కేసీఅర్ దీక్ష ప్రారంభించి వారం రోజులు కావస్తోంది. ఈ వారం రొజులలో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రభుత్వ రక్షణలో ఉన్న ఆయనకు ఒక రకంగా రెండు ఫలితాలు దక్కాయి. మొదటికి ఆయన వైద్యుల సంరక్షణలో ఉండడం రెందోది ఆయన ఆరోగ్యంగా (సెలైన్ తొ) దీక్ష కొనసాగించడం. ఇక నాకెందుకో తెలంగాణా ఉద్యమకారులలో వాస్తవిక దృక్పదం ఉన్నవాళ్ళు కనిపించలేదు ఒకే ఒక్క జయశంకర్ తప్ప. రాష్ట్ర ప్రభుత్వానికిగాని అటు కేంద్ర ప్రభుత్వానికిగానీ ప్రత్యేక రాష్ట్రంపై ఎలాంటి అభిప్రాయం లేదు. అటువంటి పరిస్తుతులలో "కూడా రావద్దు అంటే ఎత్తుకోమని ఏడ్చినట్టు" అసలు ప్రత్యేక రాష్ట్రమంటేనే పడని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిరాహారదీక్షలో కూర్చొని నిర్నయం తీసుకోమంటే కోరి ప్రాణాలమీదకి తెచ్చుకోవడమే. ఇప్పటికే కేసీఆర్ ఖాతాలో పది వికెట్లు పడ్డాయి. చివరి వికెట్టు కేసీఅర్ది కాకుండాచూసుకోవలసిన బాధ్యత ఉద్యమకారులదే. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారందరికీ తలో పదిలక్షలు ఇవ్వాలని టీఆరెస్ డెమాండ్ చేస్తోంది. వారి మాటలు నిజంగా రాజకీయంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. చివరకి వాస్తవికతను ఒప్పుకొన్నది ఒక్క జయశంకర్ మాత్రమే. "ప్రత్యేక రాష్ట్ర అంశం కేవలం ముఖ్యమంత్రి చేతుల్లో లేదు. కనీసం ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం చేయచ్చు కదా " అంటున్నారు. అమ్మయ్య కనిసం వీరైనా విషయం తెలుసుకున్నారు అనిపించింది. మరి మిగిలినవారికి ఈ విషయం తెలియకనా? కాదు అదే డ్రామా. కేసీఅర్ డ్రామా. ప్రభుత్వం స్పష్టమైనా హామీ ఇస్తే దీక్ష విరమిస్తారుట. దీక్ష విరమిస్తేనే చర్చలకు పిలుస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి విత్తుముందా లేక చెట్టు ముందా? మరింత జాప్యం చేస్తే మరో వికెట్టు ఖాయం అని చెప్పొచ్చు. కానీ తెలంగాణా ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదన్నది సుస్పష్టం. మరి ఈ ఉద్యమం? కొన్నిరోజులు సా..సా...గి ఒక హామీతో సంతృప్తి చెందాల్సిందే!!
10 comments:
మీరన్నది నిజమేనండీ. ఉన్నది ఉన్నట్లుగా చాలా గమ్మత్తుగా చెప్పారు.
Cut it dude,
Pro Telangana guys dont want Telangana without Hyderabad and Pro-United AP guys dont mind giving away Telangana if Hyderabad is exempted.
Long story short, it all finally boils down to the fight about Hyderabad.
భరద్వాజ్ గారూ
ప్రత్యేక రాష్ట్రం ఆలోచనే ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ విభజన చేయాల్సివస్తే అప్పుడు హైదరబాదు విషయం ప్రస్తావన వస్తుంది. మీరన్నట్టుగా తెలంగాణావాళ్ళుగానీ ఆంధ్రావాళ్ళుగానీ హైదరాబాదును వదులోకోవడానికి సిద్ధంగా లేరు. అప్పుడు ప్రజల మధ్య నిజమైన సంగ్రామం తప్పకపోవచ్చు.
Viswamithra garu ఇపుడు ఈ శతాబ్ధంలో రాజధాని గురించి అంత కలత చెందనవసరం లేదు...400 సంవత్సరాల మహానగరాన్నితలదన్నే రాజధాన్ని 40 సంవత్సరాల కాలంలో నిర్మించే వనరులు సామర్ద్యం మనకు వుంది.
ఈ ఉద్యమానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అసలైన ట్విస్టు ఏమిటంటే, గాలి దుమారాన్ని మళ్ళించడానికి, సీ.ఎం. సీటుకోసం రోశయ్యను ఇరుకున పెట్టడానికి జగన్ ఆడిస్తున్న జగన్నాటకం. గొడవల్లో పాల్గొనే వాళ్ళల్లో ఎక్కువమంది రాయలసీమ యువకులు. అందుకే కేవలం ఆంధ్రావాళ్ళ ఆస్తులమీదే దాడులు జరుగుతున్నాయి.
ఈ నాటకానికి సంబంధించి కే.సి.ఆర్.కు 100 కోట్లు ముట్టాయని అనధికారిక సమాచారం.
చూస్తూనే ఉండండి, త్వరలో అసలైన ట్విస్టు కోసం "జగన్నాటకం".
మిస్టర్గారూ
పుట్టి పెరిగిన నేలపై తెలంగాణా సెంటిమెంట్ తెలంగాణా ప్రజలకు ఉన్నట్టే పెంచి పోషించిన ప్రదేశంపై ఆంధ్రా ప్రజలకు ఉండదంటారా?
గొడవలు చేస్తుంది రాయలసీమ కుర్రాళ్ళు అని మా ఏరియా లో బాగా చెప్పుకుంటున్నారు ,,,, మరి ఏది నిజమో
ఒక వేళ సమస్యను ప్రక్కదోవ పట్టించడానికి రాయలసీమ పేరు వాడచ్చు కదా,కాకపోయినా జగన్ వర్గీయులు అంటే బాగుంటుందేమో రాయలసీమ వాసులు అనే కంటే మరలా క్రొత్త గొడవలు రాకుండా
Post a Comment