July 15, 2009
దుఖ్ఖించువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు !!
ఈ రోజు ఉదయాన్నే, దేశంలో మనకు తెలియకుండా రాత్రి ఏమి జరిగిపోయిందో అని టివి చానల్ స్కాన్ చేశాను. న్యూస్ చానల్స్ అన్ని కూడా అత్యంత డబ్బుప్రపక్తులతో ఒకే తరహ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఏ చాన్నల్స్ చూసినా ఒక్కటే మాట పాపులను రక్షిస్తామని. పాపులను రక్షిస్తే మరి పుణ్యాత్ముల సంగతేమిటో? ఒక రకంగా భగవత్గీత చెప్పేదానికి ఖురాన్ చెప్పేదానికి కొంత సారూప్యం ఉంది. రెండూ కూడా తప్పులు చేయద్దనీ చేసినవారు శిక్షించబడతారనీ చెబుతాయి.ఇదివరకు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఉదయం పూట నాతియాకలాం ప్రసారమయ్యేది. అది వింటు ఉంటే భగవత్గీత వింటున్నామా లేక ఖురానా అనే సందేహం వచ్చేది. మంచి అనేది మతంతో సంభందం లేకుండా ఎవరు చెప్పినా వినాలి. హేతుబద్ధంగా భగవంతుడితో సంబంధం లేకుండా మంచి ప్రవర్తన ఉన్నా కూడా మంచిదే. కానీ పాపాలు చేసినా నిన్ను దేముడి చేత రక్షణ కల్పిస్తానని అనడం ఎంతవరకూ సబబో నాకు అర్ధం కాలేదు.పాపాలు కడిగివేయబడతాయిట. ఇదేదో నాకు రాస్ట్ర ప్రభుత్వం చేసున్న బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంలా అనిపించింది. ముందు తప్పుడు తడకలతో అప్రూవల్ లేకుండా నిర్మించడం, తరువాత తప్పులకు జరిమానా చెల్లించడం. నన్ను ఇంకా ఆశ్చర్య పరచింది, కుంటి వాళ్ళు, గుడ్డివాళ్ళు క్షణంలో వారి అంగ వైకల్యాన్ని పోగొట్టుకోవడం. ఒక వ్యక్తిని స్టేజ్ పైకి వీల్ చైర్లో తీసుకొచ్చారు. మతపెద్ద చేతితో అతనిని తాకగానే ఆ వ్యక్తి కరెంట్ షాక్ తగిలినట్టు కింద పడి వెంఠనే లేచి నిలబడి " నా రెండు కాళ్ళూ ఇప్పుడు పనిచేస్తున్నాయి" అని అరుస్తూ స్టేజ్ అంతా పరిగెత్తాడు. ఇది నిజంగా నమ్మశక్యమా? ఇది ప్రజలను వంచించడం కాదా? హేతువాదులకు ఇది కనిపించదా? హిందువుల మూఢ భక్తిని తప్పుబట్టే రాడికల్స్ ఈ విషయంపై ఎప్పుడైనా చర్చించారా?
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
క్రైస్తవమాయల్ని హేతువాదులు తూర్పారబట్టడం లేదనేది మీ తెలియనితనమో లేక అపోహో అయ్యుంటుంది.
సువార్త సభలూ,ఫెయిత్ హీలింగుల లింగులిటుకు వ్యవహారాలన్నిటికీ వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. జనవిజ్ఞానవేదిక లాంటి సంస్థలు ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నాయి.
Let me assure you Christianity is the most ridiculed,questioned and challenged religion in practice on this planet.
వీళ్ళు అవయవాలు సరిగాపనిచేయాలని కాకుండా తమ బుధ్ధి సరిగా పనిచేయాలని "దేవుడిని" ప్రార్ధించడంవల్ల ఏమైనా ప్రయోజనం వుండవచ్చు.
ఇంతకీ మీరేంటి ఇలా హేతువాద టాపిక్కుల మీద పడ్డారు.
ఇంకా ఎక్కువ మాట్లాడారో మీరు పాతకుండ, మేము ఉత్తముండ అంటారు జాగ్రత్త. పెపంచం లో కిరస్తానీ మతాన్ని ఏకేవాళ్లు ఉన్నారన్నమాట నిజమే కానీ, మన దేశ మేతావులకు మాత్రం హిందూ అన్న ప్రతి దానిని ఏకటం లో ఉన్న తుత్తి, కిరస్తానీ ఏకటం లో లేదన్నది మాత్రం నిజం. ఉస్కో, ఉస్కో!!
@ కత్తివారూ: మీరు చెప్పింది నిజమే అయుండవచ్చు. మీరు చెప్పిన విఙ్నాన వేదికలు హిందూమతాన్ని చేసినన్ని శల్య పరిక్షలు మిగతా వాటిని చేసాయా అని! పబ్లిగ్గా ఇన్ని మాయలు ఒక మెజీషియన్కూడా చేయలేడు. అయ్యారే అని నా బాధ!
@ ఇండియన్ మినర్వా: మానవత్వాని మించిన మతం లేదు. మీరు కరక్ట్‌గా చెప్పారు. ఒక రాడికల్ వారు "హిందువుల మూర్ఖత్వం" అంటూ బ్లాగుల్లో ధారావాహికలు రాస్తున్నప్పుడు, మరి వారి కళ్ళకి ఇవికూడా కనిపించాలి కదా?
@ క్రిష్ణ: మీరు జొవియల్గా చెప్పినా అదే నిజం. పాపము శమించుగాక!!
భక్తీ వ్యాపారమే ఐపోయింది. ఏ ఛానెల్ చూసినా సువార్త సభలు, బాబాలు, ఫకీర్లు. పుణ్యాత్ముల్ని హిందువులు, పాపుల్ని క్రైస్తవులు రక్షిస్తారు బానే ఉంది. మతపిచ్చిగాళ్లనీ, వాళ్ల బారి నుండి దేశాన్నీ ఎవరు రక్షిస్తారు? ప్రభుత్వ పెద్దలే మతాలకి ప్రచారం చేస్తుంటే దిక్కేది.
@ అబ్రకదబ్ర: చిన్న సవరణ. భక్తి వ్యాపారం కావడం కాదు, కొందరి భక్తిని మరికొందరు కాష్ చేసుకుంటున్నారు.నమ్మకాలు పెట్టుబడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. హిందూ దేవాలయాలమీద వచ్చే అదాయాన్ని ప్రభుత్వం స్వాహ చేస్తున్నట్టు.
very nice.Iam not a Hindu fanatic but I give respect to my existance as it depends on culture ,religion,language and what not?The word INDIAN it self means Hindu i,e a way of life .
Post a Comment