December 30, 2009

తెలంగాణా పులకేసికి "బందుమిత్ర" బిరుదునివ్వాలి!!


ప్రస్తుతం తెలంగాణాలో బందుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణాపై సష్టమైన ప్రకటన వెలువడేదాకా ఈ పర్వం కొనసా.....గుతుందని నాయక గణం అంటోంది. బందులో ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, ఉద్యోగులు, స్వచ్చందంగా పాల్గొంటున్నారని సదరు నాయకులు చెపుతున్నారు. స్వచ్చందముగ అంటే భయముతో అని అర్ధం చేసుకోవాలిగాబోలు. విద్యాసంస్థలపైనా, చిన్నపిల్లలతోవెడుతున్న స్కూల్ బస్సులపైన కూడా ముష్కరులు కొన్ని రోజులముందే దాడి చేయడంతో విద్యాసంస్థలు మూసివేయక తప్పని పరిస్తితి. అందుకే వారు స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఎన్నొ వ్యాపార సంస్థలపైన కూడా దాడిచేసి దోచుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అందుకే వారుకూడా స్వచ్చందముగా దుకాణాలు మూసి స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వముకూడా స్వచ్చందముగా బందులో పాల్గుంటోంది. ఎందుకంటే ఆర్టీసీ నష్టాలు భరించే స్థితిలో లేదు లాభాల మాట దేముడెరుగు, సంస్థ ఆస్తులే హరించిపోతున్నాయి కాబట్టి వారుకూడా స్వచ్చందముగా బందులో పాల్గొన్నట్టే. ఇక రైల్వేలు కూడా తమ రైళ్ళను నిలుపు చేసి తెలంగాణాకు అనుకూలంగా బందులో పాల్గొన్నయని భావించవచ్చు.

కానీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నా టీవీ చానల్స్ మూగనోముతో కేవలం స్క్రోలింగ్‌లతో సరిబెట్టుకోవలసిన పరిస్తితి వచ్చింది. పాపం హైకోర్టు వారి మైకు, కెమేరాలను కొంత అదుపులో ఉంచమని ఆదేశించడమే దీనికి కారణం.అంతేకాకుండా వారి ప్రసారాలపై కొంత నిఘా ఉంచమని పోలీసులకు కూడా అదేశాలు ఇచ్చింది. లేకపొతే వారంతా వీరావేశంతో "జజ్జనకరి జనారే" అంటూ చిందులేసేవారు.

ఇన్ని విపరీతాలకి కారణమైన మన పులకేసిగారికి ఈ సందర్భములో ఒక బిరిదునిచ్చి సత్కరించాలని నా కోరిక. దానికి నేను రెండు పేర్లను ఎంపిక చేసాను. మొదటిది "బందుమిత్ర" రెండోది "బందోపాధ్యాయ". వీటిల్లో ఎక్కువ మంది ఎంపిక చేసిన పేరును వారికి బిరుదుగా ప్రదానం చేయవచ్చు.

ఇక తెలంగాణా విషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఓయూలో మెస్‌లు మూసివేసినప్పుడు తమకు భొజన ఏర్పాటు చెయమని విద్యార్ధులు రాజకీయ నాయకులను అడిగారని ఒక బ్లాగులో చదివాను. ఇలాటి సంఘటనలు ఎవరినైనా కదిలిస్తాయి. కానీ ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది. ప్రజలు నిజంగా తాము వెనుకపడ్డామని భావిస్తున్నప్పుడు కూడా నిజానిజాలు తెలుసుకొని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇరుపక్షాలకు నష్టం లేనివిధంగా సమస్యను పరిష్కరించాలి. వృద్ధ జంబూకాలకు వేదికగా మారిన జేయేసీ దృష్టి రాబోయే పదవులపైనే ఉంది అన్నది సుస్పష్టం. కూర్చుంటే లేవలేని ఒక నాయకుడు అయితే గియితే వచ్చే తెలంగాణాకు ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తామని ఎవరో మాటిచ్చారట ఆయన తిరస్కరించారుట. వీరి మాటల్లో ప్రజాభావాలకన్న పార్టీ భావాలే వ్నిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రాతినిద్యం లేని నిజమైన ప్రజాప్రముఖులను కూర్చొబెట్టి సమస్యను పరిష్కరించగలిగితే బాగుండును. కానీ అలా జరగడానికి అవకాశం ఉందా?

December 24, 2009

తెలంగాణా పులకేసికి మరో పూనకం


మాటలు మర్చేవారిని రాజకీయ నాయకులతో ఎందుకు పోలుస్తారో నాకిప్పుడు అర్ధమైంది. తెలంగాణాపై మొదటిసారి చిదంబరం ప్రకటన చేసినప్పుడు అధీష్టానం అదేశాలకు పార్టీలోని ఎమెల్యేలు ఎంపీలందరూ కట్టుబడిఉండాలని తెలంగాణా కాంగ్రెస్‌కు చెందిన నేతలందరూ సీమ ఆంధ్ర నాయకులకు విజ్గ్నప్తి చేసారు. కానీ రెండోసారి చిదంబరం ప్రకటన వెలువడినతరువాత అదే ఎమెల్యేలు, ఎంపీలు రాజినామలు సమర్పించి టీఆరెస్‌తొ చేతులు కలిపారు. మరి దీనినే "తనది కాకపొతే తాడిమట్టకు ఎదురు డేకమని" అనడం అన్నమాట.

ఇక ఆంధ్రాలో బంకర్లు నిర్మించవలసిన ఆవశ్యకత కనబడుతోంది. ఎందుకంటే పులకేసి అణువిస్పోటం జరుగుతుందని హెచ్చరించారు కదా అందుకు. చిదంబరం ప్రకటన చేసిన తరువాత పులకేసిని రెండోసారి ఉద్యమం మొదలుపెడుతూ ప్రజలకు కొన్ని సూచనలు చేసారు. ఉద్యమమకారులంతా శాంతియుతంగా ఉండాలని. వారిమాటలను ఉద్యమకారులు "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అని అరుచుకుంటూ నలభై బస్సులను నాశనం చేసి నాలుగు బస్సులు తగులబెట్టి ఆచరించి చూపారు. తెలంగాణాలోని నాయకులంతా రాజీనామాలు చెయ్యాలని పులకేసి వినమ్రంగా కోరారు. అందుకే రాజీనామా చేయని నాగం జనార్ధన రెడ్డిపైన మరికొందరిపైనా ఉద్యమకారులు పిడిగుద్దులు కురిపించారు. ఉద్యమం చేస్తున్నంతసేపూ వారెవరైనా విద్యార్ధులే. ఒకవేళ ఖర్మకాలి దొరికిపొతే వారు విద్యార్ధులుగానీ టీఆరెస్ కార్యకర్తలుగానీ కారు. అరాచక శక్తులు. ఇంకాచెప్పాలంటే ఆంధ్రోళ్ళు అయిఉండవచ్చు. కాబట్టి విద్యార్ధులకు ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

ఇక మీడియాకు మళ్ళీ పండగ వాతావరణం వచ్చింది. సీమ ఆంధ్రా ప్రాంతాలలోని ఉద్యమాలు ఇష్టం లేకున్నా చుపించవలసి వచ్చినందుకు చాలా బాధ పడ్డారు. మళ్ళీ తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నందుకు వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ ఒక్క బస్సు దహనంగానీ నాశనంగానీ వారి కనుసన్నలు దాటి పోకుండా వారు ప్రసారం చేయగలుగుతున్నారు. నాగం జనార్ధనరెడ్డిపై దాడిని మళ్ళి మళ్ళి చూపిస్తూ మిగిలినవారిని బెదరగొట్టడమే వారి ధ్యేయంగా కనబడుతోంది. ఓ.యూ.లో కవరేజి నిమిత్తం వెళ్ళిన విలేకరి ఆంధ్రా వాడనిచెప్పి అతనిపై దాడి చేసారు.


మరో పక్క ప్రజలు భీతావహులు కావడమే కాకుండా బందులవల్ల రాష్ట్రంలో మూతబడుతున్న ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు తేరుకోలేకుండా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు కొంత పర్వాలేదు. కానీ ప్రయివేటు సంస్థలు? సరియైన ఆర్డర్లు రాక, వచ్చిన ఆర్డర్లను చేయలేక సంస్థలు మూతబడే అవకాశం ఉంది. ఈ అరాచక పరిస్తితి రాష్ట్రానికి తలమానికంగా తయారైన సాఫ్ట్వేర్ సంస్థలను చుట్టుముడితే రాష్ట్రంలో దాదాపు మూడు లక్షలమంది ప్రత్యక్షంగానూ రెందు లక్షలమంది పరోక్షంగానూ నిరుద్యోగులయ్యే ప్రమాదముందని నిపుణులు చెపుతున్నారు. మరి ఈ విషయంపై పులకేసిని ప్రశ్నిస్తే వారు చార్మినార్ లేదా గోల్కొండల దగ్గిర దుప్పటి పరుచుకోమనిగానీ తెలంగాణా చరిత్ర చెప్పుకుంటూ గైడ్‌గ పనిచేసుకోమనిగానీ చెపుతారేమో?

ఏది ఏమైనా రాష్ట్రంలోని పరిస్తితులు రాష్ట్రపతి పాలనకు దారి తీస్తున్నాయని చెప్పకనే చెపుతున్నాయి.

December 22, 2009

లగడపాటి ప్రెస్ మీట్‌లో మీడియా మిత్రుల అసహనంఅత్యంత నాటకీయంగా జరిగిన లగడపాటి అదృశ్యం ఆయన నింస్‌లో ప్రత్యక్షం కావడంతో ముగిసింది. నింస్‌లో ఆయన ఒకరోజు దొంగ దీక్ష (లగడపాటే అన్నారు) ముగించుకొని హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణాకు సంభందించి ఏదో ప్రకటన చేస్తారనుకొని ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేసుకున్న చానల్ మిత్రులందరూ ఆయన చెప్పిన విషయాలు విని చాలా అసహనానికి గురయ్యారు. తనకు పంధొమ్మిదో తేది రాత్రి కోర్టు ఆదేశాలపై శరీరానికి కావల్సిన పోషకాలను (ఐవీ) ఎక్కించారని నైతికంగా తన దీక్ష భగ్నం ఐనట్టుగా భావించానని కానీ తనను హైదరాబాదు రానీకుండా కొంతమంది అడ్డుకోవడం వల్లే పట్టుదలతో హైదరాబాదు వచ్చి నింస్‌లొ చికిత్స తీసుకున్నట్టు చెప్పారు. తాను ఐదు రోజుల ఏడు గంటలు నిజాయితీగా దీక్ష చేశానని మిగిలిన రెండు రోజులు దొంగ దీక్షేనని ఐవీలు తీసుకుంటూ ఎన్ని రోజులైనా దీక్షలు చేయవచ్చని కానీ ఇలాటి దొంగ దీక్షలగురించి ప్రజలకు మీడియాకు తెలియచెప్పడానికే చేశానని పరోక్షంగా కేసీఅర్ చేసిన దీక్షను ఉటంకిస్తూ చెప్పారు.

కేసీఅర్ ప్రస్తావన వచ్చినప్పుడు మీడియా మిత్రులు చాలా అసహనానికి గురయ్యారు. వారు వెంఠనే లగడపాటి ప్రసంగానికి అడ్డుతగులుతూ ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టినప్పుడు. లగడపాటి ఇది నేను పిలిచిన ప్రెస్ కాన్‌ఫరెన్స్ కాబట్టి తాను చెప్పింది వినాలని ఇతర (కేసీఅర్) వ్యక్తులకు గంటలకొద్దీ సమయం కేటాయించి తనకు కొద్దిసేపు సమయం కేటాయించలేనివారు వెళ్ళిపోవచ్చని, తాను ఎవరిని భయపెట్టి తీసుకురాలేదని ఇష్టంలేని వారు వెంఠనే వెళ్ళిపోవచ్చని నిర్మొహమాటంగా అన్నాకాగానీ విలేకరులు సద్దుమణగలేదు.

చానల్స్ అన్నిటికన్న టివీ-9 నుండి మురళీ కృష్ణ కాస్త అతి చేయడం స్పష్టంగా కనిపించింది. లగడపాటి నింస్‌లో చేరడానికి వచ్చినప్పుడు అక్కడినుండీ ప్రత్యక్ష ప్రసారం వివరాలు అందిస్తూ లగడపాటికి లోపల చికిత్స చేస్తున్నారని "లగడపాటికి నింస్‌లో ఏలా చికిత్స చేస్తారో ముఖ్యమంత్రి మీడియాకు చెప్పాలి" అంటూ డిమాండ్ చేశాడు. ఇది ఒక రకంగా అతడు తన పరిధిని దాటి చేసిన వ్యాఖ్యానం. లగడపాటికి నింస్‌లో చికిత్స ఎందువల్ల నిరాకరించాలో అతడు చెప్పగలడా? ముఖ్యమంత్రి మీడియాకింద పనిచేసే వ్యక్తి కాదు. మైకు చేతిలో ఉందికదానని నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయం పక్కనబెట్టి బాధ్యతగా మెలగాలి. మనము చెప్పింది జనము వినక చస్తారా అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

December 20, 2009

తెలంగాణా పులకేసితో ప్రత్యక్ష ప్రసారం


తెలంగాణా పులకేసి గారితో టీవీ-99 నిన్న ప్రత్యక్ష ప్రసారం చేసింది. తెలంగాణా దేశం ఏర్పడిందని ఆ దేశమున ఉండగోరే ప్రజలు ఏ విధమున ఉండాలో కొన్ని నియమాలు సూచనప్రాయమగా పులకేసిగారు తెలియచేశారు. తెలంగాణా సంస్కృతిని ప్రజలందరూ గౌరవించాలని చెప్పారు. కానిఎడల ప్రజలు తెలంగాణా బహిష్కరణ జరుగుతుందని పులకేసి తెలియచేశారు. కాబట్టి ప్రజలందరూ తెలంగాణా మాండలికంలోనే మాట్లాడటం నేర్చుకోవాలి. దంచుడు, సచ్చుడు, భాగో, కుక్కలు, ద్రోహులు, విద్రోహం, ఆంధ్రోళ్ళు లాంటి పదాలు ప్రతీ వాక్యంలోనూ ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఆంధ్రోళ్ళను ప్రతి మాటలొనూ దోపిడీదారులని తిడుతూ ఉండాలి. బతుకమ్మ ఆడటం నేర్చుకోవాలి. జొన్న సంకటి మాత్రమే తినాలి. ముఖ్యంగా తెలంగాణా చరిత్ర తెలిసి ఉండాలి. ఇవన్నీ చేస్తే మీరు తెలంగాణా పౌరులుగా ఉండడానికి అర్హత సంపాదించినట్టే. పులకేసిగారు మరో విషయం కూడా చెప్పారు ఉపాధి అవకాశాలకన్న కూడా సంస్కృతికే ప్రాధాన్యమని. హైటెక్ సిటీ కన్నా చార్మినార్, గోల్కొండ లకే ప్రాధాన్యమని. మరి ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారో? చార్మినార్, గోల్కొండల దగ్గర ప్రజలను అడుక్కుతినమంటారా? కొంతమంది అమాయకులు అమెరికా, బొంబాయి లాటి సుదూర ప్రాంతాలనుండి వీరిని ఫోన్‌లో కొన్ని ప్రశ్నలు అడిగేరు. సమాధానాలు చెప్పలేని పులకేసి వారిని ఆంధ్రా పొగరుతో మాట్లాడవద్దని తిట్టిపోశారు. వీరి రెండుమాటల ధొరిణి ప్రతీమాటలోనూ కనిపించింది. అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలకు తమ దేశ ప్రజలు నోచుకోవడంలేదంటూనే అమెరికాలో స్థిరపడిన వారిలో అరవై శాతంమంది తెలంగాణావారేనని చెప్పుకొచ్చారు. తమదేశంలో ఎంతోమంది ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు ఉన్నారని వారిసాయంతో దేశాభివృద్ధి చేస్తామని అన్నారు. ఆంధ్రోళ్ళు దొంగలు దోపిడిదారులనే వీరు కాకినాడవారితో వియ్యం పొందామని అన్నారు. తమ సంస్కృతి గొప్పదని ఇతరులని గౌరవిస్తామని చెప్పుకొనే వీరు కాంగ్రెస్ వాళ్ళని కుక్కలుగా సంభొదించిన విషయంగానీ బాబును నీతి జాతీ లేని మనిషి అన్నది కూడా తానేనన్న విషయం పులకేసి మర్చిపోయారు. మొత్తంమీద ఆంధ్రోళ్ళమీద నిలువెల్ల ద్వేషాన్ని పురిగొల్పుతున్న ఈ పులకేసి తెలంగాణాను ప్రత్యేక దేశంగా చేసి ఆధిపత్యం చేయాలనే కాంక్ష నిలువెల్లా కనిపించింది. ఈ కార్యక్రమం చూసాకా నాకొక్కటే అనిపించింది తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా కాక ప్రత్యేక దేశంగా చేసి దానికి ఈ పులకేసిని చక్రవర్తిగా ప్రకటించి వీలైతే ఆ ముక్కను దేశంనుండీ దూరంగా జరిపేస్తే బాగుంటుందని. టీవీ-99 లాంటి చెత్త చానల్స్ ఏక పక్షంగా చేస్తున్న ప్రసారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం.

December 16, 2009

రోశయ్యగారి బుజ్జగింపులు ఆంధ్ర మంటలను చల్లార్చవు

రోశయ్యగారు మొత్తానికి మంత్రివర్గాన్ని బుజ్జగించి ఒకచోట కూర్చోబెట్టగలిగారు. మంత్రివర్గంలో విబేధాలు లేవు అన్న సూచన రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికట. మంత్రివర్యులు గీతారెడ్డి చక్కగా ముస్తాబై మంత్రివర్గ బేఠీ జరిగిందని ఇక పరిపాలనపై దృష్టి సారిస్తుందని ఇక ఎలాంటి సమస్యలు లేవన్న బిల్డప్ ఇచ్చారు. కాని నిప్పుని దుప్పట్లో దాచి ఉంచితే దుప్పటి కాలడం ఖాయం. ఈ బుజ్జగింపు కేవలం ప్రధాని చేసే ప్రకటన వరకే. ఇరువర్గాలను సంత్రుప్తి పరచడం అనేది జరిగే పని కాదు. హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రకటిచడంగానీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి బుజ్జగించడానికి కొంతవరకు అస్కారం ఉంది. ఇక చిరంజివి కూడా సమైక్య ఆంధ్రా నినాదంతో బైటికి వచ్చారు. ప్రజల అభిష్టానికి ఎవరైనా తల ఒగ్గక తప్పదు. పార్లమెంటులో జగన్ తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి సమైక్య ఆంధ్ర ప్లకార్డు చూపించినందుకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ఎంపీలు అక్రోసిస్తున్నారు. జగన్ చేతులు కలిపింది సాక్షాత్తూ పార్లమెంట్ సభ్యులతోనేగానీ విదేశీ శక్తులతో కాదు. ఇక జై ఆంధ్రా ఉద్యమానికి వ్యతిరేకంగా శాయశక్తులా ప్రయత్నిస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వార్తా చానల్స్.తెలంగాణా నాయకుల ప్రసంగాలకు ఇస్తున్న సమయముగానీ ప్రాముఖ్యము గానీ ఆంధ్రా ఉద్యమ నాయకులకు ఇవ్వడంలేదన్నది సుస్పష్టం. చిరంజీ జై ఆంధ్రా అన్నందుకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కన్న తెలంగాణలో పీఆర్పీ చీలిపోతున్నది అన్నదానిని పెద్ద పెద్ద అక్షరాలతో చూపిస్తున్నారు. పీఆర్పీకి తెలంగాణాలో ఉన్నది కేవలం రెండు సీట్లు. గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒక్కటేనని వీరికి తెలియదా? చర్చలలోగానీ న్యూస్ ఇవ్వడంలోగానీ వారి వక్రబుద్ధి బైట పెట్టుకుంటున్నారు. కేసీఅర్ దీక్ష చేస్తున్న పదకొండు రోజులు స్క్రీన్‌పై సగం ఆయన ఫొటో ప్రసారం చేసారు.మరి ఆంధ్రా యూనివర్సిటీ, విజయవాడలలో ఎంతోమంది దీక్షలు చేస్తూ ఎంతోమంది అస్వస్తులవుతున్నారు. ఆంధ్రలో అగ్నిగుండాలు రగులుతూంటే అందాలభామల పోటీలను గంటలకొద్దీ చుపిస్తున్న ఈ చానల్స్ యొక్క యాజమాన్యాలు మేల్కొనాలి. ఇలాంటి చానల్స్‌ను ఆంధ్రా రాయలసీమ ప్రాంతాలలో నిషేధించి కేబుల్ ఆపరేటర్లు ఆ చానల్ ప్రసారాలను నిలిపివేస్తే టీఅర్పీ రేటింగ్స్ తగ్గి ఆదాయం రాక చానల్స్ మూసుకోవలసిన పరిస్తితి వస్తుంది. కాబట్టి వార్తా ప్రసారాలలో ప్రజా వాణికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమస్య ఏదో ఒకనాడు పరిష్కరించబడుతుంది. కానీ మీరు ఎప్పటికీ ప్రజలమధ్య ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి.

December 12, 2009

హరి రామ జోగయ్యా నువ్వు మూసుకోవయ్యా...


హరి రామ జోగయ్య అంటే చాలు అస్తిరత్వానికి మారుపేరని ఆంధ్రాలో అందరికి తెలుసు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా పార్టీలు మారుతూ వారి చపల బుద్ధిని చాటుకున్నారు. వీరికి కులగజ్జి కూడా ఎక్కువే. అందుకే చిరంజీవి పార్టీ పెడుతున్నాడనగానే వారు కాంగ్రెస్ను విమర్శించడం మొదలుపెట్టీ మరుక్షణం పీఅర్పీలో చేరేరు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవడంలో వీరి పేరు ప్రఖ్యాతులు కూడా పనిచేశాయి. వీరు పాదం మోపగానే పీఅర్పీకూడా అప్రతిష్ట మూటగట్టుకుంది. అటువంటి ఈ మహా నాయకుడు ఆంధ్ర రాయలసీమ ప్రజల సమైక్య నినాదాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కుతో పోల్చారు. ఇంత వయస్సు వచ్చినా వీరికి ఆ దేముడు స్థిరత్వాన్నే కాదు గ్జ్యానాన్ని కూడా ఇవ్వలేదు. వేలాది ప్రజలు వందలాది నాయకుల మనోభావాలకు అద్దం పడుతున్న ఉద్యమం వీరి కంటికి కనిపించలేదంటే వీరు గుడ్డివారుకూడా అయిఉండవచ్చు. వీరు కొన్ని తీర్మానాలు చేసారు. విశాఖ రాజధాని చేయాలిట, గుంటూర్‌లొ హైకోర్టు పెట్టాలిట ఇంకా ఎవేవో చెప్పారు. మరి వీరికి ఎవరు ఉద్యమ నాయకత్వం ఇచ్చారో లేక ఎవరు సలహా అడిగారో? వీరి పిచ్చి ప్రేలాపలన్లు మరింత ముదరకముందే అక్కడి ఉద్యమకారులు విరిని ఏదైనా ఒక మానసిక చికిత్సాలయంలో చేర్పించాలని నా మనవి.

జై సమైక్య ఆంధ్రా...! !

రోశయ్యా ఇదేమిటయ్యా?

అయ్యా రోశయ్యగారూ...సమైక్య ఆంధ్రా నినాదంతో కోస్తా రాయలసీమ ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. మీ సొంత పార్టీ ఎంఎల్ఏలు డబ్భై ఐదు మంది రాజీనామాలు చేశారు. మరో ఇరవై మంది మంత్రులుకూడా రాజీనామాలు చేయడానికి సిద్దపడుతున్నారు. మరి మీ సంగతేమిటి? తమిళనాడు, కర్నాటక గుంటనక్కలు రాష్ట్రాన్ని మీకు తెలియకుండానే ముక్కలు చేయాలని చూస్తున్నాయి. ఆపాటి ప్రాంతీయ అభిమానం మీకు లేదా? ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటున్న ఈ సమయంలో సమైక్యతకోసం ఆంధ్ర రాయలసీమ ప్రజల పోరాటం సబబు కాదా? మీరు ఎంతో కాలంగా రాజకీయలలో ఆరితేరిన వ్యక్తి. ప్రజల మనొభావాలు మీకు అర్ధం కాలేదా? మీరూ ఒక ఆంధ్రుడే, తరువాతే ముఖ్యమంత్రి. మీ పదవికి మీ పెద్దరికానికి మీ పార్టీపెద్దలే గౌరవం ఇవ్వనప్పుడు మీరు మీ ప్రతినిధుల స్వరాన్ని నిర్భయంగా ఢిల్లి కి తెలియచేయండి. మంత్రివర్యులు రాజీనామాలు చేస్తే మీ పదవి నుండీ మీరెలాగూ తొలగక తప్పదు. అది జరిగేలోగా మెజారిటీ ప్రజల మనోభావాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసి సగర్వంగా మీ రాజీనామాను కూడా తెలియచేస్తే ఢిల్లీ దిగిరాక తప్పదు. అప్పుడు ఆంధ్రా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మరువరు.

జై సమైక్య ఆంధ్రా !!


December 11, 2009

జై సమైక్య ఆంధ్రా నినాదంతో డిల్లీ పీఠం కదలాలి !!

ప్రశాంతంగా ఉండే ఆంధ్రాలో ఇంత చలనం కలిగించిన సంఘటన దాదాపు లేదనే చెప్పాలి. ఆంధ్రా రాయలసీమ ప్రజల సమైక్య నినాదం వింటూ ఉంటే నేను చదువుకున్న స్వాతంత్ర్య పోరాట సంఘటనలు గుర్తుకువచ్చాయి. సమైక్య నినాదం తొ వారి అరుపులు ఇంపుగా వినిపిస్తున్నాయి. వారి అరుపుల్లో నాకైతే దేశభక్తే కనిపిస్తోంది.కేసీఅర్ పదకొండురొజుల్లో సౄష్టించిన పరిస్తితి ఆంధ్రులు గంటలో సృష్టించారు. మహాత్ముల ప్రతిమలకు తెలంగాణాలో జరిగిన అవమానాలను పాలాభిషేకం చేసి తుడిచివేశారు. విద్యార్దులను ఎవ్వరూ మభ్యపెట్టలేదు, కార్మికులను ఉద్యమం చేయండని కోరలేదు, నాయకులను చంపుతామని బెదిరించలేదు అందరూ సమైక్య ఆంధ్ర దేశంకోసం అడుగు వేసారు. దానికి ప్రారంభం విజయవాడలో రాజ్‌గోపాల్‌తొ ప్రారంభమైనా సీమ నాయకులు ముందువరుసలో ఉన్నారు. పదవులను తృణప్రాయంగా త్యజించారు. పిచ్చి ప్రేలాపనలు లేవు. హెచ్చరికలు లేవు. అందరిదీ ఒక్కటే నినాదం సమైక్య ఆంధ్రా.

ెలంగాణా వేర్పాటులో ఎన్నో రాజకీయ కోణాలు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం తెలియకుండా తెలంగాణా ప్రకటన రాష్ట్రప్రజలను, ప్రజలచే ఎన్నొకోబడిన ప్రతినిధులను అవమానపరచడమే. చిదంబరం చెప్పిన సాకు "ఆంధ్ర ప్రజల పాలనలో తెలంగాణాకు న్యాయం జరగలేదు, అందుకే ప్రత్యేక తెలంగాణా". చిదంబరానికి తెలుసా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని? మరి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? ఆ అప్రతిష్ట వారిదేనని తెలియదా? ఒక ప్రాంతం అభివృద్ధి కాకపొతే ప్రత్యేక పేకేజ్ ఇవ్వచ్చు. వందకోట్లు కాకపొతే వెయ్యి కోట్లు ఇవ్వచ్చు. అంతేకాని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?


ఎంఎల్‌యేలు కాదు ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి. అధీష్టానం చెప్పిందే వేదం అంటూ కూర్చుంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదు. కేంద్ర ప్రభుత్వం విభజనపై పునరాలోచించకపొతే ప్రభుత్వం ఒక్కరోజు మనుగడలో ఉండడానికి వీలు లేని పరిస్తితి కల్పించాలి. పంటలు పండించేది మనం, టాక్సులు కట్టేది మనం. ఆ ఫలాన్ని రాష్ట్ర ప్రజలందరూ అనుభవించారు. ఒక్క మాటతో మన రాష్ట్రంలోనే మనం పరదేశీలం అవ్వడం ఏ ఆంధ్రుడు ఒప్పుకోడు. ఈ ఉద్యమం కొనసాగాలి. వారి చేసిన తాప్పు వారు తెలుసుకొనే దాకా కొనసాగాలి.

జై సమైక్య ఆంధ్రా!!

December 9, 2009

జై తెలంగాణా అనకపోతే చంపేస్తారా?

కేసీఆర్ (ఆమరణ)దీక్ష పదకొండవ రోజుకు చేరింది. ఆయనను గ్లూకోస్ మీద దాక్టర్లు బ్రతికిస్తున్నారు. ఆయన ఇప్పుడు విద్యార్ధులు వారి పార్టీవాళ్ళూ ఇంటివారూ ఎవరు చెప్పుతున్నా దీక్ష విరమించడానికి నిరాకరిస్తున్నారుట. కారణం ఒక్కటే అయిఉంటుంది దీక్ష విరమిస్తే ఉద్యమంలో తన పాత్ర కేవలం ఉత్సవ విగ్రహమే అవుతుందని. కానీ ఇది కోరి ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే.

ఇక తెలంగాణా ప్రజా వేదిక అనుకుంటా తెలంగాణాలో పదవులలో ఉన్న నాయకులంతా రాజీనామాలు చేయాలి లేకపొతే వారి ప్రాణాలకు తమ హామీ లేదని ప్రకటించారు. పైగా విద్యార్ధులు చూస్తూ ఊరుకోరని ముక్తాయింపు. రాజీనామాలు చేయకపొతే చంపేస్తారా? ఇది కోరి తగువులు పెట్టుకోవడమే. దానికి మంత్రివర్యులు దానం నాగేందర్ కటువుగానే సమాధానం ఇచ్చారు. ఆయన వెలుబుచ్చిన అభిప్రాయమే హైదరాబాదులో స్థిరపడిన ప్రజలందరి అభిప్రాయముకూడా. ఎందుకంటే పబ్బం గడుపుకోవడానికి ముందు సరే అని ఒకవేళ తెలంగాణా ఏర్పడితే హైదరాబాదులో స్థిరపడిన తెలంగాణేతరులను ఇక్కడ బ్రతకనిస్తారనే హామీ లేదు. కాబట్టి ఒకవేళ తెలంగాణా ఏర్పడితే హైదరాబాదును యూనియన్ టెరిటరీగా ప్రకటించడం సమంజసమే.

టీవీ-5 తొ మాట్లాడుతూ జేఏసీ నాయకుడు రవి ఉద్యమంలో కొందరి బయట వారుండవచ్చని చెపుతున్నప్పుడు వరవరరావు అతడు అమాయకుడు అతనికి ఏమి తెలియదు అని వెనకేసుకొచ్చడు. మరి ఏమి తెలియని విద్యార్ధులను ఉద్యమంలోకి లాగడం ఎందుకు? ఎంతోమంది విద్యార్ధులపై లఠీలు విరిగాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఅర్ జీవితాన్ని చూసిన వ్యక్తి. బ్రతికినంత కాలం ఎలాగూ బ్రతకడు. కానీ అతనికోసం జీవితం అంటే తెలియని వయసులోనే విద్యార్ధులు సమిధలవుతున్నారే. వారిని ఈ ఉద్యమానికి పురుగొల్పినదెవరు? రాజకీయనాయకులు కాదా? ఇంతవరకూ ఒక్క రాజకీయనాయకుడైనా కనీసం లాఠీ రుచి చూసాడా? మరి విద్యార్ధులే ఎందుకు బలవ్వాలి?

గద్దరన్నా నాదో ప్రశ్న. బుల్లెట్ట్లను సైతం ఒంట్లో దాచుకున్న ఉద్యమ కారుడివి నువ్వు. కాలానికి ఎదురు ఈదలేక నువ్వే ఎంతమారిపోయావో చూసుకున్నావా? నూలుపంచె స్థానంలో నల్లని టెరీకాట్ పాంటు వేశావు. నల్లని కంబళిబదులు తెల్లని పొలియస్టర్ చొక్కాని టక్ చేశావు. పొడవైన గెడ్డాన్ని నున్నగా చేశావు. తెల్లని పొడవైన జుట్టును కట్టిరించి నల్లని రంగు వేశావు. ఇంకా కాలం తీరిన సిద్ధంతాలని విద్యార్ధులపై ఎందుకు రుద్దుతావన్నా? అసెంబ్లీ ముట్టడి అంటూ విద్యార్ధులు ఎగబడుతున్నారు. నీకుగానీ ఏ రాజకీయనాయకుడికి కానీ ఏమవ్వదని తెలుసు. కానీ ఎందరు అమాయక విద్యార్ధులు తూటాలకు బలవ్వుతారోనని భయమేస్తొందన్నా. విద్యార్ధుల శవాల మెట్లపై అధికారం హస్తగతం చేసుకోవాలనుకొనే నాయకులను చూస్తూ ఉంటే భయమేస్తోందన్నా. వారి మానాన వారిని ప్రశాంతంగా బ్రతకనీయండన్నా.

December 6, 2009

తెలంగాణా ఉద్యమ విజయావకాశాలు

కేసీఅర్ దీక్ష ప్రారంభించి వారం రోజులు కావస్తోంది. ఈ వారం రొజులలో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రభుత్వ రక్షణలో ఉన్న ఆయనకు ఒక రకంగా రెండు ఫలితాలు దక్కాయి. మొదటికి ఆయన వైద్యుల సంరక్షణలో ఉండడం రెందోది ఆయన ఆరోగ్యంగా (సెలైన్ తొ) దీక్ష కొనసాగించడం. ఇక నాకెందుకో తెలంగాణా ఉద్యమకారులలో వాస్తవిక దృక్పదం ఉన్నవాళ్ళు కనిపించలేదు ఒకే ఒక్క జయశంకర్ తప్ప. రాష్ట్ర ప్రభుత్వానికిగాని అటు కేంద్ర ప్రభుత్వానికిగానీ ప్రత్యేక రాష్ట్రంపై ఎలాంటి అభిప్రాయం లేదు. అటువంటి పరిస్తుతులలో "కూడా రావద్దు అంటే ఎత్తుకోమని ఏడ్చినట్టు" అసలు ప్రత్యేక రాష్ట్రమంటేనే పడని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిరాహారదీక్షలో కూర్చొని నిర్నయం తీసుకోమంటే కోరి ప్రాణాలమీదకి తెచ్చుకోవడమే. ఇప్పటికే కేసీఆర్ ఖాతాలో పది వికెట్లు పడ్డాయి. చివరి వికెట్టు కేసీఅర్‌ది కాకుండాచూసుకోవలసిన బాధ్యత ఉద్యమకారులదే. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారందరికీ తలో పదిలక్షలు ఇవ్వాలని టీఆరెస్ డెమాండ్ చేస్తోంది. వారి మాటలు నిజంగా రాజకీయంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. చివరకి వాస్తవికతను ఒప్పుకొన్నది ఒక్క జయశంకర్ మాత్రమే. "ప్రత్యేక రాష్ట్ర అంశం కేవలం ముఖ్యమంత్రి చేతుల్లో లేదు. కనీసం ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం చేయచ్చు కదా " అంటున్నారు. అమ్మయ్య కనిసం వీరైనా విషయం తెలుసుకున్నారు అనిపించింది. మరి మిగిలినవారికి ఈ విషయం తెలియకనా? కాదు అదే డ్రామా. కేసీఅర్ డ్రామా. ప్రభుత్వం స్పష్టమైనా హామీ ఇస్తే దీక్ష విరమిస్తారుట. దీక్ష విరమిస్తేనే చర్చలకు పిలుస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి విత్తుముందా లేక చెట్టు ముందా? మరింత జాప్యం చేస్తే మరో వికెట్టు ఖాయం అని చెప్పొచ్చు. కానీ తెలంగాణా ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదన్నది సుస్పష్టం. మరి ఈ ఉద్యమం? కొన్నిరోజులు సా..సా...గి ఒక హామీతో సంతృప్తి చెందాల్సిందే!!

December 3, 2009

సమైక్యవాదం బూతుమాట అయిన వేళ...

మొత్తానికి కేసీఆర్ ను హైదరబాదు పట్టుకొచ్చారు.మరి ప్రభుత్వం ఆయన ఆరోగ్య రీత్య తీసుకొచ్చిందో, మానవహక్కుల సంఘం మాటలవల్లో లేక కేసీఆర్ పంతంవల్ల తీసుకొచ్చిందో గాని ఆయన ఉద్యమ విద్యార్ధుల మధ్యకు వచ్చి పడ్డాడు. ఖమ్మంలో తనకు ప్రాణహాని ఉన్నదన్న వాదన కేవలం ఒక సాకు మాత్రమేనని అందరికి తెలిసిందే. నాకు మాత్రం కేసీఆర్ పరిసిస్తితి చూస్తే జాలి వేస్తోంది. ముందు నుయ్యి వెనుకు గొయ్యి అన్నట్టు తయారయ్యింది. ఒకరోజు నిరాహారదీక్షతొ మంటలు ఎగదోసి చోద్యం చూద్దమనుకున్న కేసీఆర్ కు చుక్కెదురెయ్యింది.దీక్ష విరమించగానే విద్యార్ధుల ఆగ్రహంతొ ఖంగు తిన్న కేసీఆర్ దీక్షను కొనసాగించక తప్పలేదు. మానేస్తే విద్యార్ధులతో తంటా ముందుకెడితె ప్రాణాలకు సంకటం. వీటి మధ్య ఊగుతూ కొద్దిసేపు డాక్టర్లకు సహకరిస్తూ కొద్దిసేపు తిరస్కరిస్తూ ప్రాణాలని ఉగ్గబెట్టుకు బ్రతుకుతున్నాడు.

ఇక ఉద్యమం చాలావరకు కేసీఅర్‌ను దాటి విద్యార్ధుల చేతులలోకి వెళ్ళిందనిపిస్తోంది. విద్యార్ధులు కూడా త్యాగాలు మాని నెమ్మదిగా బలి తీసుకొనే స్థాయికి చేరుతున్నారు. ఆస్తులపై దాడులు, రోడ్డుపై ప్రయాణించే వారిపై దాడులతో రాక్షస రూపాన్ని సంతరించుకుటున్నారు. చదువుకున్న వీరు కూడా ఆంధ్ర బూచినే సాకుగా చెప్పడం దానికి ఉదాహరణ. తెలంగాణా ప్రాంతాల వెనుకబాటుకు కారణం ఆంధ్రా ప్రజలా? ఆంధ్రాలో వెనుకబాటుతనం లేదా? ఆంధ్రాలో ఉపాధికోసం ప్రజలు వలసలు వెళ్ళడం ఇరవై అయిదు ముప్ఫై సంవత్సరాల క్రితమే మొదలయింది. పొట్ట చేతబట్టుకొనె గల్ఫ్ దేశాలు వెళ్ళి మూటలు మోసి, టాయిలెట్లు కడిగి పైస పైస కూడగట్టి వారి సంసారాలని ఒక స్థాయికి తెచ్చుకున్నారు. మరి ఇక్కడి ప్రజలకు ఒళ్ళుఒంచి పనిచేసే అలవాటు లేదా? అక్కడికి వెళ్ళిన యౌవకులు ఎంతో మంది ప్రమాదాలకు లోనై మరణించారు కూడా. ఇక ఇక్కడ పచ్చళ్ళు వ్యాపార్లు పెత్తనం చేస్తున్నారని ఒక వాదన. వారివల్ల కొన్ని వేల మందికి జీవనాధారం కలుగుతోందనే విషయం స్పురణకు రాలేదా? మా దేశంలో పెట్టుబడులు పెట్టండని విదేశస్తులనే మనవాళ్ళు దేవురిస్తున్నారుకదా? పచ్చళ్ళ వ్యాపారులు అంతకన్నా తీసిపోయారా? వీరు చేస్తున్న పోరాటం వారు ఎన్నుకున్న నాయకులపై చేసిఉంటే తెలంగాణా ఎప్పుడో బాగుపడి ఉండేది.స్వార్ధపరుల అధికార దాహం కోసం రగిలించిన కాష్టం ఇది. దీనివల్ల ప్రజలలో కూడా బేధాలు మొదలవుతున్నాయి. సమైక్యవాదం పేరెత్తితే చాలు మనుషులని చంపేసే పరిస్తితి దాపురిస్తోంది. అర్హతలున్నవారికి విదేశాలలోసైతం ఉద్యాలొస్తున్నయి కదా? తెలంగాణా విద్యార్ధులు విదేశాలలో ఎంతోమంది ఉద్యోగం చేస్తున్నారుకదా? తెలంగాణావారని వారిని వెనుకబెట్టలేదుకదా? మరి అర్హత లేనప్పుడు ప్రత్యేక రాష్త్రం వచ్చినా వారికి ఏ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందో కేసీఆరే చెప్పాలి. వెనుకబాటుతనం, దోపిడీ, వ్యతిరేకవాదం, కుట్రలు అంటూ ఆంధ్రా ప్రజలను దూషించక్ఖర్లేదు. మీ ఏడుపు మీరు ఏడవండి...మా ఏడుపు మేము ఏడుస్తాము అంటున్నరు ఆంధ్రప్రజలు. కొంతవరకు ఇది నిజమే అనిపిస్తోంది.

December 1, 2009

ఎం.ఎల్.సీ. నాగేశ్వర్ జెంటిల్ మేన్?

మీలొ ఎంతమంది ఈ రొజు ఉదయం టీవీ-5 లొ జరిగిన " తెలంగాణా ప్రస్తుత పరిస్తితి" పై చర్చ చూసారో? దానిలో రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్త, ఎం ఎల్ సీ అయిన నాగేశ్వర్, ఆంధ్ర మేధావుల తరపున శ్రీనివాస్ మరొకరు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగేశ్వర్ ఉద్యమంలో విద్యార్ధులపై పోలీసుల దాడిని నిరశించారు. యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేసించే అవసరం లేదని అంటూ ఇంతవరకు యూనివర్సిటీ చరిత్రలో విద్యార్ధులు బాంబులతో దాడి ఎప్పుడూ చేయలేదని అది మరొకరి పనే అయిఉండవచ్చని అన్నారు. అంతవరకూ బాగానే ఉంది. తరువాత ఆంధ్ర మేధవుల తరపున శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక పేపర్ లో వచ్చిన వార్తను ఉటంకిస్తూ పన్నెండు సంవత్సారాల పిల్లలు తెలంగాణా కోసం ఆత్మ హత్యలు చేసుకుంటామని అంటున్నారని వారికి కనీసం ఉద్యమం అంటే తెలీయదు తెలంగాణా అంటే తెలీయదు అలాంటి వారిని రాజకీయ నాయకులు బలి పసువులు చేస్తున్నారని చెప్పబోతూ ఉంటే నాగేశ్వర్ ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆత్మహత్యలను నేను ఖండించాను కదా మీరెలా మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తారు అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. మీరు నన్ను అడుగుతారా? మేము ఆత్మహత్యలను సమర్ధించామా? నేను పార్టీలకు తప్పు చేస్తే తప్పు అని మంచి చేస్తె మంచిదని చెప్పాను. ఎన్నో చానల్స్ కి విశ్లేషణ చేసాను. నన్ను అడుగుతావా నేను వెళ్ళి పోతాను అంటూ చిందులు మొదలు పెట్టాడు. నిజానికి శ్రీనివాస్ ఆ ప్రశ్నను రాజకీయపార్టీలకు ముఖ్యంగా టీఆరెస్ ను ఉద్దేశించి అడగ బోతున్నాడు. పేపర్‌లో క్లిప్పింగ్ చూడనీయకుండా ఆ విషయాన్ని చెప్పనీయకుండా నాగేశ్వర్ ఆడిన డ్రామా నాకైతే అసహ్యం వేసింది. నేను మిమ్మల్ని అడగలేదు అంటూ శ్రీనివస్ పదే పదే చెప్పినా ఆయన వీరంగం సృష్టించారు.చివరికి ఆ అంశన్ని వదిలిపెట్టి చర్చ ముగించారు. నాగేశ్వర్ అంటే నాకు ఇప్పటివరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఆయన కూడా ఫక్తు రాజకీయ నాయకుడు. నేను తెలంగాణా వాదినని ఒప్పుకొని వారి తరపున వాదించినా ఫర్వాలేదు కానీ మధ్యవర్తిగా రావడానికి అర్హుడు కాదు.

November 30, 2009

స్విమ్మింగ్ గోదావరి విత్ డాగ్ టైల్

అర్ధమైందా మీకు? అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమన్న మాట. సర్వశ్రీ కేసీఆర్ గారు తమ ఆమరణ దీక్షను పండ్ల రసం తాగి విజయవంతముగా విరమించారు. ఇది కూడా కేసీఆర్ స్క్రీన్ ప్లే లో భాగమే అయిఉండవచ్చు. వారిని ఇప్పటివరకు వెనకేసుకొచ్చిన వారందరికీ ఇది ఒక షాకింగ్ న్యూసే. ఉద్యమంలో మీరు త్యాగం చేయండి అంటూ తాను తమాషా చూడడానికే నిశ్చయించుకున్నారు. అవసరమైతే ఉరికంబం ఎక్కుతానని ప్రకటించి కొందరి అమాయకుల ప్రాణాలను గాలిలో కలిపేసారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ జ్వాలలో కొందరి అమాయక ప్రాణాలు గాలిలో కలసిపోయాక కొందరి నెత్తురు చిందించాకా వారికి ఙ్యానోదయం అయింది. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని నిర్నయించారుట. ఎందరో విద్యార్ధులు వీరి మాటలకు ఉద్వేగంచెంది రెండు రోజులుగా జైళ్ళలో మగ్గుతున్నారు. చాలా మంది విద్యార్ధులు ఉద్యమ బాట పడతామని ప్రతిగ్జ చేసేరు. వీరిని జైల్లో పెట్టినందుకు ఆత్మ హత్య ప్రయత్నాలు చేసారు. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణా సాధించుకు రమ్మని ఎన్నికల్లో గెలిపిస్తే మరి వారు ఇప్పటివరకు వారు చేసిందేమిటో? ప్రజాస్వామ్య బద్ధంగా చేయబోయేదేమిటో వారే చెప్పాలి. ఎందుకంటే వారి స్టైలే వేరు. అమాయక విద్యార్ధులు వారి మాయ మాటల వలలో పడకుండా ఎవరైనా కాపాడగలరా?

వంది మాగధులు కొత్తగా చెప్పేది ఏమిటంటే కేసీఆర్ విద్యార్ధులలో ఉద్యమ స్పూర్తి నింపారని. దానికి అయిన ఖర్చు కొందరి ప్రాణాలు కోట్లలో ఆస్తి నష్టం

November 29, 2009

త్యాగాలు చెయ్యండి నేను తమాషా చూస్తా ! !

అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. స్క్రేన్ ప్లే ప్రకారం కధ నడుస్తోంది. అరెస్టు చేయగానే అంతకన్న సేఫ్ ప్లేస్ దొరకదన్నట్టు కేసీఆర్ వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఆమరణ దీక్ష కూడా తప్పింది అనుకొని ఉంటాడు. తరువాత ఆ బాధ్యత హరీష్ రావు తీసుకున్నాడు. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఊరుకోరుట. ప్రజలు సరే మరి ఈయన ఏమి చేస్తాడుట? ప్రభుత్వం కేసీఆర్ ని మరల తీసుకొచ్చి వేదిక వద్ద దింపి ఆయనను దీక్షలో కూర్చొబెట్టాలిట. మైకు ముందు హరీష్ చెప్పే మాటలు నాకైతె భలే నవ్వు తెప్పించాయి. మధ్యలో నాగం జనార్ధన రెడ్డి గారు కేసీఆర్ ని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం అంటూ కేకలు. వీరి కప్పదాటు నిర్నయాలకి ప్రజలు చీ కొట్టినా సిగ్గు రాలేదు. ఇటువంటి పరిస్తుతులలో సులువుగా భావొద్వేగానికి గురయ్యేది విద్యార్ధులే. ఉద్రిక్త వాతవరణం ఉన్నప్పుడు పోలీసు కాపలా సర్వసాధారణం. వారిలో ఒకరు పోలీసుపై రాయి విసరడంతో యూనివర్సిటీ కేంపస్ లో ఒక పోలీసుకు మొఖం పగిలి రక్తం కారడం స్పస్టంగా కనబడింది. వాళ్ళు అసలే పోలీసులు వాళ్ళు ఊరుకుంటారా? దొరికిన వాడిని దొరికినట్టు విరగ గొట్టేరు. ఎల్బీ నగర్‌లో ఒక విద్యార్ధి పెట్రోల్ పోసుకుంటే టీఆరెస్ కార్యకర్తలే నిప్పు పెట్టారుట. వాళ్ళు కార్యకర్తలో లేక నర రూప రాక్షసులో తెలీదు. ఐనా మన దేశంలో పార్టీ కార్యకర్త అంటే వారి స్థాయి ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు. అదృష్టం కొద్దీ అతడు కొద్దిపాటి గాయాలటో బైటపడ్డట్టు అనిపించింది. ఒకవేళ అతడికి ఏమైన ఐఉంటే అతని తల్లికి కలిగే గర్భశోకాన్ని కేసీఆర్ పోగొట్టగలడా? తెలంగాణా ఏర్పడినా అతని జీవితాన్ని తిరిగి ఇవ్వగలడా? ఇటువంటి త్యాగాలు ముందు టీఆరెస్ నాయకులు చేసి తరువాత ఆచరించమని చెపితే బాగుండేది. అది కేసీఆర్ తొ ప్రారంభిస్తే మరీ బాగు.

నేనే పోలీస్‌నైతే ముందుగా కవరేజ్ కొచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే చెత్త న్యూస్ చానెల్ విలేకరుల వీపు పగలగొట్టేవాడిని. మరి కేసీఆర్ ని అరెస్టు చేసారు కదా మీరేమి చేస్తారు అంటూ అగ్గిపుల్ల ప్రశ్నలు వేసి వారు చెప్పే ఎగవేత మాటలు మరల మరల ప్రసారం చేయడం. అది విని అమాయక విద్యార్ధులు రెచ్చిపోవడం. ఇంకా నంగి నంగి మాటలలో మాటలు కూడా మాట్లాడలేని విద్యార్ధులు ఉద్రేకంగా చెప్పే మాటలు పట్టుకొని ఇక్కడ వాతవరణం చాలా ఉద్రిక్తంగా ఉందని సొల్లు కబర్లు చెప్పడం. ఈ రాజకీయ జగన్నాటకంలో ఎంతమంది బలవుతారో ?

November 27, 2009

నే సచ్చిపోతా...నన్నాపకండి ! !

చాలా సినీమాల్లో మనం చూసాము వేణుమాధవ్ కోపంగా నే సచ్చిపోతా నన్నాపకండి అని గింజుకుంటూ ఉంటే వెనుకాల స్నేహితులు పట్టుకొని ఆపుతూ ఉంటారు. విసిగిపోయిన స్నేహితులు సరే సచ్చిపో అని వదిలేస్తే సరే మీరు చెప్పినాక నేనెందుకు చస్తాను అంటూ వాయిదా వేస్తాడు. నిన్న న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే నాకెందుకో షడన్‌గా అది గుర్తుకు వచ్చింది. తెలంగాణా సాధన కోసం మధువును కూడా త్యాగం చేసిన కేసీఅర్ నిన్నటినుండి అప్పగింతల కార్యక్రమం మొదలు పెట్టారు. ముందు ఇంటివారి వీర తిలకం అందుకున్నారు. తరువాత తెలంగాణా భవన్‌లో అప్పగింతలు చివరికి ప్రెస్ వారికి కూడా మళ్ళీ కలుస్తానో లేదో అంటూ సెలవు తీసుకున్నారు. 29న జరగబోయే నాటకానికి రిహార్సల్స్ మొదలయ్యాయని చెప్పకనే చెప్పారు. వారు స్వయంగా వధ్యశిలకు వెడుతున్న ఆవులా అనుకున్నా ఇదంతా ఫక్తు నాటకీయ పరిణామలా ఉంది. మధ్యలో వారిని వారు పొట్టి శ్రీరాములు తో కూడా పోల్చుకున్నారు. వారి ముందస్తు ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తమ మరణ దీక్షను ఆపుతుందో లేదో అనే అనుమానంతో కావచ్చు. నాకెందుకో ప్రభుత్వం కేసీఅర్ దీక్షను నిరవధికంగా కొనసాగనివ్వాలని కోరుకుంటున్నాను. ముందుగానే వారిని అరెస్టు చేస్తారని కేసీఅర్ కి తెలుసు. కొంత రసాభాసతో అది ముగుస్తుందని నాకు మీకు వారికి కూడా తెలుసు. ఐనా కూడా వారు తమ నాటకాన్ని విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ ప్రత్యేక తెలంగాణా అవసరమా కాదా అన్నది సమస్య కాదు, ప్రజల ఆశయాలకు తగ్గ నాయకుడా కాదా అన్నది ప్రధాన సమస్య. అది కేసీఅర్ తొ ఎన్నటికి కాదు అన్నది నగ్న సత్యం.

October 29, 2009

పునర్వివాహ ప్రాప్తిరస్తు ! !

తిరుమల అనే పదమే పవిత్రమైనదిగా భావిస్తారు హిందువులు. ఇక వేంకటేశుడంటే చెప్పక్కర్లేదు. ఫ్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా భక్తులు సందర్శించే ప్రదేశాలలో తిరుమల ఒకటి. అత్యధికంగా విరాళాలు పొందే దేముడు వేంకటేశుడు. ఆయన తరపున భక్తుల ఆలన పాలన చూసేది తిరుమల తిరుపతి దేవస్తానం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్మ ప్రచారం చేయడం దాని విధులలో ఒకటి. కాని ఈ మధ్య టి టి డి నిర్నయాలు ధర్మ ప్రచారం కంటే రాజకీయ ప్రచారానికే మగ్గు చూపుతోందని అనిపించక మానదు. వాటిలో మొదటిది దళిత గోవిందం. దళితులకు తిరుమలో ప్రవేశం నిషిద్ధం కాదు. వేంకటేశుడిపై విశ్వాశం ఉన్న అన్య మతస్తులు కూడా స్వామివారిని దర్శించవచ్చు. అలాగే అందరూ వేంకటేశుడిని దర్శించుకుంటున్నారు కూడా. అలాంటి పరిస్థితులలో వేంకటేశుడిని ప్రత్యేకంగా దలితులవద్దకు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. కేవలం అది ఒక రాజకీయ నాయకుల వక్ర బుద్ధి. లేనిపోని వివక్షను ఎత్తి చూపడమే. చివరికి ఒక న్యూస్ చానల్ వాడలో ఊరేగించిన విగ్రహాలను గర్భ గుడిలో కాక మరో చోట ఉంచారని వార్త. ఉత్సవ విగ్రహాలను గర్భ గుడిలో ఎప్పుడూ ఉంచరు. కానీ ఆ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారు. అలాగే ఇప్పుడు కళ్యాణమస్తు కార్యక్రమం. మరి ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో వారికి పునర్వివాహ ప్రాప్తిరస్థు. ఎందుకంటే ఈ కార్యక్రమం లో పెళ్ళి చేసుకొనే కొందరు తమ పిల్లలతో పాటు కూర్చొని భార్యని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం, మారు వివాహాలు చేసుకోవడం వార్తలలో చూస్తున్నాము. దీనికి కారణం అధికారులకు టార్గెట్లు ఇవ్వడమే. ఒక వూరిలో నిర్వహించే కార్యక్రమానికి తప్పనిసరిగా వొందమంది ఉండాలని టిటిడి అధికారులకు ఏలినవార్లు హుకుం జారీ చేస్తే జరిగే ఉపద్రవం ఇది. ఇదివరకు డాక్టర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు ఇచ్చేది. అలా ఉంది ఈ విషయం కూడా. కొంతలో కొంత సంతోషం వారు కేవలం పెళ్ళిళ్ళు చేసి అంతటితో అగేరు. కాని ఇలాంటి విషయాల వల్ల అధ్యాత్మిక విషయలు పక్క దారి పట్టే ప్రమాదం ఉంది. వారి దృష్టి కేవలం ధర్మ ప్రచారం పైనా సేవా కార్యక్రమాలపైన ఉంచితే మన అందరికి మంచిది.

September 18, 2009

యత్‌భావం తత్‌భవతి!!

ఏమిటో ఈ మధ్య బ్లాగ్లోకం వైపు చూడటానికి అస్సలు వీలు పడలేదు. ప్రయారిటీలు మరేయేమో అనుకునేరు, కేవలం పని వత్తిడే. మధ్య మధ్యలో ఒక చూపు మాత్రం ఇటువైపు వేస్తునే ఉన్నాననుకోండి.గడిచిపోయిన విషయాలు తలుచుకుంటే బాధ కలిగించే సంఘటన మాత్రం రాజశేఖర రెడ్డి మరణం. ఇటు రాష్ట్రాన్ని అటు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభావితం చేయగలిగిన సత్తా సంపాదించిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి. అతడు మరికొంత కాలం బ్రతికి ఉంటే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు చాలా మారి ఉండేవి. కాంగ్రెస్ అధీష్టానాన్ని ఒక రకంగా అచేతనం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్న ఏకైక వ్యక్తి. రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి మాత్రమే అనిపించే స్థాయికి తీసుకు వచ్చాడు. ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ హయాంలో పదవులు నిర్వహించారు. అందరూ అధీష్టానికి అనుగుణంగానే నిర్నయాలు చేసేవారు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం తన నిర్ణయాలకు అనుగుణంగా అధీష్టానాన్ని నడిపించాడు. ఎదైనా ఆయన మరణం ఒక దురదృష్టకర సంఘటన. కానీ తదనంతర సంఘటనలు మాత్రం కడుపులో దేవినట్టు చేసాయి. జగన్ తన తండ్రి కడసారి యాత్రలో పెట్టుడు దణ్ణాలు కేవలం సానుభూతి కోసమే. ఎత్తిన చెయ్యి దాదాపు రెండు రోజుల తరువాత దింపాడు. దీనికి పూర్తి స్క్రీన్‌ప్లే కె వి రామచంద్ర రావు. ఆయన ప్రయత్నాలు వైఎస్సార్ చనిపోయిన వెనువెంఠనే ప్రారంభమయ్యాయి. ఎక్కడ పట్టు వదిలితే విహెచ్, జైపాల్ రెడ్డి, డీఎస్ లు ముందు వరుసకు వచ్చేస్తారోనని ఆయన భయం.ఈ విషయంలో మీడియా కూడా చాలా అతి చేసింది. ఈ ప్రభావం వల్ల నూట అరవై మంది మృతి చెందారు.ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావొద్వేగానికి గురి కావడం చాలా సహజం. ఆ ప్రభావాన్ని మీడియా తగ్గించే ప్రయత్నం చేసే బదులు చనిపోయిన వారి వేళ్ళు చూపించి కాళ్ళు చూపించి మరింత పెంచింది. వంశ పార పర్యంగా ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ అధీష్టానానికి సుతారమూ ఇష్టం లేదు. జగన్‌కి అంత సీన్ ఉందా అన్నది కూడా ప్రశ్న. రోశయ్యకు అందరిని కలుపుకు వెళ్ళేంత శక్తి ఉందా అన్నది కూడా అనుమానమే. కేవలం వైయస్సార్ వల్ల పార్టీలో ప్రాపకం పెరిగింది. ప్రస్తుతానికి ఒక పెద్ద దిక్కు. అధీష్టానం ఒక నిర్నయం తీసుకొనేదాకానే ఈ శాంతి సంప్రదింపులు. తరువాత కధ షరా మామూలే. కాంగ్రెస్ చరిత్రే దీనికి ఉదాహరణ. ఇది నా అభిప్రాయం మాత్రమే. మరి మీరేమంటారో?

August 10, 2009

సంస్కారం కులాన్నిబట్టి వస్తుందా?

విద్య నేర్పే గురువు సాక్షాత్తూ భగవత్ స్వరూపంగా చెపుతారు. అలాంటి భగవత్ స్వరూపమే మా మాస్టారు. ఆజానుబాహుడు. ఎప్పుడూ ఖద్దరు బట్టలే కడతారు. పొడవైన అంగీ, పంచె కట్టు, భుజంపై మువ్వన్నేల రంగుతో ఉండే కండువా, మొఖంలో తేజస్సు, గాంభీర్యం, ఏ విషయాన్నైనా తెలియ చెప్పగల విఙ్నానం ఆయన సొత్తు. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ పుస్తకాలుండేవి. అవేమిటో తెలుసుకొనే సాహసం మాకు ఉండేది కాదు. ఆయన క్లాసులోకి వస్తే చాలు పిల్లలందరమూ బుద్ధిమంతులుగా కూర్చుండి పోయేవాళ్ళం. అలాగని మమ్మల్ని ఎప్పుడూ మందలించిన పాపాన కూడా పోలేదు. ఆయన చెప్పేది చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉండేవి. ఊరి పెద్దలలో ఆయన ఒకరు. అనేక సలహాలు సంప్రదింపులు ఆయనతో జరిగేవి. రోడ్డుపై ఆయన నడిచి వెడుతూ ఉంటే గౌరవంతో అందరూ పక్కకు తప్పుకొనే వాళ్ళు. ఇన్ని విశిష్ట లక్షణాలున్న ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు. వారికి కులాన్ని అంటగట్టి పాపం మూటగట్టుగోవడం నా ఉద్దేశ్యం కాదు. సంస్కారం అనేది కులాన్ని బట్టి రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. గొప్ప వ్యక్తులకు మతం రంగు, కుల కంపులు అంటవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. వ్యక్తిత్వం అనేది కేవలం పుస్తకాలు చదవడంవల్ల రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మర్యాద అనేది అడిగి తీసుకొనేది కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. సంఘంలో మనలని ఎవ్వరూ పట్టించుకోరు అనడం బ్రమ అని చెప్పడమే నా ఉద్దేశ్యం. నీ మాటలు, నీ నడవడికే సంఘంలో నీకొక స్థానన్ని కల్పిస్థాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మహాత్మ గాంధీ కూడా జాతి వివక్షను చవి చూశాడు. దానివల్ల ఆయన్లోని నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయికాని నశించి పోలేదు. ఇలాటి ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు!!

సాంఘీకంగా ఏర్పరచుకున్న కట్టుబాట్లని పాటించాలని రాజ్యాంగంలో రాసి లేదు. ఎవరి చిత్తము వచ్చినట్ట్లు వారు నడుచుకోవచ్చు. బ్రాహ్మలు మాంసాహారము తింటానన్నా, మరొకళ్ళు మా సంస్కృతి ప్రకారం గొడ్డు మాంసము తింటానన్నా నిరభ్యంతరంగా తినచ్చు. దొరికితే కుక్క మాంసము కూడా తినొచ్చు. ఈశాన్య ప్రాంతాలలో బంధువులు వచ్చినప్పుడు ప్రత్యేక వంటకంగా కుక్క మాంసమే వండుతారు. నీ స్వేచ్చని కాదనే హక్కు ఎవరికీ లేదు. వండుకు తిన్నా పచ్చిది తిన్నా కూడా కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ నీ అలవాట్లని మరొకరిపై రుద్దటం అనుచితం. నీ స్వేచ్చ నీ వరకే పరిమితం. సాంఘీకంగా సర్వోన్నతుడివి కావాలంటే మాత్రం మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి. వారి అభిప్రాయాలతో నీకు పని లేనప్పుడు నువ్వెప్పటికీ ఒంటరివే!!

August 6, 2009

నా అభిప్రాయంలో మగధీర.....

మగధీర సినీమాకి చేసినంత పబ్లిసిటీ ఈ మధ్య కాలంలో మరే సినీమాకీ చేయలేదేమో. మెగా స్టార్ తనయుడు, భారీ బడ్జెట్, పేరున్న దర్శకుడు ఇంకా ఇతర అంశాలు ఎన్నో ఈ సినీమా అంటే ఒక ఉత్సుకతని కలిగించాయి.సినీమా రిలీజ్‌కు ముందే ప్రతీ ప్రేక్షకుడు చాలా భారీ స్థాయిని ఊహించాడు. మరి సినీమా చూసిన ప్రేక్షకుడు తాను ఊహించిన స్థాయిలో ఉందని ఒప్పుకున్నాడా? నాలుగు రోజుల క్రితం నేను కూడా ఈ సినీమాని చూసేను. హాలివుడ్ సినీమా "త్రీ హండ్రెడ్" చూసిన ప్రేక్షకులెవరికైనా మగధీర సినీమా చూస్తున్నప్పుడు ఒక షాడో లైన్లా ఒక్కసారి గుర్తుకు వచ్చి ఉండాలి. అలాగే అరుంధతి కూడా. రాజమౌళీ రాంచరణ్‌తో సినిమా తీయడానికి అతనిని చాలా విధాలుగా పరీక్షించి ఉంటాడనిపిస్తోంది. రాంచరణ్ ఒకరకంగా పౌరాణిక పాత్రలకి నప్పినంతగా సాంఘీక పాత్రలకి నప్పకపోవచ్చనిపించింది.కోల మొహం, పొడవైన ముక్కు పౌరాణిక పాత్రలకి చక్కగా నప్పుతాయి. అందువల్లే కధ ఎంపికకి ఫ్లాష్ బేక్‌లో పౌరాణిక కధని ఎంచుకున్నాడు. ఒకరకంగా సినిమా మొదటి భాగంలొ ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురౌతారు. రెండో భాగం మొదలు అయ్యాకా గానీ అసలు కధ మొదలవ్వదు. రెండో భాగంలో భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ ప్రేక్షకులని మెప్పించాయి. రాంచరణ్ రాజ సైనికుడి పాత్రలో ఇమిడిపోయాడు. అతని శరీర ధారుడ్యం కూడా చక్కగ నప్పింది. కాజోల్ కూడా రాకుమారి పాత్రకు చక్కగ నప్పింది. కాని కొన్ని సంఘటనలు మాత్రం కధా పరంగా అవసరం కాకపోయినా ఖర్చుకు వెనకాడకూడదన్నట్టుగా కనిపించాయి. అతిధి పాత్రలో చిరంజీవి కనిపించడం, బంగారు కోడి పెట్ట పాటను మరలా ఎంచుకోవడం కేవలం చిరంజీవి అభిమానులకోసమే. కమర్షియల్‌గా పెట్టిన ఖర్చుకు కొంత గ్యారంటీ ఉండటంకోసమే. టోటల్‌గా సినీమా ఓకే. ప్రతీవాళ్ళూ ఒకసారి చూడవచ్చు.

July 28, 2009

హేతువాదము - కాకిరెట్ట!!

హేతువాదం అంటే ఏమిటి? హేతువాదులేవరు?
నాస్తికులనా? విఙ్నాన సంపన్నులనా? లేక వితండవాదులా?
నాస్తికత్వం లేదా ఈ నాస్తికులు అనేవాళ్ళు ఆస్తికత్వం ఆరంభం నుండే ఉన్నారు.
ఆస్తికత్వం ఎప్పటినుండి ఉంది? వేదకాలం నుండి ఉంది.
మరి వేదాలు ఎప్పుటినుండి ఉన్నాయి? ఎవరు రాసేరు?
దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి.
దీనిపై నాస్తికులు కూడా కొంత అధ్యయనాలు చేసారు.
19వ శతాబ్దంలో సర్ విలియం జొన్స్ చేసిన అధ్యయనంలో వేదాలు క్రీ.పూ. 1500లో రాయబడ్డాయి అని తీర్మానించాడు. కానీ దానికి తగ్గ అధారాలు చూపించలేక పొయాడు.
బాలగంగాధర్ తిలక్ చేసిన అధ్యనంలో క్రీ.పూ.4500కు పూర్వమే ఈ వేదాలు రాయబడ్డాయని అనడానికి కొని రుజువులు దొరికాయి. మరి అప్పుడు ఎవరు రాసి ఉంటారు?
ఙ్నాన వంతులైన ఋషులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,అధర్వణవేదం.
ఈ నాలుగు వేదాలు హిందూ మతానికి పునాదులు.
హిందూ మతం యొక్క మూల సుత్రం "మానవుడిలోనే మాధవుడున్నాడు".
అంటే సాటి మనిషిలోనే భగవంతుడిని దర్శించడం.
ఆ విధంగా హిందూ మతం యొక్క ఆదిని కనుగొనడం ఎవరివల్ల కాలేదు.
మనువు నాస్తికుడు అంటే వేదాలు నమ్మనివాడు అని అర్ధం చెప్పాడు.
అంటే అప్పటినుందే ఈ నాస్తికులున్నరన్నమాట.
ఒక ఉదాత్తామైన లక్ష్యంతో మరెంతో ఘనమైన చరిత్రతో ఆది అంతాలు లేని ఏకైక మతం
హిందూ మతం.
కాలగతిన కొంతమంది దానిని వక్రీకరించి తమ స్వార్ధానికి వాడుకున్నంత మాత్రాన
దాని మూలాలను తప్పుబట్టడం సరియైనది కాదు.
తప్పు జరిగినప్పుడు దానిని ఖండిచడానికి ఏ మతమూ అడ్డు రాదు.
హిమవత్ పర్వతాల కీర్తికి అసూయ చెందిన ఒక కాకి ఆ పర్వతంపై రెట్ట వేసి
"ఆహ నేను హిమాలయాల తెల్లదనాన్ని పోగెట్టేను" అనుకున్నదట.
అలా ఉంటాయి ఈ హేతువాదుల చేష్టలు.
హేతువాదులమనుకొనే ఓ వితండవాదులారా
మనిషియొక్క నడవడికను తప్పుబట్టండి, మతాన్ని కాదు.

July 25, 2009

తిక్క వేషాలు!!

మా బాసు ఆఫీసులో నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. నిజానికి అది పూర్తిచేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది. కానీ దానిని మరుసటి రోజుకు పూర్తి చేసి హెడ్ ఆఫీసుకు పంపాలి. ఆ బాధ్యత నామీద పెట్టాడు. ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటలకు ఆఫీసుకు చేరుకున్నాను. చేరుకున్నదే తడవుగా పని ప్రారంభించాను. ఒక అర్ధగంట గడిచిందో లేదో ఫోన్ మ్రోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీశాను. హల్లో అని పలకరిస్తే అవతలివాళ్ళు
"సెప్టిక్ టాంక్ క్లీనరా?" అని అడిగాడు. నాకు మొదట అర్ధం కాలేదు.
మరోసారి "ఏమిటి?' అని ప్రశ్నించాను.
అవతలి వ్యక్తి "ఏమయ్యా ఇది సెప్టిక్ టాంకు క్లీను చేసే టాంకర్ లా రీయేనా?" అని అడిగాడు.
నాకు భలే తిక్క పుట్టింది. ఒళ్ళు తెలియకుండా పొద్దున్నే మా నంబరుకి ఫోన్ చేసి నా పని చెడగొట్టడమే కాకుండా సెప్టిక్ టాంక్ క్లీన్ చేసే అఫ్ఫీసా అని అడుగుతున్నాడు. కాస్త కోపన్ని అదుపులో ఉంచుకొని నెమ్మదిగా
"అవును" అని సమాహానం చెప్పాను.
"మా సెప్టిక్ టాంక్ నిండిపోయింది. అది క్లీన్ చేయాలి" అన్నాడు
"మీరు ఉండేది ప్రదేశం ఎక్కడో?" అన్నాను అతడు వివరాలు చెప్పాడు.
"మీ ఇంటిలో ఎంతమంది ఉంటారు?" నేను
"నలుగురు" అతడు
"అందరూ పెద్దవాళ్ళేనా?" నేను
"ఆ..అందరూ పెద్దోళ్ళే" అతడు.
"టాంక్ వెడల్పు లోతు ఎంత?" నేను
"ఉంటాది లోతు పది అడుగులు వెడల్పు ఎనిమిది"
"మీ ఇంటిలో అందరూ బలంగానే ఉంటారా?" నేను
"ఆటి ఇవరాలెందుకు?" అతను
"నే చెపుతాగా...మీ ఇంటిలో నాలు బక్కెట్లు ఉన్నాయా?" నేను
"ఆ ఉండాయి" అతను
"నాలుగు తాళ్ళు ఉన్నాయా?" నేను
"తాళ్ళు ఉండాయి" అతడు
"ఆ తాళ్ళు బక్కెట్లకి కట్టి మీరు నలుగురూ కలిసి తోడి పక్కింట్లొ పోసేయ్యండి" అన్నాను నేను
"అదేంటి మేము తోడటమేంటి?" అతడు
"ఏం మీరు పెట్టిన చెత్త మీకే అసహ్యం వేస్తే ఎలా? దానికి మేము రావాలా? ఇంకోసారి టాంకర్ కావాలని ఫోన్ చేస్తే టాంకర్లో ఉండే చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో పొయిస్తా. ఫోన్ పెట్టు" అని అరిచాను.
అప్పటిగ్గాని నా కోపం తీరలేదు. ఇది జరిగి వారం రోజులైయింది. ఈ సంఘటన మా ఫ్రెండ్స్‌కి చెప్పి పడి పడి నవ్వుకున్నాము ఆ సమయంలో ఫోన్ చేసిన వ్యక్తి మొహం ఎలా ఉండి ఉంటుందో తలుచుకొని. ఇది నిజంగా తిక్క వేషమే కదా?

July 20, 2009

కె.బ్లా.స. పై కోర్టులో కేసేస్తా..!!

అవును మిరు విన్నది నిజమే. కె.బ్లా.స.పై కోర్ట్‌లో కేసేద్దమని నిర్నయించుకున్నాను. లేకపొతే ఒక పార్టీలో గానీ ఒక సంఘంలో గానీ అద్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాలిగానీ ఫ్రెండ్షిప్‌కొద్దీ పదవులూ ఇచ్చేసుకుంటే ఎలా? తె.రా.స లో పరిస్తితి చూసికూడా ఇలా ఒంటెద్దు పోకడలకు పొతే ఎలా? కె.బ్లా.స లో అలా జరగడానికి వీలు లేదు. ఎన్నికలు జరగాల్సిందే. లేదా నాదో కోరిక తీర్చాలి. అదేమిటంటే ఒక్క రోజైనా ఆ అద్యక్ష పదవి నాకు ఇవ్వలి. అదీ ఒప్పందం. ఎందుకంటే కె.బ్లా.స అద్యక్ష హోదాలో బ్లాగర్లకు ఒక విన్నపం /నోటీస్/ సూచన ఎదైనా గానీండి ఒకటి చేయాలి. అదేమిటంటే నోటీస్ సారాంశం ఇది. తెలుగు బ్లాగర్లకు విన్నపం. బ్లాగంటే ఒక ఙ్నాపికలా ఉండాలి. చూడగానే మనసులోని సంఘటన ఎప్పటిదో తట్టి లేపేదిగా ఉండాలి. మదుర స్మృతిగా ఉండాలి. చూడగానే అబ్బ అనిపించాలి. ఎవ్వరూ గమనించని విషయాన్ని తట్టి లేపాలి. విఙ్నానాన్ని ఇవ్వాలి. వినోదాన్ని ఇవ్వాలి.మనసుకు ఉల్లసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఆలోచన కలిగించాలి, ఆశ్త్చర్యాని కలిగించాలి. టపా చదవగానే వేళ్ళు అసంకల్పితంగా కామెంట్ బాక్స్‌వైపు కదలాలి. పైన చెప్పిన విధంగా ఒక్క లక్షణం లేకపోయిన పర్వాలేదు, కానీ కొందరిని కించపరచేదిగా ఉండకూడదు. కొందరి మనో భావాలు గాయ పరచేదిగా ఉండకూడదు. వర్గ బేధాలు, కుల బేధాలు కలిగించేదిగా ఉండకూడదు. ఈ మధ్య బ్లాగుల్లో సున్నితమైన అంశం మత భావాలపై వస్తున్న టపాలు చూడగానే కొందరి మనసులు ఖచ్చితంగా గాయ పడి ఉంటాయి. మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళపై వస్తున్న టపాలు, వారి వెక్కిరిస్తూ రాస్తున్న రాతలు నిజంగా శోచనీయం. ఎవరి విశ్వాశం వారిది. ఒకరి విశ్వాశాన్ని గౌరవించకపోయినా అగౌరవ పరచడం అమనుషం. ఇటువంటి టపాలకు బ్లాగు లోకంలో గౌరవ సభ్యులుగా (నేను) భావిస్తున్న పెద్దలు కూడా వంత పడడం మరింత క్లేశాన్ని కలిగిస్తోంది. మతపరంగా జరిగే అన్యాయాన్ని అడ్డగించు, మతాన్ని కాదు. మతం ఒక నమ్మకం. మతం ఒక విశ్వాశం. బ్లాగుల్లో హిట్లే పరమావధిగా, కామెంట్లే కొలతలుగా రాతలు రాసే వితండవాదులు ఉన్నారు. వారిని నిరుత్సాహపరచవలసిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. ఒకరు చీ కొట్టినప్పుడు నడవడిక మారితే అతడు మనిషి, లేకపొతే అతడు మహిషి. ఇట్లు కాబోయే అద్యక్షుడు, కె.బ్లా.స. అదండీ మాటర్. మరి నాకు ఒక్కరోజు అద్యక్ష పదవి ఇచ్చినా లేక నా నోటీస్ మీరు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. విషయం తేల్చగలరు.

July 19, 2009

మీ బ్లాగులో ఒకే టపాకు వంద కామెంట్లు కావాలాంటే..

తెలుగులో బ్లాగడమంటే దురదగుంటాకు ఒంటికి రాసుకోవడమే.
దురదగుంటాకు ఒంటికి రాసినకొద్దీ దురదలు పెరుగుతాయి.
అలాగె బ్లాగులో హిట్లు వచ్చేకొద్దీ బ్లాగడం పెరుగుతుంది.
మీరు కష్టపడి ఒక విషయం రాస్తే అదెవ్వరూ చదవలేదనుకోండి మీరు ఫీలవుతారా లేదా?
మరి మీరు రాసిన ప్రతీ విషయం ప్రతీ ఒక్కరిని చదివేలా చేయాలంటే కొన్ని సూత్రాలున్నాయి.
బ్లాగు సుత్రాల్లో మొదటిది మీరు ఎవ్వరూ వాడని పదాలు వాడాలి, వాటికి అర్ధం మీకు తెలియక పోయినా పరవాలేదు. దాని అర్ధం తెలుసుకోవడం కోసం కొందరు కామెంటుతారు కదా!
ఒకవేళ ఎవరైనా దానికి అర్ధం అడిగితే మీకు నచ్చినట్టు చెప్పవచ్చు.
రెండోది మీరు వినమృడివై ఉన్నట్టు రాయాలి కానీ ప్రతీ విషయంలోనూ ఎవరో ఒకరిని గిల్లుతూ ఉండాలి.
దానివల్ల బ్లాగుకు హిట్లు పెరుగుతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పుస్తకాలు చదవడం నేర్చుకో అని చెప్పాలి.
నువ్వు రాసింది తప్పు అని ఎవరైనా అంటే, సరిగా అర్ధం చేసుకోవడంలో ఉంది, రంధ్రాన్వేషణ వద్దు అని హెచ్చరించాలి. చివరిది ఎవరైనా మరీ విసిగిస్తే నీ కామెంట్లు ఇకముందు నా బ్లాగులో కనబడవు అనాలి.
ఈ సూత్రాలు వంటబట్టించుకున్న తరువాత మీరు తెలుగు బ్లాగు ప్రారంచించాలి.
ఉదాహరణకి నా మరో బ్లాగు "చెరసాల". చెరసాలలో మొదటి టపా ఇలా రాయడం ప్రారంభించాను.


టపా హెడ్డింగ్ : సూరిగాడి అనుభూతులు
ఆ రోజు పొద్దుగాలే సూరిగాడు లేచిండు. ఆడితోబాటు ఆడయ్య లేచిండు. ఆడయ్యతోబాటు ఆడమ్మ లేచింది.
ఆళ్ళతో్‌బాటే ఆళ్ళ కోడి లేచింది.ఒక్కసారిగా ఊరికి బ్రాహ్మనీకం వచ్చింది. (ఇక్కడ బ్రాహ్మనీకం అంటే తెలుగుదనం అని అర్ధం). ఊళ్ళోని ప్రజలందరూ అస్తిత్వాన్ని వదలి అభిజాత్యంతో తమ పనులకు బయలు దేరుతున్నారు.
ప్రతి వారూ సాంప్రదాయకంగా కట్టిన గోసీలను బిగించి పశువులను ప్రతిఘటిస్తూ కొందరూ, వర్గ సాంప్రదాయకంగా పొలాల్లోకి కొందరూ, సహేతుకంగా ఎడ్ల బండి తోలుతూ కొందరూ, సిద్ధంతాలు అలోచిస్తూ ఏమి చేయాలా అని కొందరు బయలు దేరారు. సూరిగాడికి చిన్న శంక కలిగింది. సమాజికంగా వెనుకబడిన మన ఊరోళ్ళకు ప్రభుత్వం సత్వర న్యాయం చేస్తోందా అని. వామ పక్ష చరిత్ర కలిగిన ప్రభుత్వం పోరాట పటిమ చూపితెనేగానీ న్యాయ ఫలాలు దొరకవని తెలుసుకున్న సూరిగాడు భోరున విలపించాడు.
దీనికి కారణం అగ్ర వర్నాల అభిజాత్యం అని భావించాడు. ఈ న్యాయం వారికి అందకుండా "పండితులు" కూడా అడ్డుపడుతున్నారు. సాహిత్యం, సారస్వతం అంటూ అరిచే ఈ పండితులకు తమ ఆకలి బాధలు తెలియవు.
వీరినుండి సామాజిక ప్రయోజనం ఆసించడం కన్న ఆత్మాశ్రయం ఒక్కటే మార్గం. సూరిగాడిలో ఒక సమాజోద్ధరణ భావం పైకి లేచింది. ఈ ధోరిణికి కారణం బ్రాహ్మలే ఐనా ఈ జాడ్యం తమ వారికి సోకకుండా మమేకం కావాలి అనుకున్నాడు.
అనుకున్నదే తడవు దక్షిణం వైపు పయనించాడు, కాల కృత్యాలు తీర్చుకోవడానికి.

నా ఈ మొదటి టపాకి మీరు నమ్మరు, నూట పన్నెండు కామెంట్లు వచ్చాయి.
మెచ్చుకుంటూ కాదనుకోండి. ఐనా మొత్తం మీద హిట్లు వచ్చాయా లేదా? అదీ విషయం.
కాబట్టి మీరు మొదలు ఈ సూత్రాలు పాటించండి.

July 15, 2009

దుఖ్ఖించువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు !!

ఈ రోజు ఉదయాన్నే, దేశంలో మనకు తెలియకుండా రాత్రి ఏమి జరిగిపోయిందో అని టివి చానల్ స్కాన్ చేశాను. న్యూస్ చానల్స్ అన్ని కూడా అత్యంత డబ్బుప్రపక్తులతో ఒకే తరహ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఏ చాన్నల్స్ చూసినా ఒక్కటే మాట పాపులను రక్షిస్తామని. పాపులను రక్షిస్తే మరి పుణ్యాత్ముల సంగతేమిటో? ఒక రకంగా భగవత్‌గీత చెప్పేదానికి ఖురాన్ చెప్పేదానికి కొంత సారూప్యం ఉంది. రెండూ కూడా తప్పులు చేయద్దనీ చేసినవారు శిక్షించబడతారనీ చెబుతాయి.ఇదివరకు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఉదయం పూట నాతియాకలాం ప్రసారమయ్యేది. అది వింటు ఉంటే భగవత్‌గీత వింటున్నామా లేక ఖురానా అనే సందేహం వచ్చేది. మంచి అనేది మతంతో సంభందం లేకుండా ఎవరు చెప్పినా వినాలి. హేతుబద్ధంగా భగవంతుడితో సంబంధం లేకుండా మంచి ప్రవర్తన ఉన్నా కూడా మంచిదే. కానీ పాపాలు చేసినా నిన్ను దేముడి చేత రక్షణ కల్పిస్తానని అనడం ఎంతవరకూ సబబో నాకు అర్ధం కాలేదు.పాపాలు కడిగివేయబడతాయిట. ఇదేదో నాకు రాస్ట్ర ప్రభుత్వం చేసున్న బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంలా అనిపించింది. ముందు తప్పుడు తడకలతో అప్రూవల్ లేకుండా నిర్మించడం, తరువాత తప్పులకు జరిమానా చెల్లించడం. నన్ను ఇంకా ఆశ్చర్య పరచింది, కుంటి వాళ్ళు, గుడ్డివాళ్ళు క్షణంలో వారి అంగ వైకల్యాన్ని పోగొట్టుకోవడం. ఒక వ్యక్తిని స్టేజ్ పైకి వీల్ చైర్‌లో తీసుకొచ్చారు. మతపెద్ద చేతితో అతనిని తాకగానే ఆ వ్యక్తి కరెంట్ షాక్ తగిలినట్టు కింద పడి వెంఠనే లేచి నిలబడి " నా రెండు కాళ్ళూ ఇప్పుడు పనిచేస్తున్నాయి" అని అరుస్తూ స్టేజ్ అంతా పరిగెత్తాడు. ఇది నిజంగా నమ్మశక్యమా? ఇది ప్రజలను వంచించడం కాదా? హేతువాదులకు ఇది కనిపించదా? హిందువుల మూఢ భక్తిని తప్పుబట్టే రాడికల్స్ ఈ విషయంపై ఎప్పుడైనా చర్చించారా?

July 13, 2009

కడుపు మంట - రకాలు

మనుషులకు వచ్చే కడుపు మంటలో రెండు రకాలున్నాయి. మొదటిది టీలు ఎక్కువ తాగడం, సిగరెట్లు కాల్చడం, సమయ పాలన లేని భొజనాలవల్ల ఎసిడిటీ పెరిగి వచ్చే కడుపు మంట. ఈ వ్యాధిని డాక్టర్ నయం చెయగలడు. రెండోది మనవల్ల ఇతరులకు వచ్చే కడుపు మంట.అంటే ఆఫీసులో బాసుకు మన పని నచ్చి ప్రమోషన్ ఇచ్చాడనుకోండి. మన కొలీగ్స్‌కు కడుపు మండవచ్చు. అలాగే అద్దె ఇటిలో ఉండే మనం ఒక సొంత ఫ్లాట్ కొనుక్కొని మారి పోతున్నామనుకోండి, ఆ అద్దె ఇంటి ఓనరుకి కడుపు మండవచ్చు. రోజూ డొక్కు స్కూటర్‌మీద తిరిగే మనం కొత్త బైక్‌గానీ కొత్త కారుగానీ కొన్నామనుకోండి, మన పక్క ఫ్లాట్లోని వాళ్ళకి కడుపు మండవచ్చు. పెళ్ళికాని మనకు, మనకు తెలిసిన పెళ్ళైనవాళ్ళందరూ రోజూ "ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా లేటైపొతే పెళ్ళి చేసుకుందమాన్న దొరకరు" అని సలహాలిచ్చే సమయంలో ఒక అందమైన పెళ్ళాం దొరికిందనుకోండి, సలహాలిచ్చినవాళ్ళందరికి కడుపు మండవచ్చు. మా అబ్బాయి క్లాసులో జెం, ఎప్పుడూ ఫస్టు రాంకే అని ఫోజు కొట్టే పక్కింటి అంకుల్, ఈ సారి వాళ్ళబ్బాయికి పదవ రాంక్ వచ్చి మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందనుకోండి, అంకుల్‌కి కడుపు మండవచ్చు. మనింటిలో లేని వస్తువుగురించి పక్కింటి ఆంటీ రోజూ గొప్పగా చెపుతున్న సమయంలో మనంకూడా ఆ వస్తువు కొనేసామనుకోండి, ఆంటీకి కడుపు మండవచ్చు. నేను వాడే వస్తువులన్నీ ఇంపోర్టెడే, లొకల్ వస్తువులు నేను వాడను అని ఫోజ్‌కొట్టే అంకుల్‌కి, నాక్కూడా మా అబ్బాయి అమెరికానుండీ సెల్‌ఫోన్ పంపించాడని చూపించామనుకోండి, అప్పుడా అంకుల్‌కి కడుపు మండవచ్చు. ఇన్ని రకాల కడుపు మంటలున్నాయన్నమాట! ఈ మంట చాలా మందికి లేకపోయినా ఒక్కొక్క సందర్భంలో బైట పడుతుంది. దీనిని ఏ డాక్టరూ నయం చేయలేడు.ఈ రకం కడుపు మంట వచ్చినప్పుడు ఆ వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కారు కొన్నామని పక్కింటి అంకుల్‌కి చెప్పేమనుకోండి, వెధవది రెండు లక్షలు పెడితే కారు. ఈ ట్రాఫిక్‌లో కారునడపడం అంత చిరాకు మరేది లేదు. నేనైతే ఎప్పుడైనా కావాలంటే టాక్సీని పిలుచుకొనె దర్జాగా వెళ్ళి వస్తాను అంటాడు. మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందని చెపితే, ఏమి చదువులో ఏమి స్కూళ్ళో, పిల్లలనందరిని కూర్చోబెట్టి రుబ్బించేస్తున్నారు.మా కాలంలో ఇలా కాదు అంటాడు. నాకు పెళ్ళి కుదిరింది అంటూ పెళ్ళికూతురు ఫొటో చూపించామనుకోండి, అందం కొరుక్కుతింటామా ఏమిటి, అమ్మాయి నెమ్మదిస్తురాలో కాదో కనుక్కున్నావా అంటారు. ఇది చాలామందికి ఉండే కడుపు మంట. ఇలాంటివాళ్ళని సంతృప్తి పరచడానికి మార్గాలు వెదకాలి. ఉదాహరణకి కారుగాని, బైక్ గాని కొన్నాక, పక్కింటాయనకి కారు కొని అలా తీసుకొస్తున్నానో లేదొ ఆటోవాడు వచ్చి గీత పెట్టేసాడని చెపితే ఆయన కారుకు లేద బైక్‌కి పడ్డ గీతని చూడటానికి ఆనందంగా వస్తాడు. మనం చేసిన పనుల్లో మైనస్ పాయింట్లు ముందుగా వీళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆనందపడతారన్నమాట. వీళ్ళ కడుపు మంటకి అదే మందు.
సూచన: కడుపులో ఎటువంటి మంటలు లేనివారు స్థితప్రఙ్నులని భగవత్‌గీతలో చెప్పబడింది.

గోపి గోపిక గోదావరి & తలనొప్పి

వంశీ సినిమాలంటే నాకో ప్రత్యేక అభిమానం ఉంది. చక్కని సెంటిమెంట్‌తో మలుపులు తిరిగే కధ, హాస్యం మంచి చిత్రీకరణ వంశీ సొంతం. అదే అభిప్రాయంతో గోపి గోపిక గోదావరి సినీమాకి వెళ్ళాను. నాకు చాలా గందరగోళంగా అనిపించింది. టూకీగా కధ ఏమిటంటే గోపీ(వేణు) హైదరబాదులో ఒక ఆర్కెస్ట్రా సింగర్. గోపిక (కమలిని ముఖర్జీ) గోదావరి ఒడ్డున ఉన్న పోలవరంలో ఒక డాక్టర్. గోదావరిలో తిరిగే ఒక లాంచిలో మొబైల్ హాస్పిటల్ నడుపుతూ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకి వైద్యం చేస్తూ ఉంటుంది. ఒక రోజు గోపికి ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్‌కి గోపిక ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ తనకి దొరికిందని గోపి చెపుతాడు.ఆ ఫోన్ హైదరాబాదులో ఉన్న తన స్నేహితురాలిది అని ఆ ఫోన్‌ను ఆమెకి అందచేయాలని గోపీని గోపిక కోరుతుంది. గోపీ ఆ ఫోన్‌ను తీసుకొని ఆమె వద్దకు వెడితే ఆ ఫోన్ పోవడం మూలాన ఆమెకు ఆమె బాయ్ ఫ్రెండ్‌కు జరిగిన గొడవలవల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తెలుస్తుంది. అదే విషయాన్ని గోపి గోపికకు తెలియ చేస్తాడు. తరువాత స్నేహితురాలి తండ్రి గోపికను కలిసి తన కూతురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు గోపి చాలా సహాయం చేసాడని చెపుతాడు. దానితో గోపిక గోపీ ఫోన్ మిత్రులవ్వడం వారిద్దరూ ఫోన్లోనే ప్రేమిచుకోవడం జరుగుతుంది. ఒకసారి హైదరాబదులో కలుసుకోవాలనే వారి ప్రయత్నం ఫలించదు. గోపి తల్లికి విషయం తెలిసి వారి పెళ్ళికి ఒప్పుకోక్పోవడంతో గోపిక గోపీని వచ్చి తన తల్లిని ఒప్పించమని చెపుతుంది. పోలవరం బయలుదేరిన గోపీ మరో గొడవలో ఇరుక్కొని తలమీద గాయంతో గోదావరిలోకి తోసేస్తారు దుడగులు. అతనిని గోపిక చూసి రక్షించి వైద్యం చేస్తుంది. కాని అతనికి తలమీద తగిలిన గాయంవల్ల ఙ్ణాపక శక్తి పోతుంది. అతనని తన హాస్పిటల్‌లోనే ఉంచుతుంది కానీ అతనే తన గోపీ అని తెలియదు. తరువాత అతనికి ఙ్నాపక శక్తి తిరిగి వచ్చినా తనే గోపీని అని చెప్పడు. ఇంతలోఅ గోపీ చనిపోయడని అనుకొని మరో పెళ్ళికి సిద్దపడుతుంది గోపిక. ఆ సమయంలో గోపీ తల్లి అసలు విషయం బయటపెడుతుంది. చివరికి వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుటారు. మధ్యలో కొన్ని ట్విస్టులు ఉన్నా కధ అంతా చాలా బోరుగా సాగింది.ఇరవై సంవత్సారల క్రితం తీయాల్సిన సినిమ. వంశీ సినీమల్లో సంభాషణల్లో శృంగారం ఉంటుంది. కానీ దీనిలో కాస్త శృతి మించింది . ఫొటోగ్రఫీ కూడా ఏమాత్రం బాగాలేదు. టోటల్‌గా రెండున్నర గంటల సినిమా రెండున్నర యుగాలుగా గడిచింది.

July 9, 2009

హేతువాదులూ మీరు ఆస్తికులా లేక నాస్తికులా?

ఈ మధ్యకాలంలో హేతువాదులమని చెప్పుకోవడం ఒక గొప్ప క్వాలిఫికేషన్ అని జనాలు అనుకుంటున్నారు. హేతువాదమంటే సైంటిఫిక్‌గా నిరూపించబడితేనే వారు ఏ విషయాన్నైనా నమ్ముతారన్నమాట. హేతువాదమనేది ముఖ్యంగా నమ్మకాలతొ ముడిపడి ఉంటుంది. ఆస్తికత్వం పుట్టినప్పుడే నాస్తికత్వం పుట్టి ఉంటుంది.దేముడు ఉన్నాడా లేదా అనే విషయంపై అనాదిగా చర్చలు జరుగూతూనే ఉన్నాయి. బ్లాగుల్లో కూడా ఈ విషయం పై అనేక చర్చలు జరిగే ఉంటాయి. కానీ నాస్తికులకన్నా ఆస్తికులకు కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. పొద్దున్నే లేవగానే అద్దంలో చెత్త మొహం చూడకుండా చక్కగా దేముడి మొహం చూసుకోవచ్చు. ఏదైన కష్టం వచ్చినప్పుడు ఓరి దేముడో నేనేమి పాపం చేసేనురో అని దీర్ఘంగా ఏడవచ్చు. మన చేతుల్లో లేని పని ఏదైనా ఉంటే దేముడిపై భారం వేయవచ్చు. గుళ్ళు గోపురాలంటూ చక్కగా ఊళ్ళు తిరగొచ్చు. మరిన్ని అడ్వాంటేజీలు వదులుకొని నాస్తికులు ఏమి సాధిస్తారో నాకు తెలియదు. భూమిమీద గాలి నీరు తిండి ఆవకాయి, మాగాయి అన్నీ ఉన్నాయి.మరే ఇతర గ్రహాలమీద లేవు. ఆస్తికులు ఇవన్ని భగవంతుడి సృష్టి అని తృప్తిగా చెప్పుకుంటారు. కాని నాస్తికులు ఇవన్ని అనుభవిస్తూ కూడా ఇదంతా ఎవరు సృష్టించారో తెలియని సైన్స్ అంటారు. భూమిపై హాయిగా నడుస్తున్నాము, డాన్స్ చేస్తున్నాము. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే నడవగలుగుతున్నమని అంటే మరి ఇతర గ్రహాలకు ఎందుకు లేదు? సూన్యంలో గ్రహాల్న్ని వలయాకారంలో తిరగడానికి శక్తినిచ్చినదెవరు? చంద్రుడికి లేని గురుత్వాకర్షణ భూమికి ఎలా వచ్చింది? చంద్రుడిలొని చల్లదనం సూర్యుడికి ఎందుకు లేదు? వీటిలోని మంచి లక్షణాలు భూమి ఎలా అందుకోగలుగుతోంది? మనం మురిసిపోయే తొలకరి జల్లులు భూమికే ఎందుకు? ఇవన్నీ మన కళ్ళ ఎదుటి సాక్ష్యాలు. గ్రహ మండలాల గురించి సైన్స్ చెప్పేది చాలావరకు ఊహాగానాలు మాత్రమే. జీవిత కాలం అంతా కనుగొని చెప్పింది పిసరంత. ఇంకా బొలేడు మిగిలి ఉంది. కనిపించేదానికి కారణం చెప్పడానికే ఇంతకాలం పడితే అది సృష్టించబడడానికి ఇంకెంత శక్తి కావాలి? ఆ తెలియని శక్తే భగవంతుడని అనుకుంటున్నారు. అతని రూపం ఊహాజనితం కావచ్చు, కదలికలు ఊహజనితం కావచ్చుగాక ఆడ మగా అనేది కూడా ఊహా జనితం కావచ్చు.అది ఏదైనా ఎవరైనా ఒక శక్తికి ప్రతిరూపం. ఇంకో చిన్న విషయం ఆస్తికుడు చచ్చిపోతూ నేను అందరికి మంచి చేసాను భగవంతుడు మరుజన్మలో నాకు మంచి చేస్తాడు అనే తృప్తితో మరణిస్తాడు. కాని మరుజన్మ లేదనుకొనే నాస్తికుడు నా శరీరంలోని కదలికలు ఇక ఆగిపొతాయి, ఇక నేను చెయగలిగేది ఏమిలేదు అనుకుటూ మరణిస్తాడు. ఇదే ఆస్తికత్వానికి నాస్తికత్వానికి ముగింపులోని తేడా. మీరేమంటారో?

July 7, 2009

తెలుగు బ్లాగరు పారిపోతున్నాడు పట్టుకోండి!!

నేనా రోజు బజారుకు వెళ్ళాను. అంతా చాలా రద్దీగా ఉంది. ఫ్రూట్స్ కొందామని చూస్తూంటే కొందరు వ్యక్తులు ఒక యువకుడిని వెంటపడి తరుముతున్నారు. ఆ యువకుడు ఆ వ్యక్తులనుండి తప్పించుకోవాడినికి వేగంగా పరిగెడుతున్నాడు. ఆ గుంపులో వివిధ వయస్సుల వాళ్ళు ఉన్నారు. కొందరు అరుస్తున్నారు
"ఎలాగైన పట్టుకోండి..మళ్ళీ బ్లాగులో రాయకుండా చితక్కొంట్టండి" అంటున్నారు. మరికొందరు
"పారిపోతే దేశంలో ఎక్కడినుండైనా బ్లాగింగ్ చెశేస్తాడు. చేతులు విరగ్గొట్టండి" అంటున్నారు.
నేను పరిగెడుతున్న గుంపులో ఒక వ్యక్తిని పట్టి ఆపి "ఎందుకు అలా తరుముతున్నారు?" అని అడిగేను.
దానికి అతను " ఏమి చెప్పమంటారు! మేమంతా ఒక మంచి మాట చెప్పుకుందామని, చిన్న నాటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని మురవాలని, ఒకరికి తెలిసిన విషయం మరొకరు పౌచుకోవాలెన ఉద్దేశ్యంతో తెలుగు బ్లాగులు ఏర్పాటు చేసుకున్నాము. వీడు మధ్యలో దూరిందే కాకుండా ఎవ్వరికీ ఇష్టం లేని విషయాలు పదే పదే రోజుకు పదిసార్లు రాస్తూ కొన్ని నెలలుగా విసిగించేస్తున్నాడు.విసిగించకురా అని చెప్పినా వినట్లేదు. మా అందరికీ వీడిబానుండీ ఎలా తప్పించుకూవాలో తెలియట్లేదు. అనుకోకుండా ఇప్పుడు దొరికేడు.మరోసారి రాయకుండా చెసేస్తేగానీ వాడికి బుద్ధి రాదు" అన్నాడు ఒగురుస్తూ.
గుంపు ముందుకు సాగిపొయింది.
కొద్దిసేపటికి నా పనులు చక్కబెట్టుకొని తిరిగి వస్తూ ఉంటే ఆ యువకుడు జేబులో చేతులు పెట్టుకొని ఈల వెసుకుంటూ నెమ్మదిగా విలాసంగా ఎదురు వస్తున్నాడు. నేను అతనికి ఎదురు వెళ్ళి అతనిని అడిగాను
" వాళ్ళు నిన్నెందుకు తరుముతున్నారు?" అని.
అతడు చిద్విలాసంగా "నేను దొరకలేదుగా" అన్నాడు.
" సరేగాని విషయం ఏమిటో చెప్పు" అన్నాను.
"నేను కూడా ఒక బ్లాగు రాస్తున్నాను. దాని పేరు 'అ టు అహా కలలు'. దానిలో నాకిష్టమైన హీరో చరణ్‌జీవి గురుంచి రాస్తూ ఉంటాను"
" దానినికి వారికెందుకు అంత కోపం? ఏం రాసేవాడివి" అన్నాను.
" నా హీరో గురించి అన్ని విషయాలు. ఉదయం లేచి నప్పటినుంది పడుకొనే వరకు, సినీ హీరో గా, పార్టీ పెట్టిన హీరోగా, కాబోయే ముఖ్య మంత్రిగా,వివిధ దశలుగా వర్ణించేవాడిని"
"నువ్వేమి చేస్తూవుంటావు?" అడిగాను
"బ్లాగులు రాస్తూ ఉంటాను" అన్నాడు
"రాయడం అయ్యకా ఏమి చేస్తావు?" మళ్ళీ అడిగాను
"మళ్ళా రాస్తాను" అన్నాడు
"రోజూ ఎన్ని సార్లు రాస్తావు?" అడిగాను
"నిద్రొచ్చేదాకా ఒక పది పదిహేను రాస్తాను" అన్నాడు
"మరికాస్త విపులంగా చెపుతావా?" అని అడిగాను.
"నా హీరో చరణ్‌జీవి పార్టీ పెట్టినప్పుడు అతని సిద్ధంతాలు విపులంగా ఊహించి వివరించాను. అతనికి అభిమానులు జైకొడుతున్నప్పుడు అతని పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పాను.మీటింగులకి జనం భారీగా వస్తే రెండువందల నలభై సీట్లు వస్తాయని ధీమగా చెప్పాను. ఎవరైనా జోకులేస్తే నాకు చిరాకని రాసేను. కాబోయే ముఖ్య మంత్రి అని చెప్పాను.సీట్లు అమ్ముకొంటున్నారని ఎవరైనా విమర్శిస్తే అంతా భూటకం అని అన్నాను."
"మరి నువ్వు చెప్పినట్ట్లు మీ హీరో పార్టీకి రెండువందల నలభై సీట్లు వచ్చాయా?" నేను
"నలభై కూడా రాలేదు" అన్నాడు
"మరి మీ హీరో ముఖ్యమంత్రి అయ్యాడా?" అని అడిగేను
"ముఖ్య మంత్రి కాదు పోటీ చేసిన స్థానల్లో ఒకచోట ఓడిపొయాడు కూడా" అన్నాడు
"మీ పార్టీ స్థాపకులలో సత్రా కూడా ఒకరు కదా?" అని అడిగాను
"అవును" అన్నాడు
"మరి ఆయనే పార్టీని వదిలి పెట్టి పొతే నువ్వేమి పాముతున్నావు" చిరాగ్గా అడిగాను
"అందుకే ఆయన కొడుకు గురించి రాస్తున్నాను" అన్నాడు
"ఆయన కొడుకు గురించి ఏమి రాస్తున్నావు?" ఆశ్త్చర్యంగా అడిగాను
"కొత్తగా మగవీర సినిమా తీస్తున్నారుగా దానిగురించి" అన్నాడు
"రిలీజ్ కాని సినీమా గురించి నువ్వేమి రాస్తావు?" నేను
"సినీమా చాలా బాగుంటుందని, పాటలు బాగా వస్తాయని" అన్నాడు
అప్పుడు నాకు కాలింది చాలా చాలా...
వెంఠనే నా మొబైల్ తీశాను.
"ఎవరికి ఫోన్ చేస్తున్నారు?" అడిగాడతడు
"తెలుగు బ్లాగర్లకి, నువ్విక్కడ ఉన్నావని చెప్పడానికి" అన్నాను కసిగా
ఒక్క ఉదుటున పారిపోబోయాడు.
నేను పట్టుకున్నాను.
ఐనా విదుల్చుకొని పారిపోయాడు.
మీకుగనక ఎక్కడైనా కనిపిస్తే కాస్త నాక్కూడా చెప్పండి.ప్లీజ్!!

గమనిక: ఈ టపా ఎవరినీ నొప్పించడానికి కాదు. పాత్రలన్ని కల్పితాలు. నవ్వొస్తే నవ్వుకోండి.

July 6, 2009

టెన్షన్..టెన్షన్..టెన్షన్..!!

అప్పుడే తొలకరి మొదలు. ఇంటి అరుగు మీద కూర్చొని చేతులు చాస్తే చేతి పడే చినుకులు బలే అహ్లాదంగా ఉండేది. వెనువెంఠనే వచ్చే మట్టి వాసన కూడా గమంత్తుగా ఉండేది. కొత్తగా బడులు తెరిచేరు. మా క్లాసులోకి మాష్టారు వచ్చి ఒక్కక్క పేరు చదువుతున్నారు. పేరు చదివినవారంతా పాస్ ఐనట్ట్లు. మష్టారు పేరు చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేచి వెళ్ళి మరో తరగతి గదిలో కూర్చోవాలి. పేరు చదివే వరకు ప్రతీ ఒక్కరికీ టెన్షనే. క్లాసులో చాలా మంది లేచి వెళ్ళిపొయేరు. నేను చాలా కొద్ది మంది ఉండిపోయేము. మష్టారు మిగిలిన పిల్లలకి వార్నింగులు ఇచ్చారు. వెధవల్లారా రోజూ స్కూలుకి రాకపొతే వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే కూర్చోపెడతాను అంటున్నారు. అదేమిటీ నేను రోజూ స్కూలుకి వస్తాను కదా! నన్ను ఫెయిల్ చేయడమేమిటె? నా మొహం అవమానంతో ఎర్రబడింది.కాళ్ళు వణుకుతున్న భావన.కళ్ళలోంచి నీళ్ళు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. నా ఇంద్రియాలు పనిచేయడం మనేశాయి. మష్టారు పిల్లలని తిట్టే తిట్ట్లు ఎక్కడో దూరం నుంది వస్తున్నట్ట్లు అనిపిస్తోంది. చివరిగా వాళ్ళని ఉద్దేశించి ఈ సంవత్సరమైనా బుద్ధిగా స్కూలుకి రండి అంటూ ముగించి నా వైపు తిరిగేరు. నాతో రా అన్నట్ట్లు తల ఊపి ముందుకి కదిలేరు. నేను ఈ ప్రపంచంలో లేను. చెక్క బొమ్మలా అలాగే నిలబడి ఉన్నాను. అక్కడ ఏమి జరుగుతోందో నాకు స్పృహలో లేదు. ఆయనే మళ్ళీ వెనకు వచ్చి నా చేయి పట్టుకొని ముందుకు కదిలేరు. నేను ఆయన వెంట కదిలేను - ఒక రకంగా లాక్కువెళ్ళేరు. అందరూ వెళ్ళి కూర్చున్న క్లాసుకు కాదు. మరో తరగతికి - ఆ తరువాతి తరగతికి. అక్కడి మేష్టారికి నన్ను అప్పచెప్పి అన్నారు, వీడు తెలివైన వాడు. నా క్లాసులొనే హైయ్యర్ క్లాసు పుస్తకాలు కూడ చదివేశేవాడు. ఒక సంవత్సరం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక సంవత్సరం ముందుకు పంపుదాము. నేను వాళ్ళ నన్నతో మాట్లడతాను. మీరు వీణ్ణీ మీ క్లాసులో కూర్చొబెట్టుకోండి అన్నకగాని నాకు అర్ధం కాలేదు. నాకు డబల్ పాస్ ఇచ్చేరని.

July 3, 2009

మా(టీవి) తుఝే సలాం!

గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మా టీవీ చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా భావోద్వేగానికి గురై ఉంటారని భావిస్తున్నాను.రేలారే కార్యక్రమం చూసేక ఇది నాకు కలిగిన భావన. " పల్లే కన్నీరూ పెడుతూందో కనిపించని కుట్రల" అంటూ ప్రముఖ జానపద గాయకుడు వెంకన్న చిందేస్తూ పాడిన పాట ప్రేక్షకుల గుండెను గొంతులోకి తెచ్చింది. నరాల్లో రక్త ప్రవాహం పెరిగి ఒక ఉద్వేగానికి గురై ఉంటారు. గ్లోబలైజైషన్ వల్ల కుల వృత్తులు చేసుకునెవాళ్ళు ఏవిధంగా జీవనం కోల్పోయి ఎలా అనాధలయ్యరో, పల్లెలు ఏవిధంగా బోసిపోయాయో పాడి వినిపిస్తూ ఉంటే ప్రముఖ పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోసులు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జానపద గీతాలంటే ప్రజలలో మరోసారి క్రేజ్ కలిగించిన ఈ కార్యక్రమం నిజంగా ఒక ఆణిముత్యం. ప్రైవేట్ చానల్స్ మధ్య ఉన్న ఇంత పోటిలో కూడా కొన్ని విలువలకు కట్టుబడి సంస్కృతికి సంభంధించిన కార్యక్రమాలను విజయవంథంగా ప్రజల మధ్యకు తీసుకు వెడుతున్న మా తుఝే సలాం!!

July 2, 2009

గిన్నిరొట్టె కధా కమామిషు!!

మా పెద్ద పరీక్షలు ఐపొయాక వేసంగి శెలవలు ఇచ్చేవారు. అప్పటికే ఎండలు మొదలయ్యేవి.నేను కాస్త సుకుమారుణ్ణే. కొద్దిగా ఎండ తగిలితే చాలు ఒళ్ళంతా పేలి ఎర్రగా ఐపోయేది. అందుకు మా అమ్మ ఇల్లు కదలనిచ్చేది కాదు. పదకొండు కాగానే నేను ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకొని ఇంటికి లాక్కు పోయేది. మాది పెంకుటిల్లే. ఎండలు ఎక్కువ ఉన్నా ఇంత బాధించేవి కావు. పెంకుటిల్లు మూలాన వేడి తెలిసేది కాదు. మరీ ఎక్కువ ఉక్కగా అనిపిస్తే పెరట్లో చెట్లకింద చేరే వాళ్ళం. పెరట్లో వేప అరటి నందివర్ధనం చెట్లు నిండుగా ఉండేవి.వేప చెట్టుకింద మడత మంచం వేసుకొని పడుకొనేవాళ్ళం. పైనుండి వేప ఆకులు, చిలుకలు ఉడతలు కొరికి పారేసే గింజలు మీద పడుతూఉంటే వాటిని చేత్తో తీసివేస్తూ పడుకొనేవాళ్ళం. మధ్య మధ్యలో కాకులు కొన్ని చిలిపి పనులు కూడా చేస్తూ ఉండేవి.ఎండ వేడికి నాకు ఒళ్ళు పేలిపోయి మరీ చిట చిటలాడుతోందని గొడవ చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి భొజనాలు అయ్యేక గంధం అరగదీసి ఒంటికి రాసేది. ఆ చల్లదనానినికి హాయిగా నిద్ర పట్టేది. మళ్ళీ ఏ మూడు లేక నాలుగు గంటలకో మెలుకవ వచ్చేది. లేచేటప్పటికి మా అమ్మ నాకిష్టమైన గిన్ని రొట్టె సిద్ధంగా ఉంచేది.గిన్నె రొట్టె అంటే దాదాపు ఇడ్లీ పిండిని చేసినట్టే ముందురోజు చేసి ఉంచేది. దానిని ఉదయం పదకొండు గంటలకి కుంపట్లో బొగ్గులు వేసి దానిపై ఒక ఇత్తడిగిన్నె ఉంచి దానిలో కొంచం నూనె వేసి ఈ పిండి పొసేది. దానిపై మరో ఇత్తడి మూత ఉంచి దానిపైకూడా నిప్పులు పోసి ఉంచేది. రెండువైపుల ఆ నిప్పుల సెగకి నెమ్మదిగా కాలుతూ మధ్యాన్నానికి ఆ రొట్టె ఎర్రగా కాలి కమ్మని వాసనలొతో తయారయ్యేది. అప్పుడు దానిని బైటికి తీసి ముక్కలుగా చేసి దానిపై నేయి వేసి కొత్త ఆవకాయతో నంచుకు తింటే ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పటి పిజ్జాలుగానీ బ్లాక్ ఫారెస్టులుగాని ఎందుకూ పనికి రావు. మధ్య మధ్యలో మా అమ్మకు దొరకకుండా నేను పారిపొయేవాడిని. చింత చెట్లకింద పిల్లలం అందరూ చేరేవాళ్ళం. నెమ్మదిగా చింత చిగురు కోసి దానిని ఒక నాపరాయి మీద ఉంచి మరో రాయి తో మెత్తగా చితకగొట్టి పిల్లలు ఇంటినుండి దొంగచాటుగా తెచ్చిన ఉప్పు కారాలు కూడా దానిలో కలిపి ఆ చాట్‌ను అందరం ఎంతో అప్యాయంగా తినేవాళ్లం. నాపరాయి మీద వేసి కొట్టేటప్పుడు దానిలో కలిసిన ఇసుక పళ్ళమధ్య పడి ఒళ్ళు గగుర్పొడుస్తున్నా ఒదిలిపెట్టేవాళ్ళం కాదు. సాయంత్రం ఐతే మా పడక ఇంటిముండు రోడ్డుమిదే మంచాలు వేసుకొని పడుకొనేవాళ్ళం. పైన చంద్రుడు, కొబ్బరి ఆకుల గలగలలు, కిందనుంది కొద్ది కొద్దిగా మట్టివాసనలు. ఒక్కప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా చినుకులు పదితే మంచాలు ఎత్తి ఇంటి అరుగుమీదకి మార్చుకొనేవాళ్లం. ఏమిటో ఉద్యోగం పేరు చెప్పి ఇక్కడికి వచ్చేశాకా గిన్నిరొట్టెగాని చింత చిగురు చాట్‌గాని మళ్ళి తినడం కుదరలేదు. మళ్ళీ మా వూరు వెళ్ళి మా అమ్మ చేతి గిన్ని రొట్టె, చింత చిగురు చాట్ తినాలని ఉంది. మీరూ వస్తారా?

July 1, 2009

ప్రత్యేక దళిత చట్టాలు చేయాలేమో!

భారత దేశంలో ఇప్పటికే ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అలాగే దళితులకు కూడా ప్రత్యేక చట్టలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయాన్నే టీవిలో వార్తలు చూస్తూంటే యంపి జగన్నాధంగారు స్వయంగా బాంక్ మేనేజర్ను యస్సి యస్టీ లకు లోన్లు మంజూరులో జాప్యం చేస్తున్నారని దాడి చేయడం చాల జుగుప్స కలిగించింది. ఒక అధికారిపై ఒక యంపి స్వయంగా దాడి చేయడం అనేది నిజంగా భారత రాజ్యాంగాన్ని, వ్యస్తను అవమాన పరచడమే. ఇది వారి మూర్ఖత్వాన్ని బరితెగించడాన్ని తెలియచేస్తోంది. యస్సి, యస్టిల పేరుమీద ఏమి చేసినా చెల్లుతుందనే వారి నమ్మకానికి ఇది పరాకాష్ట.నేను చూసిన ఆఫీసుల్లో ఈ పద్దతి ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలో ఉంది. నిబంధనలు విధిగా పాటించాలనే అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టడం సర్వసాధారణం. దళితుల రక్షణకు చేసిన చట్టాలు చాలా విధాలుగా దుర్వీనియోగం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేయమంటే అట్రాసిటీ కేసులు పెట్టడం, కావలసిన సీటు ఇవ్వకపోతే అట్రాసిటీ కేసు పెడతామనడం ఇవిగాక యస్సి, యస్టీ సంఘాలు ఆఫీసుల్లో చేసే హడవిడి అంతా ఇంతా కాదు. అంబేద్కర్ దేశ నాయకుడు. ఆయనకు వర్గ నాయకత్వం అంటగట్టి ఆఫీసుల్లో వీరు చేసే చేష్టలు ఆయనను అవమాన పరిచేవిగా ఉంటాయి. ఎక్కడో కొన్ని దురదృష్ట సంఘటనలు మినహా వీరు చెపుతున్న విభేదాలు లేనేలేవు. న్యూనతా భావాన్ని వీరు విడిచి పెట్టి మనసులో ఉన్న విభేదాలు మరచిపోవాల్సిన అవసరం ఉంది. అగ్ర వర్నాల దురహంకారం అంటూ ఎలుగెత్తే వీరికి ప్రస్తుతం జగుతున్న ప్రేమ వివాహాల్లో ఎంతమంది యస్సి, యస్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలను అబ్బాయిలను ఇతర కులస్తులు చెసుకోవట్లేదు! చట్టాల మాటున వీరు దాడులు చేయడం గర్హినీయం. ఈ ఉపేక్ష ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు వీరికి ఓటు వేయని వాళ్ళమీద అట్రాసిటీ కేసు, పదవి ఇవ్వకపోతే ప్రధాని మీద ఒక అట్రాసిటీ కేసు పెడతారేమో! కబట్టి ఇకపై వీరు ఎలాంటి దాడి చేసినా శిక్షలు ఉండని విధంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది.

June 28, 2009

పోస్టు రాస్తే కిక్ ఉండాలి!!

నేను ముందే చెప్పాను. నాకు కామెడీ అంటే ఇష్టమని. ఇంతకు ముందు టపా మాత్రం ఉక్రోషం ఆపుకోలేక అలా రాసేసాను. పోస్టులో కిక్, బ్లాగుకి హిట్లు లేకపోతే సుద్ధ దండుగ. కూడలి జల్లెడలలో నా బ్లాగు చేర్చినందుకు రొంబ థాంక్స్!! కామేడీ అంటే గుర్తొకొచ్చింది. ఇంతకు ముందు ఒక బ్లాగరు మరో బ్లాగరును ఉంటంకిస్తూ సబ్జక్ట్ ఐపొయినట్టుంది పాపం కామెడీలు రాసుకుంటున్నాడు అని గేలి చేశాడు. సదరు బ్లాగు సోదరునికి సీరియస్ సబ్జెక్టులు రాసేవాళ్ళు బ్లాగు జనోద్ధరణ చేస్తున్నరన్న భావన దృఢంగా ఉన్నట్టు అనిపించింది.నాకప్పుడే కాలింది. ఏదో ఒక పుస్తకం దగ్గిర పెట్టుకొని చదివేసి దానిని వివరిస్తూ నాలుగు టపాలు, అలాకాక ఇలా ఉంటే బాగుండేది అని మరో నాలుగు టపాలు రాసేస్తే బ్లాగు జనోద్ధరణా? నలభై పుస్తకాలు దగ్గిర పెట్టుకొన్నా కూడా కామెడీకి మరో కామెడీ రాయడం కుదరదు. హాస్యం అన్నది ఒక్కటే ఉంటుంది. సిద్ధాంతాలు మార్చ్చినట్టు హాస్యాన్ని మార్చడం కుదరదు.ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టాలి. మొహం ముడుచుకున్నప్పుదు మూడువేల కండరాలు(?) ముడుచుకుపోతాయని నవ్వితే కండరాలు వికసిస్తాయనే కదా ఇప్పటి లాఫింగ్ క్లబ్బులు పడీ పడీ నవ్విస్తున్నాయి. బ్లాగుల్లో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ రాద్ధంతాలు చేసేవారంతా ఈ విషయాని గ్రహించాలని సవినయంగా మనవి చేసున్నాను. మీరు చెప్పే విషయాలు గొప్ప విజ్గ్యనాన్ని కలిగిస్తాయనో, లేక ఏదొ కాంపిటేటివ్ ఎగ్జాంస్‌కు ప్రిపేర్ కావడానికి పనికివస్తాయనో కాదు. కొంత విషయాన్ని కొంత ఉల్లాసాన్ని కొంత ఉత్సాహాని కలిగిస్తాయని బ్లాగులు చూస్తారు. కాబట్టి సోదరా ఈ విషయాన్ని గ్రహించి కామెడీని కామెడీ చెయ్యద్దు.నేను మాత్రం ఈవిధంగా ముందుకు పోవడానికే నిర్నియించుకున్నాను.

June 27, 2009

అమ్మ తోడు అడ్డంగా నరకాలి!!

మీకెప్పుడైనా ఎవరినైనా బోర కొరికి చంపెయ్యాలని అనిపించిందా?
లేకపోతే మణికట్టుమీద నరం కోసి రక్తం బొట్ట్లు బొట్ట్లుగా పోయి నెమ్మదీగా చస్తూంటే చూడాలని అనిపించిందా?
ఒంట్లో నరాన్ని పట్టి లాగి ఒంద మీటర్ల తాడు బైటికి తీయాలని అనిపించిందా? టిప్పర్ లారీ ఆటోని గుద్ది నలిపేసినట్టు ఒకడి తలని నాపరాళ్ళ మద్య పెట్టి నలిపెయ్యాలని అనిపించిందా? నాకనిపించింది!! చాలసార్లు అనిపించింది.
మొదటి సారి బొంబాయి పేలుళ్ళలో ఒకడైన కసబ్ గాడికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నప్పుదు అనిపించింది.
కోర్టు వాడి తరపున లాయర్ పెట్టుకో అన్నప్పుడు వాడి తరపున లాయర్లు సిద్దమైనప్పుడు అనిపించింది. వాడి మీద నేర నిరూపణకు సాక్ష్యాధారాలు కోర్టులో పెడుతున్నప్పుడు అనిపించింది. సిన్సియర్ పోలీసు ఆఫీసర్లు తూటాలకి బలి అయినప్పుడు అనిపించింది. పాకిస్తాన్, కసబ్ మా జాతీయుడు కాదు అన్నప్పుడు అనిపించింది. ఒకతల్లి తన ఒళ్ళొ బిడ్డ తుపాకీ తూటకు బలి చేసింది వాడే అని గుర్తించి అక్రోసించినప్పుడు అనిపించింది. భారత ప్రతిష్ట దిగజార్చడానికి విదేశీయుల్ని చెరపట్టి చంపారని తెలిసినప్పుడు అనిపించింది. ఇన్ని అకృత్యాలకు ప్రత్యక్ష సాక్ష్యాలున్నా వాడిని శిక్షించాడానికి మీన మేషాలు లెక్కపెడుతున్న వ్యవస్థ మీద కసి ఉక్రోషం పుడుతున్నయి. మన నేతల ఉదాసీన వైఖరి మీద కసి ఉక్రోషం పుడుతున్నయి. భారత సమైక్యతకోసం ఎన్ని త్యాగాలకైన సిద్దం అని నేతలు ప్రకటించిపన్నుడు కసి ఉక్రోషం పుడుతున్నాయి. ఎన్ని దారుణాలు జరుగుతున్నా బీరాలు తప్ప చేతలు లేని నాయకుల ప్రవర్తన మీద కసి ఉక్రోషం పుడుతున్నాయి. అదె మరొక దేశమైతే వాడి కుత్తుక కత్తిరించి పాకిస్తాన్ ఇంటిముందు వేలాడదీసేది. ఇది నా ఆక్రోశం. మరి మీరేమంటారో నాకు తెలియదు.