February 7, 2011

క్లారిటీ అనేది మన అభిప్రాయంలో ఉండాలి మిత్రమా!!



బ్లాగులో రాతలు తీటలాంటిదే. మనం గొప్ప అనుకున్న అభిప్రాయాన్ని మనం రాసుకుంటే తీరిక ఉండి బ్లాగులొకి తొంగిచూసినోడు నచ్చితే "ఆహ!" అంటాడు లేకపొతే "యాహ!" అంటాడు. మన అభిప్రాయాలు కొద్దిగ అతిగా, తిక్కతిక్కగా అనిపిస్తే, ఎదుటివాళ్ళని రెచ్చగొట్టేల ఉంటే చదివినవాడు మనల్ని గిచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఇది మాటలవరకే ఐతే పర్వాలేదు, శృతిమించి వ్యక్తిగత ధూషణలకు వెళ్ళడం మాత్రం అర్ధం లేనిని, భరించలేనిది. సత్తయ్య మంచివాడు అంటే తెలిసినవాళ్ళు అవును అనుకుంటారు, తెలియనివాళ్ళు అవునేమో అనుకుంటారు. కానీ జగమెరిగిన "మీడియా" చెడ్డది అందులో పనిచేసేవాళ్ళు చాలా మంచోళ్ళు అంటేనే తంటా మొదలవుతుంది. మంచోళ్ళు అందరూ కలిసి మీడియాని బాగుచేయచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ వెలుబుచ్చుతున్న అభిప్రాయమేమిటంటే "మీడియా"లో ఉన్న పెట్టుబడిదార్లు దొం.నా.కో లు పనిచేస్తున్న జర్నలిస్టులంతా మంచోళ్ళు అని. ఇక్కడ విషయం ఎక్కడికెళ్ళిందంటే ఆంధ్రా తెలంగాణా అంశానికి దారితీసింది. మీడియాలో పెట్టుబడిదారులలో చాలామంది ఆంధ్రావాళ్ళే. కాబట్టి ఆంధ్రావాళ్ళని విలన్‌లని చేస్తూ ఇక్కడి జర్నలిస్టులను హీరోలను చేసే ప్రయత్నం ఒకటైతే, హోల్ మొత్తం మీద పెట్టుబడిదారులను ఒకవర్గం చేసి వాళ్ళు చెడ్డోళ్ళు అనేసి "జర్నలిస్టు" అంటేనే చానా మంచోడు అనడం రెండో మాట. కానీ ఒక సామాన్యుడి దృష్టిలో మీడియా అంటే మీడియా. కాబట్టి పైన రెండు స్టేట్‌మెంట్లు తప్పే. దొంగతనం చేసినవాడు జర్నలిస్టైనా వాడిని కూడా దొం.నా.కొ అనగలిగి జర్నలిస్టులలోనూ దొంగలున్నారు అని చెప్పగలిగే సత్తా ఉండాలి. అప్పుడే మన రాతల్లో నిజాయితీని ప్రజలు (బ్లాగు చదివినవాళ్ళు) గుర్తిస్తారు. ఇక ఎవరో అనామకుడు పిచ్చిరాతలు రాస్తే దానికి మీ సొంతపేరుతో ఫోన్ నంబర్లు ఉంచి మీడియా మీద రాతలు రాయండి మీకు తెలుస్తుంది అనడం, మాఫియాగా వర్నించడం ఎవరిని భయకంపితుల్ని చేయడానికో మరి. అందరూ ఒకతానులో గుడ్డలే. ఎవ్వరూ తక్కువ తినలేదు. ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటారన్నది జగమెరిగిన సత్యం. మీ పోరాటం అన్యాయంమీదైతే జర్నలిస్టుల్లోనూ దొంగలున్నారు అని ప్రకటించి వారిని కూడా బైటపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వవిస్తారు.

ఒకరి అభిప్రాయాలు నచ్చక్పొతే వ్యతిరేకించవచ్చుగానీ వ్యక్తిగత ధూషణలు చేయడం మాత్రం ఎవ్వరూ హర్షించరు. వాటిని మనమందరమూ ఖండించాలి.



13 comments:

Sravya V said...

హ్మ ! చాల రోజులకు మళ్ళీ ఒక మంచి పోస్టు తో వచ్చారు !

karthik said...

long time dude..welcome back!!
and as usual u nailed the point..

Praveen Mandangi said...

రాము గారు నాకు మెయిల్ పంపారు. అతనికి ఫోన్ నంబర్ ఇచ్చాను. ఫోన్‌లోనూ బూతులు తిట్టారు. అందుకే వాయిస్ రికార్డ్ చేసాను. ఎంత శ్రీరంగ నీతుల పెద్ద మనిషైనా ఇంత ఓపెన్‌గా బూతులు మాట్లాడుతాడా అని డౌటొచ్చింది.

విశ్వామిత్ర said...

@ శ్రావ్య గారూ & కార్తీక్ గారూ థాంక్యూ...

@ ప్రవీణ్...బ్లాగుల్లో మీ పేరే ఒక చైతన్యం...ఒక విపరీతం...ఒక వైపరీత్యం...!! సరేగానీ మీరు ఒకరికి అంత కోపం తెప్పించే వ్యాఖ్యలు ఏమి చేశారు?

Praveen Mandangi said...

రాము గారు అప్పలరాజు గారిని 'నా కొడకా' అని తిడుతోంటే నేను 'శ్రీరంగ నీతుల పెద్ద మనిషి' అన్నాను. ఈ మాత్రానికే ఆయన నన్ను అడ్డమైన తిట్లు తిట్టారు. ఫోన్‌లోనూ అలాగే మాట్లాడారు. వాయిస్ రికార్డింగ్ చేశాను. అంతే.

విశ్వామిత్ర said...

ప్రవీణ్..ఆవిషయాలు నేను చదవలేదు. వారిద్దరూ తిట్టుకున్నారని మీకెలా తెలుసు?

శ్రీనివాస్ said...

బ్లాగుల్లో మీ పేరే ఒక చైతన్యం...ఒక విపరీతం...ఒక వైపరీత్యం...!!
_______________________

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

Praveen Mandangi said...

http://appalaraj.blogspot.com/2011/02/blog-post.html

విశ్వామిత్ర said...

ప్రవీణ్... అప్పలరాజు బ్లాగ్‌లో టపా చదివాను. నేనుకూడా కొంతమంది టపాలకి పేరడీలు రాశాను. కానీ వారు నొచ్చుకోలేదు. తరువాత అదే వ్యక్తి నా బ్లాగులో కామెంట్లు కూడా పెట్టారు. కానీ దీంట్లో పేరడీ పాళ్ళు కొద్దిగా...ఎక్కువ అయింది. అయినా సదరు వ్యక్తి 5వ తారీకున రాసిన కామెంటు"నీ పోస్టులో ఆరోపణలపై నేను నీతో మాట్లాడాలి. నువ్వు రాసినట్లు నిజంగానే నాకు విద్వత్ లేదు. కానీ మరీ నేను అంత చెడ్డ వాడినో, దుర్మార్గుడినో కాదు. బ్లాగులో మీడియాతో పాటు నా గురించి, నా భావాల గురించి రాసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. దాని మీద వ్యాఖ్యను ... గానీ, ... ఖండిచకపోవడం బాధగా ఉంది" ఈ వ్యాఖ్యను వారు మొదటనే వ్రాసిఉంటే ..ఆయన అనుకునే స్నేహితులంతా వారివెనుకే ఉండేవారు... బ్లాగరు కూడా తన రాతలను మార్చుకొనే అవకాశం ఉండేది.

ప్రవీణ్ ఈ విషయంలో నీ పెద్దరికం అనవసరం. నువ్వు అనవసరంగా తల దూర్చావు..ఇది నా అభిప్రాయం

Krishna K said...

బాగా చెప్పారు.
నేను, నాకు నచ్చిన వాళ్లు, ప్రస్తుతం నేను చెసే మీడియా సంస్థలే "పత్తిత్తులు", మిగతా అందరూ "ఎండిత్తులే" అన్న వాదన తప్ప ఇంకొకటి అని మాత్రం నాకు అనిపించలేదు ఏనాడూ :(
IMHO, it is good that true colors came out finally

Praveen Mandangi said...

తలదూర్చడం ఏమిటి? కేవలం 'శ్రీరంగ నీతుల పెద్ద మనిషి' అని నిజం చెప్పినందుకే అడ్డమైన బూతులు తిట్టాలా? ఇదేదో పెద్ద తలదూర్చడం విషయం ఎలా అవుతుంది?

విశ్వామిత్ర said...

"ఒళ్ళు కాలి ఒకరు..." లా ఉంటే నీ మాటలు మరింత పెంచాయి ప్రవీణ్.

Praveen Mandangi said...

How can it be my fault? I don't think that the so called educated person is not aware about the decorum of the language.