ళు అసలే పోలీసులు వాళ్ళు ఊరుకుంటారా? దొరికిన వాడిని దొరికినట్టు విరగ గొట్టేరు. ఎల్బీ నగర్లో ఒక విద్యార్ధి పెట్రోల్ పోసుకుంటే టీఆరెస్ కార్యకర్తలే నిప్పు పెట్టారుట. వాళ్ళు కార్యకర్తలో లేక నర రూప రాక్షసులో తెలీదు. ఐనా మన దేశంలో పార్టీ కార్యకర్త అంటే వారి స్థాయి ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు. అదృష్టం కొద్దీ అతడు కొద్దిపాటి గాయాలటో బైటపడ్డట్టు అనిపించింది. ఒకవేళ అతడికి ఏమైన ఐఉంటే అతని తల్లికి కలిగే గర్భశోకాన్ని కేసీఆర్ పోగొట్టగలడా? తెలంగాణా ఏర్పడినా అతని జీవితాన్ని తిరిగి ఇవ్వగలడా? ఇటువంటి త్యాగాలు ముందు టీఆరెస్ నాయకులు చేసి తరువాత ఆచరించమని చెపితే బాగుండేది. అది కేసీఆర్ తొ ప్రారంభిస్తే మరీ బాగు.
నేనే పోలీస్నైతే ముందుగా కవరేజ్ కొచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే చెత్త న్యూస్ చానెల్ విలేకరుల వీపు పగలగొట్టేవాడిని. మరి కేసీఆర్ ని అరెస్టు చేసారు కదా మీరేమి చేస్తారు అంటూ అగ్గిపుల్ల ప్రశ్నలు వేసి వారు చెప్పే ఎగవేత మాటలు మరల మరల ప్రసారం చేయడం. అది విని అమాయక విద్యార్ధులు రెచ్చిపోవడం. ఇంకా నంగి నంగి మాటలలో మాటలు కూడా మాట్లాడలేని విద్యార్ధులు ఉద్రేకంగా చెప్పే మాటలు పట్టుకొని ఇక్కడ వాతవరణం చాలా ఉద్రిక్తంగా ఉందని సొల్లు కబర్లు చెప్పడం. ఈ రాజకీయ జగన్నాటకంలో ఎంతమంది బలవుతారో ?
నేనే పోలీస్నైతే ముందుగా కవరేజ్ కొచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే చెత్త న్యూస్ చానెల్ విలేకరుల వీపు పగలగొట్టేవాడిని. మరి కేసీఆర్ ని అరెస్టు చేసారు కదా మీరేమి చేస్తారు అంటూ అగ్గిపుల్ల ప్రశ్నలు వేసి వారు చెప్పే ఎగవేత మాటలు మరల మరల ప్రసారం చేయడం. అది విని అమాయక విద్యార్ధులు రెచ్చిపోవడం. ఇంకా నంగి నంగి మాటలలో మాటలు కూడా మాట్లాడలేని విద్యార్ధులు ఉద్రేకంగా చెప్పే మాటలు పట్టుకొని ఇక్కడ వాతవరణం చాలా ఉద్రిక్తంగా ఉందని సొల్లు కబర్లు చెప్పడం. ఈ రాజకీయ జగన్నాటకంలో ఎంతమంది బలవుతారో ?
40 comments:
Really these 24 Hrs bloody NEWS channels are creating hell. They don't have any stuff to telecast and creating hype for everything and enjoying. Really these fellows don't have any social responsiblity, first of all something should be done to these idiotic channels.
very simple. They should be taken to custody before any event is taking place. :)
అంతే అంటారా:) నాకొక సందేహం నిజం గా ఈ పిల్లలంతా ఆ యునివర్సిటీ లో చదివేవాల్లెనా అని ?
ఈ రాజకీయ జగన్నాటకంలో ఎంతమంది బలవుతారో ?
the count doesnt matter to politicians as long as it doesnt include their kin. some student's condition is serious in Apollo. if anything happens to him it will be a big issue for the next month or so!! news channels will get huge amount of stories to telecast.
@ శ్రావ్య గారూ మీరు అన్నది కూడా నిజమే. విద్యార్ధులలో కొంతమంది గెడ్డాలు మీసాలు చూస్తే విద్యార్ధుల్లా లేరు. వీరివెనుక కార్యకర్తల సపోర్ట్ కూడ ఉంటుంది.
@ కార్తీక్ ....నిజమే ఎంతమంది చస్తే పార్టీకి అంత లాభం అలాగే చానల్స్కి న్యూస్ కి కొదవ ఉండదు.
mee andhraa buddulu maraava vaalu students kadataa ...
meeko vishyam cheppali maa ee thandlataa kcr kosam harish rao kosamo kadu ..telanagana sadana kosam ...
ippudi ee sanagatana kevalam okaa malupu maatrame ...
idi students lo neevuru kappina nippu
Jai Telanagana
టీవీ చానెల్స్ ని తిట్టే వాళ్ళకు నేను ఒకటే చెప్పేది...remote మీ చేతిలో వుంది...టీవీ మీ ఇంట్లో వుంది....మీరు చూడటం ఆపేస్తే చాలు....ఆ టీవీ ఛానల్ వాడికి గూబ పగులుతుంది....
P.S : నేను టీవీ చూడను.
హరీష్ గారు మీరు చెప్పినదానితో నేను ఏకీభవిస్తాను కాకపొతే అప్పుడు అప్పుడప్పుడు అత్యుతాహం తో ఇలా బలి అవుతానన్నమాట.
ప్రేమచంద్ గారు దీన్నేనా మీరు ఆంధ్ర బుద్దులు అని తెగ తిడుతుంటారు, ఇన్ని రోజుల అర్ధం కాక ఏమి అన్యాయం జరుగుతుందో అని జుట్టు పీక్కునేదాని ధన్యవాదాలు మీరు నా సందేహం తీర్చినందుకు . దీనికే మరింత ఫీల్ అవుతుంటే పొద్దున్న లేస్తే మీరు అడిపోసుకొనే మాటలకు ఆంధ్ర వాళ్ళు ఎంత ఫీల్ కావలి ?
అయ్యా/అమ్మా, మీరు కె.సి.ఆర్ గురించే ఎందుకు అలోచిస్తున్నారో అర్థం కాదు, తెలంగాణా కావాలని తెలంగాణా లొ కనీసం 70 శాతం మంది కోరుకుంతున్నారు, కాని అందరు చురుకుగా ముందుకు రాకపోవచ్చు, అంత మాత్రాన తెలంగాణా ఎవరు కోరుకోవట్లెదు అని అనడం మాత్రం అన్యాయం, అన్ని మీకు డ్రామా లాగానె ఎందుకు కనిపుస్తుందో నాకైతె అర్థం కావట్లేదు.
శ్రావ్య గారికి, ఎందుకు ఆడిపొసుకుంటున్నారో మాత్రం అలోచించరు, ఎన్ని రోజులైనా మా పైన అన్యాయాలు జరుగుతుంటె సహించాలనా మీ అభిప్రాయం, మీకు అంత బాధ కలిగితె మీరు ఎందుకు ఇక్కడ తిట్లు తినుకుంటు ఉండదం, ఐనా తెలంగాణా ప్రజలందరూ మిమ్మల్ని ఎం దూషిచట్లేదే, మీరు కె.సి.ఆర్ ని మాత్రమే చూడకండి , తెలంగాణా ప్రజలలో ఉన్న బాధని కూడా గమనిచండి.
మీసాలు గడ్డాలూ వున్నంతా మాత్రాన వాల్లు విద్యార్థులు కాదాని మీరెలా అనుకుంటారు, ఒస్మానియా యూనివర్సిటీ లో పి.హెచ్.డి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాల్లు విద్యార్థులు కాదనా మీ ఉద్దెశ్శ్యం
@ ప్రేంచంద్ నాదో చిన్న సందేహం. తెలంగాణా ప్రజా సమస్య అయినప్పుడు తెలంగాణా ఉద్యమంకోసమే ఏర్పడిన టీఆరెస్ ను ప్రజలు తెలంగాణాలోనే ఎందుకు తిరస్కరించారో చెపుతారా? ఒకవేళ ప్రజాభిప్రాయం అదే అయినప్పుడు దానికి టీఆరెస్ నాయకత్వాన్ని తిరస్కరించేనట్లేగదా?
ఫణి గారు నిజం గానే నాకు తెలియకనే అడుగుతున్నాను ఎందుకు ఆడిపోసుకుంటారు ఆంధ్ర వాళ్ళంటే నిజం గానే నాకు తెలుసుకోవాలని ఉంది .ఇక ఎందుకు ఇక్కడ ఉంటారు అని అడుగుతున్నారు కదా నా చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేసేవారు మరి మేము ఎక్కడ ఉండాలి, ఇప్పుడు నాకు కాబోయే భర్తది హైదరాబాద్ మరి నేనెక్కడ ఉండాలి ? తెలంగాణా ప్రజలు అందరు దూషిస్తున్నారని నేను అనడం లేదు, కాని దీన్ని తమ స్వప్రయోజనానికి వాడుకునే ప్రతి ఒక్కడు ఇదే మాట, అంతెందుకు ఇవాళ నేను టీవీ చూస్తున్నాను ప్రతి వాళ్ళు అదే మాట ఏమి చేసారు ఆంధ్ర వాళ్ళు మిమ్మలిని ? నిజం గా ప్రత్యెక రాష్ట్రము కావాలంటే దాని కోసం పోరాడండి కాని సాటి జనాలను ఎందుకు ఆడిపోసుకుంటారు . మీరు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని మర్చిపోతున్నారు ఇది ఒక్క తెలంగాణాకే కాదు , మన ఖర్మ కొద్ది గత కొద్ది సంవత్సరాలు గా ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కేంద్రీకృతం అవుతుంటే జనాలు బ్రతకటానికి వలసలు రాక ఏమి చేస్తారు ? ఉన్నఊరి లో అన్ని వసతులు ఉంటె ఎందుకు సుఖం గా ఉండగా వలసలు వస్తారు ?
తెలంగాణా జనాలు బాధలను అర్థం చేసుకోమని చెబుతున్నారు బానే ఉంది కాని మిగిలిన ప్రదేశాలలో కూడా సామాన్య జనాల పరిస్తితి ఇంతకన్నా అందం గా ఏమి లేదు వాళ్ళు ను ద్రోహులు గా చూడకండి అనే నా విన్నపం .
ఇంకొక విషయం ఫణి గారు ఇది అందరికి తెలిసిన విషయమే యునివర్సిటీ లలో సగం మంది విద్యార్థులు ఉంటె మిగిలిన సగం ఎవరుంటారో ఇది ప్రత్యేకంగా నేను ఎద్దేవా చేయలేదు .
విశ్వామిత్ర గారు క్షమిచండి మీ స్పేస్ అంటా నేనే తినేస్తున్నందుకు :)
విశ్వామిత్ర, ఎన్నికలలో టి.ఆర్.ఎస్. ఒక్కటే తెలంగాణా కొసం మెము పాటుపదుతాం అని చెప్పలేదు, ప్రతి పార్టి మేము కూడా మద్దతు తెలుపుతాం అని ప్రకటించినప్పుడు, తప్పకుండా ఆ ఆ పార్టీ కార్యకర్తలు వారి వారి పార్టీలకి ఓట్లు వేస్తారు , మీరు ఓట్లనే ద్రుష్టి లొ పెట్టుకోకండి , ప్రజలలో తెలంగాణా కావాలనే ఆకాంక్ష ఉన్నది , దాన్ని మీరు కె.సి.ఆర్ ని బూచిగా చూపి ఎద్దేవా చెయ్యాల్సిన అవసరం లేదు
@ ఫణి......నేను నిరసించేది మాత్రం కేసీఆర్ నే. దేశ విభజన జరిగినప్పుడే ప్రజలకి ఎక్కడ ఉండాలి అనేది వారి అభిమతానికి వదిలిపెట్టారు. అలాంటిది కేవలం రాష్ట్ర విభజన చేస్తే ఇక్కడి ప్రజలకి స్వేచ్చ ఉండదా? తరిమేస్తా, భగాయిస్తా లాటి పిచ్చి వాగుడు మీకు తప్పు అనిపించకపోవచ్చు. తెలంగాణా కోసం చాలామంది పోరాటం చేస్తున్నా ప్రస్తుతం దానికి నాయకత్వం చేస్తోంది మాత్రం కేసీఆరే కదా? మిగిలినవాళ్ళు ఆయన వెనకాల ఉన్నారు. కాబట్టి అందరిని తప్పుబట్టాల్సి వస్తోంది.
విశ్వామిత్ర గారికి, నేను మీరు కె.సి.ఆర్ ని విమర్శిస్తె నాకు అభ్యంతరం లేదు, కాని ఆ వంకతో తెలంగాణా ఉద్యమం ఒక డ్రామ లాగా చిత్రించె ప్రయత్నం చెయ్యడం మాత్రమే అభ్యంతరకరం.
శ్రావ్య గారికి, ఎందుకు ఆడిపొసుకుంటున్నారో మీకు తెలియదా, ఎప్పుడో 50 ఏళ్ళ కింద విశలాంధ్ర ఏర్పడినప్పుడు తెలంగాణా ని విలీనం చెసినప్పుడు కొన్ని ఒప్పందాలు చెసుకున్నారు ( పెద్ద మనుషుల ఒప్పందం, స్థానిక ఉద్యోగాలు, ఇలాంటివి) -- కాని ఒక్కదాని కూడా అమలు చెసిన పాపాన పొలేదు, అది ఒక కారణం, అలాగే మా భాషని మీది తెలుగేనా అనే కుసంస్కారులు ఎంత మందో, అలాగే, ప్రభుత్వ రంగ సంస్థలు ఒదిలెయండి, ప్రైవేటు కంపనీ ల లో పని చేయాడానికి కూడా ఇక్కడ అర్హులే దొరకలేదా.( ఎంత శాతం మంది ఉన్నారు తెలంగాణా వాళ్ళు అంధ్రా కంపనీలలో) , మిమ్మల్ని ఎవరు వెల్లగొట్టట్లేదు, అది మేము కోరుకోవడం లేదు కూడా,
నేను కె.పి.హెచ్.బి లో ఉంటాను, మా తో మీ భాషా ఒక భాషేనా అని వెక్కిరించిన వాళ్ళు మా పక్కకే ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అలా అని అందరిని ఒక్క గాటున కట్టడం కూడా ఒప్పు కాదు, కాని ఎక్కువ శాతం అలాంటివాళ్ళే ఉన్నారు, ఇది నా స్వానుభవంతో చెప్తున్నా.
ఉద్యొగాలన్నీ ఇక్కడ కెంద్రీకృతం అవుతున్నాయి అంటున్నారు, అదే అన్ని ప్రాంతాలని సమానంగా చూసే నాయకులుంటే ప్రజలు పొట్ట చెత పట్టుకోని వలసలు వెల్లాల్సిన పని లెదు, (అంధ్రా అంతా అభివ్రుద్ది చెందింది అని నేను అనను, అక్కడ కూడా వెనకబాటుతనం ఉంది). అలాగే, ఇక్కడ కేంద్రీకృతమైన ఉద్యోగాలలో స్థానికులాకి కూడా అవకాశాలు కలింగిచ బడాలి కదా.
మేము అడిగేది కూడా ముందు చేసుకున్న ఒప్పందాలు అన్ని ఉల్లంఘించబడ్డాయి కాబాట్టి మా రాష్ట్రం మాకు కావాలి అంటున్నాం. అంతె కాని సెట్టిలర్స్ని మీరు మీ ఊళ్ళకి వెళ్ళిపోంది అని చెప్పట్లెదే,
మీరు మరీ అమాయకంగా అడుగుతున్నారు, ఎక్కడ పుట్టినవాడు అక్కడ స్థానికుడె అవుతాడు. అది నేను చెప్పఖరలేదు మీకు.
ఇంకొక్క విషయం, తెలంగాణా రాష్త్రం అనేది ముందు నుండి ఉన్నదే, ఈ రోజు మెము కొత్తగా ముక్కలు చెయ్యండి అని ఎం అనట్లేదు, మా ముక్క మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం.
మా భాషంటె వెక్కిరింత, మా సంస్కృతి పట్ల చిన్న చూపు, మా న్యాబద్దమైన హక్కులు కల్పించడం లో నిర్లిప్తత, ఇవ్వాన్ని భరించలేక ఆడిపోసుకుంటున్నారు
మీరు అవునన్న కాదన్నా ఇది నిజం.
to sravya sorry that I couldn't post all the content at once.. the above 3 comments are the reply given to you.
@ శ్రావ్య...స్థలం గురించి మీరు బెంగ పెట్టుకొనక్కర్లేదు. బ్లాగర్.కాం బొలేడు స్థలం ఇస్తాడు లెండి :) మీరు వెలిబుచ్చిన అభిప్రాయమే ఇక్కడ స్థిరపడిన వాళ్ళందిరిదీ. పది సంవత్సారాలు ఉంటేనే అమెరికాలో విదేశీయులకి సైతం గ్రీన్ కార్డు ఇచ్చేస్తున్నారు కదా ! అలాటిది మన దేశంలో 30 లేక్ 40 సంవత్సరాలు ఒక చోట ఉంటే ఇక్కడ ఉన్నవాళ్ళకి హక్కు ఉండదా? హైదరాబాదు, తెలంగాణా కేసీఆర్ అబ్బ సొత్తు కాదు. సరిహద్దు కేవలం రాష్ట్రాలకి మాత్రమే. దేశ ప్రజలని విడగొడతామనే వాళ్ళని చెప్పుతో కొట్టాలి.
విశ్వామిత్ర, దేశ ప్రజలని ఎవడు విడకొద్తున్నాడు, మేమేమి మాకు ప్రత్యేక దెశం కావాలని అనట్లేదు, ప్రత్యేక రాష్ట్రం అంటె దేశం లొ అంత్రభాగమనే ఇంగితం మీకు ఉందనే అనుకుంటున్నా,
మీరు ఎలాంటి వాఖ్యలు చేసినా మేము మాత్రం భరించాలి. ప్రతిస్పందన మాత్రం సహించరు.
@ ఫణి..తెలంగాణా ఉద్యమం డ్రామా కాదు....తెలంగాణా ఉద్యమంలో కేసీఆర్ చేసేది డ్రామా.
కె.సి.ఆర్ చేసెది డ్రామా ఐతే కావచు గాక, తను ప్రజలను ముందుకు నడిపించడం లో ఈ డ్రామా వల్ల విజయం సాధించాడు, ఆ తర్వాత ఎమైనా మాట మారిస్తే ప్రజలే బుద్ది చెప్తారు
already he learnt his lessons ani nenu anukutunnaa..
ఫణి మీరు అనలేదు. ఇక్కడ స్థిరపడిన వాళ్ళను తరిమేస్తా అని ఇంగిత జ్యానం లేని మీ నాయకుడన్నాడు కదా ! ! మరచి పోయారా?
ఇక్కడ మీరొక విషయం గ్రహించాలి. తెలంగాణా అనేది ప్రజల మధ్య సమస్య కాదు. ప్రజలకు రాజకీయ నాయకులతో ఉన్న సమస్య. ఇప్పటికి తెలంగాణా అభివృద్ధి కాకపోవడానికి కారణం రాజకీయ నాయకులే.
అవును, నేను మరచి పోలెదు, అలా అనడం తప్పే అని తెలంగాణా వాళ్ళు కూడా ఖండించారు, కాని ఆ తర్వాత కె.సి.ఆర్ ఇచిన వివరణ మీరు మరచి పొయారా, నేను అంధ్రవాలా భాగో అన్నది భూకబ్జా దారులు, మోసం చెసే పెట్టుబడి దారుల గురించే అని చెప్పింది
మీరన్నది కరెక్టే, రాజకీయ నాయకులే కారణం. మా దగ్గర ఓ సామెత ఉంది,
ఇసంత రమ్మంటె ఇల్లంత నాదే అన్నడంట ఎనకటికి అని -- మనం మనం ఒకటి అని చెప్పి కలిసినప్పుడు అందరిని ఒక లాగ చూడాలి అని తెలివిలెదా పాలకులకి.
ప్రజలలో ఈ ప్రత్యెక రాష్ట్ర భావన ఉంది, కాని దాన్ని జనాలలోకి చొప్పించుకు పోవాడానికి కూడా ఒక ఊతం కావాలి, దురదృష్టమో అదృష్టమో అది కూడా రాజకీయ నాయకుడే కావడం,
కాని కె.సి.ఆర్ వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా, తన స్వలాభం కోసం ఎం చెసినా, ప్రజల మనొభవాలకు ఒక మాధ్యమం గా ఉపయొగపడుతున్నాడు, అందుకే కె.సి.ఆర్ తప్పులు చేసినా ప్రజలు వెంట ఉన్నారు
మా ప్రాంతపు నాయకులని నేను వెనకేసుకు రావటంలేదు, మా ప్రాంతం, మీ ప్రాంతం అని కాకుండా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అందరి పైన నాకు సద్భావం లేదు
చెల్లీ.. శ్రావ్యా....
ఇంత అమాయకం గా మాట్లాడుతున్నావ్... ఇక్కడ పుట్టిన నువ్వు మా ఆడపడుచువు.. రెండు ప్రాంతాలు మాత్రమే చేయమంటున్నాం... అంత మాత్రాన తెలుగు వాళ్ళని ఎవరూ విడదీయలేరు.. ఎవరూ ఇక్కడ నుండి వెల్లఖ్ఖర లేదు... ఇప్పటి వరకు జరిగిన ఉళ్ళంఘనలు చాలు.. ఇక ముందు వద్దు... అంటూ విడదీయమంటున్నాం... ఈ రోజు ప్రభుత్వ, పోలీసు దురహంకార ప్రవర్తనని తప్పు బట్టలేని ఈ విశ్వామిత్రునికి ... కనీసం కేబుల్ కనెక్షన్లు, పవర్ కనెక్షన్లు తీయాటాన్ని నిరసించని ఈతడు... తలలు పగిలిన విద్యార్తులను తప్పు పట్టాడు...
విశ్వామిత్రా.. నీ వాదన పక్షపాత ధోరణి కాదని ఎలా నిరూపించుకుంటావు.... ?
జై తెలంగాణ
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వట్టికూటి శ్రావ్య కి
ఆశీర్వదించి వ్రాయునది.
పెళ్లి చేసుకుని మా ఆడపడచుగా మారి మా తెలంగాణలో అడుగుపెట్ట బోతున్న నీకు మంగళ హారతుల స్వాగాతమమ్మా .
ఈ గొడవలు చూసి అనవసంగా మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోవద్దు తల్లీ. తెలంగాణా ప్రజల మాట పైకి వినసొంపుగా ఉండక పోవచ్చు గానీ వాళ్ళు కపటం లేని అమాయకులమ్మా . పైకి ఒక మాట లోపల ఒక మాట ఇక్కడి వాళ్లకి చేతకాదు తల్లీ.
వాళ్ళ బాషని సినిమాల్లో రౌడి గాళ్ళకి ఉపయోగించి, ఉపయోగించి కొందరు ఆంద్ర ఎదవలు అపభ్రంశం చేయడం వాళ్ళ నీకు ఏమైనా దురభిప్రాయం ఏర్పడి వుంటే అది పూర్తిగా తీసేయి తల్లీ.
మెజారిటీ తెలంగాణా ప్రజలది వెన్నలాంటి మనసమ్మా .
స్నేహానికి, విలువలకి, మంచికి ప్రాణం ఇస్తారు.
అంతెందుకు ఇంకో మాట చెప్పనా మా ఆవిడది కూడా మీ ఇలాకయే తల్లీ. తూ గో జిల్లా. చెట్టుమీది కాయనూ సముద్రంలో ఉప్పునూ కలిపినట్టు దేవుడు ఏదో మమ్మల్ని కలిపెసాడు. నేను కడియం నర్సరీల సౌందర్యాన్ని, కాకినాడ కాజాలని, పూతరేకుల్ని ఆస్వాదిస్తాను, తను మా బతుకమ్మ పండుగనాడు అందరితో కలిసి ఇక్కడ బతుకమ్మ ఆడుతుంది. మా కాపురం లో ఎట్లాంటి పొరపొచ్చాలు లేవమ్మా .
కాబట్టి నువ్వేం ఆందోళన పడొద్దు. భూ కబ్జా దార్లు, రాజకీయ నాయకులకు నష్టం జరగొచ్చు కానీ మనలాంటి సామాన్య ప్రజలకు ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఎట్లాంటి నష్టం వున్దదమ్మా. అన్న దమ్ముల్లా గొడవ్లలేకుండా విడిపోయేందుకు కొందరు ఎదవలె అడ్డుకుంటున్నారు.
లేని పోనీ దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ విడిపోయాక ఆంధ్రా తెలంగాణా మధ్య బెర్లిన్ గోడ ఏమీ కట్టరు తల్లీ . ఆంద్ర వాళ్ళు బెంగళూరులో చెన్నైలో వున్నట్టు హైదరాబాద్ లో కూడా నిక్షేపంగా ఉండొచ్చు .
వుంటాను తల్లీ
రాజన్న గారు, తెలంగాణా గారు మీ అభిమానానికి ధన్యవాదాలు !
తెలంగాణా గారు ఇక్కడ విశ్వామిత్ర గారు తప్పు పడుతుంది విద్యార్ధులని కాదు, వారిని పావులు గా వాడుకుంటున్న వారిని . నిజం గా మీరు మనస్పూర్తి గా ఆలోచించండి, కెసిఆర్ గారు నిరాహారదీక్ష చేయాలంటే ఒక పది రోజులనుండి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు చూడండి అవి జనాలను ఉద్రేకపరిచేవి కావు ?ఇలా అరెస్ట్ చేయాలనే అల్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని అనిపించటంలేదు ? విజ్ఞత కలిగిన ఎవరు చెప్పిన ఒక్కటే తెలంగాణా ప్రజలకు తమకు ప్రత్యెక రాష్ట్రం కావాలని పోరాడే హక్కు ఉంది, కాని అది వేరే ప్రాంత ప్రజలను కించపరిచి సాధించేది ఆ ఉండద్దు అని .
@ తెలంగాణా...నా మాటలు మీకు అలా అనిపించడం దురదృష్టం. వారి జీవితాలు ఈ గొడవల్లో నాశనమైపొతే ఆ ఇంటివారి శోకాన్ని ఎంత డబ్బులిచ్చినా పోగొట్టగలమా చెప్పండి.. కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు కాకుండా ప్రజలు కూడా స్పందిచినప్పుడు అది నిజమైన సమస్యగా ప్రతి ఒక్కరూ ఒప్పుకొనె తీరాలి. కానీ దానికి విద్యార్ధులే ఎందుకు బలవ్వాలి. పనికిమాలిన నాయకులను కార్యకర్తలను ముందుగా తగలబెట్టుకోమనండి.
@ రాజన్న గారూ ప్రజల మధ్య ఎలాంటి విద్వేషాలు లేవు. బహుశ రావు కూడా రాజకీయ నాయకులు రెచ్చగొడితే తప్ప. మీ భార్య మనసు ఎలాంటిదో ఆంధ్ర ప్రజల మనస్సు అలాంటిదే. మధ్యలో మీరో మాట వాడారు. వాటివల్లే అభిప్రాయ బేధాలు వచ్చేది. మీరు పెద్దవారు. ఇంతకన్నా చెప్పలేను.
రాజన్నగారు,
అదే 'ఆంధ్రా వెధవలు' సికాకుళం సిన్నోల్లనీ ఎగతాళి చేస్తారు, తూగో/పగో వాళ్లనీ ఏడిపిస్తారు, చిత్తూరోళ్ల తమిళ యాసనీ వెక్కిరిస్తారు, కర్నూలు/కడప వాళ్లందరూ సూమోల్లో గొడ్డళ్లు పట్టుకు తిరిగే పక్కా ఫ్యాక్షనిస్టులంటారు .. అంతెందుకు, స్వయానా తమ ఆంధ్రాలోని అమలాపురం మరియూ చిలకలూరిపేట అమ్మాయిలందరూ 'ఆ టైపే' అని తేడాగా చూస్తారు. వాటికి తెలంగాణ వాళ్లూ వంత పాడతారు.. వీటినే వంకలుగా చూపిస్తే జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చెయ్యాల్సుంటుంది!
ఆంధ్రావాళ్ల గొడవ అవతల పెట్టండి. సర్దార్జీల మీద జోకులేసే తెలంగాణ స్నేహితులు నాకు లెక్కలేనందరున్నారు. తమిళులని సాంబారుగాళ్లనీ, బీహారీలందరూ బందిపోట్లేననీ ఈసడించేవాళ్లూ ఉన్నారు. అదేమి మర్యాద మరి?
ఏ ప్రాంతంలో ప్రజలూ అందరూ అమాయకులో, వెధవలో అయ్యుండరు. రాష్ట్రం చీలటానికి ఇష్టపడని వాళ్లందరూ దానివల్ల ఏదో లబ్ది పొందేవాళ్లే అయ్యుండాల్సిన అవసరం లేదు. కాబట్టి సమైక్యవాదుల్నందర్నీ కట్టగట్టేసి 'ఎదవలు' అనటం సంస్కారం అనిపించుకోదు.
వట్టికూటి శ్రావ్య, విశ్వమిత్ర, అబ్రకదబ్ర గార్లకు -
ఇప్పుడు మనమంతా తెలంగాణా ఆంద్ర రాష్ట్రాలు సామరస్యంగా, అన్న దమ్ముల్లా విడిపోవడం గురించి ఆలోచించాలి
కాని ఇంకా కోడిగుడ్డుకు ఈకలు పీకే ప్రయత్నం చేసినట్టు పనికిమాలిన విషయాలను పట్టించుకోకూడదు.
ఇంకా ఎంతకాలం ఈ గొడవ ?
విడిపోక తప్పదని తేలిపోయింది కదా .... అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంత పరంగా, మానిఫెస్టో ల పరంగా విడిపోయేందుకు అనుకూలతను ప్రకటించాయి కదా ... ఇంకా ఎందుకు ఈ అనవసరపు రాద్దాం తాలు , ఎందుకు ఈకాలయాపణలు ?
అబ్రక దబర గారూ
>> "సమైక్యవాదుల్నందర్నీ కట్టగట్టేసి 'ఎదవలు' అనటం సంస్కారం అనిపించుకోదు."<< అన్నారు.
ఎంత అన్యాయమండి.
నేనెక్కడ అన్నాను అంత అసహ్యంగా?
తెలంగాణా యాసని సినిమాల్లో రౌడీలకి ఓ అదే పనిగా ఉపయోగించి ఉపయోగించి తెలంగాణా వాళ్ళంటే అనాగరికులు, దుర్మార్గులు, సంస్కార హీనులు అనే భావాన్ని ప్రచారం చేసిన సిన్మా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నాను.
అట్లాగే మా తెలంగాణలో తెలంగాణా ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పిచ్చిగా వాగుతున్న వాళ్ళని మేం "తెలంగాణా కుక్కలు" అనే అంటున్నాం . దీనర్ధం తెలంగాణా వాళ్ళంతా కుక్కలని కాదు కదా.
దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి.
మహా ప్రస్తానం లో కొంపెల్ల జనార్ధన రావు కోసం కవితలో మహాకవి శ్రీ శ్రీ " దొంగ లంజా కొడుకు "లసలే మెసలే ధూర్త లోకం లో బతక లేక తలవంచుకు వెళ్లి పోయావా నేస్తం ... అన్నారు తెలుసు కదా?
. దానర్ధం ఈ లోకం లో వున్న వాళ్ళంతా "దొంగ లంజా కొడుకులు " అనా అర్ధం.
ఇంకా ఈ మాటల యుద్ధం వద్దండి.
అన్న దమ్ముల్లా విడిపోయే మార్గాల గురించి మాట్లాడండి !
Sir , Naku matladadam radu .. First time oka commnet rasthunna . Naku antha loka gynanam kuda ledu ..thappu matladithey kshamistharani aasisthu ..
Nenu samaikyavadhini sir .I am A stupid common man , who always thinks of changing the world instead of changing himself ..
@All supporters to telangana ,
Yenduku vidipovali sir ,, Ippudu yem thakkuvaindi sir Telangana ki ?? Abivrudhi thakkuvaindhi antara ?? ha ha ..Yekkada undhi sir abivrudhi mana state lo (aa mataki vasthey India lo ..) .. Nijanga telanganani abivrudhi cheyalanukuntey ,separate state (Power kuda chethilo lekunda .. )avasaram lekunda cheyochu sir e politicians ... Asalu develpoment yenduku jaragadam ledu sir ?? ,Ultimate answer Politicians(your region politician's only regardless of the party they won) , Meru elections lo photi cheyandi .. Meelo manchi fire undhi , e comments (Frankly Avi chadivi nenu kuda oka nimisham Telangana supporter aipoya ..) lo rasinavi prajalaku cheppandi .. Assembly ki poyi poradandi , funds theesukurandi , Develope cheyandi ..Never think I am regarding to telangana , andhra .. think only as I am an Indian .. I expect Don't even think I am an Indian ..think I am a Stupid Common man(Humanbeing on earth) , Dude ..
e comments rayaniki waste chesinantha time yeppudaina telangana abivrudhi ki kosam alochinchi untey .. Yeppudo telangana bagupadedhi sir , As usual ga me pakkana unna humanbeings kuda bagupadatharu ..
Inka Jobs lo anyayam jarigindantara ?? Sir Candidate lo nijanga worth vuntey vanni Andhra vadu kadhu kadha , America vadu kuda aapaledu ..Inka pothey Govt. Jobs .. Daniki manam yem cheyalemu .. Adhi mana Constitution lo unna pedha mistake .. Reservations ??
Again ultimate solution .. Someone who have fire in him (Like you all people ) to develop their place should become a leader ??
Stop fighting and start thinking how to develop ?
Next time elections lo participate chesi , me telanganani develop chesukuntarani aashisthu ..
Me Stupid Common man .
PS : Inni sookthulu cheppadu inthaku veedu particiapte chesada elections lo anukuntunnara ?? ha ha .. Naku eligibility ledu sir last elections ki ..
Next time sure ga particiapte chestha..
కొండా రెడ్డి గారూ
అంతా బాగానే ఉంది గానీ పోలిటిక్స్లోకి ఎవరు వస్తారు? కేసీఆర్ లాటి నాయకులే వస్తారు. నిజంగా సేవ చేద్దామనుకునే వాళ్ళకి డిపోజిట్లు కూడా దక్కవు. మీరు చెప్పిన విశాల భావాలు ఉండి ఉంటే సమస్య ఇక్కడిదాకా వచ్చేది కాదు
మొత్తానికి డ్రామా ముగిసిందండి మరి ఈ తతంగానికి జనాల సొమ్ము ఎంత ఖర్చు అయ్యిందో, ఎన్ని బస్సులు తగలపడ్డాయో :(
Post a Comment