February 25, 2014

కేసీఅర్‌ని చూస్తే ముచ్చటేస్తొంది!!

కాంగ్రెస్ అనుకున్నది సాధించింది.తెలంగాణాకు జైకొట్టి సీమాంధ్రుల నోట్లో మన్ను కొట్టింది. సరే వారి కోరికమేరకు విభజన చెసినా సీమాంధ్రుల భయాలకు తగిన ధైర్య వచనాలు కూడా చెప్పకుండా తోసిరాజు అనడం కేవలం ఒక్క సోనియాకే చెల్లింది. నాకు కేసీఅర్‌ని చూస్తే ముచటేస్తోంది. పార్టీ్‌కోసం తెలంగాణాకోసం సోనియాను ముప్పుతిప్పలు పెడుతూ తనకోర్కెలన్నీ తీర్చుకుంటున్న కేసీఅర్‌ని చూస్తే ముచ్చటేస్తొంది.   2014 సంవత్సరానికి ఉత్తమ ప్రజా నాయకుడు ఎవరు అని పోటీ పెడితే ఖచ్హితంగాం కేసీఆర్ అని తెలంగాణా ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు కూడా వోటు వేస్తారు. ఉత్తమ ప్రజా వ్యతిరేక నాయకుడు ఎవరా అని పోటీ పెడితే సీమాంధ్రలో చాలా మంది తన్నుకు చావాలి ఆ స్థానం కోసం. వీళ్ళ మొహాలు మండ.. వీళ్ళు ప్రజా నాయకులా? సిగ్గు శరం అనేవి వీళ్ళలో ఒక్కరికైనా ఇసుమైంతైనా లేవు. విభజనకు అడ్డుపడలేకపోయినా కనీసం సీమాంధ్రాకు కావలసిన వసతులు తెచ్చుకోవడంలో కూడా వీరు ఘోరంగా విఫలమయ్యారు. వ్యక్తిత్వం లేని అనామకులు, పార్టీకి బానిసలు, పదవికి ఈసులు. వచ్చిన అరాకొరా ప్రయోజనాలు కేవలం బీజేపీవల్ల వచ్చాయి. అదికూడా వెంకయ్య నాయుడువల్ల అనే చెప్పుకోవచ్చు. బీజేపీకూడా సీమాంధ్రులను వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. సుష్మా గారికి చిన్నమ్మగా పిలుపించుకోవాల్నే ముచ్చట వల్లే వారు ఎటువంటి షరతులు లేకుండా తెలంగాణాకు సై అనడం అద్వాణీని కూడా కలవరపరచింది. ఇదంతా సీమాంధ్రుల ప్రారబ్ధం. పార్టీలను అమ్ముకుంటూ, నోటికి నరం, ఒంట్లొ రక్తం, బుర్రలో గ్జ్యానం  లేని నాయకులను ఎన్నుకోవడంవల్ల జరిగిన విపరీతం. శ్రీకాకుళం పల్లెల్లో పెట్టిన 124 సెక్షన్ చెబుతుంది, ఈ నాయలుకు మనల్ని ఏంత కలవరపరిచారో. అక్కడి అల్లరులు చెబుతాయి మనల్ని ఈ నాయకులు ఏంత వంచించారో.   కానీ సీమాంధ్రులు కష్టపడేవారు. ఇదొక్కటి చాలు  మనల్ని మనం నిర్మించుకోవడానికి. ఇప్పుడైనా నోటుకోసం వోటు కాకుండా మన భవిష్యత్ కోసం వోటు వేద్దము. మనకోసం పనిచేయనివారి నడ్డి పగలగొడదాం. పదండి ముందుకు...!! జై ఆంధ్ర....జై తెలంగాణా !!