ఎలచ్చన్లు అయిపోయాయి...... అనుకున్నదే..ఎర్రిబాగులోళ్ళమంతా గన్బాబుని గెలిపుంచుకున్నాము. గన్బాబు ఇప్పుడు ప్రజాహోమంలోంచి నూతనంగా జనించిన సత్శీలుడు. వారి తప్పులనీ ప్రజా "గుండం"లో కాలి ఒప్పులయ్యాయని అవి అస్సలు తప్పులేకావని సదరు పార్టీ వక్తలు చెప్పుకుంటు ఉంటే విని అవునని తలూపడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది లేదు. ఇక కాబోయే ముఖ్యమంత్రి వారేనని కూడా ప్రకటించారు. ఇది దేవుడి విజయమని అమ్మగారు చెపితే ఇది కేవలం అన్నగారి విజయమని సోదరి సద్దిచెప్పారు. ఇక ఈ విజయంతో కోర్టులో తప్పులన్నీ ఒప్పులుగా మారిపోతాయని, ఇక గన్బాబు బైటకి రావడమే మిగిలిందని ముగించారు. ఇవన్నీ పక్కనబెడితే ప్రబుత్వం పైన అపనమ్మకమే ప్రజలు వారిని పక్కనబెట్టారని చెప్పక తప్పదు. మీరు వందల కోట్లు కాదు వేలకోట్లు తిన్నా పర్వాలేదు కానీ మాకు తాగడానికి గుక్కడు నీళ్ళిస్తే చాలని, చచ్చిపోతుంటే మాకోసం ఒక నాలుగుచక్రాల ప్రభుత్వ వాహనం వస్తే చాలని, ఒకపూట తినడానికి నాలుగు గింజలు చాలని, ప్రస్థుత ప్రభుత్వం అది కూడా చేయట్లేదని ఎలుగెత్తి చెప్పేరు. మరి వారి మాటలు ప్రభుత్వ పెద్దలకు అర్ధమవుతాయా? కానీ గన్బాబు గెలిపించుకున్నవారితో లుకలుకలనుండి బైటపడడానికి ప్రభుత్వ పెద్దలతో ఒప్పందానికి వచ్చి,వారితో చేతులు కలిపితే...మళ్ళీ మనం ఎర్రిబాగులోళ్ళమే!!
5 comments:
:))
prajalu eppaiki erribagulavalle.. vaari badhalu nayakulu, prabhutavalaku kanisam maro 50 years tarwataina ardhamautai anukunna vallu evarinaa unte.. vaallantha erribagulavalle!
రాసేవాళ్ళకు చదివేవాళ్ళు ఎప్పుడు లోకువే....
రాసేవాళ్ళకు చదివేవాళ్ళు ఎప్పుడు లోకువే....
"హమ్మయ్య గెలిపించేశాం...ఓ పనైపోయింది!!"
అప్పుడే ఏమయ్యింది?
ఇంకా ముందుంది మరిన్ని ఉప ఎన్నికల పండగ.
ఓటర్లకు డబ్బు, కానుకలు, మందు పండగ.
మీడియాకి బ్రేకింగ్ న్యూసుల పండగ.
చూస్తునే ఉండండి ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం...
Post a Comment