తెలుగు భాషాభివృద్ధికోసం బ్లాగర్లంతా "తెలుగు బాట" కార్యక్రమం చేబట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. గిడుగు రామ్మూర్తిగారి జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని చేబట్టడం మరింత ఆనందించాల్సిన విషయం. నాక్కూడా ఆరోజు బ్లాగర్లందరితోనూ పాల్గొని నేనేగాకుండా మరింతమందిని తీసుకురావాలని ఉంది. కానీ కొంతమంది వక్రదృష్టి దీనిమీద పడుతుందేమో అనే సందేహం కలుగుతోంది. మొదటిది తెలుగుభాష అంటే "తెలంగాణా తెలుగా?" లేక "ఆంధ్రా తెలుగా?" అనేది మొదటి సందేహం. మరి ఏ తెలుగుభాషో తెలియకుండా నేనెలా పాల్గొనేది? రెండూ ఒక్కటే అని మీరంటే నాకేమాత్రం అభ్యంతరం లేదుసుమండీ! కానీ అంతా ఒక్కటే అంటే మరి మా తెలంగాణా పులకేసి ఒప్పుకుంటాడా? కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాడా? పైగా కార్యక్రమం మొదలుపెట్టేది తెలుగు తల్లి విగ్రహం నుండి. అదే తెలంగాణా తల్లి విగ్రహంనుండి ఐతే మా పులకేసికి అభ్యంతరం ఉండదేమో బ్లాగర్లంతా ఆలోచించాలి. దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇదికూడా సమైక్యవాదుల కుట్ర, తెలుగు భాష ముసుగులో వీరంతా తెలంగాణా వ్యతిరేకంగా ఉద్యమం చేబడుతున్నారంటూ దాడిచేస్తేమాత్రం నా భాద్యత లేదు. కాబట్టి బ్లాగర్లంతా తగుజాగ్రత్తలతో "తెలుగు బాట"లో పాలొనాలని నా విన్నపం.
6 comments:
ఆలోచించాల్సిన విషయమే
ఇందులో ఆలోచించడానికేముంది సార్. రాజకీయాలు చేయడానికైతే ఆంధ్రాభాషనో, తెలంగాణ భాషనో వంకలు పెట్టవచ్చు. ఇదొక మహోన్నత ఆశయంతో చేస్తున్న ‘తెలుగు బాట‘కు వెనకడుగు వేయాల్సిన పనిలేదు. అంతెందుకు సార్ ఒక్క తెలంగాణలోనే అనేక యాసలున్నాయి. మీరంటున్న పులకేసి మాట్లాడేది ఒక యాస అయితే ఆయన పదకొండో చెల్లెలు మాట్లాడేది మరో యాస. ఆయన కొడుకు మాట్లాడేది ఇంకోయాస, ఆయన మేనల్లుడు మాట్లాడేది మరోకటి. ఈ నలుగురిలోనే ఇంత వ్యత్యాసం వుంటే... వీరిలో ఎవరు మాట్లాడేది అసలైన తెలంగాణ భాష. గుంటూరు, కృష్ణా తెలుగు ఒకరకంగా వుంటే విజయనగరం, శ్రీకాకుళం మరోరకంగా వుంటుంది. ఒక తల్లి బిడ్డల్లోనే ఏ ఇద్దరూ ఒకేరకమైన ఆలోచన చేయరు. ఒకే రకమైన భావాలను కలిగివుండరు. అందువల్ల దీనిపై మరో ఆలోచన లేకుండా ముందుకడుగేయడమే మంచిది.
ఎవరూ ఏమీ భయపడాల్సిన పనిలేదు. ఈ-తెలుగు తరపున పురపాలక సంఘం నుంచీ, పోలీసు శాఖ నుంచి అనుమతులూ అన్నీ తీసుకున్నాం. ధైర్యంగా రండి.
ఛీ నా బతుకు చెడ....,తెలుగును ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలొ పులకేసిల గురించి ఎందుకు సార్ ప్రస్తావన. అతనుగాని అతని పార్టివాళ్లుగాని అలా మాట్లాడితే తెలుగు శూరుడు గారు అన్నట్టు "I pity myself to have been born in to this "yet-to-grow" race. "
vachindannaaa... vachadannaaa... okatenanna varala telugu....
Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read my blogs for spiritual information and universal intents
Thanks,
Nagaraju
Post a Comment