October 20, 2017

కడుపుమంటకు కారణాలు!!

ఊరందరిదీ ఒక దారైతె ఉలిపిరికట్టది మరో దారి అన్నది సామెత అని విన్నట్టు జ్గ్యాపకం. అందరిలా మనమూ ఉంటే ఎలా అని అనిపించినప్పుడు..మనల్ని ఎవరూ గుర్తించట్లేదు అనిపించినప్పుడు...జివితం లో కొత్తదనం కావాలి అనిపించినప్పుడు...జివితం మరీ సాదాసీదాగా పోతోంది అనిపించినప్పుడు... ఏదో ఒక చిలిపి చేయాలి అని అనిపించినప్పుడు....కడుపు మండినప్పుడు... తలలో నిషా ఎక్కినప్పుడు....పక్కవాడి పెరుగుదల మన మనసుని చిద్రం చేస్తున్నప్పుడు...మనమీద మనకే విసుగుపుట్టినప్పుడు... కళ్ళు మండి కడుపు మండి మెదడు చిట్లినప్పుడు...ఎవరో ఒకరిని దుమ్మెత్తి పొస్తే కాస్త మనసుకి శాంతి కలుగుతుంది. అది కూడ సెలబ్రటీనో లేక ఒక  కులాన్నొ దుమ్మెత్తి పొస్తే ఉండే ఆ కిక్కే వేరు. చేతి  దురద తగ్గేదక రాసెయ్యాలి, నోటి దూల తీరేదాకా వాగాలి. కంఠ సోష తగ్గేదాకా నిందలు వేయాలి. ఇక చూస్కో  సోషల్ మీడియాలో బోలెడు పబ్లిసిటీ, లత్కోర్ చానల్లో బోలెడు చర్చలు, పనికీమాలిన పేపరోళ్ళ పబ్లిసిటీ. మొబైల్స్‌లో,  వాట్సప్‌లలో,  రోడ్లమీద, కార్లమీద, ఆఖరికీ టాయిలెట్లలో కూడా బోలెడు పబ్లిసిటీ. నా భావ స్వేచ్చను హరించే హక్కు ఎవ్వరికీ లేదు. నన్ను కాదంటే నీలో ఏదో దురహంకారం ఉన్నట్టే. నీ ఛాందసవాదంతో నన్ను ఆపలేవు. ఇరోజు రాష్ట్రమంతా కాదు కాదు దేశమంతా నాగురించే చర్చ. నేను అనుకున్నది సాధించా. నేను అనుకున్నది సాధించా !!   రేపొమాపో ఏకో ఒక పార్టీ నన్ను తమలోకి  ఆహ్వానిస్తుంది. ఏందుకంటే నేను ఈరోజు వార్తల్లో వ్యక్తిని. నా చర్మం మందం. నా నాలుక మందం. నా బుద్ధి మందం. నా కళ్ళు చూడలేవు. నా మెదడు ఆలోచించదు. కుళ్లిపోయి కంపుకొడుతున్న భావ ప్రపంచంలో పొర్లాడడం నాకు ఆహ్లాదకరం. ఇదే నా ప్రపంచం!!           

February 25, 2014

కేసీఅర్‌ని చూస్తే ముచ్చటేస్తొంది!!

కాంగ్రెస్ అనుకున్నది సాధించింది.తెలంగాణాకు జైకొట్టి సీమాంధ్రుల నోట్లో మన్ను కొట్టింది. సరే వారి కోరికమేరకు విభజన చెసినా సీమాంధ్రుల భయాలకు తగిన ధైర్య వచనాలు కూడా చెప్పకుండా తోసిరాజు అనడం కేవలం ఒక్క సోనియాకే చెల్లింది. నాకు కేసీఅర్‌ని చూస్తే ముచటేస్తోంది. పార్టీ్‌కోసం తెలంగాణాకోసం సోనియాను ముప్పుతిప్పలు పెడుతూ తనకోర్కెలన్నీ తీర్చుకుంటున్న కేసీఅర్‌ని చూస్తే ముచ్చటేస్తొంది.   2014 సంవత్సరానికి ఉత్తమ ప్రజా నాయకుడు ఎవరు అని పోటీ పెడితే ఖచ్హితంగాం కేసీఆర్ అని తెలంగాణా ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు కూడా వోటు వేస్తారు. ఉత్తమ ప్రజా వ్యతిరేక నాయకుడు ఎవరా అని పోటీ పెడితే సీమాంధ్రలో చాలా మంది తన్నుకు చావాలి ఆ స్థానం కోసం. వీళ్ళ మొహాలు మండ.. వీళ్ళు ప్రజా నాయకులా? సిగ్గు శరం అనేవి వీళ్ళలో ఒక్కరికైనా ఇసుమైంతైనా లేవు. విభజనకు అడ్డుపడలేకపోయినా కనీసం సీమాంధ్రాకు కావలసిన వసతులు తెచ్చుకోవడంలో కూడా వీరు ఘోరంగా విఫలమయ్యారు. వ్యక్తిత్వం లేని అనామకులు, పార్టీకి బానిసలు, పదవికి ఈసులు. వచ్చిన అరాకొరా ప్రయోజనాలు కేవలం బీజేపీవల్ల వచ్చాయి. అదికూడా వెంకయ్య నాయుడువల్ల అనే చెప్పుకోవచ్చు. బీజేపీకూడా సీమాంధ్రులను వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. సుష్మా గారికి చిన్నమ్మగా పిలుపించుకోవాల్నే ముచ్చట వల్లే వారు ఎటువంటి షరతులు లేకుండా తెలంగాణాకు సై అనడం అద్వాణీని కూడా కలవరపరచింది. ఇదంతా సీమాంధ్రుల ప్రారబ్ధం. పార్టీలను అమ్ముకుంటూ, నోటికి నరం, ఒంట్లొ రక్తం, బుర్రలో గ్జ్యానం  లేని నాయకులను ఎన్నుకోవడంవల్ల జరిగిన విపరీతం. శ్రీకాకుళం పల్లెల్లో పెట్టిన 124 సెక్షన్ చెబుతుంది, ఈ నాయలుకు మనల్ని ఏంత కలవరపరిచారో. అక్కడి అల్లరులు చెబుతాయి మనల్ని ఈ నాయకులు ఏంత వంచించారో.   కానీ సీమాంధ్రులు కష్టపడేవారు. ఇదొక్కటి చాలు  మనల్ని మనం నిర్మించుకోవడానికి. ఇప్పుడైనా నోటుకోసం వోటు కాకుండా మన భవిష్యత్ కోసం వోటు వేద్దము. మనకోసం పనిచేయనివారి నడ్డి పగలగొడదాం. పదండి ముందుకు...!! జై ఆంధ్ర....జై తెలంగాణా !!    
       

June 15, 2012

హమ్మయ్య గెలిపించేశాం...ఓ పనైపోయింది!!



ఎలచ్చన్లు అయిపోయాయి...... అనుకున్నదే..ఎర్రిబాగులోళ్ళమంతా గన్‌బాబుని గెలిపుంచుకున్నాము. గన్‌బాబు ఇప్పుడు ప్రజాహోమంలోంచి నూతనంగా జనించిన  సత్శీలుడు. వారి తప్పులనీ ప్రజా "గుండం"లో కాలి ఒప్పులయ్యాయని అవి అస్సలు తప్పులేకావని సదరు పార్టీ వక్తలు చెప్పుకుంటు ఉంటే విని అవునని తలూపడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది లేదు. ఇక కాబోయే ముఖ్యమంత్రి వారేనని కూడా ప్రకటించారు. ఇది దేవుడి విజయమని అమ్మగారు చెపితే ఇది కేవలం అన్నగారి విజయమని సోదరి సద్దిచెప్పారు. ఇక ఈ విజయంతో కోర్టులో తప్పులన్నీ ఒప్పులుగా మారిపోతాయని, ఇక గన్‌బాబు బైటకి రావడమే మిగిలిందని ముగించారు. ఇవన్నీ పక్కనబెడితే ప్రబుత్వం పైన అపనమ్మకమే ప్రజలు వారిని పక్కనబెట్టారని చెప్పక తప్పదు. మీరు వందల కోట్లు కాదు వేలకోట్లు తిన్నా పర్వాలేదు కానీ మాకు తాగడానికి గుక్కడు నీళ్ళిస్తే చాలని, చచ్చిపోతుంటే మాకోసం ఒక నాలుగుచక్రాల ప్రభుత్వ వాహనం వస్తే చాలని, ఒకపూట తినడానికి నాలుగు గింజలు చాలని, ప్రస్థుత ప్రభుత్వం అది కూడా చేయట్లేదని ఎలుగెత్తి చెప్పేరు. మరి వారి మాటలు ప్రభుత్వ పెద్దలకు అర్ధమవుతాయా? కానీ గన్‌బాబు గెలిపించుకున్నవారితో లుకలుకలనుండి బైటపడడానికి ప్రభుత్వ పెద్దలతో ఒప్పందానికి వచ్చి,వారితో చేతులు కలిపితే...మళ్ళీ మనం ఎర్రిబాగులోళ్ళమే!!     



June 1, 2012

ఎక్కడో అక్కడ పడనివాడుంటాడా?


"లక్ష కి పడకపోవచ్చు, కోటికి పడకపోవచ్చు, కానీ వందకోట్లు ఇస్తానంటే పడనివాడుంటాడా?" ఇదో సినిమాలోని డైలాగు. సీబీఐ కోర్ట్ జడ్జి పట్టాభిగారి విషయంలో ఇదే జరిగి ఉంటుందా? ఆయన లాకర్లలో దొరికిన డబ్బు కూడా కొంత అనుమానాల్ని దృవీకరిస్తోంది. సుడిగాలి బ్రదర్స్ ( గన్ & గాలి) హస్తవాసి అంత మంచిది కాదని స్పష్టమౌతోంది. వారి చేతిలోంచి ప్రసాదాలు పొందినవాళ్ళెవ్వరూ కూడా సుఖంగా లేరు. చాలామంది జైలుపాలయారు. కొత్తగా మరో వికెట్, అనుకోని వికెట్. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని... వీళ్ళు మింగడమే కాకుండా జనాల్ని ప్రలోభ పెడుతూ వారిని కూడా ఇరకాటంలో పెడుతూ పార్టీల పరువు, కోర్టుల పరువుకూడా తీస్తున్నారు. ఇప్పటికే ఐయేస్ ఆఫీసర్లంటే చులకన భావం వచ్చేసింది. ఇక జడ్జీలకు ఆ పరిస్తితి వస్తే మారింత ప్రమాదకరం. కాబట్టి వీళ్ళని వీఐపీలగా గాక అత్యంత ప్రలోభ పరచలగల వ్యక్తులుగా గుర్తించి  వీరి చాయలకు ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది? 

May 29, 2012

ఎర్రిబాగులోళ్ళు !!





సీబీఐ ఒక యువకుడిని, కాబోయే ముఖ్యమంతిని అరెస్ట్ చేయించింది. ఏంత అన్యాయం? కక్షగట్టి ఒక తండ్రిలేని పిల్లవాణ్ణి కటకాలపాలు చేస్తారా? ఒక ఆశయంతో  బుద్ధిగా ఎన్నికల్లో పోటిచేసి ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్న ఒక యువకిడిని చెరసాలపాలు చేస్తారా? వారి తండ్రి సెజ్‌ల పేరుతో రైతుల భూముల లాక్కుంటే మాత్రం, వేల కోట్లు సంపాదించుకుంటే మాత్రం అలా జైలుపాలు చేయడం సహించం. జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించినా, హంసతూలికా తల్పంపై శయనించే ఆయన, అలా ఒంటరిగా జైలు బారాక్‌లో ఒంటరిగా ఉండడం హృదయవిదారకంగా ఉంది. మా మన్సులు సున్నితమని ఎవరు తెలుసుకుంటారు? ఆయనకు ఒక్కరోజు జైలు శిక్ష అంటే మాకు జీవిత శిక్ష. మా ప్రాణాలు తృణప్రాయంగా ఆయనకోసం వదులుకుంటాం. ఆయన వేలకోట్లు కాదు లక్షల కోట్లు సంపదించుకున్నా మేము పట్టించుకోం. ఆయన సుఖంగా ఉండాలి. మేము బాగుపడకపోయినా, మా జీవితాలు బుగ్గిపాలైనా వారిని కష్టబెట్టడం మేం సహించం. మేము ఎల్లవేళలా కష్టాల్లో ఉండాలి, వారు వచ్చి మమ్మల్ని ఓదార్చాలి. వారిని అరెస్ట్ చేస్తే కొన్ని పేపర్‌వాళ్ళకెందుకు అంత సంబరం? ఆయన కష్టాల్లో ఉంటే అయ్యో అనాల్సింది పోయి రాత్రి నిద్దుర పోలేదు , ఉదయాన్నే బ్రెడ్ తిని పాలు తాగారంటూ చానల్స్‌లో వార్తలెందుకు? నయ్యం అంతటితో ఆగేరు. ఎవరు ఎవర్ని దోచుకున్నా మాకు బాధ ఉండదు కానీ వాళ్లు కష్టాలపాలు కావడం మేము సహించం. మేము సున్నిత హృదయులం. వారు బాగుండాలి.  మా ఓటు తప్పకుండా వారికే!!     


    

May 24, 2012

బుర్ర పగిలిపోతోంది బాబోయ్!!

కొంత కాలంగా తెలుగు న్యూస్ చానల్స్ అంటే విసుగొచ్చింది. పేపర్ మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు న్యూస్ పేపర్ అన్నా విసుగొస్తొంది. జగన్ అరెస్ట్ అవుతాడా? ఎప్పుడవుతాడు? ఆయన ఆస్తుల్ని జప్తు చేస్తారా? ఆయనకు  అన్ని ఆస్తిపాస్తులు ఎలా వాచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వానికి తెలియదా? ఆస్తులని కూడబెట్టడం వైయెస్సార్ ఉన్నప్పటినుండీ ఉన్నదని ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదా? అంతా తెలుసు. అది అందరికి తెలుసు. ఇలాంటివాళ్ళు కాంగ్రెస్‌లో మరెవ్వరూ లేరా?    వారు పోగేసుకుంటూ చుట్టుపక్కలవారందరికీ కొద్ది కొద్దిగా విదిల్చిన సంగతి మాత్రమే  సీబీఐ కొద్ది కొద్దిగా బయట పెట్టగలుగుతోంది. మరి వైఎస్సార్ బ్రతికే ఉండిఉంటే కాంగ్రెస్ ఈ అక్రమాలని బయట పెట్టగలిగేదా? జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంటే సీబీఐ విచారణకు అనుమతించేదా?  వైఎస్సార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పార్టీ నిధులెన్ని? పనిలో పనిగా సీబీఐ ఇదికూడా విచారించగలిగితే బాగుంటుంది. అక్రమాలని బయట పెట్టడం హర్షించవలసిన విషయమే. కానీ అది రాజకీయ కారణాలవల్ల జరగడం మ్మత్రమే బాగాలేదు. దేశంలో ఇప్పటికే దోపిడీలు పెరిగిపోయాయి. ఒకక్క సందర్భంలో ఒకక్క పార్టీ తల దించుకుంటునే ఉంది. దానికి తోడు న్యూస్ పేపర్ల మధ్య వైరం విసుగు తెప్పిస్తోంది. వ్యక్తిగత వైరంతొ అసలు విషయం దారి తప్పుతోందేమో అనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అంటే అక్రమాల పుట్ట అన్న అభిప్రాయం ప్రజలలొ కలుగుతోంది. అన్నా హజారే కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనే దీనికి రుజువు. కర్నాటకలో జరుగుతున్న సంఘటనలు బీజేపీ పైన ఉన్న భ్రమలు కూడా తొలగిస్తున్నాయి. ఒక చదువుకున్న వ్యక్తి, రాజకీయనాయకు కానివాడు ప్రధాని ఐయితే మంచి జరుగుతుందని అనుకున్న ప్రజల ఊహలు తారుమారయ్యాయి. మరి ఏమి ఏమి చెయ్యలి? న్యూస్ పేపర్లు చదవడం కూడా మనెయ్యాలా? చెడు వినకు, చెడు చదవకు. అప్పుడు లోకం ప్రశాంతంగా కనబడుతుందేమో!! ఫేస్‌బుక్‌లో పోస్టింగ్స్ చూసుకుంటూ ఫొటోలు అప్డేట్ చేసుకుంటూ కాలం గడిపేస్తే మంచిదా?  

September 23, 2011

వీళ్ళిద్దరు!!

సకల జనుల సమ్మె బాగానే సా..గుతోంది. జనాన్ని మూకుమ్మడిగ ఎలా ముంచచ్చో పులకేసికి తెలిసినంతబాగా మరెవ్వరికీ తెలియదు. ఎవరి చేత్తో వారికే వాతలు పెట్టుకోవడం చక్కగా నేర్పిస్తున్నాడు. వీరికితోడు నత్తి సత్తిబాబు, ఎల్కేజీ టీచర్. ఇకపై మిలటెంటు కార్యక్రమాలు మొదలు పెట్టాలిట. పైగా గాంధీజి కూడా మిలటెంట్ కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. అంటే తనని తాను గాంధిజితో పోల్చుకుంటున్నాడేమో? ఖర్మ. మొత్తం మీద చాలావర్గాల్ని సమ్మెలో భాగస్తులని చేశారు. మొదటగా టీచర్లని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో మొట్టమొదటి ఏబ్రాసులు వీళ్ళే(ప్రాంతీయ బేధం లేకుండా). అత్యంత తక్కువ సమయం పని చేస్తూ మొత్తం కాలానికి జీతం తీసుకొనే ఒక వర్గం. ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు కేవలం చులకన, అసహ్యం(క్షమించాలి తప్పదు). ఇక తరువాత రెవెన్యూ తదితర విభాగాల ఉద్యోగాలు. వీరిలో ఎంతమంది బల్లకింద చేతులు పెట్టకుండా పని చేస్తారంటారు? ఎన్ని కధలు వినలేదు, ఎన్ని సినిమాలు చూడలేదు. అందులో సెక్రటేరియట్. వీరి నాయకుడు ప్రభుత్వాన్ని వందసార్లు ఉరి తీయాలని అన్నారు. పిల్లి గుడ్డిదైతే అన్న సామేత గుర్తుకొచ్చింది. మిగిలిన వారిలో ఒకటో తారీకుకి జీతాలు రాకపోతే ఎంతమంది తాట్టుకోగలరో తెలియనిది కాదు. ఇక అసహ్యకరంగా పురోహితులు, డాక్టర్లు సమ్మె చేయడం. వీళ్ళకి ఏమి పోయికాలం వచ్చింది. సర్వే జనాహ్ సుఖినో భవన్‌తు అని ఆకంక్షించే వర్గం దేవుడి ధూప దీప నైవేద్యాలు మానేసి క్రికెట్ ఆడడం!! అది ఖచ్చితంగా విపరీత పోకడలే. పోయేకాలం దాపురించినవాడికి మంచి చెడు తెలియదు అన్నట్టు ఉంది వీరి తీరు. భగవంతుడి తరువాత అంతటి స్థానం డాక్టర్లది. ముక్కుకి మసి రాసుకొని ఎప్పుడు సమ్మె చేద్దామని ఎదురుచూసే సిబ్బంది హైదరాబాదు ప్రభుత్వ డాక్టర్లు. డ్యూటీలు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీసు చేసుకోడానికి మంచి తరుణం. మొత్తం మోద వీళ్ళందరూ యుద్ధం ప్రకటించింది తెలంగాణా ప్రజలమీద. వాతలు పెడుతున్నది తెలంగాణా ప్రజల వంటిమీద. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నది తెలంగాణా ప్రజలే. ప్రత్యేక రాష్ట్రం వస్తే భూతల స్వర్గమే అంటూ అందరినీ నమ్మించిచ ఘనత పులకేసిదే. నిజమేగాబోలు అనుకొని ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఎలా ముగుస్తుందో మరి?

March 10, 2011

మీడియా మితృల గొంతులో పచ్చి వెలక్కాయ!!

మిలీనియం మార్చ్ మొత్తం మీద అయింది. పదిలక్షల మంది కాకపోయిన వేలమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మార్చ్ చేద్దామనుకున్న వారికి కుదరక పరుగులు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చాలా సంయమనంతోనే వ్యహరించారని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యహారమే ఎవ్వరికీ మింగుడుపదలేదు.కేకేకి గానీ తెలంగాణా తరప;ున పూర్తిగా వకల్తాపుచ్చుకొని వాదిస్తూ వచ్చిన మధు యష్కీగానీ బిత్తరపోయుంటారు. జేపీ పై దాడిజరిగినప్పుడు తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు సహించరని చెప్పిన ఈయన మరి తెలంగాణాకు వ్యతిరేకంగా ఏమి మట్లాడాడో ఆయనే చెప్పాలి. "పిత్తు మింగిన దాసరి"లాగ గమ్మున ఉండడం తప్ప ఏమి చేయలేని పరిస్తితి. తనపై దాడి జరిగింది కేవలం తెలంగాణాపై అభిమానంతొనే అని కేకే చెప్పుకొచ్చారు పాపం. మరికొందరు వీర భక్తులు ఈ దాడివెనుక కుట్ర (సీమాంధ్రా వారిదా?) ఉన్నది అని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అసలే కోతి అందులో కల్లు తాగిందన్నట్టు టాంక్ బండ్ పైకి చేరిన వారికి తోడుగా తెరాస కార్యకర్తలు(?) చేరడంతో వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది. మీడియా సాక్షిగా వారు చేసిన విధ్వంసానికి సభ్య సమాజం (ఇక్కడ ఉంటే) తల వంచుకోవాల్సిందే. వారు చేసింది తప్పు అని చెప్పే దమ్ము ఒక్కరికీ లేదు కేవలం దురదృష్టం అనడం తప్ప. వారి మూర్ఖత్వాన్ని పెంచి పోషించిన మీడియా కి కూడా భంగపాటు తప్పలేదు. దాదాపు ఇరవైఐదు కెమేరాలు అవి బీటాకెం ఎక్విప్మెంట్ అయితే ఒక్కొక్క కెమేరా కనీసం రెండు లక్షలకు తక్కువ ఉండదు. ఇవి కాకాక ఒక ఓబీ వేన్, మొత్తం డబ్బై లక్షల నష్టం. ఈ ఘటన కొంతమంది జర్నలిస్టు మితృలకి కూడా పండగే.కానీ ఈ దాడివల్ల వచ్చే వ్యతిరేకత వారిని కలవర పరుస్తోంది. పోలీసులు తమ మార్చ్‌ను అడ్డుకోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని గద్దరు సారు సెలవిచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా 81;ద్యమాన్ని ఆపలేరని ఎప్పటిలాగే మరోసారి సెలవిచ్చారు. మొత్తంమీద్ద పదిలక్షలమంది రాకుండా ఆపేమని పోలీసులు, ఎలాగైనా మార్చ్ చేసామని "వాదులు" అనుకొని సంబరపడ్డారు. మీడియా మాత్రం తమపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎప్పటిలాగే గొంతు చించుకుంటోంది. జరగబోయేది షర మామూలే!!

February 18, 2011

చిల్లర నాయకులు..!!


నోరు విప్పితే గబ్బు...మాట్లాడితే మాయమాటలు...జనాల అమాయకత్వంతో ఆటలు...ప్రజల మనోభావాల మాటున కపట రాజకీయాలు....ఆశయాల సాధన పేరుతో అక్రమ సంపాదన...ఇది గులాబీల వికృత చేష్టలు. దీనికి వారు పెట్టుకున్న మరో ముద్దు పేరు "మా సంస్కృతి". అసెంబ్లీ సాక్షిగా వీరి వికృతి హేల నిన్న హద్దులు దాటింది. గవర్నరు పై దాడిని జరిగిన తరువాత వారి చర్యను ఖండించబోతే జేపీకి జరిగిన అవమానానికి యావత్ మీడియా సాక్షిభూతంగా నిలిచింది. వారి చర్యలను ఆపబోయిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ చర్యను యావత్ మీడియా తమ కెమేరాలలో బదిస్తూ చోద్యం చూస్తూ ఉంటే మరికొందరు జర్నలిస్టులు నవ్వుకుంటూ ఆ వికృత హేలను ఆనందించడం స్పష్టంగా కనబడింది. మట్టిగొట్టుకుపోతున్న విలువలకు అసెంబ్లీ వేదిక కావడం మరో దురదృష్టం. ఈ చర్యను ప్రభుత్వం ఖండించి ఊరుకుంటుందా? దాడిచేసిన వారినే కాదు దాడికి ప్రోత్సహించిన వ్యక్తులను జీవిత కాలం పాటు ఎన్నికలలో పోటికి అనర్హులుగా ప్రకటించాలి. వారిని దోషులుగా ప్రకటించి శిక్ష విధించాలి. సహాయ నిరాకణలో పాల్గొని సుస్పేండైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాష్ట్రంలో ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించిన చిల్లర నాయకుల మాటలకు భ్రమపడితే జరిగేది బిక్షాటనే. బూతద్దంపెట్టి వెదికినా వీరిలో విలువలు పాటించే వ్యక్తి ఒక్కరైనా కనబడతారా అన్నది అనుమానమే. ఇప్పటివరకూ చక్కటి వాక్పటిమతో హుందాగా ప్రవర్తించిన రేవంత్ రెడ్డి లాటి యువ నాయకుడు కూడా వీరిలో చేరడం దురదృష్టకరం. కుళ్ళిన శవాలకోసం రాబందులు సృష్టించబోయే వికృత ప్రళయానికీ ఇది ఒక సంకేతమా? వీరి చేతికి అధికార పగాలు ఇస్తే జరగబోయేది వినాశనమే గానీ మరొకటి కాదు. జేపీ గారికి నా సంపూర్న మద్దతు తెలుపుతున్నాను. జేపిపై దాడి చేసి గులాబీలు వారి చితికి వారే నిప్పు పెట్టుకున్నారు.


February 16, 2011

శూర్పణకకి సీతపై అసూయ సహజమే!!




దశరధమహారాజు ఒకానొక సమయంలో కైకకి ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించమని శోకమందిరంలో ఉన్న కైక కోరుతుంది. వాగ్దానం ప్రకారం కైక కోరికలు దశరధుడు మన్నించాలి. భరతుడికి పట్టాభిషేకం చేయడం ఒకటైతే మరోటి శ్రీరాముడిని అడవులకు పంపివేయడం. ఆమె మాట ప్రకారం సీతారాములు అడవికి బయలుదేరుతారు. వారితోబాటోబాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. నార దుస్తులతో వారు అడవికి బయలుదేరుతారు. నారబట్టలు కట్టుకోవడం సీతాదేవికీ రాకపొతే శ్రీరాముడు ఆమెకు సహాయపడతాడని రాసి ఉంది.అంటే భార్య భర్తలు ఎలా ఒకరికొకరు సహయాం చేసుకోవాలో తెలియచేయడానికి వ్రాసిన విషయం. అలాగే వారి ప్రేమ అలౌకికమైనది. ఒకరంటే మరొకరికీ ఉండే ప్రెమ అభిమానం, రాముడిపట్ల సీతకుండే భక్తి తత్వం, సీతా రాముల అంద చందాలు చూసి రావణుడి చెల్లెలు శూర్పణకకి కన్నుకుడుతుంది. ఎలాగైన రాముడిని మనువాడాలని ఎన్నొ ప్రయత్నాలు చేస్తుంది. ఆ అసూయే సీతపట్ల ద్వేషభావం పెరగడానికి కారణం. వారిద్దరినీ ఎలాగైనా వేరుచేయాలన్న ప్రయత్నంలో లక్ష్మణుడి చేతిలో భంగపడి రావణుడిని రెచ్చగొడుతుంది. వారిద్దరూ వెరైతే రాముడు తనకు దక్కుతాడని ఒక పిచ్చి నమ్మకం. దానివల్లే సీతాపహరణం, రామ రావణుడి యుద్ధం అందరికీ తెలిసిందే.

కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియనీ విషయం ఆనాటి శూర్పణక ఆంధ్ర దేశంలో మళ్ళీ జనియించి ఈనాడు సీతా రాములపై బ్లాగుల్లో దుష్ప్రచారం చేయడం. అందగాడైన రాముడు ఆమెకు దక్కకపోవడం ఆమెలో నిసృహకి కారణం ఒకటైతే, సీతవల్ల తన అన్నగారైన రావణుడు చనిపోవడం మరో కారణం. కాబట్టి రాక్షస జాతికి చెందిన ఆమెకు సీతారాములతో వైరం రావణుడిపట్ల ప్రేమ సహజం. ఆనాటి శృంగభంగాన్ని మర్చిపోలేక సీతని మా అన్న ఏదో చేసాడని, వారిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని, రాముడికి సీతపై ప్రేమ లేదని అందువల్లే వదిలివేశాడని పిచ్చిరాతలు రాసుకుంటూ ఆనాతి శూర్పణక ఈనాడు తృప్తి పొందుతోంది. కాబట్టి రామయణాన్ని అభిమానించే వారెవ్వరూ ఆ రాతలను పట్టించుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.



February 7, 2011

క్లారిటీ అనేది మన అభిప్రాయంలో ఉండాలి మిత్రమా!!



బ్లాగులో రాతలు తీటలాంటిదే. మనం గొప్ప అనుకున్న అభిప్రాయాన్ని మనం రాసుకుంటే తీరిక ఉండి బ్లాగులొకి తొంగిచూసినోడు నచ్చితే "ఆహ!" అంటాడు లేకపొతే "యాహ!" అంటాడు. మన అభిప్రాయాలు కొద్దిగ అతిగా, తిక్కతిక్కగా అనిపిస్తే, ఎదుటివాళ్ళని రెచ్చగొట్టేల ఉంటే చదివినవాడు మనల్ని గిచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఇది మాటలవరకే ఐతే పర్వాలేదు, శృతిమించి వ్యక్తిగత ధూషణలకు వెళ్ళడం మాత్రం అర్ధం లేనిని, భరించలేనిది. సత్తయ్య మంచివాడు అంటే తెలిసినవాళ్ళు అవును అనుకుంటారు, తెలియనివాళ్ళు అవునేమో అనుకుంటారు. కానీ జగమెరిగిన "మీడియా" చెడ్డది అందులో పనిచేసేవాళ్ళు చాలా మంచోళ్ళు అంటేనే తంటా మొదలవుతుంది. మంచోళ్ళు అందరూ కలిసి మీడియాని బాగుచేయచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ వెలుబుచ్చుతున్న అభిప్రాయమేమిటంటే "మీడియా"లో ఉన్న పెట్టుబడిదార్లు దొం.నా.కో లు పనిచేస్తున్న జర్నలిస్టులంతా మంచోళ్ళు అని. ఇక్కడ విషయం ఎక్కడికెళ్ళిందంటే ఆంధ్రా తెలంగాణా అంశానికి దారితీసింది. మీడియాలో పెట్టుబడిదారులలో చాలామంది ఆంధ్రావాళ్ళే. కాబట్టి ఆంధ్రావాళ్ళని విలన్‌లని చేస్తూ ఇక్కడి జర్నలిస్టులను హీరోలను చేసే ప్రయత్నం ఒకటైతే, హోల్ మొత్తం మీద పెట్టుబడిదారులను ఒకవర్గం చేసి వాళ్ళు చెడ్డోళ్ళు అనేసి "జర్నలిస్టు" అంటేనే చానా మంచోడు అనడం రెండో మాట. కానీ ఒక సామాన్యుడి దృష్టిలో మీడియా అంటే మీడియా. కాబట్టి పైన రెండు స్టేట్‌మెంట్లు తప్పే. దొంగతనం చేసినవాడు జర్నలిస్టైనా వాడిని కూడా దొం.నా.కొ అనగలిగి జర్నలిస్టులలోనూ దొంగలున్నారు అని చెప్పగలిగే సత్తా ఉండాలి. అప్పుడే మన రాతల్లో నిజాయితీని ప్రజలు (బ్లాగు చదివినవాళ్ళు) గుర్తిస్తారు. ఇక ఎవరో అనామకుడు పిచ్చిరాతలు రాస్తే దానికి మీ సొంతపేరుతో ఫోన్ నంబర్లు ఉంచి మీడియా మీద రాతలు రాయండి మీకు తెలుస్తుంది అనడం, మాఫియాగా వర్నించడం ఎవరిని భయకంపితుల్ని చేయడానికో మరి. అందరూ ఒకతానులో గుడ్డలే. ఎవ్వరూ తక్కువ తినలేదు. ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటారన్నది జగమెరిగిన సత్యం. మీ పోరాటం అన్యాయంమీదైతే జర్నలిస్టుల్లోనూ దొంగలున్నారు అని ప్రకటించి వారిని కూడా బైటపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వవిస్తారు.

ఒకరి అభిప్రాయాలు నచ్చక్పొతే వ్యతిరేకించవచ్చుగానీ వ్యక్తిగత ధూషణలు చేయడం మాత్రం ఎవ్వరూ హర్షించరు. వాటిని మనమందరమూ ఖండించాలి.



November 28, 2010

ఖరీదైన కూలీ !!

మా అపార్ట్‌మెంట్లో సెక్రటరీ ఒక నిర్నయం తీసుకున్నాడు. ఫ్లాట్లలో ఉండే కార్లను ఇకనుండీ వాచ్‌మెన్ తుడవడని. ఎందుకంటే కార్లు తుడవడంవల్ల ఎక్కువ సమయం దానికే పోతే అసలు పనులు చేయడానికి వాచ్‌మెన్ కి సమయం చాలట్లేదని. ఏమి చేస్తాము? ఎవరినైన మరొకరిని వెతికిపెట్టమని వాచ్‌మెన్‌కె అప్పచెప్పాను. ఒకరోజు ఉదయాన్నే వాచ్‌మెన్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చాడు. సార్ ఇయన కార్లు శుబ్రం చేస్తాడుట. కార్లు ఉదయాన్నే శుబ్రం కూడా చేశాడు. అన్నాడు. అతనితో అన్నాను "సరే నెలకు ఎంత ఇమ్మాంటావు?" అని. "నెలకు కాదు, ఈ ఒక్కరోజే తుడుస్తాను. ఇవ్వాళ తుదిచినందుకు పది లక్షలు ఇవ్వాలి" అన్నాడు మెడలోని కండువా సర్దుకుంటూ. నా చెవులను నమ్మలేక "ఎంత అన్నావు?" అన్నాను. "అక్షరాల పది లక్షలు" అన్నాడు. నా కారు విలువే ఐదు లక్షలు ఉండదు. దానిని ఒకసారి తుడిచినందుకు పది లక్షలా? మా వాచ్‌మెన్ కేసి అయోమయంగా చూశేను. వాచ్‌మెన్ అన్నాడు" అవును సారు ఆయన గొప్పనాయకుడు. అదేదొ పనికోసం చందాలు వసూలు చేస్తున్నడంట". "ఐతే మాత్రం కారు తుడిస్తే పదిలక్షలా? కావాలంటే వంద రూపాయలిస్తాను" అన్నాను. దానికి అతను కొపంగా" ఇక్కడ తిరగాలంటే పది లక్షలు ఇవ్వాల్సిందే" అంటూ వెనుతిరగబోయేడు. ఈ సంభాణ వెనకనుండీ వింటున్న మా ఆవిడ ఖంగారుగా నాతో" ఆయనతో గొడవెందుకండీ మీరు అప్పుచేసి ఇవ్వగలిగినంత ఇస్తానని చెప్పండి" అన్నది. నేను ఆయన వెంట నడుస్తూ నా బాంక్ బాలెన్స్ క్రెడిట్ కార్డులు అన్నీ చూపించి నా తాహతు ఆయను తెలియచెప్పి ఒక అంకె చెప్పాను. ఆయన అన్యమనస్కంగా ఒప్పుకొని నేని ఇచ్చిన చెక్కు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మిత్రులెవరైనా కొత్త పనివారిని పెట్టుకొనేముందు కాస్త తెలుసుకొనె మసలుకోండి. వచ్చింది మరెవరో కాదు..తెలంగాణా పులకేశి!!

August 31, 2010

ఆయన వీసినా? వీళ్ళు లెక్చరర్లా?

ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు వీసీకి కూడా మెదడు అరికాలినుండీ మోకాలుకు చేరిపోయిందదని అనిపిస్తోంది. ఎందుకంటే జరిగిన దానిని తప్పు అని చెప్పే దమ్ము లేకపోయినా, వారిపై చర్య తీసుకునెందుకు మనసు రాకపోయినా పర్వాలేదు, కానీ దీనిని మీడియా దుశ్చర్య అని మీడియా అనవసర ప్రచారం చేసిందని చెప్పడం సిగ్గుమాలిన తనం. తెలంగాణా గొడవల్లో కూడా మీడియా అదే పాత్రను పోషించింది. సదరు వీసీని ఎవరైనా చెప్పులతో సత్కరించి ఉంటే వీరికి అభిమానం అంటే ఏమిటో తెలిసి ఉండేది. పైగా విద్యార్ధులకు నష్టం జరగకుండా వీరు చూస్తారుట. అంటే దీని అర్ధం ఆంధ్రా ప్రాంతం నుండీ వచ్చిన లెక్చరర్లు వీరికి నష్టం కలుగ చేశారనా వీరి ఉద్దేశ్యం? తోటి లెక్చరర్లను చెప్పులతో కొడితే సానుభూతి తెలపవల్సింది పోయి విద్యార్ధులపై కేసులనెత్తి వేయాలని అక్కడి లెక్చరర్లు ఆందోళన చేశారట. వీళ్ళు లెక్చరర్లా? వీళ్ళ బతుకులు చెడ! వీసి పదవికి, లెక్చరర్ మాటకి తలవంపులు తీసుకు వచ్చారు. ఇంతకన్న వెధవలు ఉండరేమో? చదువుకున్నవాళ్ళే ఇలా చస్తే, చదువు లేనివాళ్ళు మరింత మూర్ఖంగా ప్రవర్తించడం పెద్దవిషయం కాదేమో? ఇది కేవలం కాష్టాని రగిలించడానికి చేసిన ప్రయత్నమేగానీ మరోటి కాదని అనిపిస్తోంది. దానిలో కిరాయి విద్యార్ధులతోబాటు లెక్చరర్లు చేరడమే మారుతున్న విలువలకు నిదర్శనం.

August 26, 2010

బ్లాగర్లూ జర జాగ్రత్త !!

తెలుగు భాషాభివృద్ధికోసం బ్లాగర్లంతా "తెలుగు బాట" కార్యక్రమం చేబట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. గిడుగు రామ్మూర్తిగారి జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని చేబట్టడం మరింత ఆనందించాల్సిన విషయం. నాక్కూడా ఆరోజు బ్లాగర్లందరితోనూ పాల్గొని నేనేగాకుండా మరింతమందిని తీసుకురావాలని ఉంది. కానీ కొంతమంది వక్రదృష్టి దీనిమీద పడుతుందేమో అనే సందేహం కలుగుతోంది. మొదటిది తెలుగుభాష అంటే "తెలంగాణా తెలుగా?" లేక "ఆంధ్రా తెలుగా?" అనేది మొదటి సందేహం. మరి ఏ తెలుగుభాషో తెలియకుండా నేనెలా పాల్గొనేది? రెండూ ఒక్కటే అని మీరంటే నాకేమాత్రం అభ్యంతరం లేదుసుమండీ! కానీ అంతా ఒక్కటే అంటే మరి మా తెలంగాణా పులకేసి ఒప్పుకుంటాడా? కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాడా? పైగా కార్యక్రమం మొదలుపెట్టేది తెలుగు తల్లి విగ్రహం నుండి. అదే తెలంగాణా తల్లి విగ్రహంనుండి ఐతే మా పులకేసికి అభ్యంతరం ఉండదేమో బ్లాగర్లంతా ఆలోచించాలి. దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇదికూడా సమైక్యవాదుల కుట్ర, తెలుగు భాష ముసుగులో వీరంతా తెలంగాణా వ్యతిరేకంగా ఉద్యమం చేబడుతున్నారంటూ దాడిచేస్తేమాత్రం నా భాద్యత లేదు. కాబట్టి బ్లాగర్లంతా తగుజాగ్రత్తలతో "తెలుగు బాట"లో పాలొనాలని నా విన్నపం.

June 9, 2010

మీడియా, జర్నలిస్టులు వేరు వేరుట !!


దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనేది ఒకప్పటి మాట. చానల్స్ చానల్స్ ఊళ్ళు పంచుకోవడం అనేది ఇప్పటి మాట. దొంగల ఆగడాలు కొంతవరకు పోలీసులు అరికడతారు. ప్రభుత్వ ఆగడాలను ప్రతిపక్షాలు అరిచి అడ్డుకుంటాయి. కాని మీడియా ఆగడాలను ఆపడం ఎవరి తరము కాలేదు. కానీ ప్రజల అదృష్టం కొద్దీ వారి ఆగడాలు వారే బైట పెడుతున్నారు. ఆ మధ్య రెండు చానల్స్ ఒకరిపై ఒకరు ప్రత్యక్ష వాదోపవాదనలు చేసుకుంటూ ఒకరు చేసిన ఆగడాలను మరొకరు బైటపెడుతూ మీడియా ముసుగు తొలగించి ప్రజలముందు నగ్నంగా ఆవిష్కరించారు. మీడియా అంటే ప్రజలలో ఉన్న భ్రమలు తొలగేటట్టు చేసారు. కాని ఇలాటి సంఘటనలు కొంతమంది మీడియా మితృలకు బ్లాగు మిత్రులకు కూడా మింగుడు పడలేదు. తరువాత జర్నలిస్టుల మధ్య జరిగిన వాదనలు కూడా దొంగలు దొంగలు ఒకరినొకరు బైటపెట్టుకుంటే ఎలా, ఇది మంచి విధానం కాదు అన్న పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు బ్లాగుల్లో మీడియా అంటే ఒకటి కాదన్నట్టు ఉంటున్న వారి వాదనలు ఆశ్చర్యం కలగ చేస్తోంది. జర్నలిజంలో యాజమాన్యం ఒక వర్గముట. వాళ్ళు పెట్టుబడిదారులుట. పేపర్లు నడిపేది డబ్బున్న మారాజులేగానీ ధర్మరాజులు కాదని ఇప్పటివరకు వీరికి తెలియదా? ఒక్కక్క జర్నలిస్టుకు అక్షారాలా ముప్ఫైవేలనుండీ యాభైవేలవరకూ జీతభత్యాలు చెల్లించాలంటే అది డబ్బున్నా మారాజులవల్లే అవుతుంది. ఇక జర్నలిస్టులలో రెండో వర్గం యాజమాన్యం కొమ్ము కాసే వర్గమట. వీరు కూడా అసలైన జర్నలిస్టులు కాదుట. పెట్టుబడి పెట్టే యజమాన్యం తమకనుకూలమైనవారికే పగ్గాలు అప్పచెపుతుందని తెలియని అమాయకులా వీరు? తమను ఎండకడుతూ తమకు వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తినీ ఏ సంస్థా భరించదని వీరికి తెలియదా? మీడియా అనేది ఒక వ్యాపార సంస్థే అని ఎప్పుడో నిర్నయించబడింది. దానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. అటువంటప్పుడు ఈ నీతి సూత్రాలెందుకు? ఉద్యోగం కావాలంటే యాజమాన్యం చెప్పింది చేయాలి. అది మీడియా అయినా మరేదైనా ఒక్కటే. జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియని దశలో ఒకరు తమ బ్లాగుల్లో రాసుకున్న రాతలను గొప్ప స్వేచ్చా భావాలు అంటూ అకాశానికెత్తి పొగిడితే జరిగే మేలు ఏమీ ఉండదు. ఆమెకు మరికొంత నష్టమే తప్ప. వీరు రాసే ప్రతీ రాతల్లోనూ జర్నలిస్టుల తప్పు ఏమి లేదనడం, దానికి బాధ్యత యాజమాన్యానిదో, లేక వారి కొమ్ము కాసే భజనపరులదో అనడం హాస్యాస్పదం. మీరంతా ఒకే తానులో గుడ్డలే అనడంలో ఎవ్వరికీ ఏమాత్రం సందేహం ఉండదు. మనం రాసే రాతలను జనం పూర్తిగా విశ్వశిస్తారు అనుకోవడం కూడా ఒక భ్రమే. అన్యాయం ఎక్కడ జరిగినా ఖండించాలి. దానికి వారు వీరు అనే తారతమ్యాలు ఉండకూడదు. వాళ్ళు జర్నలిస్టులైనా మరెవరైనా. స్వచ్చత అనేది మనుషుల్లో ఉండాలి, అది కేవలం వృత్తిలోనే వస్తుంది అనుకోవడం గొప్ప పొరబాటు. జనం దృష్టిలో మీడియా అంటే మీడియానే. యాజమాన్యం, భజనపరులు, స్వేచ్చాభావాలుగల జర్నలిస్టులు అంటూ ఉండరు. ఇలాటి వర్గాలు అన్ని సంస్థల్లోను ఉంటాయి. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలి, పక్కవారిపైనెట్టి నేను స్వచ్చమైనవాడిని అంటే జనం ఒక్కసారే నమ్ముతారు.

ఇక స్వామీజీల విషయానికి వస్తే ప్రజల నమ్మకాన్ని కొంతమంది స్వాములు సొమ్ము చేసుకుంటున్నారన్నది నిర్వివాదాంశం. కొంత ధర్మ ప్రచారం జరిగినా సంపాదనే వారి లక్ష్యం. వారి సాంపాదనలో రాజకీయ నాయకులు,మీడియా కూడా వాటాలు పొందుతారన్నది కొంత నిజం. నాకు తెలిసి ఒక పెద్ద స్వామిజీ తాను అవతారమెత్తిన కొత్తల్లో ప్రచారం కోసం, కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులకు బంగారపు గొలుసులు, ఉంగారాలు ఇచ్చేవాడని ఒక పెద్దాయన చెప్పేడు. నేను కలిసిన ఒక డబ్బున్న భక్తురాలు (ఆమె లెక్చరర్) తనకు నెల నెలా వచ్చే ఇంటి అద్దెల ఆదాయమంతా తన భర్తకు కూడా తెలియకుండా సదరు స్వామీజీకి పంపుతానని చెప్పారు.ఆదాయా మర్గాలు పెరిగేచోట మీడియా దృష్టి పెట్టడం సహజమే కదా. ఏంతైనా మీడియా స్వామీజీలకంటే పవర్‌ఫుల్ కదా!!



May 29, 2010

రెచ్చగొడితే రెచ్చిపోయి చచ్చిపోయే పిచ్చి జనం!


రాష్ట్ర ప్రజలు అన్నీ మరచి కొద్దిగా ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, టీవీ చానల్స్ కేవలం ఎండవేడి, వడగాడ్పుల విశేషాలు మాత్రమే ప్రసారం చేస్తున్నవేళ రాష్ట్రంలో మరో సంఘటన. కులాల కుంపటి నెత్తినపెట్టుకొని గ్రూపు రాజకీయాలతో ఒకరు, ఆ ప్రాంతంలో తమ ప్రాభవానికి గండిపడుతుందేమోనని మరొకరు పోటిపడి అసలే ఎండలతో మండుతున్న రాష్ట్రాన్ని మరింత వేడెక్కించడం సాధారణ ప్రజలను ఉక్కిరుబిక్కిరి చేస్తోంది. ఒకరిని ఒక ప్రాంతంలో తిరగొద్దని అనడానికి ఇది ఎవడబ్బా జాగీరు కాదు. భారత ప్రజలు దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా తిరగొచ్చు. పిచ్చి ప్రేలాపనలు చేసేవాళ్ళని కట్టడి చేసే శక్తి ప్రభుత్వానికి లేకుండా పోయింది.ప్రచారం అనేది లేకుండా ఏ రాజకీయ నాకుడు ప్రజలకి సాయం చెయ్యడని అందరికీ తెలిసిన విషయమే. తమ గ్రూపును బలోపేతం చేసుకోవాడానికి యాత్రలు చేస్తూ చనిపోయిన కుటుంబ సభ్యులకు కొంత సాయడం చేయడం రాజకీయ నాయకులకు ప్రచారం అయినా నష్టపోయిన కుటుంబానికి ఆ చిన్న మొత్తం పెన్నిధే అవుతుంది. ఆ విధంగా జగన్ యాత్ర ఆగిపోవడం చనిపోయిన కుటుంబ సభ్యులకు నష్టమే. యాత్రవల్ల అతడు బలపడి తద్వారా తెలంగాణా ఉద్యమం నీరుగారిపోతుందేమోనని సదరు కేసీఅర్‌కు ఇతర కాంగ్రెస్ నాయకులకు కూడా భయమే. ఆ భయమే పిచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా చేసింది. జగన్ తెలంగాణాలో అడుగు పెడితే ప్రజలు ఊరుకోరు, తెలంగాణా అగ్నిగుండం అవుతుంది అంటూ నాయకులు పేలితే (కొంతమంది) ప్రజలు "అహ ఊరుకోకూడదుగాబోలు" అనుకుంటూ రోడ్డునపడ్డారు. వారికి తోడు కిరాయి కార్యకర్తలు సాగించిన విద్వంసం రాష్ట్రాన్ని మరోసారి ఉద్రేకంలోకి నెట్టింది. సాధారణ ప్రజలెవ్వరూ రైలు పట్టాలని పీకి జనాన్ని చంపుదామని అనుకోరు. దానికిసైతం తెగించారంటే దీని రాష్ట్రాన్ని అస్థిరపరచే రాజకీయ కుట్ర దీనివెనుక జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమాయకుల శరీరాల్లోకి బుల్లెట్ట్లు దూసుకువెళ్ళాయి. మరి ఈ పాపం ఎవరిది? ప్రజాహక్కులను రక్షించలేని ప్రభుత్వానిదా లేక సొంత జాగీరులను ఏర్పాటు చేసుకుంటూ నా ప్రాంతానికి మరొకరు రావద్దని శాశించే మూర్ఖ నాయకులదా? లేక పదిరూపాయల ఖర్చుతో రూపాయి పంచిపెట్టీ ప్రజా సేవకులమని భ్రమించే నాయకులదా?

April 15, 2010

మీడియా చేసేది వ్యాపారమే...!!


ఈ మద్యకాలంలో చర్చలకు వేదిక కల్పించాల్సిన మీడియానే చర్చనీయాశమైంది. ముఖ్యంగా బ్లాగుల్లో మీడియా ముఖ్యవిషయమైంది. మీడియాపైన ఎక్కువమంది వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు అన్నది సత్యం. వీరికీ వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్నయం వచ్చినా పత్రికా స్వాతంత్ర్యం మంటగలిసిపోతోంది అని పెడబొబ్బలు పెట్టే వ్యక్తులు దానికి కారణాలు శొధించాల్సినప్పుడు ఆ బాధ్యతను యాజమాన్యంపై నెట్టివేస్తూ అందులో తమ బాధ్యత లేదంటూ కప్పదాటుధోరిణి ప్రదర్శించడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రజా పక్షాన నిలబడవలసిన పత్రికలు లేద చానల్స్ ప్రభుత్వ పక్షమో లేక ప్రతిపక్షంవైపో ఉంటున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇలాటి సమయంలో పత్రికా విలువలు అంటూ అంటూ సూక్తులు చెప్పడం ప్రజల్ని వెర్రివాళ్లని చేయడమే. మీడియా అనేది ఒక సేవాసంస్థ కాదు అందులో పనిచేసేవాళ్ళు ప్రజా సేవకులు కాదు. మీడియాలో అన్నీ వ్యాపార సంస్థలే అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదికూడా ఒక రియల్ ఎస్టేట్ లాంటిదే. ఒక పత్రిక బలపరిచే పార్టీ అధికారంలో ఉంటే ఆ పత్రికకు మంచి బూం ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనలలో సింహభాగం ఆ పత్రికకే వస్తాయి. అందులో పనిచేవాళ్ళంత కేవలం ఉద్యోగస్తులు. కేవలం ఉద్యోగస్తులు. తమ పత్రికకు చదువరులు ఎక్కువ ఉంటే ప్రకటనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అందులో పనిచేవాళ్లంత చదువరులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో సేవాతత్పరత, విలువలు అనేవి ప్రస్తుతం లేవు. ఇది కాదని ఏ ఒక్కరైనా చెప్పగలరా? మరి అటువంటప్పుడు జర్నలిస్టులంటూ వీరికి ప్రత్యేక హోదాగానీ ప్రత్యేక సదుపాయాలు గానీ ఎందుకు? మీడియా అనేది నిజానికి ఒక "వాచ్ డాగ్" (తెలుగులో చెపితే కొంతమంది బాధ పడతారెమోనని)లాగ పనిచేయాలి. మీడియా నిజంగా ఆపని చేస్తోందా? దానిలో ఎన్నో స్వలాభాలు ఉంటాయి. ఆ లాభాన్ని పంచుకోవడం జర్నలిస్టుతో మొదలై యాజమాన్యంతో ముగుస్తుంది. ఆ లాభాన్ని పొందుతున్నప్పుడు కష్టాన్ని కూడా భరించాలి. ఆ కష్టం నిజంగా ప్రజలకోసం పడితే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు మీడియా వెంట ఉంటారు. కానీ జర్నలిస్టులంతా ప్రజలకోసం పనిచేస్తున్నారు, ప్రజలకోసం కష్టపడుతున్నారు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీరు మాకు దూరంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాము అనేది ప్రస్తుత పరిస్తితి.
ఒక మిత్రుడు మద్యపానం చేసి రాత్రి బైక్‌మీద ఇంటికి వెడుతూ ఉంటే ఒక పోలీసు అతడిని అపేడు. నేను జర్నలిస్టును నన్ను ఆపడానికి నీకెంత దమ్ము అని ప్రస్నిస్తే తిక్కపుట్టిన పోలిసులు అతగాడిని స్టేషన్‌కు తీసుకుపోయారు. అతడు మరో సీనియన్ జర్నలిస్టుకు ఫోన్ చేసి విడిపించమని చెపితే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్‌తొ మాట్లాడటమేమిటి? నాది ఎస్పీ లెవెల్..రేపు ఎస్పీతో మాట్లాడతాను అని చెప్పేడు. అది సంగతి!!

జర్నలిస్టులు వేరు పత్రికా యాజమాన్యం వేరు అంటూ జరుగుతున్న తతంగంలో మా బాధ్యత లేదు మేము నిమిత్త మాత్రులమంటే కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

విలువలను పాటిస్తూ ప్రజాభిప్రాయాన్ని మన్నించే, ప్రజాహితం కోసం పాటుబడే నిజమైన జర్నలిస్టులు ఒక శాతమైనా ఉండిఉంటే వారికి నా వందనాలు.


April 1, 2010

మీడియా ట్రెండ్ మారుతోందా?


గత కొన్నిరోజులుగా హైదరాబాదులో జరుగుతున్న అల్లర్లకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చెప్పకపోయినా పండగ చేసుకొనేది మాత్రం మీడియానే. ఈ అల్లర్లలో కేవలం ఇద్దరే చనిపోయారు. పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనైతేనేమి ప్రభుత్వ కృతనిత్చ్యయం వల్లనైతెనేమి బాగానే అదుపులోకి తేసుకొచ్చారు. కానీ జరిగిన అల్లర్లు మీడియాకు తగినంత వార్తలను అందించలేకపోయింది. అందువల్ల జరుగుతున్న అల్లర్లలో మషలా సరిపోక ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు తవ్వి ఆ క్లిప్పింగులను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు కలిపి బంపర్లు చేసి చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే. కాని వీటికి భిన్నంగా "జీ-24 గంటలు" స్పందించడం కొంత సంతోషకరం. "NO EXCLUSIVE, NO SENSATION" అంటూ మీడియా బాధ్యతను అందరికీ గుర్తు చేస్తోంది. సందులో సడేమియాలా దీనికి తెలంగాణా రంగు పులమడానికి అరాచకీయ నేతలు ప్రయత్నాలు నిజంగా సిగ్గుచేటు. కోదండరాం, గద్దర్ " ఇది సమైక్యవాదుల కుట్ర" అని ప్రకటించి వారి కుటిల రాజకీయాన్ని బయటపెట్టుకున్నారు. ఇలాటి సందర్భాలలో ప్రజలకు బాసటగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన తరుణంలో ఇలాటి పేలాపనలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయని తెలియని ఈయన ప్రజా గాయకుడెలా అయ్యాడో? ఏది ఏమైనా ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా ఎంతో సంయమనం పాటించాలి. దానిలో తొలి అడుగు జీ-24 గంటలుదైతే అది శుభ పరిణామమే.

February 19, 2010

మనిషివా....జర్నలిస్టువా..??


ఒక మనిషి రోడ్డుమీద ప్రమాదవశాత్తూ గానీ దాడికి గురైగానీ నెత్తురోడుతూ కనిపిస్తే మీరేమి చేస్తారు? అతన్ని సేదదీర్చడానికి సురక్షిత ప్రదేశానికి మార్చి వెంఠనే ఆంబులెన్స్‌కో లేక పోలీసులకో కబురంపుతారు. కానీ ఇవేమి చేయకుండా అతని బాధను ఏవిధంగా అనుభవిస్తున్నాడో తెలుసుకుంటూ అతను చెప్పలేని స్తితిలో ఉన్నాకూడా సహాయం చేయడం మానేసి అతన్ని ప్రశ్నలతో విసిగిస్తూ కారుతున్న రక్త ధారల్ని చిత్రీకరిస్తూ అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవరకు వేచి చూసేవాడే జర్నలిస్టు. ఇలాటి సంఘటనలు మనం అనేక చానల్స్ లో చూసిఉన్నాము కూడా. ఇటీవలికాలంలో జర్నలిస్టులు ప్రజల అభిప్రాయాలు చెప్పవలసింది పోయి స్టూడియోలో కూర్చొని తమ సొంత పైత్యాన్ని ప్రజలపై రుద్దుతూ ఇదే ప్రజల అభిప్రాయం అనుకోమంటూ, అనామకుల నోటిముందు మైకులుంచి వారు వాగే అవాకులు చవాకులూ ప్రసారం చేస్తూ చంకలు గుద్దుకునేవాడే జర్నలిస్టు. ఒకప్పుడు జర్నలిస్టులపై దాడి అంటే ప్రజలు కూడా మహాపరాధం జరిగిపోయిందనే భావనలో ఉండేవారు. ప్రభుత్వం కూడా అలాటి సంఘటనలకు వెంఠనే స్పందించేది. కానీ ఇప్పుడు పరిస్తితులు మారిపోయాయి. మీడియా స్వేచ్చ పేరుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయం పేరుతో దాడిచేయడం చాలా మామూలు విషయంగా మారిపోయింది.ఉస్మానియాలో పోలీసుల చర్యలను సమర్ధించకపోయినా దానికి కారణాలను ఏమాత్రం చూపకుండా పూర్తి బాధ్యతను పోలీసులపైకి నెట్టివేస్తే పోలిసులకు మండుకొచ్చి ఒక చాకిరేవు మీడియా ప్రతినిధులకు కూడా పెట్టారు. దానికి ప్రతిగా రేపటి బడ్జెట్ వార్తల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను తెలియచేయాలని నిర్నయించారుట. ఒక్క విషయం చెప్పాలి!! వీళ్ళు చెప్పే వార్తలకోసం ఎవ్వరూ పడిగాపులుపడి ఎదురు చేడట్లేదు. ఇంకా చెప్పాలంటే వార్తా చానల్స్ లేని రోజుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి డిమాండ్లు ఎవైనా ఉంటే తక్షణమే......స్పందించకుండా ఒక నెల రోజులు వేచి చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....!!

February 12, 2010

తెలంగాణా పులకేసి మళ్ళీ తెరపైకి...



ఈ మద్య లోకమంతా అప్రశాంతంగా, ఏదో కోల్పోయినట్టు, టీవీలన్నీ బోసిపోయినట్టు, విలేకరులంతా తెగులుపట్టిన కోళ్ళలా మెడలు వంగిపోయి, ముఖ్యంగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ దివాళా తీసిన వ్యాపారుల్లా దీనంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. కారణం మీకు తెలిసి ఉండదు! అదే మా తెలంగాణా పులకేసి అస్సలు పేపరోళ్ళవైపు, చానల్స్‌వైపు చూడడం మానివేయడంవల్లే. ఇదిగో నిన్నటినుండీ విలేకరులకు కాస్త ముద్ద గొంతు దిగుతోంది. ఎందుకంటే నిన్ననే మా తెలంగాణా పులకేసి మళ్ళీ టీవీలో కనిపించాడు. కనిపించడమేకాదు బోలెడు విషయాలు చెప్పాడు. వస్తూనే అతడన్నది ఆంధ్రోళ్ళు అంటే పెట్టుబడిదార్లు ఆంధ్రాలో చేసింది అస్సలు ఉద్యమమేకాదుట. ఉద్యమమంటే తెలంగాణాలో జరుగుతున్నదేట. ఇంకా శ్రీకృష్ణ కమీషన్‌పై అతడి అభిప్రాయలు కొన్ని చెప్పాడు. అసలు తెలంగాణా ఇవ్వాలా వద్దా అని రాష్ట్రంలో ఎవ్వరినీ అడక్కూడదట. ఆంధ్రోళ్ళనిగానీ, సీమోళ్ళనిగానీ, హైదరాబదీలనిగానీ. మరి ఎవరిని అడగాలి? పులకేసిని అడగొచ్చంట, ఇంకా వాళ్ళ అల్లుడిని అడగొచ్చుంట, ఇంకా పులకేసి కూతురునికూడా అడగొచ్చంట. తెలంగాణా ఇవ్వాలని తేల్చడానికి పదినెలలెందుకు అని తెలివిగా అడిగాడు. కేవలం పది సెకన్లు చాలుట. లేదంటే ఒక వారమో పదిరోజుల్లోనో సరిపెట్టుకోవాలిట. అసలు తెలంగాణా ఇవ్వడంకోసమే కమిటీ వెయ్యాలిగనీ ఇంకా అడిగేదేంటని అన్నాడు మా పులకేసి. ఇక తాము త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇంతకుముందు ప్రకటించినట్టు తల నరుక్కుంటాడేమోన్ని ఆశగా ఎదురు చూసేరు... అదేమికాదు. పదవులకు మరోసారి రాజీనామాలు చేసి, వాటిని నిజ్జంగా ఆమోదింపచేసుకుంటాడుట. అదీ సంగతి!! ఇకనుండీ మళ్ళీ కొన్ని రోజులు అందరికీ ముఖ్యంగా నక్సలైట్ చానల్స్‌కి, పోరంబోకు చానల్స్‌కి పండగే పండుగ. మనం కుడా చూసి సరదా పడదాం. ఏమంటారు?