December 12, 2009

హరి రామ జోగయ్యా నువ్వు మూసుకోవయ్యా...


హరి రామ జోగయ్య అంటే చాలు అస్తిరత్వానికి మారుపేరని ఆంధ్రాలో అందరికి తెలుసు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా పార్టీలు మారుతూ వారి చపల బుద్ధిని చాటుకున్నారు. వీరికి కులగజ్జి కూడా ఎక్కువే. అందుకే చిరంజీవి పార్టీ పెడుతున్నాడనగానే వారు కాంగ్రెస్ను విమర్శించడం మొదలుపెట్టీ మరుక్షణం పీఅర్పీలో చేరేరు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవడంలో వీరి పేరు ప్రఖ్యాతులు కూడా పనిచేశాయి. వీరు పాదం మోపగానే పీఅర్పీకూడా అప్రతిష్ట మూటగట్టుకుంది. అటువంటి ఈ మహా నాయకుడు ఆంధ్ర రాయలసీమ ప్రజల సమైక్య నినాదాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కుతో పోల్చారు. ఇంత వయస్సు వచ్చినా వీరికి ఆ దేముడు స్థిరత్వాన్నే కాదు గ్జ్యానాన్ని కూడా ఇవ్వలేదు. వేలాది ప్రజలు వందలాది నాయకుల మనోభావాలకు అద్దం పడుతున్న ఉద్యమం వీరి కంటికి కనిపించలేదంటే వీరు గుడ్డివారుకూడా అయిఉండవచ్చు. వీరు కొన్ని తీర్మానాలు చేసారు. విశాఖ రాజధాని చేయాలిట, గుంటూర్‌లొ హైకోర్టు పెట్టాలిట ఇంకా ఎవేవో చెప్పారు. మరి వీరికి ఎవరు ఉద్యమ నాయకత్వం ఇచ్చారో లేక ఎవరు సలహా అడిగారో? వీరి పిచ్చి ప్రేలాపలన్లు మరింత ముదరకముందే అక్కడి ఉద్యమకారులు విరిని ఏదైనా ఒక మానసిక చికిత్సాలయంలో చేర్పించాలని నా మనవి.

జై సమైక్య ఆంధ్రా...! !

9 comments:

karthik said...

ఇంతకూ జోగయ్య చేరని పార్టీ ఏదైనా ఉందా??

Anonymous said...

it is real voice of people in andhra region.

you are ignoring if condition, showing your frustration against who are talking reality

if condition = incase of telangana seperated

సమైఖ్య నినాదం "హైదరాబాద్ కోసం" అన్న నిజాన్ని ఒప్పుకోలొని మీకు జై కోస్తాంధ్ర అనే వాళ్ళను విమర్శించే హక్కు లేదు.

Anil Dasari said...

'తెలంగాణ' నినాదం కూడా హైదరాబాద్ కోసమే కదా.

మంచు said...

జోగయ్యకి వైజాగ్ , గుంటూర్ లొ ఆస్తులున్నాయేమో..
A2Z - మీరు నేను ఇద్దరం ప గొ నే.. ఇద్దరం చిరంజీవి అభిమానులమే... నాకు హైదరాబాద్ లొ చిల్లిగవ్వ ఆస్తి కూడ లేదు. నాకు జొగయ్య చెప్పింది నచ్చలేదు.. మీకు నచ్చింది. మనిద్దరిమద్యే ఎకాబిప్రాయం లేనప్పుడు జొగయ్య చెప్పింది రియల్ వాయస్ ఎందుకవుతుంది.

Anonymous said...

అబ్రకదబ్ర, హైదరాబాద్ is part of తెలంగాణ.

మంచు పల్లకీ, నిస్వార్దంగా మీ నినాదం సమైక్యాంధ్ర అయితే చాలా సంతోషం.

నా పరిధిలోని మా కొసాంధ్ర వాళ్ళు కోరుకునేది ఏమిటంటే సమైక్యాంధ్ర అయితే నొ ప్రొబల్మం,we are happy too.

incase of telangana seperated, "జై కోస్తాంధ్ర" ! తెలంగాణ ఇచ్చేసినా మాకు ప్రొబల్మం లేదు, మా ప్రాంతాన్ని కొంత తెలంగానలో కలిపారు, అది మాకిచ్చేయాలి.

కె.సి.ఆర్ వాగే కారు కూతలు ఎన్ని రోజులు భరించాలి సార్ ?

హరి రామ జోగయ్య మాట మీద నిలబడ్డ వ్యక్తి. ఎన్నికల ముందు ఏమి చెప్పాడో దానికి కట్టుబడి వున్నాడు.

మంచు said...

హైదరాబాద్ is part of అంధ్రప్రదేశ్

విశ్వామిత్ర said...

@a2zdreams:
నాయకులనే వారి పెద్దలు మాట్లాడనివ్వలేదు. ఇక ప్రజాభిప్రాయాన్ని ఎవరు అడిగారు? అందుకే ఇప్పుడు పార్టీలతో సంభంధం లేకుండా రాజీనామాలు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. మీరు ఆంధ్రా ప్రాంతం వారైనా తెలగాణా ఏర్పాటును మీరు సమర్ధించే హక్కు మీకెప్పుడూ ఉంటుంది. విమర్శించే హక్కు నాకు ఉంటుంది. :) )

ఏకాంతపు దిలీప్ said...

"it is real voice of people in andhra region."

నాకు విశాఖపట్టణం నుండి ప్రకాశం వరకూ ఉన్న బంధువులు, స్నేహితులూ, పరిచయస్తులెవరూ ఈ వాయిస్ వినిపించలేదు. అప్పుడె మన జోగయ్య రాజధాని గురించీ, కోర్టుల గురించీ ఆలోచిస్తున్నారు అంటే ఎంతటి ముందు చూపుని ప్రదర్శిస్తున్నారో! :-) ఏమయి ఉంటుందో లోగుట్టు..
విశ్వామిత్ర, మీకేమైనా తెలుసా? :)

విశ్వామిత్ర said...

దిలీప్ గారూ
వారి విషయంలో లోగుట్టు ఏమిలేదు. జోగయ్యగారికి వెన్నుపోట్లు వెన్నతో పెట్టిన విద్య