December 11, 2009

జై సమైక్య ఆంధ్రా నినాదంతో డిల్లీ పీఠం కదలాలి !!

ప్రశాంతంగా ఉండే ఆంధ్రాలో ఇంత చలనం కలిగించిన సంఘటన దాదాపు లేదనే చెప్పాలి. ఆంధ్రా రాయలసీమ ప్రజల సమైక్య నినాదం వింటూ ఉంటే నేను చదువుకున్న స్వాతంత్ర్య పోరాట సంఘటనలు గుర్తుకువచ్చాయి. సమైక్య నినాదం తొ వారి అరుపులు ఇంపుగా వినిపిస్తున్నాయి. వారి అరుపుల్లో నాకైతే దేశభక్తే కనిపిస్తోంది.కేసీఅర్ పదకొండురొజుల్లో సౄష్టించిన పరిస్తితి ఆంధ్రులు గంటలో సృష్టించారు. మహాత్ముల ప్రతిమలకు తెలంగాణాలో జరిగిన అవమానాలను పాలాభిషేకం చేసి తుడిచివేశారు. విద్యార్దులను ఎవ్వరూ మభ్యపెట్టలేదు, కార్మికులను ఉద్యమం చేయండని కోరలేదు, నాయకులను చంపుతామని బెదిరించలేదు అందరూ సమైక్య ఆంధ్ర దేశంకోసం అడుగు వేసారు. దానికి ప్రారంభం విజయవాడలో రాజ్‌గోపాల్‌తొ ప్రారంభమైనా సీమ నాయకులు ముందువరుసలో ఉన్నారు. పదవులను తృణప్రాయంగా త్యజించారు. పిచ్చి ప్రేలాపనలు లేవు. హెచ్చరికలు లేవు. అందరిదీ ఒక్కటే నినాదం సమైక్య ఆంధ్రా.

ెలంగాణా వేర్పాటులో ఎన్నో రాజకీయ కోణాలు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం తెలియకుండా తెలంగాణా ప్రకటన రాష్ట్రప్రజలను, ప్రజలచే ఎన్నొకోబడిన ప్రతినిధులను అవమానపరచడమే. చిదంబరం చెప్పిన సాకు "ఆంధ్ర ప్రజల పాలనలో తెలంగాణాకు న్యాయం జరగలేదు, అందుకే ప్రత్యేక తెలంగాణా". చిదంబరానికి తెలుసా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని? మరి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? ఆ అప్రతిష్ట వారిదేనని తెలియదా? ఒక ప్రాంతం అభివృద్ధి కాకపొతే ప్రత్యేక పేకేజ్ ఇవ్వచ్చు. వందకోట్లు కాకపొతే వెయ్యి కోట్లు ఇవ్వచ్చు. అంతేకాని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?


ఎంఎల్‌యేలు కాదు ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి. అధీష్టానం చెప్పిందే వేదం అంటూ కూర్చుంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదు. కేంద్ర ప్రభుత్వం విభజనపై పునరాలోచించకపొతే ప్రభుత్వం ఒక్కరోజు మనుగడలో ఉండడానికి వీలు లేని పరిస్తితి కల్పించాలి. పంటలు పండించేది మనం, టాక్సులు కట్టేది మనం. ఆ ఫలాన్ని రాష్ట్ర ప్రజలందరూ అనుభవించారు. ఒక్క మాటతో మన రాష్ట్రంలోనే మనం పరదేశీలం అవ్వడం ఏ ఆంధ్రుడు ఒప్పుకోడు. ఈ ఉద్యమం కొనసాగాలి. వారి చేసిన తాప్పు వారు తెలుసుకొనే దాకా కొనసాగాలి.

జై సమైక్య ఆంధ్రా!!

25 comments:

Anonymous said...

జై సమైక్య ఆంధ్రా నినాదం, సిగ్గులేని నినాదం.

నాగప్రసాద్ said...

జై సమైక్యాంధ్ర! జై సమైక్యాంధ్ర!! జై సమైక్యాంధ్ర!!!

తెలంగాణ నినాదం దిక్కుమాలిన నినాదం. స్వాతంత్ర్యం సమయంలో 550కి పైగా సంస్థానాలుండేవి. అప్పట్లో సెపరేట్‌గా అలా బతికారని, మరి ఇప్పుడు కూడా మనదేశాన్ని 550కి పైగా ముక్కలు చేద్దామా?

అయినా చేతగాని నాయకులను పెట్టుకొని, అభివృద్ధి జరగలేదంటే, దానికి ఎవ్వరు ఏం చేస్తారు?

Raj said...

JAI SAMAIKHYA ANDHRA ..JAI..JAI..

Okasaari kaadu kotla sarlu antaamu ...

Kalidasu said...

jai Telangana

Krishna said...

You said it correct ...
we want united andhra

పుల్లాయన said...

jai samaikyaandhraa!

phani said...

mee vaade cheppindu--bayapetti bandulu chepistunnarani.. swachandangaa andarooo ekkada koodaa raaru naannaa..rechagoditene ostaru..ochina taruvaata viraminchukuntaraa ledaa anedi vere vishayam..

phani said...

oka sooti prashna, hyderabad andhra ke ichestaam ante mee naayakulu appudu kooda samaikyaandhraa antaraaa, jawabu cheppi migataadi maatlaadandi..

phani said...

ikkada bassulu tagalabedite vidwamsam antaaru, mari akkadem jarugutundi ippudu...

నాగప్రసాద్ said...

@Phani: భాగ్యనగరం ఇచ్చేస్తామని ఆశపెట్టినా, సమైక్యవాదానికే మా మద్ధతు ఎప్పుడూ కూడా.

phani said...

mee abhipraayam kaadu, mee raajakeeya naayakula sangati cheppandi..

నాగప్రసాద్ said...

@Phani: వాళ్ళ అభిప్రాయం కూడా అంతే! కావాలంటే, ప్రకటించి చూడండి.

Unknown said...

"జై సమైక్య ఆంధ్రా!!"

కోస్తా + రాయల సీమ = ఆంధ్రా

అదే తీసుకోండి.

మేమేం ఒద్దన్నామా?

ఒక్క రాయలసీమ, ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే అంది సమైక్యాంధ్ర వాదం కాదు. జై ఆంధ్రా వాదం అవుతుంది.

ఏంటి మీరంతా విదేశం, విదేశం అని మొత్తుకుంటారు? తెలుగు వారు దేశంలోని అన్ని నగరాల్లో ఉన్నారు. హైదరాబాదులో ఒక్క ఆంధ్రా వారే కాదు, సిక్కులు, మార్వాడీలు, జైనులు, సింధీలు, పార్సీలు, లోదీలు ఇలా ఏంటో మంది కలిసి మెలిసి ఉంటున్నారు. మీరిప్పుదేదో భద్రత ఉండదని గోల పెడితే నమ్మేవారెవరూ లేరు.

నిన్నటిదాకా ఎవరైతే జై ఆంధ్రా, జై రాయలసీమ అన్నారో వారంతా ఈరోజు ప్రత్యెక తెలంగాణా గురిచి ప్రకటన రాగానే సమైక్యాంధ్ర రాగం ఆలపిస్తున్నారు. ఇలా పుట కొక్క మాట మాట్లాడి విశ్వసనీయతనికోల్పోతున్నారు.

విశ్వామిత్ర said...

@ తెలంగాణా యోధుడు
మీరన్నదే నిజం తెలుగురాష్ట్రంలో తెలుగువాళ్ళు సిక్కులు, మార్వాడీలు, జైనులులా
వలసవచ్చిన వారిలా ఉండవలసిన ఖర్మ పట్టగూడదనే సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నము.

phani said...

andhraa nunchi vachina vaallake ee abhipraayam ostundante vaallalO tappu chesamane bhaavana undannatte kada...
tappu cheyyani vaadu ekkadainaa nirbhayanga undochu.

విశ్వామిత్ర said...

ఫణీ
నేనన్నది మీకు అర్ధం కాలేదు!!

Anil Dasari said...

@a2zdreams:

ఏడాది కింద వరకూ మీరు సమైక్యవాది (బ్లాగుల్లో మీ కామెంట్ల ద్వారా తెలిసిన విషయం). చిరంజీవి 'జై తెలంగాణ' అనగానే మీరూ ఆ పాటందుకున్నారు. రేపాయన మాట మారిస్తే మీరు మనసు మార్చుకునేలా ఉన్నారు.

ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఎంత చిరంజీవంటే వీరాభిమానమైనా, మీకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా?

Anonymous said...

అబ్రకదబ్ర, చిరంజీవి జై తెలంగాణ అన్నాడని నేను 'జై తెలంగాణ' అంటున్నాను అన్నది నిజం కాదు. అది మీ ఉహ. అయినా చిరంజీవి అభిప్రాయం, నా అభిప్రాయం , మీ అభిప్రాయం ముఖ్యం కాదు సార్ ఇక్కడ. నాకు వచ్చినా రాకపోయినా నేను నష్టపోయేది కలిసోచ్చేది ఏమి కాదు. వస్తే విజయవాడ రాజధాని అవుతుందని చిన్న ఆశ. నాకు ఆంధ్ర, రాయల సీమ సమైక్య వాదుల పోరాటం హైదారాబాద్ కోసమే అన్నట్టుగా కనిపిస్తుంది తప్ప తెలుగు మీద ప్రేమ అనిపించడం లేదు ... అందుకనే సిగ్గులేని సమైక్య నినాదంగా వినిపిస్తుంది.

తెలుగుదేశం అధికారం చేపట్టివుంటే న్యాయంగా ఇదే పని(తీర్మానం) చేయవలసి వచ్చేది.

కేంద్రం సహాయంతో రోశయ్య తీసుకున్న నిర్ణయం అందరీ నాయకుల రంగు, పార్టీల అంతర్గత ఎజెండా బయట పెట్టింది. మళ్లీ ఎన్నికలు జరగవలసిన సమయం ఇది.

విశ్వామిత్ర said...

@ a2zdreams
విజయవాడ రాజధాని కావాలన్న ఆశ బాగానే ఉంది. దానికి ఎంత ప్రణాళిక ఎంత ఖర్చు ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? ఆంధ్రలో ఉన్న ప్రతి చదువుకున్న వ్యక్తి ఉపాధికి గమ్యం హైదరాబాదు. పైచదువులకు గమ్యం హైదరాబాదు. రోగం వస్తే హైదరాబాదు. విదేశాలకు వెళ్ళాలంటే హైదరాబాదు. వ్యాపారం చేయాలంటే హైదరాబాదు. హైదరాబాదుతో ప్రతీ ఆంధ్రుడి జీవితం ముడిపడి ఉంది. అందుకే మానసికంగాకాని ప్రాంతియంగాగాని వేరుపడటం అనే అలోచనే ఆంధ్రులు చేయలెకపోతున్నారు.

Anonymous said...

viswamitra, you are not catching my point. "నాకు వచ్చినా రాకపోయినా నేను నష్టపోయేది కలిసోచ్చేది ఏమి కాదు"

అందరూ "తెలంగానకు జై" అన్నారు. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. అది నమ్మకద్రోహం .. I am against to that.

I wanted to be happy either case. వస్తే విజయవాడ దగ్గర అని ఆనందపడతా .. రాకపొతే తెలుగువాళ్ళం కలిసున్నాం అని ఆనందపడతా.

కె.సి.ఆర్ పార్టీ ఉద్యమ పార్టీ. తెలంగాన సాధించడమే వాళ్ళ లక్ష్యం. అధికారం కోసం వారితో పొత్తులు పెట్టుకొని, అప్పుడు తెలంగానకు సై అని, ఇప్పుడు సమైక్య ఆంధ్ర అనడం సిగ్గులేని నినాదం కాకుండా, ఏమంటారు ?

విశ్వామిత్ర said...

@a2zdreams:
మీరు చెప్పింది పార్టీల మనుగడకోసం ఆడిన నాటకం. వారు ప్రజాభీష్టాన్ని తెలుసుకోలేదు.

Nrahamthulla said...

100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

Nrahamthulla said...

బాబాగారూ
మీరిచ్చిన సమాచారం బాగుంది.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రతిపాదనపై యానాంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.మీరు చెప్పినట్లు యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

Nrahamthulla said...

Posted January 14, 2010 at 5:17 AM | Permalink

మన తెలుగు యానాం పర్యాటక కేంద్రంగా అభివృధ్ధీ చెందుతోంది.45 కోట్ల రూపాయల ఖర్చుతో యానాంలో ఈఫిల్ టవర్ కట్టబోతున్నారు.http://epaper.sakshi.com/Details.aspx?id=355564&boxid=28742358

Unknown said...

రాజగోపాల్ గారు అంటే సమైక్యవాదిగా నాకు చాలా అభిమానం ఆయన ఇదే పట్టుదల తో సమైక్యవాదులందరిని అందర్ని ఏకతాటి పై తీసుకురావడానికి చేస్తున్న కృషి బాగుంది వేర్పాటువాద తెలంగాణా వారికి ఒక చిక్కుముడి ప్రశ్నలాంటిది వెయ్యాలి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరబాద్ రాష్ట్రం లో తెలంగానా భాగాన్ని మనకి కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అంత ప్రత్యేకం గా వుండాలి అనుకుంటే హైదరాబాద్ రాజధాని గా ఏర్పడే రాష్ట్రం లో ఏ యే ప్రాంతాల వారు కలిసి వుంటారు? కొత్త రాజధాని తో ఏర్పడే తెలగాణా రాష్ట్ర ం లో ఏయే ప్రాంతాలవారు కలిసి వుంటారు అని అడిగితే చక్కగా సమధానం దొరుకుతుంది అపుడు ప్రత్యేక తెలంగాణా అనేవారు నోరు మూసేసుకుంటారు ఎలాగు సీమాంధ్ర వారు హైదరాబాద్ కి ఓకె చెపుతారు తెలంగాణా లో చీలిక వస్తుంది