February 16, 2011

శూర్పణకకి సీతపై అసూయ సహజమే!!




దశరధమహారాజు ఒకానొక సమయంలో కైకకి ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించమని శోకమందిరంలో ఉన్న కైక కోరుతుంది. వాగ్దానం ప్రకారం కైక కోరికలు దశరధుడు మన్నించాలి. భరతుడికి పట్టాభిషేకం చేయడం ఒకటైతే మరోటి శ్రీరాముడిని అడవులకు పంపివేయడం. ఆమె మాట ప్రకారం సీతారాములు అడవికి బయలుదేరుతారు. వారితోబాటోబాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. నార దుస్తులతో వారు అడవికి బయలుదేరుతారు. నారబట్టలు కట్టుకోవడం సీతాదేవికీ రాకపొతే శ్రీరాముడు ఆమెకు సహాయపడతాడని రాసి ఉంది.అంటే భార్య భర్తలు ఎలా ఒకరికొకరు సహయాం చేసుకోవాలో తెలియచేయడానికి వ్రాసిన విషయం. అలాగే వారి ప్రేమ అలౌకికమైనది. ఒకరంటే మరొకరికీ ఉండే ప్రెమ అభిమానం, రాముడిపట్ల సీతకుండే భక్తి తత్వం, సీతా రాముల అంద చందాలు చూసి రావణుడి చెల్లెలు శూర్పణకకి కన్నుకుడుతుంది. ఎలాగైన రాముడిని మనువాడాలని ఎన్నొ ప్రయత్నాలు చేస్తుంది. ఆ అసూయే సీతపట్ల ద్వేషభావం పెరగడానికి కారణం. వారిద్దరినీ ఎలాగైనా వేరుచేయాలన్న ప్రయత్నంలో లక్ష్మణుడి చేతిలో భంగపడి రావణుడిని రెచ్చగొడుతుంది. వారిద్దరూ వెరైతే రాముడు తనకు దక్కుతాడని ఒక పిచ్చి నమ్మకం. దానివల్లే సీతాపహరణం, రామ రావణుడి యుద్ధం అందరికీ తెలిసిందే.

కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియనీ విషయం ఆనాటి శూర్పణక ఆంధ్ర దేశంలో మళ్ళీ జనియించి ఈనాడు సీతా రాములపై బ్లాగుల్లో దుష్ప్రచారం చేయడం. అందగాడైన రాముడు ఆమెకు దక్కకపోవడం ఆమెలో నిసృహకి కారణం ఒకటైతే, సీతవల్ల తన అన్నగారైన రావణుడు చనిపోవడం మరో కారణం. కాబట్టి రాక్షస జాతికి చెందిన ఆమెకు సీతారాములతో వైరం రావణుడిపట్ల ప్రేమ సహజం. ఆనాటి శృంగభంగాన్ని మర్చిపోలేక సీతని మా అన్న ఏదో చేసాడని, వారిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని, రాముడికి సీతపై ప్రేమ లేదని అందువల్లే వదిలివేశాడని పిచ్చిరాతలు రాసుకుంటూ ఆనాతి శూర్పణక ఈనాడు తృప్తి పొందుతోంది. కాబట్టి రామయణాన్ని అభిమానించే వారెవ్వరూ ఆ రాతలను పట్టించుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.



6 comments:

karthik said...

super annay.. keka!

శ్రీనివాస్ said...

అదీ సంగతి .

Sravya V said...

as usual very well said :)

Ramani Rao said...

అదా అసలు సంగతి?

రామరాజ్యం said...

ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే అధర్మాన్ని ఎదిరించి నిల బడగలరు. మరి ఎవరు ధైర్యస్థులు గా ఉండగలరు అంటే ధర్మాన్ని ఆచరించే వారు మాత్రమే. తాను చేస్తున్నది ధర్మమని నమ్మి న వారు మాత్రమే. మీకూ అలాంటి నమ్మకం ఉంటే మాతో చేతులు కలపండి. ఆబ్లాగుని, అలాంటి ధర్మ వ్యతిరేక బ్లాగులని తొలగించే ప్రయత్నం సమిష్టిగా చేద్దాం.





అబ్లాగులోని Report Abuse అనే బటన్ ఉంది ఇటువంటి సందర్భాలలో ఉపయోగించడానికే. మీకు అది సరిఅయిన పనే అనే నమ్మకముంటే వీలైనంత త్వరగా ఆపని చేయడిం. కేవలం రాతలకే కాక చేతలకు దిగండి.


మనకు నచ్చని, మన మనసు నొప్పించే కంటెంట్ ఉన్న ఏ బ్లాగునైనా బ్లాగరునుండి తొలగించ మని అడిగే హక్కు మనకు ఉంది. దానిని అందరం ఉపయోగించుకుందాం

Vani said...

ముఖ్యంగా టైటిల్స్ ఘోరం.
ఎందుకు ఆ బ్లాగ్ ని అగ్రిగేటర్లు తీసివెయ్యటంలేదో నాకు తెలియదు. విషయాన్ని సపోర్ట్ చెయ్యని వారే నడుపుతున్న మాలిక లోనించి కూడా తీసెయ్యలేదు. అగ్రిగేటర్ లో లేని తెలుగుబ్లాగులు చదివేవారు ఉండరనేది సత్యం.