November 30, 2009

స్విమ్మింగ్ గోదావరి విత్ డాగ్ టైల్

అర్ధమైందా మీకు? అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమన్న మాట. సర్వశ్రీ కేసీఆర్ గారు తమ ఆమరణ దీక్షను పండ్ల రసం తాగి విజయవంతముగా విరమించారు. ఇది కూడా కేసీఆర్ స్క్రీన్ ప్లే లో భాగమే అయిఉండవచ్చు. వారిని ఇప్పటివరకు వెనకేసుకొచ్చిన వారందరికీ ఇది ఒక షాకింగ్ న్యూసే. ఉద్యమంలో మీరు త్యాగం చేయండి అంటూ తాను తమాషా చూడడానికే నిశ్చయించుకున్నారు. అవసరమైతే ఉరికంబం ఎక్కుతానని ప్రకటించి కొందరి అమాయకుల ప్రాణాలను గాలిలో కలిపేసారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ జ్వాలలో కొందరి అమాయక ప్రాణాలు గాలిలో కలసిపోయాక కొందరి నెత్తురు చిందించాకా వారికి ఙ్యానోదయం అయింది. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని నిర్నయించారుట. ఎందరో విద్యార్ధులు వీరి మాటలకు ఉద్వేగంచెంది రెండు రోజులుగా జైళ్ళలో మగ్గుతున్నారు. చాలా మంది విద్యార్ధులు ఉద్యమ బాట పడతామని ప్రతిగ్జ చేసేరు. వీరిని జైల్లో పెట్టినందుకు ఆత్మ హత్య ప్రయత్నాలు చేసారు. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణా సాధించుకు రమ్మని ఎన్నికల్లో గెలిపిస్తే మరి వారు ఇప్పటివరకు వారు చేసిందేమిటో? ప్రజాస్వామ్య బద్ధంగా చేయబోయేదేమిటో వారే చెప్పాలి. ఎందుకంటే వారి స్టైలే వేరు. అమాయక విద్యార్ధులు వారి మాయ మాటల వలలో పడకుండా ఎవరైనా కాపాడగలరా?

వంది మాగధులు కొత్తగా చెప్పేది ఏమిటంటే కేసీఆర్ విద్యార్ధులలో ఉద్యమ స్పూర్తి నింపారని. దానికి అయిన ఖర్చు కొందరి ప్రాణాలు కోట్లలో ఆస్తి నష్టం

5 comments:

Sravya V said...

అమాయక విద్యార్ధులు వారి మాయ మాటల వలలో పడకుండా ఎవరైనా కాపాడగలరా? >> కాపాడం ఇదో జోకు సూర్యుడు ఎందుకు తూర్పున ఉదయస్తున్నాడు అంటే ఆంధ్రోళ్ళ కుట్ర అనే ఒక తరాన్ని తయారుజేస్తున్నారు వాళ్ళే వీళ్ళ ఆటలు సాగటానికి పెట్టుబడి .

విశ్వామిత్ర said...

శ్రావ్య గారూ అంతేనంటారా? భూకైలాస్ ఎకరం ఏభై కోట్లు తంతేనా? వీళ్ళ కపటత్వం తెలిసిన మేధావులు కొందరైనా ఉండరా?

Anil Dasari said...

Shrek లో Lord Farquaad చెప్పే లైను ఈ సందర్భంగా ఉటంకించటం అప్రస్తుతం కాదనుకుంటా:

"Some of you may die, but that is a sacrifice I am willing to make"

:-)

Krishna K said...

"వీళ్ళ కపటత్వం తెలిసిన మేధావులు కొందరైనా ఉండరా?" ఎంత అమాయకం గా అడిగారండి. తెలంగాణా మెతావులు వాళ్ల so called లీడర్ల దగ్గరకు వచ్చేవరకూ "నీ బాంచన్ దొర" అలవాటు మాత్రం మానలేరు.

మీ బ్లాగ్లోనే ప్రభాకర్ మందారను నేను అడిగిన ప్రశ్న మళ్లె రెపీట్ చేస్తున్న.

"ఇక మీరు చెప్పే అల్లము, జయశంకర్ లాంటి మెతావులు kcr వరకు వచ్చేటప్పటికి, ఆ బక్కోడి కామేడీ తింగరి వేషాలు వచ్చేవరకూ ఎందుకు నోర్లు, పెన్నులు, (ఇంకా వేరేవి కూడా) మూసుకొని కూర్చుంటున్నరో సెప్తారా? "
ఇంతవరకూ సమాధానం లేదు. మొదట్లో నేనా మాట మా తెలంగాణా మిత్రులను అడిగితే, వీడు వెధవ అని మాకూ తెలుసు ఒకటి రెండేండ్లు వీడిని భరించి, ఉద్యమానికి కొంచం ప్రచారం వచ్చినాక వీడిని సాగనంపుతాం అన్నారు. ఇప్పుడేమో kcr వాళ్ల వాళ్లనే సాగనంపాడు, కక్కలేక, మింగలేక "నీ బాంచన్ దొర " అంటూ తెలంగాణా వచ్చాక వీడిని సాగనంప్తాము లే అని సర్ది చెప్పుకొంటున్నారు.

విశ్వామిత్ర said...

అబ్రకదబ్ర
..........well said ! !

@ కృష్ణ
టీఆరెస్ వెంటబడుతున్న వారందరు ఆలోచనపరులు కాదనేగా?