July 7, 2009

తెలుగు బ్లాగరు పారిపోతున్నాడు పట్టుకోండి!!

నేనా రోజు బజారుకు వెళ్ళాను. అంతా చాలా రద్దీగా ఉంది. ఫ్రూట్స్ కొందామని చూస్తూంటే కొందరు వ్యక్తులు ఒక యువకుడిని వెంటపడి తరుముతున్నారు. ఆ యువకుడు ఆ వ్యక్తులనుండి తప్పించుకోవాడినికి వేగంగా పరిగెడుతున్నాడు. ఆ గుంపులో వివిధ వయస్సుల వాళ్ళు ఉన్నారు. కొందరు అరుస్తున్నారు
"ఎలాగైన పట్టుకోండి..మళ్ళీ బ్లాగులో రాయకుండా చితక్కొంట్టండి" అంటున్నారు. మరికొందరు
"పారిపోతే దేశంలో ఎక్కడినుండైనా బ్లాగింగ్ చెశేస్తాడు. చేతులు విరగ్గొట్టండి" అంటున్నారు.
నేను పరిగెడుతున్న గుంపులో ఒక వ్యక్తిని పట్టి ఆపి "ఎందుకు అలా తరుముతున్నారు?" అని అడిగేను.
దానికి అతను " ఏమి చెప్పమంటారు! మేమంతా ఒక మంచి మాట చెప్పుకుందామని, చిన్న నాటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని మురవాలని, ఒకరికి తెలిసిన విషయం మరొకరు పౌచుకోవాలెన ఉద్దేశ్యంతో తెలుగు బ్లాగులు ఏర్పాటు చేసుకున్నాము. వీడు మధ్యలో దూరిందే కాకుండా ఎవ్వరికీ ఇష్టం లేని విషయాలు పదే పదే రోజుకు పదిసార్లు రాస్తూ కొన్ని నెలలుగా విసిగించేస్తున్నాడు.విసిగించకురా అని చెప్పినా వినట్లేదు. మా అందరికీ వీడిబానుండీ ఎలా తప్పించుకూవాలో తెలియట్లేదు. అనుకోకుండా ఇప్పుడు దొరికేడు.మరోసారి రాయకుండా చెసేస్తేగానీ వాడికి బుద్ధి రాదు" అన్నాడు ఒగురుస్తూ.
గుంపు ముందుకు సాగిపొయింది.
కొద్దిసేపటికి నా పనులు చక్కబెట్టుకొని తిరిగి వస్తూ ఉంటే ఆ యువకుడు జేబులో చేతులు పెట్టుకొని ఈల వెసుకుంటూ నెమ్మదిగా విలాసంగా ఎదురు వస్తున్నాడు. నేను అతనికి ఎదురు వెళ్ళి అతనిని అడిగాను
" వాళ్ళు నిన్నెందుకు తరుముతున్నారు?" అని.
అతడు చిద్విలాసంగా "నేను దొరకలేదుగా" అన్నాడు.
" సరేగాని విషయం ఏమిటో చెప్పు" అన్నాను.
"నేను కూడా ఒక బ్లాగు రాస్తున్నాను. దాని పేరు 'అ టు అహా కలలు'. దానిలో నాకిష్టమైన హీరో చరణ్‌జీవి గురుంచి రాస్తూ ఉంటాను"
" దానినికి వారికెందుకు అంత కోపం? ఏం రాసేవాడివి" అన్నాను.
" నా హీరో గురించి అన్ని విషయాలు. ఉదయం లేచి నప్పటినుంది పడుకొనే వరకు, సినీ హీరో గా, పార్టీ పెట్టిన హీరోగా, కాబోయే ముఖ్య మంత్రిగా,వివిధ దశలుగా వర్ణించేవాడిని"
"నువ్వేమి చేస్తూవుంటావు?" అడిగాను
"బ్లాగులు రాస్తూ ఉంటాను" అన్నాడు
"రాయడం అయ్యకా ఏమి చేస్తావు?" మళ్ళీ అడిగాను
"మళ్ళా రాస్తాను" అన్నాడు
"రోజూ ఎన్ని సార్లు రాస్తావు?" అడిగాను
"నిద్రొచ్చేదాకా ఒక పది పదిహేను రాస్తాను" అన్నాడు
"మరికాస్త విపులంగా చెపుతావా?" అని అడిగాను.
"నా హీరో చరణ్‌జీవి పార్టీ పెట్టినప్పుడు అతని సిద్ధంతాలు విపులంగా ఊహించి వివరించాను. అతనికి అభిమానులు జైకొడుతున్నప్పుడు అతని పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పాను.మీటింగులకి జనం భారీగా వస్తే రెండువందల నలభై సీట్లు వస్తాయని ధీమగా చెప్పాను. ఎవరైనా జోకులేస్తే నాకు చిరాకని రాసేను. కాబోయే ముఖ్య మంత్రి అని చెప్పాను.సీట్లు అమ్ముకొంటున్నారని ఎవరైనా విమర్శిస్తే అంతా భూటకం అని అన్నాను."
"మరి నువ్వు చెప్పినట్ట్లు మీ హీరో పార్టీకి రెండువందల నలభై సీట్లు వచ్చాయా?" నేను
"నలభై కూడా రాలేదు" అన్నాడు
"మరి మీ హీరో ముఖ్యమంత్రి అయ్యాడా?" అని అడిగేను
"ముఖ్య మంత్రి కాదు పోటీ చేసిన స్థానల్లో ఒకచోట ఓడిపొయాడు కూడా" అన్నాడు
"మీ పార్టీ స్థాపకులలో సత్రా కూడా ఒకరు కదా?" అని అడిగాను
"అవును" అన్నాడు
"మరి ఆయనే పార్టీని వదిలి పెట్టి పొతే నువ్వేమి పాముతున్నావు" చిరాగ్గా అడిగాను
"అందుకే ఆయన కొడుకు గురించి రాస్తున్నాను" అన్నాడు
"ఆయన కొడుకు గురించి ఏమి రాస్తున్నావు?" ఆశ్త్చర్యంగా అడిగాను
"కొత్తగా మగవీర సినిమా తీస్తున్నారుగా దానిగురించి" అన్నాడు
"రిలీజ్ కాని సినీమా గురించి నువ్వేమి రాస్తావు?" నేను
"సినీమా చాలా బాగుంటుందని, పాటలు బాగా వస్తాయని" అన్నాడు
అప్పుడు నాకు కాలింది చాలా చాలా...
వెంఠనే నా మొబైల్ తీశాను.
"ఎవరికి ఫోన్ చేస్తున్నారు?" అడిగాడతడు
"తెలుగు బ్లాగర్లకి, నువ్విక్కడ ఉన్నావని చెప్పడానికి" అన్నాను కసిగా
ఒక్క ఉదుటున పారిపోబోయాడు.
నేను పట్టుకున్నాను.
ఐనా విదుల్చుకొని పారిపోయాడు.
మీకుగనక ఎక్కడైనా కనిపిస్తే కాస్త నాక్కూడా చెప్పండి.ప్లీజ్!!

గమనిక: ఈ టపా ఎవరినీ నొప్పించడానికి కాదు. పాత్రలన్ని కల్పితాలు. నవ్వొస్తే నవ్వుకోండి.

15 comments:

sunita said...

Baaboo thaanks.chakkagaa raasaavu.

కొత్త పాళీ said...

ha ha ha.

టపాలో కామెడీకి కాదు, ఆ చివర్లో డిస్క్లెయిమరు చదివి :)

Bhaskar said...
This comment has been removed by the author.
Bhaskar said...

It is very good from A to Z...

శేఖర్ పెద్దగోపు said...

హహ..హ..

Anil Dasari said...

అతను తన గొడవేదో తను రాసుకోటమే కానీ ఎవరి జోలికే వెళ్లని రకం. ఆయన వెంట పడతారెందుకు సార్?

చిలమకూరు విజయమోహన్ said...

అబ్రకదబ్ర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా.

Anonymous said...

>>అతను తన గొడవేదో......

గదే మరి కామెడీ అంటే. కూడలిని గబ్బు పట్టిస్తుండు గదనే కుప్పలతెప్పల టపాల్తోని.

జీడిపప్పు said...

అదరగొట్టారు విశ్వామిత్ర గారు. Wonderful post.

>> "రాయడం అయ్యకా ఏమి చేస్తావు?" మళ్ళీ అడిగాను
"మళ్ళా రాస్తాను" అన్నాడు <<

ఇది చదివి గట్టిగా నవ్వాను ఆఫీసులోనే :)

Please remove "word verification" in Comments settings.

విశ్వామిత్ర said...

@ అబ్రకదబ్ర & చిలమకూరు విజయమొహన్ గార్లూ నేను విన్న ఒక జోకు చెపుతాను!!

ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు బలవంతంగా ఒక పిచ్చి డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళారు. డాక్టర్‌తో ఆ వ్యక్తి "డాక్టర్‌గారూ నాకెమీ పిచ్చి లేదు. కాని నాకు కంది పచ్చడి అంటే ఇష్టం దానికే నాకు వీళ్ళంతా పిచ్చి అను అనుకుంటున్నరు" అన్నాడుట. దానికి ఆ డాక్టర్ అశ్త్చర్యంగా " నాకు కూడా కంది పచ్చడి అంటే చాలా ఇష్టం, అంతమాత్రాన పిచ్చి అంటే ఎలా" అని తీసుకొచ్చినవాళ్ళమీద కోప్పడ్డాడట. దానికి ఆ వ్యక్తి వెంఠనే ఆనందంగా "డాక్టర్ ఏమిటి కంది పచ్చది అంటే మీకు కూడా ఇష్టమేనా? ఐతే మా ఇంటికి రండి, మా ఇంట్లో ట్రంకు పెట్టె నిండా చేసి ఉంచాను" అన్నాడుట.

విశ్వామిత్ర said...

@జీడిపప్పు వారూ కామెంట్స్ సెట్టింగ్స్ మర్చేను. థాంక్స్!!

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
విశ్వామిత్ర said...

@ వినయ్ గోగినేని..ఈ పాత్రలు నీకు నిజంగా కనిపిస్తే సో సారీ! అలాంటివేమి మనసులో పెట్టుకోమాక. టేకిట్ ఈజీ బ్రదరూ..ఈ బ్లాగు బద్దలైపోనూ... ఈ బ్లాగులో కామెంట్లు రాకొపోను... ఈ బ్లాగు గుంపులో మూసెయ్యా...కోపం తీరిందా? నిజమే పిల్లిని ప్రెమిస్తాడొకడు, బల్లిని ప్రేమిస్తాడొకడు..మనిషికి మనిషికి తేడా ఉంటాదిరో.....!!

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
B. SRINIVAS NAVEEN said...

ఎవరిష్టం వాళ్ళది ఈమద్య బ్లాగులు ఇలానే రాయాలి అనే రూలేమన్నా పెట్టారా