మగధీర సినీమాకి చేసినంత పబ్లిసిటీ ఈ మధ్య కాలంలో మరే సినీమాకీ చేయలేదేమో. మెగా స్టార్ తనయుడు, భారీ బడ్జెట్, పేరున్న దర్శకుడు ఇంకా ఇతర అంశాలు ఎన్నో ఈ సినీమా అంటే ఒక ఉత్సుకతని కలిగించాయి.సినీమా రిలీజ్‌కు ముందే ప్రతీ ప్రేక్షకుడు చాలా భారీ స్థాయిని ఊహించాడు. మరి సినీమా చూసిన ప్రేక్షకుడు తాను ఊహించిన స్థాయిలో ఉందని ఒప్పుకున్నాడా? నాలుగు రోజుల క్రితం నేను కూడా ఈ సినీమాని చూసేను. హాలివుడ్ సినీమా "త్రీ హండ్రెడ్" చూసిన ప్రేక్షకులెవరికైనా మగధీర సినీమా చూస్తున్నప్పుడు ఒక షాడో లైన్లా ఒక్కసారి గుర్తుకు వచ్చి ఉండాలి. అలాగే అరుంధతి కూడా. రాజమౌళీ రాంచరణ్‌తో సినిమా తీయడానికి అతనిని చాలా విధాలుగా పరీక్షించి ఉంటాడనిపిస్తోంది. రాంచరణ్ ఒకరకంగా పౌరాణిక పాత్రలకి నప్పినంతగా సాంఘీక పాత్రలకి నప్పకపోవచ్చనిపించింది.కోల మొహం, పొడవైన ముక్కు పౌరాణిక పాత్రలకి చక్కగా నప్పుతాయి. అందువల్లే కధ ఎంపికకి ఫ్లాష్ బేక్లో పౌరాణిక కధని ఎంచుకున్నాడు. ఒకరకంగా సినిమా మొదటి భాగంలొ ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురౌతారు. రెండో భాగం మొదలు అయ్యాకా గానీ అసలు కధ మొదలవ్వదు. రెండో భాగంలో భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ ప్రేక్షకులని మెప్పించాయి. రాంచరణ్ రాజ సైనికుడి పాత్రలో ఇమిడిపోయాడు. అతని శరీర ధారుడ్యం కూడా చక్కగ నప్పింది. కాజోల్ కూడా రాకుమారి పాత్రకు చక్కగ నప్పింది. కాని కొన్ని సంఘటనలు మాత్రం కధా పరంగా అవసరం కాకపోయినా ఖర్చుకు వెనకాడకూడదన్నట్టుగా కనిపించాయి. అతిధి పాత్రలో చిరంజీవి కనిపించడం, బంగారు కోడి పెట్ట పాటను మరలా ఎంచుకోవడం కేవలం చిరంజీవి అభిమానులకోసమే. కమర్షియల్‌గా పెట్టిన ఖర్చుకు కొంత గ్యారంటీ ఉండటంకోసమే. టోటల్‌గా సినీమా ఓకే. ప్రతీవాళ్ళూ ఒకసారి చూడవచ్చు.
August 6, 2009
July 28, 2009
హేతువాదము - కాకిరెట్ట!!
హేతువాదం అంటే ఏమిటి? హేతువాదులేవరు?
నాస్తికులనా? విఙ్నాన సంపన్నులనా? లేక వితండవాదులా?
నాస్తికత్వం లేదా ఈ నాస్తికులు అనేవాళ్ళు ఆస్తికత్వం ఆరంభం నుండే ఉన్నారు.
ఆస్తికత్వం ఎప్పటినుండి ఉంది? వేదకాలం నుండి ఉంది.
మరి వేదాలు ఎప్పుటినుండి ఉన్నాయి? ఎవరు రాసేరు?
దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి.
దీనిపై నాస్తికులు కూడా కొంత అధ్యయనాలు చేసారు.
19వ శతాబ్దంలో సర్ విలియం జొన్స్ చేసిన అధ్యయనంలో వేదాలు క్రీ.పూ. 1500లో రాయబడ్డాయి అని తీర్మానించాడు. కానీ దానికి తగ్గ అధారాలు చూపించలేక పొయాడు.
బాలగంగాధర్ తిలక్ చేసిన అధ్యనంలో క్రీ.పూ.4500కు పూర్వమే ఈ వేదాలు రాయబడ్డాయని అనడానికి కొని రుజువులు దొరికాయి. మరి అప్పుడు ఎవరు రాసి ఉంటారు?
ఙ్నాన వంతులైన ఋషులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,అధర్వణవేదం.
ఈ నాలుగు వేదాలు హిందూ మతానికి పునాదులు.
హిందూ మతం యొక్క మూల సుత్రం "మానవుడిలోనే మాధవుడున్నాడు".
అంటే సాటి మనిషిలోనే భగవంతుడిని దర్శించడం.
ఆ విధంగా హిందూ మతం యొక్క ఆదిని కనుగొనడం ఎవరివల్ల కాలేదు.
మనువు నాస్తికుడు అంటే వేదాలు నమ్మనివాడు అని అర్ధం చెప్పాడు.
అంటే అప్పటినుందే ఈ నాస్తికులున్నరన్నమాట.
ఒక ఉదాత్తామైన లక్ష్యంతో మరెంతో ఘనమైన చరిత్రతో ఆది అంతాలు లేని ఏకైక మతం
హిందూ మతం.
కాలగతిన కొంతమంది దానిని వక్రీకరించి తమ స్వార్ధానికి వాడుకున్నంత మాత్రాన
దాని మూలాలను తప్పుబట్టడం సరియైనది కాదు.
తప్పు జరిగినప్పుడు దానిని ఖండిచడానికి ఏ మతమూ అడ్డు రాదు.
హిమవత్ పర్వతాల కీర్తికి అసూయ చెందిన ఒక కాకి ఆ పర్వతంపై రెట్ట వేసి
"ఆహ నేను హిమాలయాల తెల్లదనాన్ని పోగెట్టేను" అనుకున్నదట.
అలా ఉంటాయి ఈ హేతువాదుల చేష్టలు.
హేతువాదులమనుకొనే ఓ వితండవాదులారా
మనిషియొక్క నడవడికను తప్పుబట్టండి, మతాన్ని కాదు.
July 25, 2009
తిక్క వేషాలు!!
మా బాసు ఆఫీసులో నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. నిజానికి అది పూర్తిచేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది. కానీ దానిని మరుసటి రోజుకు పూర్తి చేసి హెడ్ ఆఫీసుకు పంపాలి. ఆ బాధ్యత నామీద పెట్టాడు. ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటలకు ఆఫీసుకు చేరుకున్నాను. చేరుకున్నదే తడవుగా పని ప్రారంభించాను. ఒక అర్ధగంట గడిచిందో లేదో ఫోన్ మ్రోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీశాను. హల్లో అని పలకరిస్తే అవతలివాళ్ళు
"సెప్టిక్ టాంక్ క్లీనరా?" అని అడిగాడు. నాకు మొదట అర్ధం కాలేదు.
మరోసారి "ఏమిటి?' అని ప్రశ్నించాను.
అవతలి వ్యక్తి "ఏమయ్యా ఇది సెప్టిక్ టాంకు క్లీను చేసే టాంకర్ లా రీయేనా?" అని అడిగాడు.
నాకు భలే తిక్క పుట్టింది. ఒళ్ళు తెలియకుండా పొద్దున్నే మా నంబరుకి ఫోన్ చేసి నా పని చెడగొట్టడమే కాకుండా సెప్టిక్ టాంక్ క్లీన్ చేసే అఫ్ఫీసా అని అడుగుతున్నాడు. కాస్త కోపన్ని అదుపులో ఉంచుకొని నెమ్మదిగా
"అవును" అని సమాహానం చెప్పాను.
"మా సెప్టిక్ టాంక్ నిండిపోయింది. అది క్లీన్ చేయాలి" అన్నాడు
"మీరు ఉండేది ప్రదేశం ఎక్కడో?" అన్నాను అతడు వివరాలు చెప్పాడు.
"మీ ఇంటిలో ఎంతమంది ఉంటారు?" నేను
"నలుగురు" అతడు
"అందరూ పెద్దవాళ్ళేనా?" నేను
"ఆ..అందరూ పెద్దోళ్ళే" అతడు.
"టాంక్ వెడల్పు లోతు ఎంత?" నేను
"ఉంటాది లోతు పది అడుగులు వెడల్పు ఎనిమిది"
"మీ ఇంటిలో అందరూ బలంగానే ఉంటారా?" నేను
"ఆటి ఇవరాలెందుకు?" అతను
"నే చెపుతాగా...మీ ఇంటిలో నాలు బక్కెట్లు ఉన్నాయా?" నేను
"ఆ ఉండాయి" అతను
"నాలుగు తాళ్ళు ఉన్నాయా?" నేను
"తాళ్ళు ఉండాయి" అతడు
"ఆ తాళ్ళు బక్కెట్లకి కట్టి మీరు నలుగురూ కలిసి తోడి పక్కింట్లొ పోసేయ్యండి" అన్నాను నేను
"అదేంటి మేము తోడటమేంటి?" అతడు
"ఏం మీరు పెట్టిన చెత్త మీకే అసహ్యం వేస్తే ఎలా? దానికి మేము రావాలా? ఇంకోసారి టాంకర్ కావాలని ఫోన్ చేస్తే టాంకర్లో ఉండే చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో పొయిస్తా. ఫోన్ పెట్టు" అని అరిచాను.
అప్పటిగ్గాని నా కోపం తీరలేదు. ఇది జరిగి వారం రోజులైయింది. ఈ సంఘటన మా ఫ్రెండ్స్‌కి చెప్పి పడి పడి నవ్వుకున్నాము ఆ సమయంలో ఫోన్ చేసిన వ్యక్తి మొహం ఎలా ఉండి ఉంటుందో తలుచుకొని. ఇది నిజంగా తిక్క వేషమే కదా?
July 20, 2009
కె.బ్లా.స. పై కోర్టులో కేసేస్తా..!!
అవును మిరు విన్నది నిజమే. కె.బ్లా.స.పై కోర్ట్‌లో కేసేద్దమని నిర్నయించుకున్నాను. లేకపొతే ఒక పార్టీలో గానీ ఒక సంఘంలో గానీ అద్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాలిగానీ ఫ్రెండ్షిప్కొద్దీ పదవులూ ఇచ్చేసుకుంటే ఎలా? తె.రా.స లో పరిస్తితి చూసికూడా ఇలా ఒంటెద్దు పోకడలకు పొతే ఎలా? కె.బ్లా.స లో అలా జరగడానికి వీలు లేదు. ఎన్నికలు జరగాల్సిందే. లేదా నాదో కోరిక తీర్చాలి. అదేమిటంటే ఒక్క రోజైనా ఆ అద్యక్ష పదవి నాకు ఇవ్వలి. అదీ ఒప్పందం. ఎందుకంటే కె.బ్లా.స అద్యక్ష హోదాలో బ్లాగర్లకు ఒక విన్నపం /నోటీస్/ సూచన ఎదైనా గానీండి ఒకటి చేయాలి. అదేమిటంటే నోటీస్ సారాంశం ఇది. తెలుగు బ్లాగర్లకు విన్నపం. బ్లాగంటే ఒక ఙ్నాపికలా ఉండాలి. చూడగానే మనసులోని సంఘటన ఎప్పటిదో తట్టి లేపేదిగా ఉండాలి. మదుర స్మృతిగా ఉండాలి. చూడగానే అబ్బ అనిపించాలి. ఎవ్వరూ గమనించని విషయాన్ని తట్టి లేపాలి. విఙ్నానాన్ని ఇవ్వాలి. వినోదాన్ని ఇవ్వాలి.మనసుకు ఉల్లసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఆలోచన కలిగించాలి, ఆశ్త్చర్యాని కలిగించాలి. టపా చదవగానే వేళ్ళు అసంకల్పితంగా కామెంట్ బాక్స్‌వైపు కదలాలి. పైన చెప్పిన విధంగా ఒక్క లక్షణం లేకపోయిన పర్వాలేదు, కానీ కొందరిని కించపరచేదిగా ఉండకూడదు. కొందరి మనో భావాలు గాయ పరచేదిగా ఉండకూడదు. వర్గ బేధాలు, కుల బేధాలు కలిగించేదిగా ఉండకూడదు. ఈ మధ్య బ్లాగుల్లో సున్నితమైన అంశం మత భావాలపై వస్తున్న టపాలు చూడగానే కొందరి మనసులు ఖచ్చితంగా గాయ పడి ఉంటాయి. మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళపై వస్తున్న టపాలు, వారి వెక్కిరిస్తూ రాస్తున్న రాతలు నిజంగా శోచనీయం. ఎవరి విశ్వాశం వారిది. ఒకరి విశ్వాశాన్ని గౌరవించకపోయినా అగౌరవ పరచడం అమనుషం. ఇటువంటి టపాలకు బ్లాగు లోకంలో గౌరవ సభ్యులుగా (నేను) భావిస్తున్న పెద్దలు కూడా వంత పడడం మరింత క్లేశాన్ని కలిగిస్తోంది. మతపరంగా జరిగే అన్యాయాన్ని అడ్డగించు, మతాన్ని కాదు. మతం ఒక నమ్మకం. మతం ఒక విశ్వాశం. బ్లాగుల్లో హిట్లే పరమావధిగా, కామెంట్లే కొలతలుగా రాతలు రాసే వితండవాదులు ఉన్నారు. వారిని నిరుత్సాహపరచవలసిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. ఒకరు చీ కొట్టినప్పుడు నడవడిక మారితే అతడు మనిషి, లేకపొతే అతడు మహిషి. ఇట్లు కాబోయే అద్యక్షుడు, కె.బ్లా.స. అదండీ మాటర్. మరి నాకు ఒక్కరోజు అద్యక్ష పదవి ఇచ్చినా లేక నా నోటీస్ మీరు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. విషయం తేల్చగలరు.
July 19, 2009
మీ బ్లాగులో ఒకే టపాకు వంద కామెంట్లు కావాలాంటే..
తెలుగులో బ్లాగడమంటే దురదగుంటాకు ఒంటికి రాసుకోవడమే.
దురదగుంటాకు ఒంటికి రాసినకొద్దీ దురదలు పెరుగుతాయి.
అలాగె బ్లాగులో హిట్లు వచ్చేకొద్దీ బ్లాగడం పెరుగుతుంది.
మీరు కష్టపడి ఒక విషయం రాస్తే అదెవ్వరూ చదవలేదనుకోండి మీరు ఫీలవుతారా లేదా?
మరి మీరు రాసిన ప్రతీ విషయం ప్రతీ ఒక్కరిని చదివేలా చేయాలంటే కొన్ని సూత్రాలున్నాయి.
బ్లాగు సుత్రాల్లో మొదటిది మీరు ఎవ్వరూ వాడని పదాలు వాడాలి, వాటికి అర్ధం మీకు తెలియక పోయినా పరవాలేదు. దాని అర్ధం తెలుసుకోవడం కోసం కొందరు కామెంటుతారు కదా!
ఒకవేళ ఎవరైనా దానికి అర్ధం అడిగితే మీకు నచ్చినట్టు చెప్పవచ్చు.
రెండోది మీరు వినమృడివై ఉన్నట్టు రాయాలి కానీ ప్రతీ విషయంలోనూ ఎవరో ఒకరిని గిల్లుతూ ఉండాలి.
దానివల్ల బ్లాగుకు హిట్లు పెరుగుతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పుస్తకాలు చదవడం నేర్చుకో అని చెప్పాలి.
నువ్వు రాసింది తప్పు అని ఎవరైనా అంటే, సరిగా అర్ధం చేసుకోవడంలో ఉంది, రంధ్రాన్వేషణ వద్దు అని హెచ్చరించాలి. చివరిది ఎవరైనా మరీ విసిగిస్తే నీ కామెంట్లు ఇకముందు నా బ్లాగులో కనబడవు అనాలి.
ఈ సూత్రాలు వంటబట్టించుకున్న తరువాత మీరు తెలుగు బ్లాగు ప్రారంచించాలి.
ఉదాహరణకి నా మరో బ్లాగు "చెరసాల". చెరసాలలో మొదటి టపా ఇలా రాయడం ప్రారంభించాను.
టపా హెడ్డింగ్ : సూరిగాడి అనుభూతులు
ఆ రోజు పొద్దుగాలే సూరిగాడు లేచిండు. ఆడితోబాటు ఆడయ్య లేచిండు. ఆడయ్యతోబాటు ఆడమ్మ లేచింది.
ఆళ్ళతో్‌బాటే ఆళ్ళ కోడి లేచింది.ఒక్కసారిగా ఊరికి బ్రాహ్మనీకం వచ్చింది. (ఇక్కడ బ్రాహ్మనీకం అంటే తెలుగుదనం అని అర్ధం). ఊళ్ళోని ప్రజలందరూ అస్తిత్వాన్ని వదలి అభిజాత్యంతో తమ పనులకు బయలు దేరుతున్నారు.
ప్రతి వారూ సాంప్రదాయకంగా కట్టిన గోసీలను బిగించి పశువులను ప్రతిఘటిస్తూ కొందరూ, వర్గ సాంప్రదాయకంగా పొలాల్లోకి కొందరూ, సహేతుకంగా ఎడ్ల బండి తోలుతూ కొందరూ, సిద్ధంతాలు అలోచిస్తూ ఏమి చేయాలా అని కొందరు బయలు దేరారు. సూరిగాడికి చిన్న శంక కలిగింది. సమాజికంగా వెనుకబడిన మన ఊరోళ్ళకు ప్రభుత్వం సత్వర న్యాయం చేస్తోందా అని. వామ పక్ష చరిత్ర కలిగిన ప్రభుత్వం పోరాట పటిమ చూపితెనేగానీ న్యాయ ఫలాలు దొరకవని తెలుసుకున్న సూరిగాడు భోరున విలపించాడు.
దీనికి కారణం అగ్ర వర్నాల అభిజాత్యం అని భావించాడు. ఈ న్యాయం వారికి అందకుండా "పండితులు" కూడా అడ్డుపడుతున్నారు. సాహిత్యం, సారస్వతం అంటూ అరిచే ఈ పండితులకు తమ ఆకలి బాధలు తెలియవు.
వీరినుండి సామాజిక ప్రయోజనం ఆసించడం కన్న ఆత్మాశ్రయం ఒక్కటే మార్గం. సూరిగాడిలో ఒక సమాజోద్ధరణ భావం పైకి లేచింది. ఈ ధోరిణికి కారణం బ్రాహ్మలే ఐనా ఈ జాడ్యం తమ వారికి సోకకుండా మమేకం కావాలి అనుకున్నాడు.
అనుకున్నదే తడవు దక్షిణం వైపు పయనించాడు, కాల కృత్యాలు తీర్చుకోవడానికి.
నా ఈ మొదటి టపాకి మీరు నమ్మరు, నూట పన్నెండు కామెంట్లు వచ్చాయి.
మెచ్చుకుంటూ కాదనుకోండి. ఐనా మొత్తం మీద హిట్లు వచ్చాయా లేదా? అదీ విషయం.
కాబట్టి మీరు మొదలు ఈ సూత్రాలు పాటించండి.
July 15, 2009
దుఖ్ఖించువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు !!
ఈ రోజు ఉదయాన్నే, దేశంలో మనకు తెలియకుండా రాత్రి ఏమి జరిగిపోయిందో అని టివి చానల్ స్కాన్ చేశాను. న్యూస్ చానల్స్ అన్ని కూడా అత్యంత డబ్బుప్రపక్తులతో ఒకే తరహ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఏ చాన్నల్స్ చూసినా ఒక్కటే మాట పాపులను రక్షిస్తామని. పాపులను రక్షిస్తే మరి పుణ్యాత్ముల సంగతేమిటో? ఒక రకంగా భగవత్గీత చెప్పేదానికి ఖురాన్ చెప్పేదానికి కొంత సారూప్యం ఉంది. రెండూ కూడా తప్పులు చేయద్దనీ చేసినవారు శిక్షించబడతారనీ చెబుతాయి.ఇదివరకు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఉదయం పూట నాతియాకలాం ప్రసారమయ్యేది. అది వింటు ఉంటే భగవత్గీత వింటున్నామా లేక ఖురానా అనే సందేహం వచ్చేది. మంచి అనేది మతంతో సంభందం లేకుండా ఎవరు చెప్పినా వినాలి. హేతుబద్ధంగా భగవంతుడితో సంబంధం లేకుండా మంచి ప్రవర్తన ఉన్నా కూడా మంచిదే. కానీ పాపాలు చేసినా నిన్ను దేముడి చేత రక్షణ కల్పిస్తానని అనడం ఎంతవరకూ సబబో నాకు అర్ధం కాలేదు.పాపాలు కడిగివేయబడతాయిట. ఇదేదో నాకు రాస్ట్ర ప్రభుత్వం చేసున్న బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంలా అనిపించింది. ముందు తప్పుడు తడకలతో అప్రూవల్ లేకుండా నిర్మించడం, తరువాత తప్పులకు జరిమానా చెల్లించడం. నన్ను ఇంకా ఆశ్చర్య పరచింది, కుంటి వాళ్ళు, గుడ్డివాళ్ళు క్షణంలో వారి అంగ వైకల్యాన్ని పోగొట్టుకోవడం. ఒక వ్యక్తిని స్టేజ్ పైకి వీల్ చైర్లో తీసుకొచ్చారు. మతపెద్ద చేతితో అతనిని తాకగానే ఆ వ్యక్తి కరెంట్ షాక్ తగిలినట్టు కింద పడి వెంఠనే లేచి నిలబడి " నా రెండు కాళ్ళూ ఇప్పుడు పనిచేస్తున్నాయి" అని అరుస్తూ స్టేజ్ అంతా పరిగెత్తాడు. ఇది నిజంగా నమ్మశక్యమా? ఇది ప్రజలను వంచించడం కాదా? హేతువాదులకు ఇది కనిపించదా? హిందువుల మూఢ భక్తిని తప్పుబట్టే రాడికల్స్ ఈ విషయంపై ఎప్పుడైనా చర్చించారా?
July 13, 2009
కడుపు మంట - రకాలు
మనుషులకు వచ్చే కడుపు మంటలో రెండు రకాలున్నాయి. మొదటిది టీలు ఎక్కువ తాగడం, సిగరెట్లు కాల్చడం, సమయ పాలన లేని భొజనాలవల్ల ఎసిడిటీ పెరిగి వచ్చే కడుపు మంట. ఈ వ్యాధిని డాక్టర్ నయం చెయగలడు. రెండోది మనవల్ల ఇతరులకు వచ్చే కడుపు మంట.అంటే ఆఫీసులో బాసుకు మన పని నచ్చి ప్రమోషన్ ఇచ్చాడనుకోండి. మన కొలీగ్స్‌కు కడుపు మండవచ్చు. అలాగే అద్దె ఇటిలో ఉండే మనం ఒక సొంత ఫ్లాట్ కొనుక్కొని మారి పోతున్నామనుకోండి, ఆ అద్దె ఇంటి ఓనరుకి కడుపు మండవచ్చు. రోజూ డొక్కు స్కూటర్మీద తిరిగే మనం కొత్త బైక్‌గానీ కొత్త కారుగానీ కొన్నామనుకోండి, మన పక్క ఫ్లాట్‌లోని వాళ్ళకి కడుపు మండవచ్చు. పెళ్ళికాని మనకు, మనకు తెలిసిన పెళ్ళైనవాళ్ళందరూ రోజూ "ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా లేటైపొతే పెళ్ళి చేసుకుందమాన్న దొరకరు" అని సలహాలిచ్చే సమయంలో ఒక అందమైన పెళ్ళాం దొరికిందనుకోండి, సలహాలిచ్చినవాళ్ళందరికి కడుపు మండవచ్చు. మా అబ్బాయి క్లాసులో జెం, ఎప్పుడూ ఫస్టు రాంకే అని ఫోజు కొట్టే పక్కింటి అంకుల్, ఈ సారి వాళ్ళబ్బాయికి పదవ రాంక్ వచ్చి మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందనుకోండి, అంకుల్‌కి కడుపు మండవచ్చు. మనింటిలో లేని వస్తువుగురించి పక్కింటి ఆంటీ రోజూ గొప్పగా చెపుతున్న సమయంలో మనంకూడా ఆ వస్తువు కొనేసామనుకోండి, ఆంటీకి కడుపు మండవచ్చు. నేను వాడే వస్తువులన్నీ ఇంపోర్టెడే, లొకల్ వస్తువులు నేను వాడను అని ఫోజ్‌కొట్టే అంకుల్‌కి, నాక్కూడా మా అబ్బాయి అమెరికానుండీ సెల్‌ఫోన్ పంపించాడని చూపించామనుకోండి, అప్పుడా అంకుల్‌కి కడుపు మండవచ్చు. ఇన్ని రకాల కడుపు మంటలున్నాయన్నమాట! ఈ మంట చాలా మందికి లేకపోయినా ఒక్కొక్క సందర్భంలో బైట పడుతుంది. దీనిని ఏ డాక్టరూ నయం చేయలేడు.ఈ రకం కడుపు మంట వచ్చినప్పుడు ఆ వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కారు కొన్నామని పక్కింటి అంకుల్‌కి చెప్పేమనుకోండి, వెధవది రెండు లక్షలు పెడితే కారు. ఈ ట్రాఫిక్‌లో కారునడపడం అంత చిరాకు మరేది లేదు. నేనైతే ఎప్పుడైనా కావాలంటే టాక్సీని పిలుచుకొనె దర్జాగా వెళ్ళి వస్తాను అంటాడు. మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందని చెపితే, ఏమి చదువులో ఏమి స్కూళ్ళో, పిల్లలనందరిని కూర్చోబెట్టి రుబ్బించేస్తున్నారు.మా కాలంలో ఇలా కాదు అంటాడు. నాకు పెళ్ళి కుదిరింది అంటూ పెళ్ళికూతురు ఫొటో చూపించామనుకోండి, అందం కొరుక్కుతింటామా ఏమిటి, అమ్మాయి నెమ్మదిస్తురాలో కాదో కనుక్కున్నావా అంటారు. ఇది చాలామందికి ఉండే కడుపు మంట. ఇలాంటివాళ్ళని సంతృప్తి పరచడానికి మార్గాలు వెదకాలి. ఉదాహరణకి కారుగాని, బైక్ గాని కొన్నాక, పక్కింటాయనకి కారు కొని అలా తీసుకొస్తున్నానో లేదొ ఆటోవాడు వచ్చి గీత పెట్టేసాడని చెపితే ఆయన కారుకు లేద బైక్‌కి పడ్డ గీతని చూడటానికి ఆనందంగా వస్తాడు. మనం చేసిన పనుల్లో మైనస్ పాయింట్లు ముందుగా వీళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆనందపడతారన్నమాట. వీళ్ళ కడుపు మంటకి అదే మందు.
Subscribe to:
Posts (Atom)