July 19, 2009

మీ బ్లాగులో ఒకే టపాకు వంద కామెంట్లు కావాలాంటే..

తెలుగులో బ్లాగడమంటే దురదగుంటాకు ఒంటికి రాసుకోవడమే.
దురదగుంటాకు ఒంటికి రాసినకొద్దీ దురదలు పెరుగుతాయి.
అలాగె బ్లాగులో హిట్లు వచ్చేకొద్దీ బ్లాగడం పెరుగుతుంది.
మీరు కష్టపడి ఒక విషయం రాస్తే అదెవ్వరూ చదవలేదనుకోండి మీరు ఫీలవుతారా లేదా?
మరి మీరు రాసిన ప్రతీ విషయం ప్రతీ ఒక్కరిని చదివేలా చేయాలంటే కొన్ని సూత్రాలున్నాయి.
బ్లాగు సుత్రాల్లో మొదటిది మీరు ఎవ్వరూ వాడని పదాలు వాడాలి, వాటికి అర్ధం మీకు తెలియక పోయినా పరవాలేదు. దాని అర్ధం తెలుసుకోవడం కోసం కొందరు కామెంటుతారు కదా!
ఒకవేళ ఎవరైనా దానికి అర్ధం అడిగితే మీకు నచ్చినట్టు చెప్పవచ్చు.
రెండోది మీరు వినమృడివై ఉన్నట్టు రాయాలి కానీ ప్రతీ విషయంలోనూ ఎవరో ఒకరిని గిల్లుతూ ఉండాలి.
దానివల్ల బ్లాగుకు హిట్లు పెరుగుతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పుస్తకాలు చదవడం నేర్చుకో అని చెప్పాలి.
నువ్వు రాసింది తప్పు అని ఎవరైనా అంటే, సరిగా అర్ధం చేసుకోవడంలో ఉంది, రంధ్రాన్వేషణ వద్దు అని హెచ్చరించాలి. చివరిది ఎవరైనా మరీ విసిగిస్తే నీ కామెంట్లు ఇకముందు నా బ్లాగులో కనబడవు అనాలి.
ఈ సూత్రాలు వంటబట్టించుకున్న తరువాత మీరు తెలుగు బ్లాగు ప్రారంచించాలి.
ఉదాహరణకి నా మరో బ్లాగు "చెరసాల". చెరసాలలో మొదటి టపా ఇలా రాయడం ప్రారంభించాను.


టపా హెడ్డింగ్ : సూరిగాడి అనుభూతులు
ఆ రోజు పొద్దుగాలే సూరిగాడు లేచిండు. ఆడితోబాటు ఆడయ్య లేచిండు. ఆడయ్యతోబాటు ఆడమ్మ లేచింది.
ఆళ్ళతో్‌బాటే ఆళ్ళ కోడి లేచింది.ఒక్కసారిగా ఊరికి బ్రాహ్మనీకం వచ్చింది. (ఇక్కడ బ్రాహ్మనీకం అంటే తెలుగుదనం అని అర్ధం). ఊళ్ళోని ప్రజలందరూ అస్తిత్వాన్ని వదలి అభిజాత్యంతో తమ పనులకు బయలు దేరుతున్నారు.
ప్రతి వారూ సాంప్రదాయకంగా కట్టిన గోసీలను బిగించి పశువులను ప్రతిఘటిస్తూ కొందరూ, వర్గ సాంప్రదాయకంగా పొలాల్లోకి కొందరూ, సహేతుకంగా ఎడ్ల బండి తోలుతూ కొందరూ, సిద్ధంతాలు అలోచిస్తూ ఏమి చేయాలా అని కొందరు బయలు దేరారు. సూరిగాడికి చిన్న శంక కలిగింది. సమాజికంగా వెనుకబడిన మన ఊరోళ్ళకు ప్రభుత్వం సత్వర న్యాయం చేస్తోందా అని. వామ పక్ష చరిత్ర కలిగిన ప్రభుత్వం పోరాట పటిమ చూపితెనేగానీ న్యాయ ఫలాలు దొరకవని తెలుసుకున్న సూరిగాడు భోరున విలపించాడు.
దీనికి కారణం అగ్ర వర్నాల అభిజాత్యం అని భావించాడు. ఈ న్యాయం వారికి అందకుండా "పండితులు" కూడా అడ్డుపడుతున్నారు. సాహిత్యం, సారస్వతం అంటూ అరిచే ఈ పండితులకు తమ ఆకలి బాధలు తెలియవు.
వీరినుండి సామాజిక ప్రయోజనం ఆసించడం కన్న ఆత్మాశ్రయం ఒక్కటే మార్గం. సూరిగాడిలో ఒక సమాజోద్ధరణ భావం పైకి లేచింది. ఈ ధోరిణికి కారణం బ్రాహ్మలే ఐనా ఈ జాడ్యం తమ వారికి సోకకుండా మమేకం కావాలి అనుకున్నాడు.
అనుకున్నదే తడవు దక్షిణం వైపు పయనించాడు, కాల కృత్యాలు తీర్చుకోవడానికి.

నా ఈ మొదటి టపాకి మీరు నమ్మరు, నూట పన్నెండు కామెంట్లు వచ్చాయి.
మెచ్చుకుంటూ కాదనుకోండి. ఐనా మొత్తం మీద హిట్లు వచ్చాయా లేదా? అదీ విషయం.
కాబట్టి మీరు మొదలు ఈ సూత్రాలు పాటించండి.

12 comments:

సూర్యుడు said...

ఊఁ

నాగప్రసాద్ said...

అంతా బాగుంది కాని, టైటిల్ బాగోలేదు. పండంటి బ్లాగుకు అని కాకుండా "ప్రతి టపాకు వంద కామెంట్లకు పైగా రాబట్టుకోవడం ఎలా?" అని పెట్టి ఉండాల్సింది. :)

జీడిపప్పు said...

"బ్లాగు సుత్రాల్లో మొదటిది మీరు ఎవ్వరూ వాడని పదాలు వాడాలి"

lol :)

Anonymous said...

mastaru, padi suthralani cheppi, rendu mathrame cheppi migilinavi dhacheyatam emi bagaledhu. kastha migilinavi cheepi punyam kattukomdi saaru :)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...
This comment has been removed by the author.
విశ్వామిత్ర said...

@ నాగ ప్రసాద్‌గారూ మీరు చెప్పినట్టు బోర్డు మర్చేసా...టట్టడోయ్!!

@ వికాసం: ఏదైనా విషయాన్ని సగమే చెప్పాలి. మిగిలింది ఏమిటని కామెంటులో అడిగితే మన ప్రయత్నం నెరవేరినట్టే కదా!! హ.హ.హ... ) ) )

నాచేత అన్ని పాయింట్లు చెప్పించేస్తారో ఏమిటో !!

Malakpet Rowdy said...

lol .. అదేమి అక్కరలేదు. నాదెండ్ల మీద ఒక పోస్టు కొట్టండి చాలు. 400 కామెంట్లు వస్తాయి

విశ్వామిత్ర said...

రౌడీగారూ ఇదో మరోవైపు ప్రయాణం!!

Malakpet Rowdy said...

I got it .. Was just kiddin!

నాగప్రసాద్ said...

తూచ్!!!తూచ్!!!ఈ టైటిలు కూడా బాలేదు. "మీ బ్లాగుకు వంద కామెంట్లు కావాలాంటే..". ఏదో ఒకటి రాస్తూ పోతుంటే, ఏదో ఒకరోజు బ్లాగుకు వంద కామెంట్లు వస్తాయి. కాని ఒకే టపాకు వంద కామెంట్లు రావాలంటేనే కొంచెం కష్టం. నాట్ సాటిస్‌ఫైడ్ విత్ టైటిల్ అధ్యక్షా. :)

విశ్వామిత్ర said...

నాగ ప్రసాద్‌గారూ ప్రజాభీష్టం మేరకు నిర్నయాన్ని మార్చుకున్నాము...!! గమనించగలరు !!

రవి said...

:-)