June 28, 2009

పోస్టు రాస్తే కిక్ ఉండాలి!!

నేను ముందే చెప్పాను. నాకు కామెడీ అంటే ఇష్టమని. ఇంతకు ముందు టపా మాత్రం ఉక్రోషం ఆపుకోలేక అలా రాసేసాను. పోస్టులో కిక్, బ్లాగుకి హిట్లు లేకపోతే సుద్ధ దండుగ. కూడలి జల్లెడలలో నా బ్లాగు చేర్చినందుకు రొంబ థాంక్స్!! కామేడీ అంటే గుర్తొకొచ్చింది. ఇంతకు ముందు ఒక బ్లాగరు మరో బ్లాగరును ఉంటంకిస్తూ సబ్జక్ట్ ఐపొయినట్టుంది పాపం కామెడీలు రాసుకుంటున్నాడు అని గేలి చేశాడు. సదరు బ్లాగు సోదరునికి సీరియస్ సబ్జెక్టులు రాసేవాళ్ళు బ్లాగు జనోద్ధరణ చేస్తున్నరన్న భావన దృఢంగా ఉన్నట్టు అనిపించింది.నాకప్పుడే కాలింది. ఏదో ఒక పుస్తకం దగ్గిర పెట్టుకొని చదివేసి దానిని వివరిస్తూ నాలుగు టపాలు, అలాకాక ఇలా ఉంటే బాగుండేది అని మరో నాలుగు టపాలు రాసేస్తే బ్లాగు జనోద్ధరణా? నలభై పుస్తకాలు దగ్గిర పెట్టుకొన్నా కూడా కామెడీకి మరో కామెడీ రాయడం కుదరదు. హాస్యం అన్నది ఒక్కటే ఉంటుంది. సిద్ధాంతాలు మార్చ్చినట్టు హాస్యాన్ని మార్చడం కుదరదు.ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టాలి. మొహం ముడుచుకున్నప్పుదు మూడువేల కండరాలు(?) ముడుచుకుపోతాయని నవ్వితే కండరాలు వికసిస్తాయనే కదా ఇప్పటి లాఫింగ్ క్లబ్బులు పడీ పడీ నవ్విస్తున్నాయి. బ్లాగుల్లో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ రాద్ధంతాలు చేసేవారంతా ఈ విషయాని గ్రహించాలని సవినయంగా మనవి చేసున్నాను. మీరు చెప్పే విషయాలు గొప్ప విజ్గ్యనాన్ని కలిగిస్తాయనో, లేక ఏదొ కాంపిటేటివ్ ఎగ్జాంస్‌కు ప్రిపేర్ కావడానికి పనికివస్తాయనో కాదు. కొంత విషయాన్ని కొంత ఉల్లాసాన్ని కొంత ఉత్సాహాని కలిగిస్తాయని బ్లాగులు చూస్తారు. కాబట్టి సోదరా ఈ విషయాన్ని గ్రహించి కామెడీని కామెడీ చెయ్యద్దు.నేను మాత్రం ఈవిధంగా ముందుకు పోవడానికే నిర్నియించుకున్నాను.

4 comments:

sujji said...

:) go ahead

chittoor.S.Murugeshan said...

గురువు గారు స్వాగతం ! సుస్వాగతం ! I agree with your openion about kick and hit
కామెడిలో ఎన్ని రఖాలున్నవని సిద్దంతం చెప్పను. మనిషికి ,జంతువుకి మద్య ఉన్న ఏకైక తేడ నవ్వే. మా అన్నయ్య అప్పట్లో వయస్సు 34. 4 ఉధ్యోగాలొస్తే అన్ని అదిలి ఇంటి పట్టే ఉండి దండ పిండాకూడు తింటుండేవాడు . ఒక రోజు రాత్రి మేమంతా భోంచేస్తున్నాం. మా నాన్న కు వాడి వాలకం చూసి చిర్రెత్తి.. " గెట్ ఔట్" అని అరిచాడు బిగ్గరగా జస్టిస్ చౌదరి ఎన్.టి. ఆర్ రేంజిలో. మా అన్నయ్య కూల్గా చెప్పాడు భోంచేస్తున్నాను కదా. తిని వెళ్తా ఆగు" (ముఖ్యంగా కామెడి సెన్స్ ఉన్నవారు ఆత్మ హత్య చేస్తుకోరు. ) కాబట్టి భాగా రాయండి

viswamitra said...

@సుజిగారూ థాంక్స్!!

@ మురుగేశన్ గారూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని వాళ్ళు వచ్చే జన్మలో రెండుకాళ్ళ దున్నపోతుగా పుడతారని నేనెక్కడో చదివేను. ఎందుకంటే దున్నపోతుకు నాలుగు కాళ్ళున్నా అది కదలదు. రెండు కాళ్ళు ఉంటే అస్సలు కదిలే సమస్యే ఉండదన్నమాట. తెలుగు బ్లాగుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ లోపించిందని నా అభిప్రాయం. కొన్ని బ్లాగుల్లో ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది లెండి. Any How Thanks.

Dharanija said...

ha ha ha ha ha ha .maa intlo sense of humour andariki undi.maa inti ki velite navvi navvi buggalu nostayi .navvu leni life oka lifa?meeru navvinchandi.memu navvukuntam.