సీబీఐ ఒక యువకుడిని, కాబోయే ముఖ్యమంతిని అరెస్ట్ చేయించింది. ఏంత అన్యాయం? కక్షగట్టి ఒక తండ్రిలేని పిల్లవాణ్ణి కటకాలపాలు చేస్తారా? ఒక ఆశయంతో బుద్ధిగా ఎన్నికల్లో పోటిచేసి ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్న ఒక యువకిడిని చెరసాలపాలు చేస్తారా? వారి తండ్రి సెజ్‌ల పేరుతో రైతుల భూముల లాక్కుంటే మాత్రం, వేల కోట్లు సంపాదించుకుంటే మాత్రం అలా జైలుపాలు చేయడం సహించం. జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించినా, హంసతూలికా తల్పంపై శయనించే ఆయన, అలా ఒంటరిగా జైలు బారాక్‌లో ఒంటరిగా ఉండడం హృదయవిదారకంగా ఉంది. మా మన్సులు సున్నితమని ఎవరు తెలుసుకుంటారు? ఆయనకు ఒక్కరోజు జైలు శిక్ష అంటే మాకు జీవిత శిక్ష. మా ప్రాణాలు తృణప్రాయంగా ఆయనకోసం వదులుకుంటాం. ఆయన వేలకోట్లు కాదు లక్షల కోట్లు సంపదించుకున్నా మేము పట్టించుకోం. ఆయన సుఖంగా ఉండాలి. మేము బాగుపడకపోయినా, మా జీవితాలు బుగ్గిపాలైనా వారిని కష్టబెట్టడం మేం సహించం. మేము ఎల్లవేళలా కష్టాల్లో ఉండాలి, వారు వచ్చి మమ్మల్ని ఓదార్చాలి. వారిని అరెస్ట్ చేస్తే కొన్ని పేపర్‌వాళ్ళకెందుకు అంత సంబరం? ఆయన కష్టాల్లో ఉంటే అయ్యో అనాల్సింది పోయి రాత్రి నిద్దుర పోలేదు , ఉదయాన్నే బ్రెడ్ తిని పాలు తాగారంటూ చానల్స్‌లో వార్తలెందుకు? నయ్యం అంతటితో ఆగేరు. ఎవరు ఎవర్ని దోచుకున్నా మాకు బాధ ఉండదు కానీ వాళ్లు కష్టాలపాలు కావడం మేము సహించం. మేము సున్నిత హృదయులం. వారు బాగుండాలి. మా ఓటు తప్పకుండా వారికే!!
16 comments:
చాలా బాగుందండి మీ వ్యంగ్యం. దురదృష్టకరమేమిటంటే, ఆ యువరాజుగారి సామాజికవర్గంలోని యువత, అందరూ అననుగానీ, మెజారిటీవర్గం ఆయనను ఒక కులదైవంగా పరిగణించడం. ఆయనగారు కనీవినీ ఎరగనిస్థాయిలో అవినీతి చేశాడని రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయినా అలాంటివాడిని ఆదర్శంగా తీసుకుంటున్నారంటే ఇది ఎంత దారుణమో చూడండి.
అతిశయోక్తి కాకపోతే తండ్రి లేని పిల్లవాడు అనుకోవడానికి అతనేమైనా అనాథా? కోట్ల ఆస్తి ఉన్నవాడు అనాథ ఎలా అవుతాడు.
కలి [పోయే] కాలం కాబట్టి జనాలు మరీ సున్నిత మనస్కులు అవుతున్నారు.
ముందు జగన్ తో మొదలయింది. అతి త్వరలో లగడపాటి, రామోజీ, కావూరి, సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, వేణుగోపాల్రెడ్డి లాంటి భూబకాసురులు & crony capitalists, వారి వెన్నంటే ఉన్న రాజకీయబాబులు జగన్ కి కంపనీగా వెళ్తారని ఆశిద్దాం.
Good riddance to those influence peddlars who grabbed sarf-e-khas lands.
నిజంగా వెర్రిబాగులోళ్ళం కాబట్టే సున్నితమనస్కులమైనాం:-)
After a long time :-) Nice one !
నేను జగన్‌ని ద్వేషిస్తాను కానీ జగన్‌ని ఆరాధించేవాళ్ళు ఎర్రిబాగులోళ్ళని అనుకోను. ఎర్రిబాగులోళ్ళకి తాము ఏమి చేస్తున్నారో తమకే తెలియదు కానీ జగన్ అభిమానులకి తాము ఏమి చేస్తున్నారో తమకి తెలుసు. ఉదాహరణకి తాడేపల్లి గారు కూడా జగన్ అభిమానే. ఆయన జగన్‌ని అభిమానించడానికి ఒక కారణం ఉంది. NTR కరణం వ్యవస్థని రద్దు చెయ్యడం వల్ల పూర్వం గ్రామాలలో కరణీకం చేసిన అనేక మంది బ్రాహ్మణుల ఉద్యోగాలు పోయాయి. అందు వల్ల చాలా మంది బ్రాహ్మణులకి NTR అంటే అసంతృప్తి ఉంది. NTR కుడి భుజమైన రామోజీరావు మీద కూడా బ్రాహ్మణులకి కోపం ఉంది. అందుకే వీళ్ళు రామోజీకి వ్యతిరేకంగా జగన్‌కి సపోర్ట్ ఇస్తున్నారు. బ్రాహ్మణులు కరణీకం కాకపోతే వేరే వృత్తులు చేసుకోలేరా?
"NTR కరణం వ్యవస్థని రద్దు చెయ్యడం వల్ల పూర్వం గ్రామాలలో కరణీకం చేసిన అనేక మంది బ్రాహ్మణుల ఉద్యోగాలు పోయాయి"
నువ్వు నీ పిచ్చ విశ్లేషణలు చేయటం ఆపు మార్థాండా! రామారావు కరణాలను తీసినందు కు బ్రాహ్మణులకు పడదని తెలిసినట్లు వాగకు. ఆయన పాలానలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొన్నాడని అందరికి తెలుసు. అన్నుకొన్నదే తడవుగా ఎన్నో సం|| పనిచేస్తున్నవారిని అకస్మాతుగా పనిలో తీసేయటం వలన, ప్రభుత్వోద్యుగులకు ఎవరికి రామారావు అంటే పడేది కాదు. చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి.ఈయన గారు 55సం|| రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించటంవలన, ఎంతోమంది యం జి ఓ లు గుండేపోటుతో చనిపోయారు.
* యన్.టి.ఆర్. కుడి భుజమైన రామోజీరావు మీద కూడా బ్రాహ్మణులకి కోపం ఉంది*
బ్రాహ్మణులందరు నీదగ్గర కొచ్చి మాకు రామోజిరావు అంటే కోపమని చెప్పారా? తాడేపల్లి గారి గురించి అనవసరంగా రాశావు.
http://teluguone.com/news/editorial/pages/పత్రికా-స్వేచ్ఛ--వాస్తవాల-గుర్తింపులో--నిన్నటికి-నేటికీ-తేడా-289-6869.html
ఎ.బి.కె. ప్రసాద్
అంతేగాదు, “సాక్షి'' వ్యవహారాల విషయంలోనే గాక, ఇంతకుముందు కూడా "దేశం'' పార్టీని "సంస్కరణల'' నీడలో అభాసుపాలయిన దానినే తనూ అడుగడుగునా శాసించుతూ, తన వ్యాపార లావాదేవీలను చక్కబెట్టుకుంటూ వచ్చిన 'ఘనత' మరొక పోటీ దినపత్రికా యాజమాన్యానికే ఉంది. మాజీ ముఖ్యమంత్రి నాతొ (ఈ వ్యాసకర్త) స్వయంగా ఒక రహస్యం చెప్పాడు. ఒక పత్రికావ్యాపారి [అంటే యజమాని]కి మీమీద ఎందుకంత ద్వేషం, అక్కసు? “దేశం'' పార్టీ మీ విశిష్ట నాయకత్వంలో రాష్ట్రపాలనాధికారాన్ని సాధించడానికి ఒక మేరకు తోడ్పాటు అందించిన ఆ పత్రికాధిపతి వైఖరి మారడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఎన్టీఆర్ యిలా జవాబిచ్చాడు: “అతగాడికి కావలసింది నా సీటు - ముఖ్యమంత్రి పదవి. అందుకోసం నానా బెదిరింపులూ, యిబ్బందులూ చేస్తున్నాడు, కలిగిస్తున్నాడు అని!
తాడేపల్లి గారే కాదు, గూగుల్ ప్లస్‌లో ఇంకొంత మంది బ్రాహ్మణులు కూడా జగన్‌కే సపోర్ట్ ఇస్తూ వ్రాస్తున్నారు. జగన్ డ్రామోజీరావు కంటే నీతివంతుడు అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. https://plus.google.com/100083344333484778077/posts/LTpFAjf7Jhr
:)) బాగుంది. యువమేతకు జరిగిన అన్యాయానికి మనస్థాపం చెంది రాష్ట్రవ్యాప్తంగా యువకులు ప్రాణత్యాగాలు చేయాలి, వేయి ముసలి గుండెలు ఆగాలి, అమరులై స్వర్గంలో సెజ్‌లు నిర్మించాలి, గనులు తొవ్వాలి, దొంగ ఫేక్టరీలు పత్రికలు పెట్టాలి.
ప్రవీణ్.. నేనెక్కడా కుల ప్రస్తావన చేయలేదు...ఎక్కడినుండి ఎక్కడికో తీసుకుపోయి నా బ్లాగు కూల్చేలాఉన్నవు :)
శ్రావ్య్‌గారూ థాంక్స్!! మీ అభిప్రాయాలు పుంచుకున అందరికీ థాంక్స్!!
అతనేవరో ఒకడు రాస్తే అందరు ఇంకొంత మంది బ్రాహ్మణులు కూడా జగన్‌కే సపోర్ట్ ఇస్తూ వ్రాస్తున్నారు అని అంటావా? తాడేపల్లి గారికి తెలుగుదేశ పార్టి అభిమాని అని ఆమాత్రం తెలియదా? ఇకనైనా ఈ ప్రచారం ఆపు.
మార్తాండో పిచ్చి పువ్వు.
తాడేపల్లి, అన్నగారికి వీరాభిమాని. ఈమధ్య ఏదో బ్లాగులో అన్నగారికోసం అందరితో యుద్ధం చేసాడు.
బ్రామ్మలకి కమ్మద్వేషం, కమ్మలకు బ్రహ్మద్వేషం కరణీకం కంటే ముందునుంచి వున్నవే.
అన్నగారు కొండవీటి వెంకటకవులతో డవిలాగులు రాయించి పురాణాలని చెత్త సిన్మాలుగా తీయించి దుర్యోధనుడ్ని, కర్ణుడిని హీరోలుగా చూపించటం ఈ బ్రహ్మ ద్వేషంలో భాగమే!
అద్సరేగానీ ప్రవీను, ఇయ్యాల్ల నర్సన్నపేట సభకి ఎంతమంది గదబలొచ్చారు, ఎంతమంది దాసర్లొచ్చారు, ఎంతమంది బ్రామ్మలొచ్చారు?
తాడేపల్లి గారు ఇప్పుడు జగన్ గారి అభిమానే: https://plus.google.com/109042910923161809247/posts/GweXGah1vkB
అసలు కామెడీ ఇక్కడ చదవండి: http://picchinews.blogspot.in/2012/05/blog-post_30.html
Post a Comment