రాష్ట్ర రాజకీయాల వేదిక హైదరాబాదునుండీ ఢిల్లీకి మారింది. ఇటు తెలంగాణా నాయకులు అటు సీమాంధ్రా నాయకులు వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుపుతూ ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా గొంతుకలు సన్నబడుతూ ఉంటే సమైక్యవాదం బలం పుంజుకుంటూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇటు తెలంగాణా ఉద్యమకారులు అటు సీమాంధ్ర ఉద్యమకారులు బందులకు రైల్ రోకోలకు పిలుపునిచ్చారు. దక్షిణ మద్య రైల్వే చాల రైళ్ళను నిలుపు చేస్తోంది. ఆర్టీసీ తమ బస్సులకు పూర్తి విశ్రాంతినివ్వడానికి నిర్నయించింది. లేని ఉత్కంఠతను పెంచే ప్రయత్నం చానల్స్ చేస్తూనే ఉన్నాయి. చర్చలతో ఏకాభి ప్రాయాన్ని సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం మృగ్యంగా తోస్తోంది.బర్దన్ తెలంగాణాకు తమ మద్దతును తెలియచేగా ప్రభుత్వం మరోవైపు భాగస్వామ్య పక్షాలనుండీ వస్తున్న వ్యతిరేకతల మధ్య భారతీయ జనతా పార్టీ తెలంగాణా పట్ల తమ వ్యతిరేకతను కాకపోయినా తమ అనుకూలతను మాత్రం తెలపట్లేదు. దేశవ్యప్తంగా రాష్ట్ర విభజన పట్ల వ్యతిరేకతనే కేంద్రం చవిచూస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చిదంబరంపై నిప్పులు చెరిగారు. తెలంగాణాపై చిదంబరం ప్రకటనను తూర్పారబెట్టారు. సీమాధ్రా ప్రతినిధుల వాదనలు బలం పుంజుకున్నట్టు వారి మాటలే చెపుతున్నాయి. దానిని నిజం చేస్తూ తెలంగాణాపై నిర్నయానికి గడువు లేదని ఇవి కేవలం సంప్రదింపులుమాత్రమే అంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు తెలంగాణా ఉద్యమానికి మావొయిస్టుల సహకారం, సానుభూతి మేలుకన్న కీడే చెసేలా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణాకు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అనుకూలవాతావరణం లేదన్నది సుస్పష్టం. ప్రస్తుతం కాంగ్రెస్ కాలయాపన చేసి సమస్యను దాటవేయాలనే చూస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణా లేనట్టే.
2 comments:
మీరు ఇంతకూ పూర్వం వార్తలు చదివే వారా ?
బాగా వ్రాసారు
:)
Post a Comment