బ్లాగుల్లో సంక్రాంతి సంబరాలగురించి కొంతమంది చక్కగా చెప్పారు. పదిమందీ కలిసి చేసుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. రైతులకు పంట చేతికొచ్చాక ఇంటిల్లిపాదీ ఆనందంగా గడుపుకొనే సంతోషకరమైన రోజులు. వాటిని మరింత శోభాయమానంగా చేసుకోవడానికి ఇంటికి కొత్త సున్నాలు, ఇంటిముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, భొగి మంటలు ఒక అదనపు ఆకర్షణలు. రైతులు అహ్లాదకరంగా గడపడానికి కోళ్ళ పందేలు. ఆంధ్ర దేశంలో ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా చేసుకుంటున్న పండుగ. ఇదా సంస్కృతి అంటూ కొంతమంది వెక్కిరించడానికి నాకేమి కారణాలు కనబడడటం లేదు. సంస్కృతి అంటే ఏమిటో? అందరూ ఒక విధానాన్ని సంవత్సరాలుగా చేస్తూపొతే తరువాతి కాలంలో అదే సంస్కృతి అవుతుందని నా మట్టి బుర్రకు తోచింది. మరి ఇంతకుమించి సంస్కృతి అంటే ఏమొటో వెక్కిరించేవాళ్ళు చెపితే మా కళ్ళు తెరుచుకుంటాయి. హిందూ సంస్కృతి అంటే కొంతమందికి చులకన బావన ఎందుకో అర్ధం కాదు. ఆ వెక్కింతను సహేతుకంగా వివరిస్తే కొంత తెలుసుకొనే ప్రయత్నమైనా చేస్తాము. ముగ్గులూ, గొబ్బెమ్మలూ,భోగిమంటలూ, గంగిరెద్దులూ సంస్కృతా అంటే? అది కాకపోవచ్చు అనిపిస్తే మరేదో చెప్పాలి. కేవలం ఒక ప్రశ్నను వేసి గేలి చేయడం సరికాదేమో! ముఖ్యంగా ఇటువంటి టపాలు ఆకతాయీలు రాస్తే అస్సలు పట్టించుకోనక్కర్లేదు. కానీ అన్నీ తెలిసినవాళ్ళే ఆకతాయీల్లా రాస్తున్నప్పుడు స్పందించక తప్పదు. వారి రాతలను మరింత సహేతుకంగా రాయాలిగానీ, కేవలం ఇదా సంస్కృతి అని ప్రశ్నించి వదిలివేయడం మంచిది కాదు.
7 comments:
విమర్శిస్తున్నవారికి ఈసంస్క్రుతిమీద విఅపరీతమైన ద్వేషం. పరాయి వారీ ఏజంట్లుగా ఇక్కడ జీవిస్తున్న ఈ దౌర్భాగ్యులు ఈ సంస్కృతినీ ,సుఖసంతోషాలను చూసితట్తుకోలేరు . వీలైనంతవరకు దీనిని వినాశమొనరించేందుకు ప్రయత్నిస్తారు.రాక్షసాంసం .కాబట్టి ఎన్ని మంచిమాటలు మీరు చెప్పినా వారి తలకెక్కదు .

నేనకోవడమేంటంటే, మనకు సంతోషంగా ఉందికదాని జంతువులను వుసిగొల్పి అవి రక్తమోడేలా కొట్టుకుంటుంటే వాటిపై డబ్బుమత్తు ఎక్కువై పందేలుకాయడం నాగరికం అనిపించుకోదు. సంస్కృతి అంటే సంస్కారం పెంచేదిగా ఉండాలి. కోళ్ళ పందాలు ఏం సంస్కారం పెంచుతాయో నాకుతెలీదు. ఒకవేళ తరాలుగా చేస్తున్నారుగా అని దాన్నే continue చేయడంలొ తప్పులేదనుకుంటే బాల్యవివాహాలని,‘సతి’ని మళ్ళి పాటిద్దాం.
‘..కానీ అన్నీ తెలిసినవాళ్ళే ఆకతాయీల్లా రాస్తున్నప్పుడు స్పందించక తప్పదు’ వాళ్ళు రాన్సిందేంటో నేను చదవలేదు, మీరు ఇక్కడ రాసిందానిపైన వ్యాఖ్య చేసాను. ఒకవేళ ఆ రాసినవాళ్లు ఈ పందేలను బేస్ చెసుకొని గొబ్బెమ్మలు,భోగిమంటలు వగైరలను silly గా మొత్తం సంస్కృతినే వెక్కిరిస్తేమాత్రం మీ ఆవేదన సరైనదే.
Are you refering to this?
http://teluguradical.blogspot.com/
LOL
I mean http://teluguradical.blogspot.com/2010/01/blog-post_14.html to be precise
@ దుర్గేశ్వర గారూ...మనలో ఒకరిగా ఊంటూ మన సాంప్రదాయలని ఏకమొత్తంగా తప్పుపట్టడం సహించరానిది. కొన్ని లోటుపాట్లు ఉన్నమాట వాస్తవమేనని మనమూ ఒప్పుకుంటాము.
@ చారీ గారూ...చివరిలో మీరు ఊహించినదే నిజం.
@ మలక్‌పేట రౌడీ....మిర్చు చెప్పిన లంకె గురించే నేను వ్రాసినది.
Post a Comment