కొంత కాలంగా తెలుగు న్యూస్ చానల్స్ అంటే విసుగొచ్చింది. పేపర్ మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు న్యూస్ పేపర్ అన్నా విసుగొస్తొంది. జగన్ అరెస్ట్ అవుతాడా? ఎప్పుడవుతాడు? ఆయన ఆస్తుల్ని జప్తు చేస్తారా? ఆయనకు అన్ని ఆస్తిపాస్తులు ఎలా వాచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వానికి తెలియదా? ఆస్తులని కూడబెట్టడం వైయెస్సార్ ఉన్నప్పటినుండీ ఉన్నదని ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదా? అంతా తెలుసు. అది అందరికి తెలుసు. ఇలాంటివాళ్ళు కాంగ్రెస్‌లో మరెవ్వరూ లేరా? వారు పోగేసుకుంటూ చుట్టుపక్కలవారందరికీ కొద్ది కొద్దిగా విదిల్చిన సంగతి మాత్రమే సీబీఐ కొద్ది కొద్దిగా బయట పెట్టగలుగుతోంది. మరి వైఎస్సార్ బ్రతికే ఉండిఉంటే కాంగ్రెస్ ఈ అక్రమాలని బయట పెట్టగలిగేదా? జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంటే సీబీఐ విచారణకు అనుమతించేదా? వైఎస్సార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పార్టీ నిధులెన్ని? పనిలో పనిగా సీబీఐ ఇదికూడా విచారించగలిగితే బాగుంటుంది. అక్రమాలని బయట పెట్టడం హర్షించవలసిన విషయమే. కానీ అది రాజకీయ కారణాలవల్ల జరగడం మ్మత్రమే బాగాలేదు. దేశంలో ఇప్పటికే దోపిడీలు పెరిగిపోయాయి. ఒకక్క సందర్భంలో ఒకక్క పార్టీ తల దించుకుంటునే ఉంది. దానికి తోడు న్యూస్ పేపర్ల మధ్య వైరం విసుగు తెప్పిస్తోంది. వ్యక్తిగత వైరంతొ అసలు విషయం దారి తప్పుతోందేమో అనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అంటే అక్రమాల పుట్ట అన్న అభిప్రాయం ప్రజలలొ కలుగుతోంది. అన్నా హజారే కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనే దీనికి రుజువు. కర్నాటకలో జరుగుతున్న సంఘటనలు బీజేపీ పైన ఉన్న భ్రమలు కూడా తొలగిస్తున్నాయి. ఒక చదువుకున్న వ్యక్తి, రాజకీయనాయకు కానివాడు ప్రధాని ఐయితే మంచి జరుగుతుందని అనుకున్న ప్రజల ఊహలు తారుమారయ్యాయి. మరి ఏమి ఏమి చెయ్యలి? న్యూస్ పేపర్లు చదవడం కూడా మనెయ్యాలా? చెడు వినకు, చెడు చదవకు. అప్పుడు లోకం ప్రశాంతంగా కనబడుతుందేమో!! ఫేస్‌బుక్‌లో పోస్టింగ్స్ చూసుకుంటూ ఫొటోలు అప్డేట్ చేసుకుంటూ కాలం గడిపేస్తే మంచిదా?
1 comment:
:)
Post a Comment