February 12, 2010

తెలంగాణా పులకేసి మళ్ళీ తెరపైకి...



ఈ మద్య లోకమంతా అప్రశాంతంగా, ఏదో కోల్పోయినట్టు, టీవీలన్నీ బోసిపోయినట్టు, విలేకరులంతా తెగులుపట్టిన కోళ్ళలా మెడలు వంగిపోయి, ముఖ్యంగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ దివాళా తీసిన వ్యాపారుల్లా దీనంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. కారణం మీకు తెలిసి ఉండదు! అదే మా తెలంగాణా పులకేసి అస్సలు పేపరోళ్ళవైపు, చానల్స్‌వైపు చూడడం మానివేయడంవల్లే. ఇదిగో నిన్నటినుండీ విలేకరులకు కాస్త ముద్ద గొంతు దిగుతోంది. ఎందుకంటే నిన్ననే మా తెలంగాణా పులకేసి మళ్ళీ టీవీలో కనిపించాడు. కనిపించడమేకాదు బోలెడు విషయాలు చెప్పాడు. వస్తూనే అతడన్నది ఆంధ్రోళ్ళు అంటే పెట్టుబడిదార్లు ఆంధ్రాలో చేసింది అస్సలు ఉద్యమమేకాదుట. ఉద్యమమంటే తెలంగాణాలో జరుగుతున్నదేట. ఇంకా శ్రీకృష్ణ కమీషన్‌పై అతడి అభిప్రాయలు కొన్ని చెప్పాడు. అసలు తెలంగాణా ఇవ్వాలా వద్దా అని రాష్ట్రంలో ఎవ్వరినీ అడక్కూడదట. ఆంధ్రోళ్ళనిగానీ, సీమోళ్ళనిగానీ, హైదరాబదీలనిగానీ. మరి ఎవరిని అడగాలి? పులకేసిని అడగొచ్చంట, ఇంకా వాళ్ళ అల్లుడిని అడగొచ్చుంట, ఇంకా పులకేసి కూతురునికూడా అడగొచ్చంట. తెలంగాణా ఇవ్వాలని తేల్చడానికి పదినెలలెందుకు అని తెలివిగా అడిగాడు. కేవలం పది సెకన్లు చాలుట. లేదంటే ఒక వారమో పదిరోజుల్లోనో సరిపెట్టుకోవాలిట. అసలు తెలంగాణా ఇవ్వడంకోసమే కమిటీ వెయ్యాలిగనీ ఇంకా అడిగేదేంటని అన్నాడు మా పులకేసి. ఇక తాము త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇంతకుముందు ప్రకటించినట్టు తల నరుక్కుంటాడేమోన్ని ఆశగా ఎదురు చూసేరు... అదేమికాదు. పదవులకు మరోసారి రాజీనామాలు చేసి, వాటిని నిజ్జంగా ఆమోదింపచేసుకుంటాడుట. అదీ సంగతి!! ఇకనుండీ మళ్ళీ కొన్ని రోజులు అందరికీ ముఖ్యంగా నక్సలైట్ చానల్స్‌కి, పోరంబోకు చానల్స్‌కి పండగే పండుగ. మనం కుడా చూసి సరదా పడదాం. ఏమంటారు?

13 comments:

శరత్ కాలమ్ said...

శ్రీక్రిష్ణ కమీషన్ పీకేసి కేసీఆర్ కమీషన్ వేస్తే సరి!

Ravi said...

*** నక్సలైట్ చానల్స్‌కి, పోరంబోకు చానల్స్‌కి పండగే పండుగ. మనం కుడా చూసి సరదా పడదాం. ఏమంటారు? ***???

???? Emitavi ???

Narsingrao said...

when a committee was set up to divide Andhra from Madras State only the opinion of Andhra people was taken and the report was given in a month’s time.

Narsingrao said...

Why we need 11 months for telangana Demand

Krishna K said...

we need 11 months " తెలీయనట్లు అడుగుతున్నారు ఎందుకో తెలియదా? అప్పటి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోవాలనుకొన్నప్పుడు తెలుగు వారు, రాజధానిని (అది తెలుగు ప్రాంతం తో నే ఎక్కువ కలసి వుండి కూడా, తెలుగువారే అందులో ఎక్కువ ఉన్నా కూడా) వదుకొన్నారు, తెలుగు వారి ప్రాంతాలను వదులుకొన్నారు,
మరి తెలంగాణా రావటానికి పులకేసి ఆయన వందమాదిగలు ఏమి వదులుకోవటానికి సిద్దం గా ఉన్నారో చెప్తారా?
కూతురుకేమో సినెమా వాళ్ల చందాలు, అల్లుడుకేమో రెసిడెన్షీల్ కాలేజీల చందాలు, పులకేసి కేమో మిగతా చందాలు, వందమాదిగ కేమో ముఖ్యమంత్రి పదవి, మరి 11 నెలలేమి ఖర్మ, కుక్కతోక పట్టుకొని ఈదాలంటే చిన్న పిల్ల కాలవనయినా సమయం పట్టదంటారా?

Narsingrao said...

మద్రాస్ తమిళనాడు లో ఎక్కువ కలిసుంది కాబట్టి మద్రాస్ న్యాయం గా వాళ్ళకే చెందాలి .. మరి అలాగే హైదరాబాద్ కూడా తెలంగాణా లో పార్ట్ సిటీ కట్టినప్పటినుండి గత 400 years గా ... మరి ఆంధ్ర వాళ్ళు 50 years ఉంటేనే హైదరాబాద్ మాది అంటే ఎలా ... ఒక MP అంటాడు .... హైదరాబాద్ లేని తెలంగాణా అయితే "OK" అంట .. మరి వాళ్ళ ప్రేమ సమక్యాంధ్ర మీద లేక హైదరబాద్ లో వాళ్ళ ప్రోపెర్టీస్ మీద ....?????

Krishna K said...

్అరసింగ గారు, ఏమిటి పులకేసి కాని, తెలబాన్లు కాని మిమ్ములను కూడా కరిచారా?
తమిళనాడు ఎప్పుడు ఏర్పడిందో చెప్తారా?
మదరాస్ అసలు పేరు ఏమిటో, దానిని ఆంగ్లేయులకు హక్కులు ఇచ్చిన వ్యక్తి తెలుగోడో, అరవోడో తెలుసా?
పోనీ జనాభా పరంగా మద్రాస్ లో అప్పుడు ఏ భాష వాళ్లు ఎంతమంది ఉండేవారో తెలుసా?

నేను చెప్పోచేదేమిటి అంటే మనకు ఒకటి కావాలనుకోవాలంటే ఇంకొకటి వదుకోవాటన్నికి రెడీ అవ్వాలి అది ఏ negotiations లో నయినా, ఏ పోరాటోలలో నయినా చివరకు జరిగేది అదే, రెండు ప్రక్కలా కొంత రాజీ పడటం, ఎవరకూ వారు కోరుకొన్న కోరికలు నూరు శాతం తీరవు,
అది మన స్వాతంత్రం తీసుకొన్నా, మద్రాస్ స్టెట్ నుండి తెలుగు వారు విడిపోయినప్పుడయినా, ఇటీవల ఏర్పడిన రాష్ట్రాలవిషయం లోనయినా, దక్షిణాప్రికా లో నల్ల వారి కి విముక్తి లభించినప్పుడయినా, జరిగింది అదే.

మరి పులకేసి ఆయన గ్యాంగ్ ఏ రాజీకి రెడీ గా ఉన్నరో చెప్తారా వారికి విడిపోవటమనేది అంత ముఖ్యమయినప్పుడు?

కిరణ్ said...
This comment has been removed by the author.
కిరణ్ said...

@@Krishnaa: తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నా కూడా మద్రాస్ ని వదులుకున్నారు కదా ఆంధ్రా వాళ్ళు.. ఇది నిజమా... అలా వదులు కున్న వాళ్ళైతే పొట్టి గారి దీక్ష 11 వ రోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్త్ర ఏర్పాటు ప్రకటించింది.... మరి పొట్టి 53 రొజులు దీక్ష చేసి చచ్చింది మద్రాస్ వదులుకోటానికా..

కిరణ్ said...

vaaLLakea kaadu neeku kooDaa panDagea...kaadanTaavaa..

shiva said...

Ayya,
mana desa charitra lo edaina committee anukunna samayaniki report ichinda....ichina report ki e GOVT aina viluvichaya? Srikrishna committee rajyaangabaddhamainda?
Marenduku committeelu?samasya KCR okkadidi kadu..patha paata manandi. Prajalantha Telangana korutunte adhishtanam ki , andhra vallaki kalu dobbaya..?

Venky said...

eduti vaarini vimarshinchetapudu
anninti gurinchi poorthiga thelusukoni matladaali....


Yes, Power, to rule ourselves, to have identity and self respect.... to free ourselves from discrimination/exploitation/injustice/looting.....Hence, that's why we need Telangaana.....

Q:Yes, you telangaanites speak impure Telugu.

A:In the 23 districts of AP , each district has got different slang/dialect. On what basis and criteria you say that one slang is pure/impure. Just because people from one district entered the print/electronic media first and used their language, does it become pure?

For your kind information, Telangaana literally means "land of telugus". The word Telugu originated from Trilinga, Telunga, Telinga, Telangana and Tenunga. (Refer : http://en.wikipedia.org/wiki/Telugu)
Now tell me, Is Telangaana telugu impure?

Q:Do you think you will get developed by
getting separate Telangaana?

A:Development ???? Nice joke dude. Let us think about our survival first. Then we will plan how to stop water in our dams , how to get our jobs back from you, how to preserve our language and culture, how to utilize our natural resources etc. Of course, the corruption and politics will be there as usual. Telangaana is to stop Andhra leaders from looting us and allowing the Telangaana leaders to loot us.

Q:Then, will you kick us from Hyderabad..?

A:Dont worry dude. We are not as selfish and cunning . It is just a states reorganization, not country's division. Anyone, irrespective of his state, can live here happily. (Many Marathis and Gujarathis have been living in Hyderabad since Nizam's rule). You are most welcome to stay until and unless you think to rule and dominate us.

Q:It is ridiculous to divide
"TeluguThalli "....
A:Where was Teluguthalli when Gentlemen's agreement/Mulki Rules/610 GO/SRC Recommendation were violated completely ?
Where was Teluguthalli when you had started Jai Andhra in 1972 just because Supreme Court ordered AP to implement Mulki Rules?

Our Telugu text books have lessons on "Atlathadde" but the Telangaana festivals like "Bathukamma" and "Sammakka-sarakka" are nowhere mentioned in our syllabus. Why?
Are we not sons of Teluguthalli?
If Bharatmata(nationalism) and Teluguthalli (sub nationalism) can coexist, why cannot Telanganathalli(subnationalism) coexist with the other two mothers.

Q:No, we wont accept ...... Hyderabad is ours.

A:@#+_$%*&_*%^+)_#%:"{_/''}]]^~}[^*(*&%^*(#$_..........Got it ?????

Dude, please don't test our patience. We do have limits to our tolerance.
400 year old Hyderabad had been built by our taxes and labour.
Have some shame to claim it. Moreover it is located in the center of Telangaana, geographically. Use some minimum sense. No one is asking anyone to leave the capital. In india we have single citizenship which gives you the right to live anywhere. Hyderabad can still be yours, even after the formation of telangana depending on the number of years you stay here(please read:Mulki Rules)

Q:We should have only one state for all Telugu speaking people

A:If we can have more than 3 states for Hindi speaking people why not for Telugu?

Moreover, you always say that the Telangaana language is impure Telugu , right? You hate our festivals, dialect and culture. Then why do you need us?? Ohhhhoooo... k k k k....acha.....your wicked concern is all about the mighty capital, our Hyderabad. I Got it now. You Andhra leaders na, always cunning.




"Jai Telangaana, Jai Jai Telangaana".....
"Naa Telangaana Koti Ratanaala Veena"....
" Nenu Saitham, Nenu Saitham....."

విశ్వామిత్ర said...

@ victory.....చాలా శ్రమ తీసుకొని వ్రాసిఉంటారు. నా తెలంగాణా కోటి రతనాల వీణ...నేను పూర్తిగా అభిమానిస్తాను ఏకీభవీస్తాను. 610 జీ.ఓ అమలులో కొంత అన్యాయం జరిగిందని ఒప్పుకోవాలి. కానీ నిధుల కేటాయింపులోగానీ, అభివృద్ధిలోగానీ అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న విషయంపై కమీషన్ నిజానిజాలు నిగ్గు తేల్చాలి. నిజంగా అన్యాయం జరిగిందని నిరూపించబడితే తెలంగాణా ఏర్పాటుకు మరింత బలం చేకురడమేకాకుండా వ్యతిరేకిస్తున్నవారుకూడా సమర్ధించకతప్పదు.యాభై మూడేళ్ళ పోరాట యోధులు మరికొన్ని నెలలు ఆగలేరా? తెలంగాణాలోని రాజకీయ పక్షాలన్నీ కమిటీని ఎందుకు వ్యతిరేకించాలి? వాళ్ళు చెపుతున్న కారణాలు నిజమైనప్పుడు ఎందుకు కాదనాలి? రాజకీయ నిరుద్యోగులు చెపుతున్న కారణాలు నిజమని ఎందుకు నమ్మాలి?