December 20, 2009

తెలంగాణా పులకేసితో ప్రత్యక్ష ప్రసారం


తెలంగాణా పులకేసి గారితో టీవీ-99 నిన్న ప్రత్యక్ష ప్రసారం చేసింది. తెలంగాణా దేశం ఏర్పడిందని ఆ దేశమున ఉండగోరే ప్రజలు ఏ విధమున ఉండాలో కొన్ని నియమాలు సూచనప్రాయమగా పులకేసిగారు తెలియచేశారు. తెలంగాణా సంస్కృతిని ప్రజలందరూ గౌరవించాలని చెప్పారు. కానిఎడల ప్రజలు తెలంగాణా బహిష్కరణ జరుగుతుందని పులకేసి తెలియచేశారు. కాబట్టి ప్రజలందరూ తెలంగాణా మాండలికంలోనే మాట్లాడటం నేర్చుకోవాలి. దంచుడు, సచ్చుడు, భాగో, కుక్కలు, ద్రోహులు, విద్రోహం, ఆంధ్రోళ్ళు లాంటి పదాలు ప్రతీ వాక్యంలోనూ ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఆంధ్రోళ్ళను ప్రతి మాటలొనూ దోపిడీదారులని తిడుతూ ఉండాలి. బతుకమ్మ ఆడటం నేర్చుకోవాలి. జొన్న సంకటి మాత్రమే తినాలి. ముఖ్యంగా తెలంగాణా చరిత్ర తెలిసి ఉండాలి. ఇవన్నీ చేస్తే మీరు తెలంగాణా పౌరులుగా ఉండడానికి అర్హత సంపాదించినట్టే. పులకేసిగారు మరో విషయం కూడా చెప్పారు ఉపాధి అవకాశాలకన్న కూడా సంస్కృతికే ప్రాధాన్యమని. హైటెక్ సిటీ కన్నా చార్మినార్, గోల్కొండ లకే ప్రాధాన్యమని. మరి ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారో? చార్మినార్, గోల్కొండల దగ్గర ప్రజలను అడుక్కుతినమంటారా? కొంతమంది అమాయకులు అమెరికా, బొంబాయి లాటి సుదూర ప్రాంతాలనుండి వీరిని ఫోన్‌లో కొన్ని ప్రశ్నలు అడిగేరు. సమాధానాలు చెప్పలేని పులకేసి వారిని ఆంధ్రా పొగరుతో మాట్లాడవద్దని తిట్టిపోశారు. వీరి రెండుమాటల ధొరిణి ప్రతీమాటలోనూ కనిపించింది. అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలకు తమ దేశ ప్రజలు నోచుకోవడంలేదంటూనే అమెరికాలో స్థిరపడిన వారిలో అరవై శాతంమంది తెలంగాణావారేనని చెప్పుకొచ్చారు. తమదేశంలో ఎంతోమంది ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు ఉన్నారని వారిసాయంతో దేశాభివృద్ధి చేస్తామని అన్నారు. ఆంధ్రోళ్ళు దొంగలు దోపిడిదారులనే వీరు కాకినాడవారితో వియ్యం పొందామని అన్నారు. తమ సంస్కృతి గొప్పదని ఇతరులని గౌరవిస్తామని చెప్పుకొనే వీరు కాంగ్రెస్ వాళ్ళని కుక్కలుగా సంభొదించిన విషయంగానీ బాబును నీతి జాతీ లేని మనిషి అన్నది కూడా తానేనన్న విషయం పులకేసి మర్చిపోయారు. మొత్తంమీద ఆంధ్రోళ్ళమీద నిలువెల్ల ద్వేషాన్ని పురిగొల్పుతున్న ఈ పులకేసి తెలంగాణాను ప్రత్యేక దేశంగా చేసి ఆధిపత్యం చేయాలనే కాంక్ష నిలువెల్లా కనిపించింది. ఈ కార్యక్రమం చూసాకా నాకొక్కటే అనిపించింది తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా కాక ప్రత్యేక దేశంగా చేసి దానికి ఈ పులకేసిని చక్రవర్తిగా ప్రకటించి వీలైతే ఆ ముక్కను దేశంనుండీ దూరంగా జరిపేస్తే బాగుంటుందని. టీవీ-99 లాంటి చెత్త చానల్స్ ఏక పక్షంగా చేస్తున్న ప్రసారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం.

19 comments:

మంచు పల్లకీ said...

ఇంతకీ ఆ పులకెసిని ఎవరొ చెప్పలేదు..

మీ శ్రేయోభిలాషి said...

పులకేసినిది రెండు నాలికలయితే TV99 కు 22 నాలికలు, ఏ ఎండకాగొడుగు పెడతాడు ఎదవ!

viswamitra said...

@ మంచు పల్లకి:
సారూ పేరులోనేముంది!! :)
@శ్రేయోభిలాషి:
నిజమేనండీ ! చానల్స్‌లో ప్రజాభిప్రాయంకన్నా వీళ్ళ సొంత పైత్యం ఎక్కువైంది

Anonymous said...

పులకేసిని కాదు, పులకేసి

శరత్ 'కాలమ్' said...

తెలంగాణా పులకేసి! భలే పేరు పెట్టారే :)

Sravya Vattikuti said...

నిన్న 7.30 కి ప్రొగ్రాం అన్న హెచ్హరిక చూసి ప్రికాషనరి మెజర్ క్రింద వేరే పనులు చూసుకున్నా . పొదున్న ఒక బ్లాగులొ చాల బాగ మట్లాడారు అన్నది చూసి నిజమేనా అని కొద్దిగా అనుమానపడ్డా. కథ మాములేన్న మాట:(

Karan K said...

తెలంగాణ పులకేషి గురించి బాగా సెలవిచ్చారు. సమైక్య రాగ రాబందులు జగడపాటి, వైఎస్ దగామోహన్, సినిమా మెగాస్టార్, పొలిటికల్ కమేడియన్ ల సంగతేమిటి? వీల్లంతా పైకి సమైక్య రాగం వినిపిస్తున్నప్పటికీ అసలు ఉద్దేషం హైదరాబాద్ లోని అక్రమిత బూముల భవిష్యత్తు, లేక ఆంధ్ర రాష్త్రంలో లీడర్షిప్పేనని లోకులు కాకులై కూస్తున్నారు.

అయినా ఈ జగడపాటి లాంటి రియల్ ఎస్టేట్ రాబందులకి గానీ సామాన్యుడికి తెలంగాణా కలిసి ఉంటే ఏమిటి, విడిపోతే ఏమిటి చెప్పండి?

viswamitra said...

శరత్ గారూ
థాంక్స్ :) )
శ్రావ్యగారూ
ఫోన్ చేసినవాళ్ళందరిని (అందరూ ఎవరులెండి రెండుగంటల కార్యక్రమంలో ఆరుగురు ఫోన్లు చేసారు. దూర్‌దర్శన్లో సైతం "పుచ్చిపళ్ళగురించి జాగ్రత్తలు" అంటేచాలు అరగంటలో ముప్పై ఫోన్లు వస్తాయి. కాని వీరికి ఆరు ఫోన్లు మాత్రమే వచ్చాయి.. అందులో ఇద్దరు మాత్రమే పులకేసిని సమర్ధించారు) మన బ్లాగులలొలాగానే నువ్వు చరిత్ర చదివి మాట్లాడు. నీది అజ్గ్నానం, ఆంధ్రా అహంకారంతో మాట్లాడుతున్నావు అంటూ బెదరగొట్టడానికి ప్రయత్నించాడు.
@కరన్
మీరు కొంత నిజం చెప్పారు. విడిపోతే లాభపడేది తెలంగాణా నాయకులు నష్టపోయేది ఆంధ్రాలోని సాధారణ ప్రజలు.

అప్పారావు శాస్త్రి said...

పాపం TV99 వాల్లాది తప్పు కాదండీ! న్యూస్ చానేల్ల వాళ్లు సీమంధ్ర ప్రజల గురించి చూపుతుంటే తెలబాన్లకు కోపం వచ్చి చానేల్ల మీద దాడి చేసారు. అందుకే అలా
మొన్నటి వరకూ సామ్యుల్ రెడ్డి గారు, పులకేసి కి మందు పోసారు. ఈ మద్య ఆయన చచ్చాక వీడికి మందు పోసే వాడు లేక డబ్బులిచ్చే వాడు లేక ఇలా యాగీ చేస్తున్నాడు.

Karan K said...

విస్వమిత్ర కు

విడిపోయినా, కలిసి ఉన్నా ఇప్పుడు లాభపడెది ఆంధ్రా ప్రాంతపు నాయకులే. వాల్లు స్పాన్సర్ చేసే సమైక్యాంధ్ర ఉద్యమం ఆంధ్ర రాష్ట్రం లో లీడర్షిప్ కోసమేగా. పోతే కలిసిఉండీ ఇప్పటివరకూ నష్టపోయింది, ఇకముందు నష్టపోయేది కూడా తెలంగాణా సామాన్యులే కదా. వాల్ల నోతికాడి నీటి లాక్కోవడం వల్లే కదా ఈ ఉద్యమం.

ఇవన్నీ తెలిసి కూడా మీరిలా రాయడం బాగుందా?

మంచు పల్లకీ said...

@ viswamitra
నాకు నిజంగా తెలీకే అడిగా.. పులకెసిని అంటే ఎదొ స్త్రీలింగం అనుకున్నా.. తెలంగాణా గురించి మాట్లాడే ఆ మహిళామణి ఎవరా అని డవుటు..

@ గిరిగారు..విడిపొయినా కూడా నష్టపోయేది తెలంగాణా సామాన్యులే అయితే విడిపొవడం ఎందుకూ ??

viswamitra said...

@ కరన్
ఈ యాభై యేళ్ళలో సాగు విస్తీర్నం ఆంధ్రాలో ఎంత పెరిగిందో, తెలంగాణాలో ఎంత పెరిగిందో ఉండవల్లి స్పష్టంగా చెప్పారు.అభివృద్ధి లేదనడం కేసీఅర్ చెప్పే అబద్ధాలలో ఒకటి. మీ నోటిదగ్గిరది ఎవరు లాక్కుంటారండీ! ఇలాటి మాటలు మాట్లాడుతూ ప్రజలని రెచ్చగొడుతున్నాడు. ఆంధ్రావాళ్ళంటే రాక్షసులు కారు.

raj said...

ఎప్పుడూ చెప్పే సొదే కానీసరైన కారణం ఎవరూ చెప్పరు...

అసలు వేరే రాష్త్రం అయితే బీడు భుములన్నీ మాగాణి ఎలా చేస్తారు...ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు...
శాస్త్రీయంగా అలోచిస్తే ఇవి జరగవు..జార్ఖండ్ ఇందుకు మంచి ఉదాహరణ..
వూరికే తిన్నది అరక్క మన పులకేసి ఇలా పైత్యపు ప్రచారం చేస్తుంటాడు

raj said...

ఎప్పుడూ చెప్పే సొదే కానీసరైన కారణం ఎవరూ చెప్పరు...

అసలు వేరే రాష్త్రం అయితే బీడు భుములన్నీ మాగాణి ఎలా చేస్తారు...ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు...
శాస్త్రీయంగా అలోచిస్తే ఇవి జరగవు..జార్ఖండ్ ఇందుకు మంచి ఉదాహరణ..
వూరికే తిన్నది అరక్క మన పులకేసి ఇలా పైత్యపు ప్రచారం చేస్తుంటాడు

Karan K said...

తెలంగాణా లో ఎంత క్రిష్నా, గోదావరి కాచ్మెంటు ఏరియా ఉందో, ఎంత ఇరిగేషన్ లో ఉందో, ఆంధ్ర కి ఎన్ని టీఎంసీ ల నీల్లు క్రిష్నా, గోదావరి ప్రాజెక్టులనుచి తెలంగాణాకి వెల్తున్నయొ, ఎన్ని టీఏంసీల నీల్లు ఆంధ్రా కి వెల్తున్నాయో చూడాలంటె మీకు ఉందవల్లి సాక్ష్య కావాలా? నెట్ లో ఉన్న ఇంఫర్మేషన్ సరిపోదా?పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా మధ్యలో ఉండవల్లి ఎందుకు?

నిజాన్ని ఒప్పుకోవడానికి ఆంధ్రా వాల్ల్లకి అంత భయం ఎందుకు?

Karan K said...

ఎందుకు విడిపోదామనుకుంటున్నారో తెలంగాణా వాల్లు వంద కారణాలు చెబుతారు. కానీ అవేవీ అంధ్రా వాల్ల చెవులకి ఎక్కవు.

వాల్లు ఎందుకు కలిసి ఉండాలో ఇంత వరకూ ఒక్క కారనం కూడా చెప్పలేదు. ఇక జోకర్ చిరంజీవి జెర్మనీ, రష్యా గురించి చెబుతాడు. ఈ సమైక్యాంధ్ర వాల్ల పరిగ్నానం చూస్తే నవ్వొస్తుంది.

సంతోష్ said...

పులకేశి అని భలే పేరు పెట్టారు ..
ఇంతకీ వీడు ఎన్నవ పులకేశి ...?
ఈ తెలంగాణా పులకేశికి NDTV REPORTER
భరఖా దత్ పర్సనల్ ఫ్రెండ్ అంట..
నాకు నవ్వాగాలేదనుకోండి.

viswamitra said...

@ కరన్
కేసీఅర్ విడిపోవడం కోసం చేసే పోరాటం తెలంగాణా అభివృద్ధి కోసం చేసిఉంటే ప్రజలందరూ హర్షించేవారు ఆంధ్రా ప్రజలతో సహా అతని వెనుక ఉండేవారు.

@సంతోష్

పులకేసి మీడియా మితౄలద్వారా కొంత, భయపెట్టికొంత చానల్స్‌లో ఆంధ్రా ప్రజలమీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు.

nagarjuna చారి said...

సాగువిస్తీర్ణం ఎంతపెరిగిందనేదాంతో పాటు, సాగు చేసే పంటలు ఏ రకమైనవో(ఆహార ధాన్యాలా?వాణిజ్య పంటలా?),సాగు చేస్తున్న భూమిలో ఎంతెంత శాతం బోరుబావులు,కాలువల ద్వారా అవుతుందో చెప్తే వాళ్ళు చెప్తున్న statisticsకి అర్థం ఉంటుంది