July 9, 2009

హేతువాదులూ మీరు ఆస్తికులా లేక నాస్తికులా?

ఈ మధ్యకాలంలో హేతువాదులమని చెప్పుకోవడం ఒక గొప్ప క్వాలిఫికేషన్ అని జనాలు అనుకుంటున్నారు. హేతువాదమంటే సైంటిఫిక్‌గా నిరూపించబడితేనే వారు ఏ విషయాన్నైనా నమ్ముతారన్నమాట. హేతువాదమనేది ముఖ్యంగా నమ్మకాలతొ ముడిపడి ఉంటుంది. ఆస్తికత్వం పుట్టినప్పుడే నాస్తికత్వం పుట్టి ఉంటుంది.దేముడు ఉన్నాడా లేదా అనే విషయంపై అనాదిగా చర్చలు జరుగూతూనే ఉన్నాయి. బ్లాగుల్లో కూడా ఈ విషయం పై అనేక చర్చలు జరిగే ఉంటాయి. కానీ నాస్తికులకన్నా ఆస్తికులకు కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. పొద్దున్నే లేవగానే అద్దంలో చెత్త మొహం చూడకుండా చక్కగా దేముడి మొహం చూసుకోవచ్చు. ఏదైన కష్టం వచ్చినప్పుడు ఓరి దేముడో నేనేమి పాపం చేసేనురో అని దీర్ఘంగా ఏడవచ్చు. మన చేతుల్లో లేని పని ఏదైనా ఉంటే దేముడిపై భారం వేయవచ్చు. గుళ్ళు గోపురాలంటూ చక్కగా ఊళ్ళు తిరగొచ్చు. మరిన్ని అడ్వాంటేజీలు వదులుకొని నాస్తికులు ఏమి సాధిస్తారో నాకు తెలియదు. భూమిమీద గాలి నీరు తిండి ఆవకాయి, మాగాయి అన్నీ ఉన్నాయి.మరే ఇతర గ్రహాలమీద లేవు. ఆస్తికులు ఇవన్ని భగవంతుడి సృష్టి అని తృప్తిగా చెప్పుకుంటారు. కాని నాస్తికులు ఇవన్ని అనుభవిస్తూ కూడా ఇదంతా ఎవరు సృష్టించారో తెలియని సైన్స్ అంటారు. భూమిపై హాయిగా నడుస్తున్నాము, డాన్స్ చేస్తున్నాము. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే నడవగలుగుతున్నమని అంటే మరి ఇతర గ్రహాలకు ఎందుకు లేదు? సూన్యంలో గ్రహాల్న్ని వలయాకారంలో తిరగడానికి శక్తినిచ్చినదెవరు? చంద్రుడికి లేని గురుత్వాకర్షణ భూమికి ఎలా వచ్చింది? చంద్రుడిలొని చల్లదనం సూర్యుడికి ఎందుకు లేదు? వీటిలోని మంచి లక్షణాలు భూమి ఎలా అందుకోగలుగుతోంది? మనం మురిసిపోయే తొలకరి జల్లులు భూమికే ఎందుకు? ఇవన్నీ మన కళ్ళ ఎదుటి సాక్ష్యాలు. గ్రహ మండలాల గురించి సైన్స్ చెప్పేది చాలావరకు ఊహాగానాలు మాత్రమే. జీవిత కాలం అంతా కనుగొని చెప్పింది పిసరంత. ఇంకా బొలేడు మిగిలి ఉంది. కనిపించేదానికి కారణం చెప్పడానికే ఇంతకాలం పడితే అది సృష్టించబడడానికి ఇంకెంత శక్తి కావాలి? ఆ తెలియని శక్తే భగవంతుడని అనుకుంటున్నారు. అతని రూపం ఊహాజనితం కావచ్చు, కదలికలు ఊహజనితం కావచ్చుగాక ఆడ మగా అనేది కూడా ఊహా జనితం కావచ్చు.అది ఏదైనా ఎవరైనా ఒక శక్తికి ప్రతిరూపం. ఇంకో చిన్న విషయం ఆస్తికుడు చచ్చిపోతూ నేను అందరికి మంచి చేసాను భగవంతుడు మరుజన్మలో నాకు మంచి చేస్తాడు అనే తృప్తితో మరణిస్తాడు. కాని మరుజన్మ లేదనుకొనే నాస్తికుడు నా శరీరంలోని కదలికలు ఇక ఆగిపొతాయి, ఇక నేను చెయగలిగేది ఏమిలేదు అనుకుటూ మరణిస్తాడు. ఇదే ఆస్తికత్వానికి నాస్తికత్వానికి ముగింపులోని తేడా. మీరేమంటారో?

15 comments:

జయహొ said...

Please read SITAPATHI KATHA by devarakonda tilak.

Indian Minerva said...

చాలా బాగా చెప్పారు.
కానీ హేతువాదులు (అందరూ కాదు) మీ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంటారు (కొన్నిటికి ఇపాటికే కనుక్కున్నారుకూడా). ఆస్థికులేంచేస్తారో తెలుసా ఇంకో రెండువందల ఎనభై ప్రశ్నలు అడిగినకూడా అన్నిటికీ ఒకే సమాధానం చెప్తారు "దేవుడి దయవల్ల" అని.

మీరన్నది నిజమే హేతువాదిగా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు వెదికే కన్నా దేవుడా అనుకోవడమే చాలా విజీ...

నిజం చెప్పాలంటే హేతువాదిగా వుండటం మీరు కూడా మొదలుపెట్టవచ్చు పెద్ద కష్టమేకాదు "నాది వెధవ మొహం" అనుకోకుండా వుంటే క్రమంగా మీలో మార్పువస్తుంది :).

విశ్వామిత్ర said...

@ఇండియన్ మినర్వా: గుడ్ జోక్.....ఇక మీ మాటల్లోని శ్లేష అర్ధమైంది. నేను మట్లాడేది పలాయన వాదం చెసే వారి గురించి కాదు. ఒక హేతువాదిగా కారణాలు మాత్రమే వెదుకుతున్నారు. ఆ కారణానికి కారకులగురించి నేను మాట్లాడుతున్నాను.

durgeswara said...

వాదన వలన వేదనమాత్రమే మిగులుతుంది వేదన భరించలేక ఏమీలేదంటారు .అదే హేతువాదమనుకుంటే అది వారిష్టం .హేతువేదో కనుక్కోవాలంటె బహుశ్రమ . కనుక ఆప్రయతనం లేకుండా ఏమీలేదు అనటం కొందరికి బహుసౌకర్యం .

Vani said...

నిజానికి పూర్వ కాలం లో కూడా తర్కం, మీమాంస అంటూ ఆస్తి కి నాస్తి కి మధ్య చర్చలు జరిగేవి.
అయితే ఇలా పక్కవారిని తిట్టటానికే పుట్టినట్లు భక్తి లో ఉన్నవాళ్ళని ఎగతాళి చేసే వాళ్ళు కాదు.
వాస్తు, జాతకం , దైవ భక్తి అనేవి మనసుకి ఆసరాలు.
అవి అక్కర లేని వాళ్ళు లేకుండా బతకచ్చు. కాని పాటించే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనటం తప్పు.
ఇతరదేశాల్లో మానసిక వైద్యుల వద్దకు, ఫ్యామిలీ కౌన్సిలర్ల వద్దకు వెళ్ళినట్లు మన వాళ్ళు కొందరు జాతకుల దగ్గరకు, గుళ్ళకు వెళ్తున్నారని ఎందుకు అనుకో కూడదు.
నమ్మకం అనేది సున్నితమైన విషయం. అందుకే మతం ని విమర్శించటం కనీస మర్యాద తెలియనట్లు. ఇది శిక్షార్హము.

Uyyaala said...

>>>> Aastikudu chachchi potoo Nenu andarikee manchi chesaanu marujanmalo naaku bhagavantudu manchi chestaadu ani truptito maraNistaadaa???? Nijamaa ?????

Aastikulantaa itlaa andarikee manchi chestunte ee prapancham itlaa enduku tagalabadutundi?

Ee hatyaloo, atyaachaaraaloo, baambu pelullu, araachakaalu enduku jarugutaayi?

Veerappanloo, Osama bin ladenloo, Fraction leadersloo, dongaloo, lanchagonduloo ... andaroo veera Aasthikule kada??

Note: Enduko mee comment box lo Telugu copy paste panicheyaka ilaa asampoornangaa, asamtruptigaa mugistunnaanu.

Unknown said...

ప్రఖ్యాత శాస్త్రవెత్తలు చాలామంది దెముడి ని నమ్మిన వారె. సైన్సు లొ ఫండమెంటల్స్ చెప్పిన్ న్యూటన్ అయినా , సైన్సు & అర్ట్ కలిపి ప్రజలను మెప్పించిన డావించి అయినా.. దెముడి ని నమ్మిన వారె. సైన్సు తొ మాత్రమె తయారు చెసి నడిపే ఉపగ్రహలను ప్రయొగించె ముందు మన ఇస్రొ శాస్త్రవెత్తలు ..తిరుపతి లొ వెంకన్న ముందు డెసైన్ బ్లూ ప్రింట్స్ పెట్టల్సిందె.

ఎందుకంటె ఒకె డెసైన్ తొ చెసిన కొన్ని వెలతాయి.. కొన్ని కూలిపొతాయి. మరి అది మానవ తప్పిదమూ లెక వాతావరణం అనుకూలించక పొవదమొ.. something beyond human control.

మనిషి ఎన్ని కంట్రొల్ చేసినా నెచర్ ని కంట్రొల్ చెసె లెవల్ కి ఎదగలెదు.

విశ్వామిత్ర said...

@ ప్రభాకర్ మందార: ప్రభాకర్ గారూ కొందరైనా అలా అనుకోబట్టే మనుషుల మధ్య కొంతైన సత్సంబధాలు ఉంటున్నాయి.అందరూ మీ గురువుల్లా ఐతే ఎలా ఉండేదో పరిస్తితి చెప్పక్కర్లేదు కదా! :)

Satyamevajayate said...

మీ రాతలు చాలా అమాయకంగా ఉన్నాయి .మీకు నిజానిజాలు గ్రహించాలని ఉన్నట్లయితే ..చాలా పుస్తకాలు తెలుగులో ఉన్నాయి .
ఒకటి,--Dr. Brahmaa reddy ..గారి" ఓ మనిషీ.. చరిత్రలో నీ స్థానం ఏమిటి ?
ఇది చక్కని పుస్తకం ..Rs15/=మాత్రమె ..విశాలాంధ్ర లో దొరుకుతుంది ..మీ ప్రశ్నలన్నిటికి చక్కగా ఒక ఆర్డర్లో సమాధానాలు ఉన్నాయి.ఇక రెండు --రంగనాయకమ్మ గారి "శాస్త్రీయ దృక్పథం "ఇది Rs15/=మాత్రమె ..ఇందులో ఇంకా మిగతా జ్ఞానానికి సంబంధించి చాలా ప్రశ్న జవాబులు ఉన్నాయి ..
అసలిది పదవతరగతిలో ..పాఠ్య గ్రంధంగా చేర్చాలి ...అందరికి జ్ఞానం కలుగుతుంది చాలా విషయాల్లో ..
మీ అమాయకత్వాన్ని ..అజ్ఞానం గా మర్చుకోవద్దు ....చదవండి మాట్లాడండి ..
రంగనాయకమ్మ గారి ఇతర రచనలు కూడా ఉపకరిస్తాయి ..

Uyyaala said...

>>> MEE GURUVULLAA naa ....?????

విశ్వామిత్ర said...

@సత్యమేవజయతే: అద్యక్షా...మీకున్న తెలివితేటలు నాకు లేకపోవడం నా అదృష్టం :)....రంగనయకమ్మగారి రామయణ విష వృక్షం నేను చదివేను... మీ అదృష్టం ఎమిటంటే మీరు హేతువాద హిందువులుగా ఉండడం... లేకపొతే మీమీద ఫత్వాలు జారి అయిఉండేవి....!!

మీరు ఎప్పుడైన ముఖ్యమంత్రి గనుక ఐతే పాఠ్యాంశాలుగా వీటిని ప్రవేశపెడుదురుగాని... !! :)

Satyamevajayate said...

ఇవ్వాళ సాక్షి ఆదివారం'' ఫన్ దే '' లో వేమన పద్యం ఇలా అంటుంది ..
నిజములాడు వాని నిందించు జగమెల్ల
నిజములాడరాదు నీచుతోను
నిజమహాత్ము గూడి నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం ...ఉన్నదున్నట్లుగా నిజం మాట్లాడేవాడిని లోకం మెచ్చదు.అలాగే తక్కువ స్థాయి వాని ముందు నిజం మాట్లాడితే ప్రమాదం కూడా .మరి నిజం మాట్లాడనేరాదా? ఎందుకు మాట్లాడరాదు ,గొప్ప జ్ఞానితో మాట్లాడవచ్చు .అతడయితే సరిగ్గా అర్థం చేసుకుంటాడు .
ఇంతకంటే ,,సమాధానం ఇంకేమిఉంటుంది?

విశ్వామిత్ర said...

@సత్యమేవజయతే: మీరు ఇదే కామెంట్ మరో బ్లాగులో కూడా ఉంచారు. ఇంకా ఎన్ని బ్లాగుల్లో ఉంచారు సార్?

Satyamevajayate said...

ఆయన నా పోస్ట్ ని ఉంచుకోలేక చేరిపివేసారు ...నిజం ..ఒక్కోసారి భయాన్ని కలిగిస్తుంది అమాయకులకు ...అజ్ఞానులకు ..అవును ఈ కామెంట్ అసలు ఆయనకే వర్తిస్తుంది ..మీరు నేను చెప్పిన పుస్తకాలు చదవండి ..అంతే కాని ..విషవృక్షం మరొక టాపిక్.దాని కారణం వేరు ..
మీకు ఉపయోగించే లాజిక్ ,సెన్స్ ,అన్ని అందులో ఉన్నాయి ..

Shashank said...

మరోలా అనుకోకండి.. ఎదో ప్రచారం చేస్తున్నా అని కూడా అనుకోకండి... నాకు దేవుడంటే నమ్మకం ఉన్నా గుడ్డిగ నమ్మేయను. అదో టైప్ లే. నాకు వేదాల మీద మన పూర్వీకుల విజ్ఞానం మీద వారి రాతల లోని గొప్ప సత్యాల మీద అవగాహన ఏర్పడేందుకు కారణమైన 'నాశదీయ సూక్తం' చదవండి. big bang theory గురించి అందరు వినేఉంటారు. scientific గా అంటే ఎప్పుడు big bang తర్వత ఎలా విశ్వం ప్రారంభమైందో చెప్తారు.. కాని అసలు big bang కంటే ముందు.. ఆ ఒక్క క్షణం ముందు ఇలా ఉండిఉండవచ్చు అని చెప్పే మహత్తరమైన సూక్తం - నాశదీయ సూక్తం. అది చదివాక ఆస్తికత్వం , నాస్తికత్వం దేవుడెరుగు సనాతన ధర్మంలోని విజ్ఞానం మీద నమ్మకం కుదురుతుంది.
http://shivadarshana.blogspot.com/2007/11/nasadiya-sukta.html