July 20, 2009

కె.బ్లా.స. పై కోర్టులో కేసేస్తా..!!

అవును మిరు విన్నది నిజమే. కె.బ్లా.స.పై కోర్ట్‌లో కేసేద్దమని నిర్నయించుకున్నాను. లేకపొతే ఒక పార్టీలో గానీ ఒక సంఘంలో గానీ అద్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాలిగానీ ఫ్రెండ్షిప్‌కొద్దీ పదవులూ ఇచ్చేసుకుంటే ఎలా? తె.రా.స లో పరిస్తితి చూసికూడా ఇలా ఒంటెద్దు పోకడలకు పొతే ఎలా? కె.బ్లా.స లో అలా జరగడానికి వీలు లేదు. ఎన్నికలు జరగాల్సిందే. లేదా నాదో కోరిక తీర్చాలి. అదేమిటంటే ఒక్క రోజైనా ఆ అద్యక్ష పదవి నాకు ఇవ్వలి. అదీ ఒప్పందం. ఎందుకంటే కె.బ్లా.స అద్యక్ష హోదాలో బ్లాగర్లకు ఒక విన్నపం /నోటీస్/ సూచన ఎదైనా గానీండి ఒకటి చేయాలి. అదేమిటంటే నోటీస్ సారాంశం ఇది. తెలుగు బ్లాగర్లకు విన్నపం. బ్లాగంటే ఒక ఙ్నాపికలా ఉండాలి. చూడగానే మనసులోని సంఘటన ఎప్పటిదో తట్టి లేపేదిగా ఉండాలి. మదుర స్మృతిగా ఉండాలి. చూడగానే అబ్బ అనిపించాలి. ఎవ్వరూ గమనించని విషయాన్ని తట్టి లేపాలి. విఙ్నానాన్ని ఇవ్వాలి. వినోదాన్ని ఇవ్వాలి.మనసుకు ఉల్లసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఆలోచన కలిగించాలి, ఆశ్త్చర్యాని కలిగించాలి. టపా చదవగానే వేళ్ళు అసంకల్పితంగా కామెంట్ బాక్స్‌వైపు కదలాలి. పైన చెప్పిన విధంగా ఒక్క లక్షణం లేకపోయిన పర్వాలేదు, కానీ కొందరిని కించపరచేదిగా ఉండకూడదు. కొందరి మనో భావాలు గాయ పరచేదిగా ఉండకూడదు. వర్గ బేధాలు, కుల బేధాలు కలిగించేదిగా ఉండకూడదు. ఈ మధ్య బ్లాగుల్లో సున్నితమైన అంశం మత భావాలపై వస్తున్న టపాలు చూడగానే కొందరి మనసులు ఖచ్చితంగా గాయ పడి ఉంటాయి. మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళపై వస్తున్న టపాలు, వారి వెక్కిరిస్తూ రాస్తున్న రాతలు నిజంగా శోచనీయం. ఎవరి విశ్వాశం వారిది. ఒకరి విశ్వాశాన్ని గౌరవించకపోయినా అగౌరవ పరచడం అమనుషం. ఇటువంటి టపాలకు బ్లాగు లోకంలో గౌరవ సభ్యులుగా (నేను) భావిస్తున్న పెద్దలు కూడా వంత పడడం మరింత క్లేశాన్ని కలిగిస్తోంది. మతపరంగా జరిగే అన్యాయాన్ని అడ్డగించు, మతాన్ని కాదు. మతం ఒక నమ్మకం. మతం ఒక విశ్వాశం. బ్లాగుల్లో హిట్లే పరమావధిగా, కామెంట్లే కొలతలుగా రాతలు రాసే వితండవాదులు ఉన్నారు. వారిని నిరుత్సాహపరచవలసిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. ఒకరు చీ కొట్టినప్పుడు నడవడిక మారితే అతడు మనిషి, లేకపొతే అతడు మహిషి. ఇట్లు కాబోయే అద్యక్షుడు, కె.బ్లా.స. అదండీ మాటర్. మరి నాకు ఒక్కరోజు అద్యక్ష పదవి ఇచ్చినా లేక నా నోటీస్ మీరు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. విషయం తేల్చగలరు.

12 comments:

Malakpet Rowdy said...

LOL go ahead .. Lets kidnap Sarat for a day and you take up the Prez post!

viswamitra said...

రౌడీగారూ అట్టా కుదరదు. ప్రజాస్వామ్య పద్దతిలో అద్యక్షులుగా నన్ను ఎన్నుకోవాలె. గప్పుడు నేను నోటీస్ ఇయ్యాలే.

ఏక లింగం said...

బాగుంది..బాగుంది.

కత్తి మహేష్ కుమార్ said...

కూడలి లో "నిర్వహణ" అనే సౌకర్యాన్ని ఉపయోగించుకోవలసింది.

Sravya Vattikuti said...

మహేష్ మీరు ఈ టపా(http://parnashaala.blogspot.com/2009/07/blog-post_1507.html)
వ్రాసే బదులు రిమోట్ అనే సౌకర్యాన్ని ఉపయోగించుకోవలసింది కదా?:)

శరత్ 'కాలమ్' said...

కె బ్లా స అధ్యక్ష ఎన్నికల్లో మతలబు జరిగిందని మీలాంటి వారు అభియోగాలు చేయడం వల్లనే నా సున్నితమయిన మనస్సు గాయపడి ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసా కానీ అభిమానులు వెనక్కితీసుకోమంటున్నారు. రాజీనామా డ్రామా లాడటానికి నేనేమయినా కె సీ ఆర్ నా ? కాదు కదా. ఉన్న అద్యక్షులు రాజీనామా చేసారు. కొత్త అధ్యక్షులు పదవి చేపట్టలేదు. ప్రస్తుతం పదవి ఖాళీ అనుకుంటా. ఎవరయినా ఎగరేసుకుపోవచ్చు. ఆలసించిన ఆశాభంగం - త్వరపడండి. మహత్తర అవకాశం చేజిక్కించుకోండి.

అయినా ఒక్కరోజు ఈ పదవి అధిష్టించడానికి ఇది హోం మినిస్టర్ పదవి అంత చీప్ అనుకున్నారా? ఫేస్ వాల్యూ చాలా వుంది దీనికి!

Bhardwaj Velamakanni said...

LOl Sravya .. good question. Lets see whether he has any answer!

Bhardwaj Velamakanni said...

Sarat, kudaradu ... post ki 300 comments kotti ... aaa 300 post chesinavaariki ivvandi. appatidaakaa meere

జీడిపప్పు said...

lol శ్రావ్య గారు. మహేష్ గారిని అలా అడగవచ్చా? అట్రాసిటీ కేసు పెడతారేమో జాగ్రత్త! :)

మహేష్ గారు, "నిర్వహణ" సౌకార్యాన్ని వినియోగించుకున్నా మతగజ్జి మూర్ఖుడొకడు అన్ని బ్లాగుల్లో మొరుగుతుంటాడు కదా.. ఏమి చేయాలంటారు?

viswamitra said...

@కత్తివారు: చూడడం మానమంటారుగాని కించపరచే రాతలు బ్లాగర్లు మనరనేగా????

శ్రావ్య గారు చెప్పింది నిజం. మహెష్‌గారి బ్లాగుల్లోనే నేను కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాను. నిర్వాహణ సౌకర్యం వాడితే వారి బ్లాగు కూడా చేర్చాల్సి ఉంటుంది :)

@ శరత్ గారు (వై యస్ ఆర్ లెవెల్లొ) అయ్యా అది హోం మినిస్టర్ పదవైతే నెనెందుకు అడుగుతాను...మీరు కె సీ ఆర్ ఐతే నేను మూటలతో సమాధానం చెప్పేవాడిని కదా...బ్లాగు ప్రజలకోసం పగలనక రేయనక టపాలు రాస్తూ..... బ్లాగులోకాన్ని బాగుచేయడానికి ఒక్కరొజు పదవడిగెతే కాదు పొమ్మంటున్నరూ... ఇది న్యామా అద్యక్షా అని అడుగుతున్నాను.

viswamitra said...

@ భరద్వాజ్: ఆ మూడు వందల కామెంట్లు వేరు వేరు పేర్లతో నేనే రాసుకోవచ్చా?? :)))) ఐనా ఇదన్యాయం. మంచి పనికోసం పదవడిగెతే కాదంటారా...!!

Sravya Vattikuti said...

భరద్వాజ గారు :)
జీడిపప్పు గారు అంతే అంటారా?సరే చూద్దాం మరీ రొటీన్ లైఫ్ బోరుగా ఉంది:)