మీలొ ఎంతమంది ఈ రొజు ఉదయం టీవీ-5 లొ జరిగిన " తెలంగాణా ప్రస్తుత పరిస్తితి" పై చర్చ చూసారో? దానిలో రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్త, ఎం ఎల్ సీ అయిన నాగేశ్వర్, ఆంధ్ర మేధావుల తరపున శ్రీనివాస్ మరొకరు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగేశ్వర్ ఉద్యమంలో విద్యార్ధులపై పోలీసుల దాడిని నిరశించారు. యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేసించే అవసరం లేదని అంటూ ఇంతవరకు యూనివర్సిటీ చరిత్రలో విద్యార్ధులు బాంబులతో దాడి ఎప్పుడూ చేయలేదని అది మరొకరి పనే అయిఉండవచ్చని అన్నారు. అంతవరకూ బాగానే ఉంది. తరువాత ఆంధ్ర మేధవుల తరపున శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక పేపర్ లో వచ్చిన వార్తను ఉటంకిస్తూ పన్నెండు సంవత్సారాల పిల్లలు తెలంగాణా కోసం ఆత్మ హత్యలు చేసుకుంటామని అంటున్నారని వారికి కనీసం ఉద్యమం అంటే తెలీయదు తెలంగాణా అంటే తెలీయదు అలాంటి వారిని రాజకీయ నాయకులు బలి పసువులు చేస్తున్నారని చెప్పబోతూ ఉంటే నాగేశ్వర్ ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆత్మహత్యలను నేను ఖండించాను కదా మీరెలా మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తారు అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. మీరు నన్ను అడుగుతారా? మేము ఆత్మహత్యలను సమర్ధించామా? నేను పార్టీలకు తప్పు చేస్తే తప్పు అని మంచి చేస్తె మంచిదని చెప్పాను. ఎన్నో చానల్స్ కి విశ్లేషణ చేసాను. నన్ను అడుగుతావా నేను వెళ్ళి పోతాను అంటూ చిందులు మొదలు పెట్టాడు. నిజానికి శ్రీనివాస్ ఆ ప్రశ్నను రాజకీయపార్టీలకు ముఖ్యంగా టీఆరెస్ ను ఉద్దేశించి అడగ బోతున్నాడు. పేపర్‌లో క్లిప్పింగ్ చూడనీయకుండా ఆ విషయాన్ని చెప్పనీయకుండా నాగేశ్వర్ ఆడిన డ్రామా నాకైతే అసహ్యం వేసింది. నేను మిమ్మల్ని అడగలేదు అంటూ శ్రీనివస్ పదే పదే చెప్పినా ఆయన వీరంగం సృష్టించారు.చివరికి ఆ అంశన్ని వదిలిపెట్టి చర్చ ముగించారు. నాగేశ్వర్ అంటే నాకు ఇప్పటివరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఆయన కూడా ఫక్తు రాజకీయ నాయకుడు. నేను తెలంగాణా వాదినని ఒప్పుకొని వారి తరపున వాదించినా ఫర్వాలేదు కానీ మధ్యవర్తిగా రావడానికి అర్హుడు కాదు.
5 comments:
మీరు బహుశా నాగేశ్వర్ గురించి రాయబోయి నాగేందర్ అని రాసారనుకుంటున్నాను.
ఆయనలా అన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది.
correct ga chepparu. chala sarlu aayana pravartana ituvanti programs lo choosi nenu kooda aschrya poyanu.
aayana peru nageswar
చదువరి గారూ
ఆయన నాగేశ్వరే....!! సరి చేశాను. ధన్యవాదాలు :)
చదువరి గారూ
ఆశ్చర్యంతొ పాటు నాకు చిరాకు అసహ్యం వేశాయి. అసలు రూపం ఒక్కక్కప్పుడు బైటపడతుంది. శ్రీనివాస్ అన్న ఆయనని అస్సలు మాట్లాడనీయలేదు. యాంకర్ ఆయన అన్నది మిమ్మలని కాదు అన్నా కూడా ఒప్పుకోలేదు. మూర్ఖంగా ప్రవర్తించాడు.
Post a Comment