కేసీఆర్ (ఆమరణ)దీక్ష పదకొండవ రోజుకు చేరింది. ఆయనను గ్లూకోస్ మీద దాక్టర్లు బ్రతికిస్తున్నారు. ఆయన ఇప్పుడు విద్యార్ధులు వారి పార్టీవాళ్ళూ ఇంటివారూ ఎవరు చెప్పుతున్నా దీక్ష విరమించడానికి నిరాకరిస్తున్నారుట. కారణం ఒక్కటే అయిఉంటుంది దీక్ష విరమిస్తే ఉద్యమంలో తన పాత్ర కేవలం ఉత్సవ విగ్రహమే అవుతుందని. కానీ ఇది కోరి ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే.
ఇక తెలంగాణా ప్రజా వేదిక అనుకుంటా తెలంగాణాలో పదవులలో ఉన్న నాయకులంతా రాజీనామాలు చేయాలి లేకపొతే వారి ప్రాణాలకు తమ హామీ లేదని ప్రకటించారు. పైగా విద్యార్ధులు చూస్తూ ఊరుకోరని ముక్తాయింపు. రాజీనామాలు చేయకపొతే చంపేస్తారా? ఇది కోరి తగువులు పెట్టుకోవడమే. దానికి మంత్రివర్యులు దానం నాగేందర్ కటువుగానే సమాధానం ఇచ్చారు. ఆయన వెలుబుచ్చిన అభిప్రాయమే హైదరాబాదులో స్థిరపడిన ప్రజలందరి అభిప్రాయముకూడా. ఎందుకంటే పబ్బం గడుపుకోవడానికి ముందు సరే అని ఒకవేళ తెలంగాణా ఏర్పడితే హైదరాబాదులో స్థిరపడిన తెలంగాణేతరులను ఇక్కడ బ్రతకనిస్తారనే హామీ లేదు. కాబట్టి ఒకవేళ తెలంగాణా ఏర్పడితే హైదరాబాదును యూనియన్ టెరిటరీగా ప్రకటించడం సమంజసమే.
టీవీ-5 తొ మాట్లాడుతూ జేఏసీ నాయకుడు రవి ఉద్యమంలో కొందరి బయట వారుండవచ్చని చెపుతున్నప్పుడు వరవరరావు అతడు అమాయకుడు అతనికి ఏమి తెలియదు అని వెనకేసుకొచ్చడు. మరి ఏమి తెలియని విద్యార్ధులను ఉద్యమంలోకి లాగడం ఎందుకు? ఎంతోమంది విద్యార్ధులపై లఠీలు విరిగాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఅర్ జీవితాన్ని చూసిన వ్యక్తి. బ్రతికినంత కాలం ఎలాగూ బ్రతకడు. కానీ అతనికోసం జీవితం అంటే తెలియని వయసులోనే విద్యార్ధులు సమిధలవుతున్నారే. వారిని ఈ ఉద్యమానికి పురుగొల్పినదెవరు? రాజకీయనాయకులు కాదా? ఇంతవరకూ ఒక్క రాజకీయనాయకుడైనా కనీసం లాఠీ రుచి చూసాడా? మరి విద్యార్ధులే ఎందుకు బలవ్వాలి?
గద్దరన్నా నాదో ప్రశ్న. బుల్లెట్ట్లను సైతం ఒంట్లో దాచుకున్న ఉద్యమ కారుడివి నువ్వు. కాలానికి ఎదురు ఈదలేక నువ్వే ఎంతమారిపోయావో చూసుకున్నావా? నూలుపంచె స్థానంలో నల్లని టెరీకాట్ పాంటు వేశావు. నల్లని కంబళిబదులు తెల్లని పొలియస్టర్ చొక్కాని టక్ చేశావు. పొడవైన గెడ్డాన్ని నున్నగా చేశావు. తెల్లని పొడవైన జుట్టును కట్టిరించి నల్లని రంగు వేశావు. ఇంకా కాలం తీరిన సిద్ధంతాలని విద్యార్ధులపై ఎందుకు రుద్దుతావన్నా? అసెంబ్లీ ముట్టడి అంటూ విద్యార్ధులు ఎగబడుతున్నారు. నీకుగానీ ఏ రాజకీయనాయకుడికి కానీ ఏమవ్వదని తెలుసు. కానీ ఎందరు అమాయక విద్యార్ధులు తూటాలకు బలవ్వుతారోనని భయమేస్తొందన్నా. విద్యార్ధుల శవాల మెట్లపై అధికారం హస్తగతం చేసుకోవాలనుకొనే నాయకులను చూస్తూ ఉంటే భయమేస్తోందన్నా. వారి మానాన వారిని ప్రశాంతంగా బ్రతకనీయండన్నా.

8 comments:
బాగా చెప్పావ్ బాస్ ..... వీళ్ళు అసలు .. తెలంగాణా అబివృది కోరుకునే వాళ్ళు కాదు ... వాళ్ళ ది కేవలం .. అధికార దాహమే .... అభివృధి జరగక పోవడానికి తెలంగాణా ప్రాంత నాయకులే కారణం .. ఇది తెలంగాణా ఒక్కదానిలో నే కాదు ఆంధ్ర అంత వుంది .. వున్నత మాత్రాన ఆంధ్ర ని 25 రాష్ట్రాలు చేద్దామా... ఏది కేవలం రాజకీయ వీధి నాటకం ... రాష్ట్రాన్ని ఇవ్వమని ఇంత అడిగే వాళ్ళు మా ప్రాంతాన్ని అబివృది చెయ్యమని ఎప్పుడైనా అడిగారా ... మాకు నిధులు ఇవ్వండి అని ఎప్పుడన్నా ధర్నా చేసారా............
నిజం గా ఈ పరిస్తితులు చూస్తుంటే దిగులు గా ఉంది ! ఏ ప్రళయం లాంటితో వచ్చి ఈ పెడ బుద్దులు పట్టిన ప్రపంచాన్ని నాశనం చేస్తే బాగుండు అనిపిస్తుంది .
@ శ్రావ్య
అవునండీ. 2012 నిజమయితే బావుండును కదా. అందరి పీడా, అందరికీ పీడా వదలిపోతాయి.
హల్లో శరత్ గారూ
శ్రావ్య గారన్నది పెడబుద్ధులు పట్టినవారు మాత్రమే, అందరూ కాదు :) )
@రాయల్
అంత వివేకమే ఉంటే ఈ పరిస్తితి రానే రాదు కందండీ !
@విశ్వామిత్ర గారు కాదండి శరత్ గారు అన్నదే నేను చెప్పింది :)

hello boss Please visit this link
http://www.mail-archive.com/tek-professionals@googlegroups.com/msg57050.html
visit this and then say...
why we want Telangana.........
We want Telangana....
Jai Telangana! Jai Jai Telangana
Visit this also
http://www.slideshare.net/faizuddin123/why-we-want-telangana
Post a Comment