July 1, 2009

ప్రత్యేక దళిత చట్టాలు చేయాలేమో!

భారత దేశంలో ఇప్పటికే ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అలాగే దళితులకు కూడా ప్రత్యేక చట్టలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయాన్నే టీవిలో వార్తలు చూస్తూంటే యంపి జగన్నాధంగారు స్వయంగా బాంక్ మేనేజర్ను యస్సి యస్టీ లకు లోన్లు మంజూరులో జాప్యం చేస్తున్నారని దాడి చేయడం చాల జుగుప్స కలిగించింది. ఒక అధికారిపై ఒక యంపి స్వయంగా దాడి చేయడం అనేది నిజంగా భారత రాజ్యాంగాన్ని, వ్యస్తను అవమాన పరచడమే. ఇది వారి మూర్ఖత్వాన్ని బరితెగించడాన్ని తెలియచేస్తోంది. యస్సి, యస్టిల పేరుమీద ఏమి చేసినా చెల్లుతుందనే వారి నమ్మకానికి ఇది పరాకాష్ట.నేను చూసిన ఆఫీసుల్లో ఈ పద్దతి ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలో ఉంది. నిబంధనలు విధిగా పాటించాలనే అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టడం సర్వసాధారణం. దళితుల రక్షణకు చేసిన చట్టాలు చాలా విధాలుగా దుర్వీనియోగం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేయమంటే అట్రాసిటీ కేసులు పెట్టడం, కావలసిన సీటు ఇవ్వకపోతే అట్రాసిటీ కేసు పెడతామనడం ఇవిగాక యస్సి, యస్టీ సంఘాలు ఆఫీసుల్లో చేసే హడవిడి అంతా ఇంతా కాదు. అంబేద్కర్ దేశ నాయకుడు. ఆయనకు వర్గ నాయకత్వం అంటగట్టి ఆఫీసుల్లో వీరు చేసే చేష్టలు ఆయనను అవమాన పరిచేవిగా ఉంటాయి. ఎక్కడో కొన్ని దురదృష్ట సంఘటనలు మినహా వీరు చెపుతున్న విభేదాలు లేనేలేవు. న్యూనతా భావాన్ని వీరు విడిచి పెట్టి మనసులో ఉన్న విభేదాలు మరచిపోవాల్సిన అవసరం ఉంది. అగ్ర వర్నాల దురహంకారం అంటూ ఎలుగెత్తే వీరికి ప్రస్తుతం జగుతున్న ప్రేమ వివాహాల్లో ఎంతమంది యస్సి, యస్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలను అబ్బాయిలను ఇతర కులస్తులు చెసుకోవట్లేదు! చట్టాల మాటున వీరు దాడులు చేయడం గర్హినీయం. ఈ ఉపేక్ష ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు వీరికి ఓటు వేయని వాళ్ళమీద అట్రాసిటీ కేసు, పదవి ఇవ్వకపోతే ప్రధాని మీద ఒక అట్రాసిటీ కేసు పెడతారేమో! కబట్టి ఇకపై వీరు ఎలాంటి దాడి చేసినా శిక్షలు ఉండని విధంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది.

18 comments:

Kathi Mahesh Kumar said...

"మాపక్కింటాయన రోజూ తన పెళ్ళాన్ని కొడతాడుకాబట్టి అందరు మొగుళ్ళూ వాళ్ళ పెళ్ళాలను రోజూ కొడతారు" అన్నట్టుంది మీవాదన. లభ్యంలో ఉన్న సంఖ్యల ప్రకారం SC/ST Prevention of attrocitioes act "misuse" కాదుకదా అసలు "use" అవ్వట్లేదు. ఇదేవాదన కట్నం కేసుల్లో కూడా మీలాంటి మహానుభావులు చేస్తున్నారు. కానివ్వండి. కాకపోతే ఇలా చట్టం గురించి sweeping generalisations and statements చేసే ముందు కొంత పరిశోధించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. That will help in giving you a perspective.

విశ్వామిత్ర said...

కత్తి మహేష్ కుమర్ గారూ! బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు. మీరు ప్రముఖ తెలుగు బ్లాగర్లలో ఒకరుగా నాకు తెలుసు. బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్ పై మీరు రాసిన టపా చదివేను. అగ్రవర్ణాలపై మీకున్న దురభిప్రాయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ప్రపంచం మారుతోంది - మీరు కుడా మారాలి! నా వాదన మీకు నచ్చకపోవడంలో విచిత్రం లేదు.

Kathi Mahesh Kumar said...

"బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్" is a word used to express deterministic attitude that is available across cultures and castes. కనీస వ్యావహారిక జ్ఞానాన్ని, ఆ టపా పుర్తిపాఠాన్నీ తెలుసుకోకుండా ఇక్కడ అసందర్భంగా మీరు చేసిన వ్యాఖ్య శోచనీయం.

దురభిప్రాయం ఎవరికి ఎవరిమీదున్నదో లేక mutually exclusive గా ఉన్నదో అనేది తరువాత నిర్ణయించుకుందాం.
ముందుగా నేను మీవాదనపై చేసిన పరిశీలనలోని అర్థాన్ని గ్రహించండి. ఇక్కడ సమస్య "నచ్చడం-నచ్చకపోవడం" కాదు. మీ observation శాస్త్రీయమైనదా కాదా అనిమాత్రమే.

విశ్వామిత్ర said...

మహేష్ కుమార్ గారూ! అది అసందర్భం కాదు. అదే మూలం.మీ భావం అంతా ఆ ఒక్క పద ప్రయోగంలోనే ఇమిడి ఉంది. సంస్కారం అనేది కులాన్ని బట్టి రాదు అని నేను నమ్ముతాను. కాని మీరు ఒక కులానికి ఆపాదించి వాడిన మాటను Culture & Caste కు symbolic word అని చెపుతున్నారు. అది తప్పు కాదా?

Kathi Mahesh Kumar said...

@విశ్వమిత్ర: అది "నా" పదప్రయోగం కాదు. ఇప్పటికే వ్యవహారంలో ఉన్న పదం అది. ఆ పదం కులసంస్కారానికి చిహ్నం కాదు. ఒక attitude కి సంబంధించిన విషయం.

Neither Brahmanism nor Brahmanical attitude has anything to do with Brahmans as a caste or community.ఒకటి ఐడియాలజీ మరొకటి యాటిట్యూడ్.అవి సామజికాలు కుల చిహ్నాలు కాదు.

విశ్వామిత్ర said...

ఒక సంఘటనని ఉదహరిస్తూ నేను రాస్తే జనరలైజ్ చేయొద్దని దానిని మీరు తప్పు బడుతున్నారు. కానీ బ్రాహ్మిణికల్ అటిట్యూడ్ అని కుల ప్రాతిపదికగా ఒక పద ప్రయోగం చేస్తూ దానిని మీరు జెనరలైజ్ చేయడంలేదా? అది ముమ్మాటికీ తప్పేనండీ.

Kathi Mahesh Kumar said...

అది కులప్రాతిపదికన చేసిన పదప్రయోగం కాదు అని చెబుతున్నా మీకు అలాగే అనిపిస్తే. మీఇష్టం. ఇక చెప్పడానికి ఏమీ లేదు. If you are not ready to learn beyond prejudice, its fine with me.

విశ్వామిత్ర said...

మహేష్ గారూ ఎవరినో నొప్పించడం నా అభిమతం కాదు. కుల ప్రాతిపదికన ఏది జరిగినా నేను వ్యతిరేకిస్తాను. కులాలని బట్టీ వ్యతిరేకించేవాళ్ళని కూడ వ్య్తిరేకిస్తాను. కొన్ని వర్గాలను పైకి తేవడానికి ప్రభుత్వం కొన్ని నిర్నయాలు చేసింది. వాటిని వాడుకోవడంలో తప్పులేదు. కానీ వాటిని ఆయుధాలుగా వాడటమే తప్పు.

Unknown said...

well said viswa mitra garu.. I agree with u

Unknown said...

Brahmin నౌన్ అయితే Brahminical ఆడ్జెక్టివ్ అవుతుంది. అటువంటప్పుడు అది బ్రాహ్మణుల్నే స్ఫురణకు తెస్తుంది. "దాన్ని నెగటివ్ సెన్సులో వాడ్డం మాకు అభ్యంతరకరం" అని బ్రాహ్మణులు ఎలుగెత్తి చెబుతున్నా కూడా వినకపోవడం ఉద్దేశపూర్వకమైన caste abuse కిందికే వస్తుంది. ఎవరైనా "ఇంతకుముందెవరో వాడారు, నేనూ వాడుతున్నాను" అని బుకాయిస్తే "అయ్యా ! వాళ్ళకి బుద్ధి లేదు. నీకూ బుద్ధి లేదా ?" అని అడగాల్సి వస్తుంది. "మమ్మల్ని బాధపెట్టొద్దు" అని అవతలివాళ్ళు మొత్తుకుంటూంటే "లేదు నేను బాధపెడతాను, నేను పెట్టే బాధని సహించే స్థాయికి నువ్వు ఎదగాలంతే" అని వాదించడం మనిషి లక్షణం కాదు, దున్నపోతు లక్షణం. గతంలో దళితుల్ని కోట్లాదిమంది అస్పృశ్యులుగా ఛూశారని ఇప్పుడు కూడా చూస్తే ఎలా ఉంటుంది ? బ్రాహ్మణులు హిందూమతానికి చాలా ముఖ్యమైన కులం. మతం మారినవాళ్ళకి ఆ విలువ తెలియకపోవచ్చు. వాళ్ళని abuse చెయ్యడం హిందూమతాన్నే abuse చెయ్యడం కిందకొస్తుంది.

When you decide to abuse somebody, you are similarly open to abuse. Remember !

విశ్వామిత్రగారూ ! దళితచట్టాలు ఎట్టి పరిస్థితుల్లోను రద్దుకావు. ఆ రూట్ లో వద్దు. ఇంకో రూట్ లో వెల్దాం. మనక్కావాల్సినవి - బీసీలపై అత్యాచార నిరోధక చట్టం, ఓసీలపై అత్యాచార నిరోధక చట్టం. ఎస్సీ ఎస్టీ చట్టాలకి తీసిపోని క్లాజులతో అవి చేయించడానికి మనం కృషి చెయ్యాలి.

విశ్వామిత్ర said...

@ అభిషేక్ గారూ మీరు చెప్పింది నిజమే. ఎవరో బూతులు తిట్టుకుంటున్నారని పబ్బ్లిగ్గా మనం బ్లాగుల్లో ఆ భాష వాడట్లేదుకదా! మనం రాసే రాతలవల్ల కొందరి మనసులు నొప్పించబడుతుందని తెలిసి కూడా దానిని పదే పదే వల్లించడం నిజంగా శోచనీయం.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Absolutely right @ Abhishek gaaru. It is nothing but 'his' deliberate attempt to insult Brahmins.

కొండముది సాయికిరణ్ కుమార్ said...
This comment has been removed by the author.
asha said...

నాకు తెలిసిన బ్రాహ్మణ కులానికి చెందిన ఒకతను ఎస్సీ, ఎస్టీ పట్ల అతనికున్న వివక్షతని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. మా అమ్మాయి మొన్న ఆ కులం వాళ్ళొచ్చి ఇల్లు అద్దెకు అడిగితే మీలాంటి వాళ్ళకి మా ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్పిందట అని ఎంతో పొంగిపోయాడు. అందుకని బ్రాహ్మణులు అందరూ అంతేనని స్వీపింగ్ జెనరలైజేషన్ చేస్తే ఎంత తప్పో కదా. ఎవరో కొందరు ఎస్సీ, ఎస్టీ ఏక్ట్‌ని దుర్వినియోగం చేస్తున్నారని అందరినీ అనటం కూడా అలానే ఉంది.
ఈ కాలంలో కూడా అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేగా పోటిచేస్తున్న ఒక దళితుణ్ణి ఊరిలోనికి రానివ్వలేదు. ఆ సంగతి మీకు తెలుసా? ఇంకో చోట పోలింగ్ బూత్‌కి రావటానికి దళిత మహిళలకు ఆంక్షలు పెట్టారు. అలాంటివాళ్ళను ఎస్సీ, ఎస్టీ ఏక్ట్ తప్పకుండా ఉండాలని నేను నమ్ముతాను.
పైకి కనిపించకుండా ఉండే వివక్షతను ఎలాగూ అరికట్టలేము. కనీసం అలాంటి దారుణాలనైనా అరికట్టగలగాలి.
ఇవన్నీ విద్వేషాలను పెంచటానికి చెప్పటం లేదు. ఈ డిస్క్రిమినేషన్ వల్లా, రివర్స్ డిస్క్రిమినేషన్ వల్లా వాళ్ళే బాధింపబడుతున్నారని నా బాధ. అంతే.

విశ్వామిత్ర said...

భవానీ గారూ మీరన్నదీ నిజమై ఉండవచ్చు. మా ఊళ్ళో ఉన్న ఒక (యస్సి కులానికి చెందిన)
సంగీత విద్వాంసుడిని బ్రాహ్మల అమ్మాయి పెళ్ళి చేసుకుంది.మా ఫ్రెండ్ సర్కిల్ లోనే రెండు ప్రెమ వివాహాలు జరిగాయి. కాబట్టి రెండూ ఉన్నాయి. మానవత్వంపై దాడి చెసే వారెవరినైన సిక్షించాలి. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను కాదనడం లేదు. ఎవరికైతే ఈ ప్రత్య్యేక హక్కుల గురించి తెలుసో వారు దానిని దురుపయోగం చెసే ప్రయత్నం చేసున్నారు.

Kathi Mahesh Kumar said...

@కొండముది సాయికిరణ్ కుమార్: Don't kid your self. What makes you think I want to insult Brahmans? What do I achieve by insulting Brahmans?

బ్రాహ్మణుల్ని అవమానపరిస్తే నాకొచ్చే సామాజిక-ఆర్థిక-మత-సాహితీ- రాజకీయ లాభం ఏమీ లేదు. సామాజికంగా బ్రాహ్మణుల ప్రాబల్యం తగ్గే కొన్ని దశాబ్ధాలు కావస్తోంది. దళిత ఉద్యమంలో బ్రాహ్మణద్వేషం అర్థం లేని పోకడగా మారి అర్థదశాబ్ధం కావొస్తోంది. నిజానికి దళిత-బ్రాహ్మణులు సహకరించుకుంటేగానీ రాజకీయ లబ్దిపొందలేరన్న స్పృహతో రాజకీయసమీకరణలు ఏర్పడుతున్నకాలంలో బ్రాహ్మణుల్ని ద్వేషించే అర్థరహిత కార్యం చెయ్యాల్సిన అవసరం నాకు లేదు.

మీలాంటి సామాజిక పరిస్థితి మీద అవగాహనలేనివాళ్ళకి అలాగే అనిపిస్తుందేమో.I can forgive you for your ignorance. I miss took it for arrogance earlier.

Kathi Mahesh Kumar said...

@అభిషేక్: "బ్రాహ్మణులు హిందూమతానికి చాలా ముఖ్యమైన కులం. మతం మారినవాళ్ళకి ఆ విలువ తెలియకపోవచ్చు. వాళ్ళని abuse చెయ్యడం హిందూమతాన్నే abuse చెయ్యడం కిందకొస్తుంది."
Such arrogant display of sole-ownership on Hindu religion by Brahman freaks such as you are making things worst for rest of your community.

మతంమారినవాళ్ళకి ఆ విలువ తెలీదు అని చాలా గొప్పగా శెలవిచ్చారు. మతంమారింది ఎవరు? ఆ విలువ తెలుసుకోవలసింది ఎవరు? హిందూమతాన్ని ప్రశ్నిస్తే వాడొక మతంమారిన క్రైస్తవుడయ్యుండాలి మరీ ముఖ్యంగా దళితక్రైస్తవుడయ్యుండాలనే స్టీరియోటైపింగ్ మీ లాంటి మూర్ఖశిఖామణే చెయ్యగలరు. ఎందుకంటే I am sure you have not even read any of the religious criticism done by "your own" (they are mine too) Brahman writers.

ABUSING BRAHMANS....!!! read my earlier answer to Mr.kondamudi

B. SRINIVAS NAVEEN said...

@కత్తి మహేష్ కుమార్
'సామాజిక-ఆర్థిక-మత-సాహితీ- రాజకీయ లాభం ఏమీ లేదు. సామాజికంగా బ్రాహ్మణుల ప్రాబల్యం తగ్గే కొన్ని దశాబ్ధాలు కావస్తోంది'.

బావిలో కప్పలా బ్రహ్మణుల ప్రాబల్యం తగ్గిందనుకొనే మీలాంటి వారితో వాదించలేను ఇప్పటికి ఇంకా రిజర్వేషన్ల కొసం దేబిరిస్తు అత్మాహుతులు, దాడులు చేస్తు ఎవరున్నారో అందరికి తెలుసు ఎందుకు రిజర్వెషన్లు మామూలుగా అర్హులు కాలేరా ,