September 23, 2011

వీళ్ళిద్దరు!!

సకల జనుల సమ్మె బాగానే సా..గుతోంది. జనాన్ని మూకుమ్మడిగ ఎలా ముంచచ్చో పులకేసికి తెలిసినంతబాగా మరెవ్వరికీ తెలియదు. ఎవరి చేత్తో వారికే వాతలు పెట్టుకోవడం చక్కగా నేర్పిస్తున్నాడు. వీరికితోడు నత్తి సత్తిబాబు, ఎల్కేజీ టీచర్. ఇకపై మిలటెంటు కార్యక్రమాలు మొదలు పెట్టాలిట. పైగా గాంధీజి కూడా మిలటెంట్ కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. అంటే తనని తాను గాంధిజితో పోల్చుకుంటున్నాడేమో? ఖర్మ. మొత్తం మీద చాలావర్గాల్ని సమ్మెలో భాగస్తులని చేశారు. మొదటగా టీచర్లని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో మొట్టమొదటి ఏబ్రాసులు వీళ్ళే(ప్రాంతీయ బేధం లేకుండా). అత్యంత తక్కువ సమయం పని చేస్తూ మొత్తం కాలానికి జీతం తీసుకొనే ఒక వర్గం. ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు కేవలం చులకన, అసహ్యం(క్షమించాలి తప్పదు). ఇక తరువాత రెవెన్యూ తదితర విభాగాల ఉద్యోగాలు. వీరిలో ఎంతమంది బల్లకింద చేతులు పెట్టకుండా పని చేస్తారంటారు? ఎన్ని కధలు వినలేదు, ఎన్ని సినిమాలు చూడలేదు. అందులో సెక్రటేరియట్. వీరి నాయకుడు ప్రభుత్వాన్ని వందసార్లు ఉరి తీయాలని అన్నారు. పిల్లి గుడ్డిదైతే అన్న సామేత గుర్తుకొచ్చింది. మిగిలిన వారిలో ఒకటో తారీకుకి జీతాలు రాకపోతే ఎంతమంది తాట్టుకోగలరో తెలియనిది కాదు. ఇక అసహ్యకరంగా పురోహితులు, డాక్టర్లు సమ్మె చేయడం. వీళ్ళకి ఏమి పోయికాలం వచ్చింది. సర్వే జనాహ్ సుఖినో భవన్‌తు అని ఆకంక్షించే వర్గం దేవుడి ధూప దీప నైవేద్యాలు మానేసి క్రికెట్ ఆడడం!! అది ఖచ్చితంగా విపరీత పోకడలే. పోయేకాలం దాపురించినవాడికి మంచి చెడు తెలియదు అన్నట్టు ఉంది వీరి తీరు. భగవంతుడి తరువాత అంతటి స్థానం డాక్టర్లది. ముక్కుకి మసి రాసుకొని ఎప్పుడు సమ్మె చేద్దామని ఎదురుచూసే సిబ్బంది హైదరాబాదు ప్రభుత్వ డాక్టర్లు. డ్యూటీలు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీసు చేసుకోడానికి మంచి తరుణం. మొత్తం మోద వీళ్ళందరూ యుద్ధం ప్రకటించింది తెలంగాణా ప్రజలమీద. వాతలు పెడుతున్నది తెలంగాణా ప్రజల వంటిమీద. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నది తెలంగాణా ప్రజలే. ప్రత్యేక రాష్ట్రం వస్తే భూతల స్వర్గమే అంటూ అందరినీ నమ్మించిచ ఘనత పులకేసిదే. నిజమేగాబోలు అనుకొని ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఎలా ముగుస్తుందో మరి?

March 10, 2011

మీడియా మితృల గొంతులో పచ్చి వెలక్కాయ!!

మిలీనియం మార్చ్ మొత్తం మీద అయింది. పదిలక్షల మంది కాకపోయిన వేలమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మార్చ్ చేద్దామనుకున్న వారికి కుదరక పరుగులు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చాలా సంయమనంతోనే వ్యహరించారని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యహారమే ఎవ్వరికీ మింగుడుపదలేదు.కేకేకి గానీ తెలంగాణా తరప;ున పూర్తిగా వకల్తాపుచ్చుకొని వాదిస్తూ వచ్చిన మధు యష్కీగానీ బిత్తరపోయుంటారు. జేపీ పై దాడిజరిగినప్పుడు తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు సహించరని చెప్పిన ఈయన మరి తెలంగాణాకు వ్యతిరేకంగా ఏమి మట్లాడాడో ఆయనే చెప్పాలి. "పిత్తు మింగిన దాసరి"లాగ గమ్మున ఉండడం తప్ప ఏమి చేయలేని పరిస్తితి. తనపై దాడి జరిగింది కేవలం తెలంగాణాపై అభిమానంతొనే అని కేకే చెప్పుకొచ్చారు పాపం. మరికొందరు వీర భక్తులు ఈ దాడివెనుక కుట్ర (సీమాంధ్రా వారిదా?) ఉన్నది అని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అసలే కోతి అందులో కల్లు తాగిందన్నట్టు టాంక్ బండ్ పైకి చేరిన వారికి తోడుగా తెరాస కార్యకర్తలు(?) చేరడంతో వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది. మీడియా సాక్షిగా వారు చేసిన విధ్వంసానికి సభ్య సమాజం (ఇక్కడ ఉంటే) తల వంచుకోవాల్సిందే. వారు చేసింది తప్పు అని చెప్పే దమ్ము ఒక్కరికీ లేదు కేవలం దురదృష్టం అనడం తప్ప. వారి మూర్ఖత్వాన్ని పెంచి పోషించిన మీడియా కి కూడా భంగపాటు తప్పలేదు. దాదాపు ఇరవైఐదు కెమేరాలు అవి బీటాకెం ఎక్విప్మెంట్ అయితే ఒక్కొక్క కెమేరా కనీసం రెండు లక్షలకు తక్కువ ఉండదు. ఇవి కాకాక ఒక ఓబీ వేన్, మొత్తం డబ్బై లక్షల నష్టం. ఈ ఘటన కొంతమంది జర్నలిస్టు మితృలకి కూడా పండగే.కానీ ఈ దాడివల్ల వచ్చే వ్యతిరేకత వారిని కలవర పరుస్తోంది. పోలీసులు తమ మార్చ్‌ను అడ్డుకోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని గద్దరు సారు సెలవిచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా 81;ద్యమాన్ని ఆపలేరని ఎప్పటిలాగే మరోసారి సెలవిచ్చారు. మొత్తంమీద్ద పదిలక్షలమంది రాకుండా ఆపేమని పోలీసులు, ఎలాగైనా మార్చ్ చేసామని "వాదులు" అనుకొని సంబరపడ్డారు. మీడియా మాత్రం తమపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎప్పటిలాగే గొంతు చించుకుంటోంది. జరగబోయేది షర మామూలే!!

February 18, 2011

చిల్లర నాయకులు..!!


నోరు విప్పితే గబ్బు...మాట్లాడితే మాయమాటలు...జనాల అమాయకత్వంతో ఆటలు...ప్రజల మనోభావాల మాటున కపట రాజకీయాలు....ఆశయాల సాధన పేరుతో అక్రమ సంపాదన...ఇది గులాబీల వికృత చేష్టలు. దీనికి వారు పెట్టుకున్న మరో ముద్దు పేరు "మా సంస్కృతి". అసెంబ్లీ సాక్షిగా వీరి వికృతి హేల నిన్న హద్దులు దాటింది. గవర్నరు పై దాడిని జరిగిన తరువాత వారి చర్యను ఖండించబోతే జేపీకి జరిగిన అవమానానికి యావత్ మీడియా సాక్షిభూతంగా నిలిచింది. వారి చర్యలను ఆపబోయిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ చర్యను యావత్ మీడియా తమ కెమేరాలలో బదిస్తూ చోద్యం చూస్తూ ఉంటే మరికొందరు జర్నలిస్టులు నవ్వుకుంటూ ఆ వికృత హేలను ఆనందించడం స్పష్టంగా కనబడింది. మట్టిగొట్టుకుపోతున్న విలువలకు అసెంబ్లీ వేదిక కావడం మరో దురదృష్టం. ఈ చర్యను ప్రభుత్వం ఖండించి ఊరుకుంటుందా? దాడిచేసిన వారినే కాదు దాడికి ప్రోత్సహించిన వ్యక్తులను జీవిత కాలం పాటు ఎన్నికలలో పోటికి అనర్హులుగా ప్రకటించాలి. వారిని దోషులుగా ప్రకటించి శిక్ష విధించాలి. సహాయ నిరాకణలో పాల్గొని సుస్పేండైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాష్ట్రంలో ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించిన చిల్లర నాయకుల మాటలకు భ్రమపడితే జరిగేది బిక్షాటనే. బూతద్దంపెట్టి వెదికినా వీరిలో విలువలు పాటించే వ్యక్తి ఒక్కరైనా కనబడతారా అన్నది అనుమానమే. ఇప్పటివరకూ చక్కటి వాక్పటిమతో హుందాగా ప్రవర్తించిన రేవంత్ రెడ్డి లాటి యువ నాయకుడు కూడా వీరిలో చేరడం దురదృష్టకరం. కుళ్ళిన శవాలకోసం రాబందులు సృష్టించబోయే వికృత ప్రళయానికీ ఇది ఒక సంకేతమా? వీరి చేతికి అధికార పగాలు ఇస్తే జరగబోయేది వినాశనమే గానీ మరొకటి కాదు. జేపీ గారికి నా సంపూర్న మద్దతు తెలుపుతున్నాను. జేపిపై దాడి చేసి గులాబీలు వారి చితికి వారే నిప్పు పెట్టుకున్నారు.


February 16, 2011

శూర్పణకకి సీతపై అసూయ సహజమే!!




దశరధమహారాజు ఒకానొక సమయంలో కైకకి ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించమని శోకమందిరంలో ఉన్న కైక కోరుతుంది. వాగ్దానం ప్రకారం కైక కోరికలు దశరధుడు మన్నించాలి. భరతుడికి పట్టాభిషేకం చేయడం ఒకటైతే మరోటి శ్రీరాముడిని అడవులకు పంపివేయడం. ఆమె మాట ప్రకారం సీతారాములు అడవికి బయలుదేరుతారు. వారితోబాటోబాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. నార దుస్తులతో వారు అడవికి బయలుదేరుతారు. నారబట్టలు కట్టుకోవడం సీతాదేవికీ రాకపొతే శ్రీరాముడు ఆమెకు సహాయపడతాడని రాసి ఉంది.అంటే భార్య భర్తలు ఎలా ఒకరికొకరు సహయాం చేసుకోవాలో తెలియచేయడానికి వ్రాసిన విషయం. అలాగే వారి ప్రేమ అలౌకికమైనది. ఒకరంటే మరొకరికీ ఉండే ప్రెమ అభిమానం, రాముడిపట్ల సీతకుండే భక్తి తత్వం, సీతా రాముల అంద చందాలు చూసి రావణుడి చెల్లెలు శూర్పణకకి కన్నుకుడుతుంది. ఎలాగైన రాముడిని మనువాడాలని ఎన్నొ ప్రయత్నాలు చేస్తుంది. ఆ అసూయే సీతపట్ల ద్వేషభావం పెరగడానికి కారణం. వారిద్దరినీ ఎలాగైనా వేరుచేయాలన్న ప్రయత్నంలో లక్ష్మణుడి చేతిలో భంగపడి రావణుడిని రెచ్చగొడుతుంది. వారిద్దరూ వెరైతే రాముడు తనకు దక్కుతాడని ఒక పిచ్చి నమ్మకం. దానివల్లే సీతాపహరణం, రామ రావణుడి యుద్ధం అందరికీ తెలిసిందే.

కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియనీ విషయం ఆనాటి శూర్పణక ఆంధ్ర దేశంలో మళ్ళీ జనియించి ఈనాడు సీతా రాములపై బ్లాగుల్లో దుష్ప్రచారం చేయడం. అందగాడైన రాముడు ఆమెకు దక్కకపోవడం ఆమెలో నిసృహకి కారణం ఒకటైతే, సీతవల్ల తన అన్నగారైన రావణుడు చనిపోవడం మరో కారణం. కాబట్టి రాక్షస జాతికి చెందిన ఆమెకు సీతారాములతో వైరం రావణుడిపట్ల ప్రేమ సహజం. ఆనాటి శృంగభంగాన్ని మర్చిపోలేక సీతని మా అన్న ఏదో చేసాడని, వారిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని, రాముడికి సీతపై ప్రేమ లేదని అందువల్లే వదిలివేశాడని పిచ్చిరాతలు రాసుకుంటూ ఆనాతి శూర్పణక ఈనాడు తృప్తి పొందుతోంది. కాబట్టి రామయణాన్ని అభిమానించే వారెవ్వరూ ఆ రాతలను పట్టించుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.



February 7, 2011

క్లారిటీ అనేది మన అభిప్రాయంలో ఉండాలి మిత్రమా!!



బ్లాగులో రాతలు తీటలాంటిదే. మనం గొప్ప అనుకున్న అభిప్రాయాన్ని మనం రాసుకుంటే తీరిక ఉండి బ్లాగులొకి తొంగిచూసినోడు నచ్చితే "ఆహ!" అంటాడు లేకపొతే "యాహ!" అంటాడు. మన అభిప్రాయాలు కొద్దిగ అతిగా, తిక్కతిక్కగా అనిపిస్తే, ఎదుటివాళ్ళని రెచ్చగొట్టేల ఉంటే చదివినవాడు మనల్ని గిచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఇది మాటలవరకే ఐతే పర్వాలేదు, శృతిమించి వ్యక్తిగత ధూషణలకు వెళ్ళడం మాత్రం అర్ధం లేనిని, భరించలేనిది. సత్తయ్య మంచివాడు అంటే తెలిసినవాళ్ళు అవును అనుకుంటారు, తెలియనివాళ్ళు అవునేమో అనుకుంటారు. కానీ జగమెరిగిన "మీడియా" చెడ్డది అందులో పనిచేసేవాళ్ళు చాలా మంచోళ్ళు అంటేనే తంటా మొదలవుతుంది. మంచోళ్ళు అందరూ కలిసి మీడియాని బాగుచేయచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ వెలుబుచ్చుతున్న అభిప్రాయమేమిటంటే "మీడియా"లో ఉన్న పెట్టుబడిదార్లు దొం.నా.కో లు పనిచేస్తున్న జర్నలిస్టులంతా మంచోళ్ళు అని. ఇక్కడ విషయం ఎక్కడికెళ్ళిందంటే ఆంధ్రా తెలంగాణా అంశానికి దారితీసింది. మీడియాలో పెట్టుబడిదారులలో చాలామంది ఆంధ్రావాళ్ళే. కాబట్టి ఆంధ్రావాళ్ళని విలన్‌లని చేస్తూ ఇక్కడి జర్నలిస్టులను హీరోలను చేసే ప్రయత్నం ఒకటైతే, హోల్ మొత్తం మీద పెట్టుబడిదారులను ఒకవర్గం చేసి వాళ్ళు చెడ్డోళ్ళు అనేసి "జర్నలిస్టు" అంటేనే చానా మంచోడు అనడం రెండో మాట. కానీ ఒక సామాన్యుడి దృష్టిలో మీడియా అంటే మీడియా. కాబట్టి పైన రెండు స్టేట్‌మెంట్లు తప్పే. దొంగతనం చేసినవాడు జర్నలిస్టైనా వాడిని కూడా దొం.నా.కొ అనగలిగి జర్నలిస్టులలోనూ దొంగలున్నారు అని చెప్పగలిగే సత్తా ఉండాలి. అప్పుడే మన రాతల్లో నిజాయితీని ప్రజలు (బ్లాగు చదివినవాళ్ళు) గుర్తిస్తారు. ఇక ఎవరో అనామకుడు పిచ్చిరాతలు రాస్తే దానికి మీ సొంతపేరుతో ఫోన్ నంబర్లు ఉంచి మీడియా మీద రాతలు రాయండి మీకు తెలుస్తుంది అనడం, మాఫియాగా వర్నించడం ఎవరిని భయకంపితుల్ని చేయడానికో మరి. అందరూ ఒకతానులో గుడ్డలే. ఎవ్వరూ తక్కువ తినలేదు. ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటారన్నది జగమెరిగిన సత్యం. మీ పోరాటం అన్యాయంమీదైతే జర్నలిస్టుల్లోనూ దొంగలున్నారు అని ప్రకటించి వారిని కూడా బైటపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వవిస్తారు.

ఒకరి అభిప్రాయాలు నచ్చక్పొతే వ్యతిరేకించవచ్చుగానీ వ్యక్తిగత ధూషణలు చేయడం మాత్రం ఎవ్వరూ హర్షించరు. వాటిని మనమందరమూ ఖండించాలి.