December 3, 2009

సమైక్యవాదం బూతుమాట అయిన వేళ...

మొత్తానికి కేసీఆర్ ను హైదరబాదు పట్టుకొచ్చారు.మరి ప్రభుత్వం ఆయన ఆరోగ్య రీత్య తీసుకొచ్చిందో, మానవహక్కుల సంఘం మాటలవల్లో లేక కేసీఆర్ పంతంవల్ల తీసుకొచ్చిందో గాని ఆయన ఉద్యమ విద్యార్ధుల మధ్యకు వచ్చి పడ్డాడు. ఖమ్మంలో తనకు ప్రాణహాని ఉన్నదన్న వాదన కేవలం ఒక సాకు మాత్రమేనని అందరికి తెలిసిందే. నాకు మాత్రం కేసీఆర్ పరిసిస్తితి చూస్తే జాలి వేస్తోంది. ముందు నుయ్యి వెనుకు గొయ్యి అన్నట్టు తయారయ్యింది. ఒకరోజు నిరాహారదీక్షతొ మంటలు ఎగదోసి చోద్యం చూద్దమనుకున్న కేసీఆర్ కు చుక్కెదురెయ్యింది.దీక్ష విరమించగానే విద్యార్ధుల ఆగ్రహంతొ ఖంగు తిన్న కేసీఆర్ దీక్షను కొనసాగించక తప్పలేదు. మానేస్తే విద్యార్ధులతో తంటా ముందుకెడితె ప్రాణాలకు సంకటం. వీటి మధ్య ఊగుతూ కొద్దిసేపు డాక్టర్లకు సహకరిస్తూ కొద్దిసేపు తిరస్కరిస్తూ ప్రాణాలని ఉగ్గబెట్టుకు బ్రతుకుతున్నాడు.

ఇక ఉద్యమం చాలావరకు కేసీఅర్‌ను దాటి విద్యార్ధుల చేతులలోకి వెళ్ళిందనిపిస్తోంది. విద్యార్ధులు కూడా త్యాగాలు మాని నెమ్మదిగా బలి తీసుకొనే స్థాయికి చేరుతున్నారు. ఆస్తులపై దాడులు, రోడ్డుపై ప్రయాణించే వారిపై దాడులతో రాక్షస రూపాన్ని సంతరించుకుటున్నారు. చదువుకున్న వీరు కూడా ఆంధ్ర బూచినే సాకుగా చెప్పడం దానికి ఉదాహరణ. తెలంగాణా ప్రాంతాల వెనుకబాటుకు కారణం ఆంధ్రా ప్రజలా? ఆంధ్రాలో వెనుకబాటుతనం లేదా? ఆంధ్రాలో ఉపాధికోసం ప్రజలు వలసలు వెళ్ళడం ఇరవై అయిదు ముప్ఫై సంవత్సరాల క్రితమే మొదలయింది. పొట్ట చేతబట్టుకొనె గల్ఫ్ దేశాలు వెళ్ళి మూటలు మోసి, టాయిలెట్లు కడిగి పైస పైస కూడగట్టి వారి సంసారాలని ఒక స్థాయికి తెచ్చుకున్నారు. మరి ఇక్కడి ప్రజలకు ఒళ్ళుఒంచి పనిచేసే అలవాటు లేదా? అక్కడికి వెళ్ళిన యౌవకులు ఎంతో మంది ప్రమాదాలకు లోనై మరణించారు కూడా. ఇక ఇక్కడ పచ్చళ్ళు వ్యాపార్లు పెత్తనం చేస్తున్నారని ఒక వాదన. వారివల్ల కొన్ని వేల మందికి జీవనాధారం కలుగుతోందనే విషయం స్పురణకు రాలేదా? మా దేశంలో పెట్టుబడులు పెట్టండని విదేశస్తులనే మనవాళ్ళు దేవురిస్తున్నారుకదా? పచ్చళ్ళ వ్యాపారులు అంతకన్నా తీసిపోయారా? వీరు చేస్తున్న పోరాటం వారు ఎన్నుకున్న నాయకులపై చేసిఉంటే తెలంగాణా ఎప్పుడో బాగుపడి ఉండేది.స్వార్ధపరుల అధికార దాహం కోసం రగిలించిన కాష్టం ఇది. దీనివల్ల ప్రజలలో కూడా బేధాలు మొదలవుతున్నాయి. సమైక్యవాదం పేరెత్తితే చాలు మనుషులని చంపేసే పరిస్తితి దాపురిస్తోంది. అర్హతలున్నవారికి విదేశాలలోసైతం ఉద్యాలొస్తున్నయి కదా? తెలంగాణా విద్యార్ధులు విదేశాలలో ఎంతోమంది ఉద్యోగం చేస్తున్నారుకదా? తెలంగాణావారని వారిని వెనుకబెట్టలేదుకదా? మరి అర్హత లేనప్పుడు ప్రత్యేక రాష్త్రం వచ్చినా వారికి ఏ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందో కేసీఆరే చెప్పాలి. వెనుకబాటుతనం, దోపిడీ, వ్యతిరేకవాదం, కుట్రలు అంటూ ఆంధ్రా ప్రజలను దూషించక్ఖర్లేదు. మీ ఏడుపు మీరు ఏడవండి...మా ఏడుపు మేము ఏడుస్తాము అంటున్నరు ఆంధ్రప్రజలు. కొంతవరకు ఇది నిజమే అనిపిస్తోంది.

16 comments:

Unknown said...

మీ ఏడుపు మీరు ఏడవండి...మా ఏడుపు మేము ఏడుస్తాము
well said

Indian Minerva said...

నిజమే మనవాళ్ళు విదేశాలకెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించొచ్చు కానీ మన ఉద్యోగాలు మాత్రం మనవాళ్ళకు మాత్రమే రావాలి. ఇదేంటో నాకర్ధం కాదు. ఇదింకొంచెం ముందుకువెళ్ళి మన రాష్ట్రంలో మనవాళ్ళుమాత్రమే వుండాలి అనే పెడధోరణులు పెరిగిపోతున్నాయ్. ఇదలా జాతీయతను కూడా పరిహసించే వరకూ వెళ్ళింది ( పరిశీలించుడు: ధాక్రే - సచిన్ ఉదంతము).

కానీ తెలంగాణా గొడవ కేవలం ఉద్యోగాల గురించే కాదనుకుంటా. ప్రాజెక్టులు కొంచెం అక్కడవారికికూడా ఉపయోగపడేట్లు కడితే ఎవరిసొమ్మేంపోతుందో నాకర్ధం కాదు (ఈ సంస్కృతి వగైరా గొడవలన్నీ కేవలం దానికి ఊతమివ్వడానికేగానీ అసలు విషయాలుకావని నా అభిప్రాయం). ఈ పరిస్థితిని ఊహించకుండా ఒక ప్రాంతంవారికే ఎక్కువగా ఉపయోగపడేలా పధకాలు ప్రారంభించి అమలుజరిపిన పాపం ఇది. తెలంగాణ ఉద్యమానికి సానుభూతిపరుణ్ణైనప్పటికీ చంద్రశేఖరరావు నాయకత్వం పై ఆధారపడి తెలంగాణ సాధనకోసం పోరాడటం మతిలేని పని అని నా నిశ్చితాభిప్రాయం. నిబధ్ధత, విలువలు, నిస్వార్ధబుధ్ధి ,కనీసం అవగాహన కూడా లేని, కేవలం జనాలని తమ అవసరాలకొసం వాడుకొనే ఇలాంటినాయకమ్మణ్యుల వల్ల మనకు ప్రయోజనంలేకపోగా దేశ/ప్రజా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టువంటివారు. నా ఉద్దేశ్యంలో తెలంగాణా ఉద్యమం కోల్పోయిన జనాల విశ్వశనీయత కోసం ఎప్పటికప్పుడు నేలబారు విన్యాసాలు చేసే చంద్రశేఖరరావుని పరిహరించడంతో మొదలవ్వాలి.

Veeragoni said...

meeku arhata lekunte udyagalu ela vastayi ane avahelane telanga ud;yamanni balopetam chesatunnadi.meeku unna arhata emiti telanganavallaku lenidi emiti.chaeduvukune avakasham evarevariki ela vachindoo charitraloniki velte telustundi.ayite maa edupu meme edustamu anduke memu poratam chestunnamu. mee ibbandi emiti.samanyulanu memu emi anadamu ledu mammulanu avahelana chese vallatone maa poratam anta . maa telangan rastaram vachedaka maa poratam aagadu.veeragonis.

విశ్వామిత్ర said...

వీరగోని

ఎవరు మిమ్మలని అవహేళన చేసింది? నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. ఆంధ్ర ప్రజలంతా అపర కుబేరులన్న భ్రమ విడిచిపెట్టండి. కాయకష్టం చేసుకుని చదువుకొనీ పైకొచ్చినవాళ్ళే చాలామంది. ఒకరిద్దరిని పేర్లు చెప్పి అందరినీ దోపిడీదార్లని అనడం సరికాదు. పెత్తందారీతనం తెలంగాణాలో లేదా? వారిని మేరు ఏమి చేయగలిగారు? కేసీఅర్ అపర కుబేరుడు కాదా? కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు లేవా? మీవి సంకుచిత మనస్తత్వాలు. మీ తప్పులకు ఎదిటివారిని నిందించడం సరి కాదు.

@ఇండియన్ మినర్వా

నేను కేవలం ఉద్యోగాలగురించే చెప్పలేదు. జీవనస్థాయిలో తేడాలెందువల్లో కూడా ఉదహరించాను. ఆంధ్రా ప్రజల జీవన స్థాయి పెరగడానికి కారణం వారి స్వయం కృషికూడా ఉంది.

Unknown said...

Babu.. veeragoni.. nayana veeragoni...

nuvvu pulibiddavi. neeku mari telangana udyamam gurinchi teluso ledo mari.. teliste..ne blog lo rayi nayana. aikamatyam ga poradi.. emi peekutavo..peeku.

campus lo chaduvulu poorthichesukoni 2-3 samvastaralu ayina.. inka akkade pandikokullaga mestu.. career meeda interest ledi vedava akkalu, annayalu chestunna vedava pani ni aikamatyam ani feel avvaku.

career meeda dhyasa pedite udyogam vastundi.. telangana vastene raadu..

maadi warangal. naku telusu TRS ki entha scene undo, vijayashanti akka ki entha scene undo.. party pettina 7 ellaki gurthukuvachindi..edava la*** kodukki.. nirahara deeksha cheyyalani..

innirojulu YSR sanka naakada.. mari..

Unknown said...

@viswamitra garu,

mee comments box lo konni parusha padajaalam vaadinanduku..kshaminchandi.. mee abhiprayam meeru chepparu..

konthamandi edavalu unnarandi geeda telanganalo..full brain ledu..inka.. halfbrain tho.. edo telisi teliyani vishayam meeda tega godava chestu unataru.. nenu choosanu kada ma Kakatiya Univ lo..akakde kaadu nenu OU lo kooda chadivanu..

nenu campus lo journalism chesanu. akkada undatam istam leka, bayata friends tho unte... oka senior(3 yrs ayindi course poorthi chesi) vachi, na ID adigadu.. daani meeda campus lo undamani.. pora gaali vedava ani tittanu..

campus lo unna students lo manchi vaaru unnaru.. pagal saale gallu unnaru..second category valla 1st category ki abd name vastondi..

cheppalante.. chiraku vestundi..

chooddam.. KCR sastado.. leka telangana techi mammalni savagodatado.. monna elections lo odipoyina siggu raledu kodukki..

విశ్వామిత్ర said...

@ thename

Go ahead no problem..:) I felt happy that you are the second one to speak out the facts. :)

స్వర్ణమల్లిక said...

@ వీరగోని

వీరగోని గారు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఇంకొక విషయం ఉంది. ఏ ఇంటర్వ్యు కి వెళ్ళినా మన ఊరి పేరు చూసి ఉద్యోగం ఇస్తారా లేక మన సమాధానాలని బట్టి ఇస్తారా? చెప్పండి. ఇంకా మీరు అనే విద్య వైద్య నీటి పారుదల సదుపాయాల గురించి: మీరు మీ స్తానిక ప్రజా ప్రతినిధులని (మీరు వోటు వేసి గెలిపించుకున్న మీ తెలంగాణా వారు) ఎందుకు నిలదీసి అడగరు? మొత్తం తెలంగాణ యం ఎల్ ఏ లు ఎంతమంది, వారిలో మంత్రులు ఎంతమంది కనీసం వారైనా తెలంగాణా గురించి ఆలొచిస్తున్నారా? అది వదిలేసి ఆంధ్రా వాళ్ళు ఏదొ మీ నోటి దగ్గర కూడు లాగేసుకున్నట్టు మాట్లాడతారేంటి? అదీ సరె, ఇంతకీ మీ బాధ తెలంగాణ వెనుకబడింది. విద్య ఉద్యొగ విషయాల్లొ ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం పెరిగింది. అంతే కదా. మరి ఇంతకీ హైదరాబాద్ ని ఏ డబ్బుతో అభివ్రుద్ధి చేసారు? ఇప్పుదు తెలంగాణ ఇస్తే హైదరాబద్ ఎవరిది? ఉమ్మడి సొమ్ముతో అభివ్రుద్ధి చేయబడిన హైదరాబాద్ మీరు తీసుకుంటే ఆంధ్రులకి జరిగే నష్టం మాట ఏంటి?

phani said...

జనాలు ఎలా అలోచిస్తారో అర్థం కాదు,

అంధ్రా ప్రజలని ఎవడు ఆడిపోసుకున్నాడు ఇక్కడ, పాలకులు మాత్రమే చెడ్డవాళ్ళు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు,

@ద నేం,
నీకు తెలంగాణా రావడం ఇష్టం లేకపోతే అందులో ఎవరికి ఇబ్బంది లేదు, అంత మాత్రాన ఇతరులను వెధవలు అనే అధికారం నీకు లేదు, నీకు నచ్చింది అందరికీ నచాలని లేదు కదా.

@విశ్వామిత్ర
అంధ్రా వాళ్ళూ కష్టపడరని మేము అన్నామా, కాని ఒకటి అలోచించండి, అంధ్రాలో సాగునీటి వసతి ఎక్కువ, అలాగే పంటలు కూడా ఎక్కువగా పండుతాయి - ప్రజలకి ఆదాయ వనరులు ఉన్నప్పుడు జీవన స్థాయి పెరుగుతుంది - అంటే మీ ముందు తరం వారు ఒక మోస్తరుగా ఉన్నా తరువాతి తరానికి అవకాషాలు అందివ్వ గలుగుతారు, అలాగె వచే తరం ఇంకా బాగా అవకాషాలని అందిపుచుకుంటుంది (అవునా కాదా)

అదే తెలంగాణాలో పంటలకు నీరు ఎలా - ఎంత లభిస్తుంది అనేది అందరికి తెలిసిందె, అలాగే ఎంతమందికి భూమి లెదో కూడా తెలిసిందే, ఎదో ఒక సంపాదనా అవకాషం లేకుండా జీవన స్థాయి ఎప్పుడు బాగుపదుతుంది చెప్పండి -- ఈ 50 ఏళ్ళుగా మాకు పంటలని పండించే విస్తీర్ణం తగ్గుతుందే కాని పెరగడంలేదు,
అలాంటప్పుడు ఆదాయం ఎలా పెరుగుతుంది - జీవన స్థాయి ఎలా పెరుగుతుంది.

ప్రాజెక్టుల కోసం నాయకులను అడిగితే ఎం చేస్తున్నారో అందరికీ తెలిసిండే, ఎవరిని ఎన్నుకున్నా అదే గతి
మాకు జరిగే అన్యాయాల విషయం లో మాత్రం మీరు మౌనంగా ఉంటారు.మేము పొరాటం చేస్తే మాత్రం సహించరు.

@స్వర్ణ మల్లిక
ఒక ఇంటర్వ్యూ పానెల్ లో ముగ్గురు అంధ్రా వాళ్ళు ఉన్నారనుకుందాం.
ఒక తెలంగాణా అతను, ఒక అంధ్రా అతను ఇంటర్వ్యూ కి అర్హత సాధించారు అంకుంటే, అక్కడా తెలంగాణా అతనికి ఉద్యోగం ఒస్తుందా -- మీ సమాధానం ఏదైనా దానికి కారణం కూడా చెప్పండి

phani said...

సమైక్య వాదం బూతు ఎప్పటికీ కాదు...కానీ ఈ సమైక్య వాదులు ప్రాంతాల పట్ల వివక్షని గురించి ప్రశ్నిచరు ఎందుకని?

Apparao said...

కెసిఆర్ యొక్క పరిస్తితిని బాగా వివరించారు.
తెలంగాణా రాక పోయినా లేక వచ్చినా బాధేమీ లేదు. కానీ
ఆంధ్రా వాళ్ళను వెల్లిపోమ్మనడం మాత్రం ఘోరం, నీచం.
అలాగయితే ఎ దేశం వాడు ఆ దేశం లోనే ఉండాలి.
నాలుగు రోజులు సెలవలు వస్తే ఎవరుంటారు ఇక్కడ ? అందరూ ఊర్లకు వెళ్లి పోరా ?
ఆంధ్రా వాళ్ళు అందరూ ఆంద్రా కు వెళ్ళిపోతే హైదరాబాదు లో ఏమి ఉంటుంది ?
బస్సులు తగల పెటడం, జనాలని కొట్టడం దారుణం.
@ కెసిఆర్ : ఇదేనా గాంధీ మార్గం లో ప్రయత్నించడం?

విశ్వామిత్ర said...

ఫణీ
ఉద్యోగాల విషయంలో మీ వివరణ చాలా సిల్లీగా ఉంది. సమైక్యవాదులంటే కుట్రదారులని మీ పోరాట యోధులందరూ అంటున్నారు కదా!!

Unknown said...

@phani,

kastapadi pani chesukune vaadiki prantam tho pani emiti?

meeku mee swasakthi meeda, parignanam meeda nammakam unte, interview lo gelavagalaru ani nammakam unte..panel lo elanti vaaru unna.. meeku udyogam avstundi. pranteeya abhimaanam choopinche vaari daggara panicheyyatam kante.. teliyani vaaridaggara pani cheyyatam 10 retlu melu.. kaadantara?

kaadu ane ante.. mee maata nenu oppukuntanu. Manam kooda Raj Thackery laaga shiridi lo telugu vaarini , Mumbai lo Hindi vallani vellagottinatlu ee kosta jillala vaarini vellagotteddam.

pantalu pandani vaaru Khammam vellandi. akkada neeru baaga undi. pantalu pandutayi. Telangana lone undi kada khammam kooda. ibbandi lekunda.. mana mundu tarala vaarini baguchesukundamu.

Anonymous said...

@Phani
ఇంటర్వ్యూ గురించి మీరు చెప్పేది చాల హాస్యాస్పదం గా ఉంది...!
అది మానవ సహజం మాస్టారూ... దీన్నే తిప్పి చూడండి. ముగ్గురు తెలంగాణా వాళ్ళు ఇంటర్వ్యూ పానెల్ లో ఉంటే..? బయాస్ ఉండదు అని చెప్పకం డేం!
ముగ్గురు తమిళ తంబిలు ఉన్నా అంతే, ముగ్గురు నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నా అంతే, డివైడ్ చేసుకోవడానికి బోలెడు dimensions మన భారతీయులకి..... బోడి గుండుకీ మోకాలికీ ముడి పెట్టొద్దు...:)

phani said...

@telugu abbayi

you may feel silly about my example but what exactly I wanted to say was

from past 50 years the govt (specifically) jobs were given to andhra people

by violating all the agreements made when andhra pradesh was formed.

and if all the jobs were having them then its obvious that they will
recruit their own local people in the new jobs.. so when will our people
will get justice
pls give answer to this.

phani said...

@ద నేం,

కష్టపడి పని చేసేవాడికి ప్రాంతం తో పని ఎముంది - ఒప్పుకుంటా, కాని పనికి అవకాశాలు కూడా లభించాలి కదా..
ఖమ్మం లో పంటలు పండినంత మాత్రాన అందరికి అక్కడ భూమి ఎలా లభిస్తుంది సారు, అక్కడకి పొయి భూమి కొనే స్తోమతే ఉంటే ఇక్కడే ఎదో పని చెసుకొని బతికెటోల్లు జనాలు, ( మీ ఖమ్మం వాఖ్య నిరర్థకం, నిర్హేతుకం)

సమస్యని ఒక కోణం లో నే చూడొద్దు దయచేసి.

ఎవరో ఒకరు ఇద్దరు అన్న మాటలను పట్టుకోని మీరు అందరిని ఒకే గాట కట్టడం సమంజసం కాదు -- తెలంగాణా ఉద్యమం లో అన్నిటికన్న ముఖ్యమైన అమ్షం మా
పాలన మమ్మల్ని చేసుకోనివ్వండి అనేది -- అది గమనించండి, సార్, భారత దేశం లో ఉన్నంత కాలం ఎవరికైన ఎక్కడికైనా ( కాశ్మీర్ తప్ప) వెల్లి బతికే అవకాశం ఉంది, మేము భారతీయులం తోటి భారతీయుల పట్ల మాకు గౌరవం ఎప్పటికీ ఉంటుంది. మేము అంధ్రా వాళ్ళని వెల్లి పొమ్మని చెప్పామా ( కె.సి.ఆర్ అన్నడు అని అనొద్దు) మీరు ప్రజలు ఏం అంటున్నరో చూడండి.

ఫణి