ఒక మనిషి రోడ్డుమీద ప్రమాదవశాత్తూ గానీ దాడికి గురైగానీ నెత్తురోడుతూ కనిపిస్తే మీరేమి చేస్తారు? అతన్ని సేదదీర్చడానికి సురక్షిత ప్రదేశానికి మార్చి వెంఠనే ఆంబులెన్స్‌కో లేక పోలీసులకో కబురంపుతారు. కానీ ఇవేమి చేయకుండా అతని బాధను ఏవిధంగా అనుభవిస్తున్నాడో తెలుసుకుంటూ అతను చెప్పలేని స్తితిలో ఉన్నాకూడా సహాయం చేయడం మానేసి అతన్ని ప్రశ్నలతో విసిగిస్తూ కారుతున్న రక్త ధారల్ని చిత్రీకరిస్తూ అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవరకు వేచి చూసేవాడే జర్నలిస్టు. ఇలాటి సంఘటనలు మనం అనేక చానల్స్ లో చూసిఉన్నాము కూడా. ఇటీవలికాలంలో జర్నలిస్టులు ప్రజల అభిప్రాయాలు చెప్పవలసింది పోయి స్టూడియోలో కూర్చొని తమ సొంత పైత్యాన్ని ప్రజలపై రుద్దుతూ ఇదే ప్రజల అభిప్రాయం అనుకోమంటూ, అనామకుల నోటిముందు మైకులుంచి వారు వాగే అవాకులు చవాకులూ ప్రసారం చేస్తూ చంకలు గుద్దుకునేవాడే జర్నలిస్టు. ఒకప్పుడు జర్నలిస్టులపై దాడి అంటే ప్రజలు కూడా మహాపరాధం జరిగిపోయిందనే భావనలో ఉండేవారు. ప్రభుత్వం కూడా అలాటి సంఘటనలకు వెంఠనే స్పందించేది. కానీ ఇప్పుడు పరిస్తితులు మారిపోయాయి. మీడియా స్వేచ్చ పేరుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయం పేరుతో దాడిచేయడం చాలా మామూలు విషయంగా మారిపోయింది.ఉస్మానియాలో పోలీసుల చర్యలను సమర్ధించకపోయినా దానికి కారణాలను ఏమాత్రం చూపకుండా పూర్తి బాధ్యతను పోలీసులపైకి నెట్టివేస్తే పోలిసులకు మండుకొచ్చి ఒక చాకిరేవు మీడియా ప్రతినిధులకు కూడా పెట్టారు. దానికి ప్రతిగా రేపటి బడ్జెట్ వార్తల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను తెలియచేయాలని నిర్నయించారుట. ఒక్క విషయం చెప్పాలి!! వీళ్ళు చెప్పే వార్తలకోసం ఎవ్వరూ పడిగాపులుపడి ఎదురు చేడట్లేదు. ఇంకా చెప్పాలంటే వార్తా చానల్స్ లేని రోజుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి డిమాండ్లు ఎవైనా ఉంటే తక్షణమే......స్పందించకుండా ఒక నెల రోజులు వేచి చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....!!
8 comments:
లెస్స పలికితిరి.
బాగా చెప్పారు. విజువల్ మీడియాతో చాలా ప్రమాదకరంగా తయారయింది. మనుషుల భావోద్వేగాలను వాడుకుంటూ తమ రేటింగ్ పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు.
కాబట్టి ప్రభుత్వం వీరి డిమాండ్లు ఎవైనా ఉంటే తక్షణమే......స్పందించకుండా
LOL......
ఒకప్పుడు విలేఖరి అంతే ఎంతో గౌరవం ఉండెది...కాని ఇప్పుడు వాళ్ళని చూస్తే చాలా చిరాకు వేస్తుంది...సెన్సేషనల్ న్యూస్ కోసం మనవతా విలువలు మరిచి బరి తెగించే( ఇది కొందరికే వర్తిస్తుంది)వారిని చుస్తే ఒక్కొసారి అసహ్యం కల్గుతోంది
yes rightly said about present day e-media journalists
జే పి గారు చెప్పినట్టు మీడియా కి ఒక నెల రోజులు సెలవిచ్చేస్తే బాగుంటుంది.
ఈ వ్యాసపరంపర చూడండి :
http://www.tadepally.com/2007/03/1-mnr.html
Excellent!
Post a Comment