January 8, 2010

ఇది జర్నలిజమా?..వీళ్ళు జర్నలిస్టులా?...సిగ్గు సిగ్గు..!!


రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని న్యూస్ చానల్స్ కంకణం కట్టుకున్నాయా? అవుననే అనిపిస్తోంది. నిన్నటివరకు తెలంగాణా విషయంలో అగ్గి రాజేసి న్యూస్ కాచుకున్న చానల్ ఇప్పుడు ప్రజలపై మరోలా విరుచుకుపడింది. ప్రజా నాయకుడు వైయెస్సార్ హత్య చేయబడ్డారంటూ ఒక కధనాన్ని ప్రజల్లోకి వదిలింది. పధకాన్ని పన్నింది రిలయన్స్ అధినేతా అంటూ ఒక ప్రశ్నతో కూడిన సమాధాన్ని వదిలింది. దాని పరిణామం రిలయన్స్ ఆస్థులపై దాడులు, లక్షలలో ఆస్థి నష్టం. ఎక్కడో పనికిమాలిన రాతలను పట్టుకొని ఇటువంటి కధనాలు అల్లడం, అది నిజమా అంటూ ప్రజలను ప్రశ్నించడం, ఇది జర్నలిజమా? వీళ్ళు జర్నలిస్టులా? ఒకప్పుడు డిటెక్టివ్ సాహిత్యమనేది ఉండేది. అలాగే బూతు సాహిత్యం కూడా. వీటిని చదివేవాళ్ళని అందరూ అసహ్యయించుకునేవాళ్ళు. ఇవి కిళ్ళీ బడ్డీలలో ఎవ్వరికీ కనిపించకుండా కేవలం ప్రత్యేకంగా అడిగినవారికే ఇచ్చేవారు. ఆ రాతలు రాసే రచయితలందరూ ఈరోజు జర్నలిస్టులు అయ్యారేమో అనిపిస్తోంది. కేవలం టీఆర్పీ రేటింగులకోసం వీరు ఎంత గడ్డికరవడానికైనా తెగిస్తారని తెలుస్తోంది. ఒక చానల్ గవర్నర్ కధనాన్ని ప్రసారం చేసి ముందువరుసలోకి వచ్చేసిందెమోనని తాము కూడా ఒక సెన్సేషన్ సృష్టించాలని కంకణం కట్టుకొని చేసే పనులు. వీటి ప్రభావం ప్రజలపైన ఎలా ఉంటుంది అనే ఇంగిత జ్గ్నానం కూడా లేకుండా తదుపరి పరిణామాలు ఊహించకుండా, భాద్యతా రహితంగా చానల్స్ ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇది ఒక ఉదాహరణ. పైగా వీరి నింద దేశ ఆర్ధిక వ్యవస్థలో పునాదిలాంటి వ్యక్తి. వేలకోట్ల పెట్టుబడులతో లక్షలమందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థలకు అధిపతి. అటువటి సంస్థలు ఒక్కసారి మూతబడితే వారిపై ఆధారపడ్డవారి సంగతి? అలాటి కధనం నిజమైనా కూడా ఎంత భాద్యతతో మెలగాలి? పైగా వైయెస్సర్ బంధువులను ఫోన్‌లో పిలిచి ఈ విష్యంపై మీరేమి చేబోతున్నరని రెచ్చగొట్టే ప్రశ్నలు. వీరు చెప్పిన కధనం నిజమో కాదో వీరికే తెలియదు, కాని వీరి కధనంపై ప్రజలు వెంఠనే ఏదొవిధంగా ప్రతిస్పందించాలి. అది చూసి వీళ్ళు సంతోషపడాలి. రిలయన్స్ అధినేతలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిపై కేసులు పెట్టబోతున్నాయి. కేసులు పెట్టాలి. వీరిని కోర్టులో నిలబెట్టాలి. గాలి వార్తలు, నీలి వార్తలు ప్రసారం చేసేవాళ్ళకి బుద్ధి వచ్చేలా శిక్షించాలి.

9 comments:

రమణ said...

వివాదాస్పద అంశాలను, ఊహాగానాలను అదేపనిగా ప్రసారం చేస్తూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు విచక్షణ నశించేటట్లుగా చేస్తున్నారు. ఈ మితిమీరిన ధోరణి చేసే చేటు అంతా ఇంతా కాదు. ప్రభుత్వాలు వీరిని అదుపు చేయకపోతే నష్టపోయేది ప్రజలే.

శిశిర said...

Yes...I agree with you.

నాగప్రసాద్ said...

ఆ కేసులో అంబానీలు నెగ్గాలని, ఆ దెబ్బకు ఒక ఛానళన్నా మూత పడాలని కోరుకుంటున్నాను. కనీసం అప్పుడైనా మిగతా ఛానళ్ళకు బుద్ధొస్తుంది.

kvsv said...

సరే మరి సి.బి.ఐ.సంగతి యేమిటి సారూ ?ఒక సి.ఎం.ఆక్కీడెంట్ లో దుర్మరణం పాలయితే దర్యాప్తు అతీ గతి లేదు?యెవారి ప్రోద్బలం తో దర్యాప్తు నత్తనడక జరిపిస్తున్నారు?చివరికి వారి బందువులకి కూడా ఒక సామాన్యునికి వచ్చే జవాబే వస్తున్నదట..ఇంకా ఆ నివేదిక అంధ లేదు ఈ నివేదిక అండలేదు అంటూ..స్వయంగా వాళ్ళే చెపుతున్నారు ఒక సి.ఎం.చనిపోతేనే దర్యాప్తుని నొక్కి పెట్టేస్తున్నారు మరి సొంధెహాలు రావా సారూ?పైసా మే పరమాత్మా హై ..

Indian Minerva said...

ఎంత బాధ్యతా రాహిత్యం, ఎంత వొళ్ళు పొగరు, ఏం చేసినా నోర్మూసుకొని పడివుంటుందిలే ప్రభుత్వం అనుకున్నారేమో. ఆ ముగ్గురు చానళ్ళ అధిపతులను తక్షణం నాన్ బెయిలబుల్ వారెంటు కింద అరెస్టుచెయ్యాలి.ఇప్పటికిప్పుడు ఆ చానళ్ళకు కోర్టులోవిషయంతేలేదాకా ప్రసారాలు నిలిపివేయమని ఉత్తర్వులుజారీచేయాలి. వాళ్ళ ఆస్తులను జప్తుచేసి మరీ నష్టపరిహారాన్ని రాబట్టుకోవాలి. ఇలాంటి వెధవ్వేషాలెయ్యడానికి భవిష్యత్తులో ఎవరూ కూడా సాహసించని విధంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. తీర్పులిచ్చేసే, రెచ్చగొట్టే కార్యక్రమాల నేపధ్యంలో ప్రసార మాధ్యమాలకు సెన్సారు కళ్ళాలు బిగించాలి.

అసలు ఒక నెలరోజులపాటు వెధవ్వేషాలేసేందుకు రోడ్డెక్కేవాళ్ళందరినీ కాల్చి చంపితేగానీ పరిస్థితి అదుపులోకి రాదేమో. పెట్రోలుబంకులు తగలపెట్టడం ఏంటండీ ఉన్మాదం కాకపోతే? అవి పేలితే పరిస్థితి ఏంటి? జనాల్లో చైతన్యం ఈ విధంగా దారితప్పిపోవడం దుస్సహం.

May Ambaani's and the State Govt. win the case.

చైతన్య said...

already ఆ ఛానల్ పైన కేసులు వేయటం జరిగింది.
ఈరోజు ఉదయం అదే ఛానల్ లో ఒక చర్చాంశం చూసాను... ఆ ఛానల్ న్యూస్ రీడర్ ఒక లాయెర్ని ఫోన్ లో అడుగుతున్నారు.. "ఇందులో ఛానల్ తప్పేముంది? ఇలా కేసు వేయటం న్యాయమేనా?" అని... దానికి ఆ లాయెర్ సమాధానం... "ఇందులో ఛానల్ తప్పేం లేదు. ఇది ఒక వెబ్సైటులో దొరికిన కథనం అనే ప్రసారం చేసింది కాని.. ఇదే నిజమని అనలేదు. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి clue ఇచ్చాము అంతే. ఇలా కూడా జరిగి ఉండొచ్చు అన్నాం కాని... ఇది confirmed అని చెప్పలేదు కాబట్టి ఛానల్ తప్పేమీ లేదు" అని అన్నారు ఆ లాయెర్ గారు!

Anonymous said...

మన తెలుగు చానెల్స్ ని మూసేస్తే అందరికీ సుఖం.ఏ గొడవా లేనప్పుడు కూడా వాళ్ళు ఓ హాయిగా ఉండే కాపురాన్ని కూల్చేయ సమర్ధులు.

సురేష్ బాబు said...

రిలయన్స్ ఆస్తుల పై దాడి చేసేటప్పుడు కానీ మరే ఆస్తులపైనో దాడి చేసేప్పుడైనా అందులో పని చేసేవారు ఏ పాపం చేసారని వాళ్ళను కొడుతున్నారు? వారి జీవనాధారాలను కొల్లగొడుతున్నారు? తిన్నది అరగక చేస్తున్న పని ఇది. ప్రజలలో మార్పు రానిదే ఏమీ చేయలేమండీ.

chakri said...

ముందు మీరు ఆ చానల్స్ ..కాదు కాదు..టీవీ నే చూడటం మానేయండి.. మనం ఆ చానెల్స్ ని చూసి వాళ్ళని encourage చేస్తున్నాం.. బహిష్కరించండి,, మొత్తం చానల్స్ ని.