December 22, 2009

లగడపాటి ప్రెస్ మీట్‌లో మీడియా మిత్రుల అసహనం



అత్యంత నాటకీయంగా జరిగిన లగడపాటి అదృశ్యం ఆయన నింస్‌లో ప్రత్యక్షం కావడంతో ముగిసింది. నింస్‌లో ఆయన ఒకరోజు దొంగ దీక్ష (లగడపాటే అన్నారు) ముగించుకొని హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణాకు సంభందించి ఏదో ప్రకటన చేస్తారనుకొని ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేసుకున్న చానల్ మిత్రులందరూ ఆయన చెప్పిన విషయాలు విని చాలా అసహనానికి గురయ్యారు. తనకు పంధొమ్మిదో తేది రాత్రి కోర్టు ఆదేశాలపై శరీరానికి కావల్సిన పోషకాలను (ఐవీ) ఎక్కించారని నైతికంగా తన దీక్ష భగ్నం ఐనట్టుగా భావించానని కానీ తనను హైదరాబాదు రానీకుండా కొంతమంది అడ్డుకోవడం వల్లే పట్టుదలతో హైదరాబాదు వచ్చి నింస్‌లొ చికిత్స తీసుకున్నట్టు చెప్పారు. తాను ఐదు రోజుల ఏడు గంటలు నిజాయితీగా దీక్ష చేశానని మిగిలిన రెండు రోజులు దొంగ దీక్షేనని ఐవీలు తీసుకుంటూ ఎన్ని రోజులైనా దీక్షలు చేయవచ్చని కానీ ఇలాటి దొంగ దీక్షలగురించి ప్రజలకు మీడియాకు తెలియచెప్పడానికే చేశానని పరోక్షంగా కేసీఅర్ చేసిన దీక్షను ఉటంకిస్తూ చెప్పారు.

కేసీఅర్ ప్రస్తావన వచ్చినప్పుడు మీడియా మిత్రులు చాలా అసహనానికి గురయ్యారు. వారు వెంఠనే లగడపాటి ప్రసంగానికి అడ్డుతగులుతూ ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టినప్పుడు. లగడపాటి ఇది నేను పిలిచిన ప్రెస్ కాన్‌ఫరెన్స్ కాబట్టి తాను చెప్పింది వినాలని ఇతర (కేసీఅర్) వ్యక్తులకు గంటలకొద్దీ సమయం కేటాయించి తనకు కొద్దిసేపు సమయం కేటాయించలేనివారు వెళ్ళిపోవచ్చని, తాను ఎవరిని భయపెట్టి తీసుకురాలేదని ఇష్టంలేని వారు వెంఠనే వెళ్ళిపోవచ్చని నిర్మొహమాటంగా అన్నాకాగానీ విలేకరులు సద్దుమణగలేదు.

చానల్స్ అన్నిటికన్న టివీ-9 నుండి మురళీ కృష్ణ కాస్త అతి చేయడం స్పష్టంగా కనిపించింది. లగడపాటి నింస్‌లో చేరడానికి వచ్చినప్పుడు అక్కడినుండీ ప్రత్యక్ష ప్రసారం వివరాలు అందిస్తూ లగడపాటికి లోపల చికిత్స చేస్తున్నారని "లగడపాటికి నింస్‌లో ఏలా చికిత్స చేస్తారో ముఖ్యమంత్రి మీడియాకు చెప్పాలి" అంటూ డిమాండ్ చేశాడు. ఇది ఒక రకంగా అతడు తన పరిధిని దాటి చేసిన వ్యాఖ్యానం. లగడపాటికి నింస్‌లో చికిత్స ఎందువల్ల నిరాకరించాలో అతడు చెప్పగలడా? ముఖ్యమంత్రి మీడియాకింద పనిచేసే వ్యక్తి కాదు. మైకు చేతిలో ఉందికదానని నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయం పక్కనబెట్టి బాధ్యతగా మెలగాలి. మనము చెప్పింది జనము వినక చస్తారా అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

5 comments:

Sravya V said...

మురళీ కృష్ణ అంటే ఎక్కువగా political న్యూస్ కవర్ చేస్తాడు అతనేనా?
ఆంధ్రప్రదేశ్ లో TV9 , KCR ల అతివాగుడులకు అడ్డుకట్ట వేసే వాళ్ళే లేరునుకుంటా అంతా మన ఖర్మ !

శరత్ కాలమ్ said...

అందుకే ఈమధ్య Tv9 కి బదులుగా ABN ఆంధ్రజ్యోతి చూడటం ప్రాక్టీసు చేస్తున్నా.

Truely said...

TV9 ravi prakash is friend of KCR, pls. stop following this worst tv channel. I started following other news channels these days.

Shashank said...

అసలు TV9 అంత వరస్ట్ చానల్ లేదేమో. ఐనా ఈ రోజుల్లో "మంచి" చానల్స్ ఎక్కడ? అన్ని TRP ratings కోసం కక్కుర్తి.. మీడియా మాఫియా.. దరిద్రుల్లు.. సగం గొడవలకి కారణం అవే..

మాడీ - అమ్మగారు ఈ ముక్క నాతో చెప్పలేదండి.. అందుకే నా TV9 వాడు తెలంగాణా అప్పుడు అంత రచ్చ చేసి ఇప్పుడు అస్సలు సౌండ్ చేయడం లేదు..

విశ్వామిత్ర said...

శ్రావ్యగారూ మీరు చెప్పిన ఆయనే మురలి క్రిష్ణ

శరత్ గారూ మంచిపని చేస్తున్నారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది :)

జే సీ దివాకర్ రెడ్డి నవ్వుతూ మీడియా వాళ్ళని పొలిటీషియన్స్‌ని కొన్ని రోజులు లోపల పడేస్తే పరిస్తితి చక్కబడుతుందని అన్నారు. ఆయన చెప్పినది నిజం :)