మా అపార్ట్మెంట్లో సెక్రటరీ ఒక నిర్నయం తీసుకున్నాడు. ఫ్లాట్లలో ఉండే కార్లను ఇకనుండీ వాచ్మెన్ తుడవడని. ఎందుకంటే కార్లు తుడవడంవల్ల ఎక్కువ సమయం దానికే పోతే అసలు పనులు చేయడానికి వాచ్మెన్ కి సమయం చాలట్లేదని. ఏమి చేస్తాము? ఎవరినైన మరొకరిని వెతికిపెట్టమని వాచ్మెన్కె అప్పచెప్పాను. ఒకరోజు ఉదయాన్నే వాచ్మెన్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చాడు. సార్ ఇయన కార్లు శుబ్రం చేస్తాడుట. కార్లు ఉదయాన్నే శుబ్రం కూడా చేశాడు. అన్నాడు. అతనితో అన్నాను "సరే నెలకు ఎంత ఇమ్మాంటావు?" అని. "నెలకు కాదు, ఈ ఒక్కరోజే తుడుస్తాను. ఇవ్వాళ తుదిచినందుకు పది లక్షలు ఇవ్వాలి" అన్నాడు మెడలోని కండువా సర్దుకుంటూ. నా చెవులను నమ్మలేక "ఎంత అన్నావు?" అన్నాను. "అక్షరాల పది లక్షలు" అన్నాడు. నా కారు విలువే ఐదు లక్షలు ఉండదు. దానిని ఒకసారి తుడిచినందుకు పది లక్షలా? మా వాచ్మెన్ కేసి అయోమయంగా చూశేను. వాచ్మెన్ అన్నాడు" అవును సారు ఆయన గొప్పనాయకుడు. అదేదొ పనికోసం చందాలు వసూలు చేస్తున్నడంట". "ఐతే మాత్రం కారు తుడిస్తే పదిలక్షలా? కావాలంటే వంద రూపాయలిస్తాను" అన్నాను. దానికి అతను కొపంగా" ఇక్కడ తిరగాలంటే పది లక్షలు ఇవ్వాల్సిందే" అంటూ వెనుతిరగబోయేడు. ఈ సంభాణ వెనకనుండీ వింటున్న మా ఆవిడ ఖంగారుగా నాతో" ఆయనతో గొడవెందుకండీ మీరు అప్పుచేసి ఇవ్వగలిగినంత ఇస్తానని చెప్పండి" అన్నది. నేను ఆయన వెంట నడుస్తూ నా బాంక్ బాలెన్స్ క్రెడిట్ కార్డులు అన్నీ చూపించి నా తాహతు ఆయను తెలియచెప్పి ఒక అంకె చెప్పాను. ఆయన అన్యమనస్కంగా ఒప్పుకొని నేని ఇచ్చిన చెక్కు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మిత్రులెవరైనా కొత్త పనివారిని పెట్టుకొనేముందు కాస్త తెలుసుకొనె మసలుకోండి. వచ్చింది మరెవరో కాదు..తెలంగాణా పులకేశి!!
6 comments:
బాగుంది, చాల రోజుల తరవాత రాసారు !
అంతోటి పెద్ద మనిషి కారు తుడిస్తే లక్షలు పదేమిటి, మధ్యలో ఒక ఒక సున్నాచేర్చి ఇచ్చినా (అయ్యా ఇక్కడ నేనేది "వంద" గురంచి. చిత్తగించగలరు) అది సరిపోదు.
శ్రావ్య గారూ తెలుగు న్యూస్ చానల్స్ చూడడం మానేస్తే బీపీలూ షుగర్లూ రావని తెలుసుకున్నాను. ఈ విషయాన్ని మనం బాగా ప్రచారం చేయాలండీ !!
@ఇండియన్ మినర్వా: మీరన్నదీ నిజమే!!
హ హ నేనైతే కొన్ని తెలుగు బ్లాగులు కూడా చూడటం మానేయాలని చెబుతా :)
btw "Viswamitra C " buzz ప్రొఫైల్ మీద ?
శ్రావ్య గారూ... విశ్వామిత్ర నా కలం పేరు మాత్రమే. మరెక్కడా నా ప్రొఫైల్ లేదు.... ))
అయ్యా విశ్వామిత్ర గారు
మీరు వంద రూపాయలు ఇస్తా అని అన్నారు , నేను అయితే అది కూడా ఇవ్వను. ముందు పనితనం చూదాలికదా.
అటువంటి పనికి మాలిన ( పని చెయ్యని) వాడిని చోస్తూ చూస్తూ పని లోకి ఎలా తీసుకుంటాం.
అసలు వాడికి ( పులకేసి కి) పూర్వానుభవం ఉందొ లేదో అడిగారా ?
నేను మినర్వా గారితో, విస్వామిత్ర గారితో ఏకీభవించలేక పోతున్నా :(
Post a Comment