June 27, 2009

అమ్మ తోడు అడ్డంగా నరకాలి!!

మీకెప్పుడైనా ఎవరినైనా బోర కొరికి చంపెయ్యాలని అనిపించిందా?
లేకపోతే మణికట్టుమీద నరం కోసి రక్తం బొట్ట్లు బొట్ట్లుగా పోయి నెమ్మదీగా చస్తూంటే చూడాలని అనిపించిందా?
ఒంట్లో నరాన్ని పట్టి లాగి ఒంద మీటర్ల తాడు బైటికి తీయాలని అనిపించిందా? టిప్పర్ లారీ ఆటోని గుద్ది నలిపేసినట్టు ఒకడి తలని నాపరాళ్ళ మద్య పెట్టి నలిపెయ్యాలని అనిపించిందా? నాకనిపించింది!! చాలసార్లు అనిపించింది.
మొదటి సారి బొంబాయి పేలుళ్ళలో ఒకడైన కసబ్ గాడికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నప్పుదు అనిపించింది.
కోర్టు వాడి తరపున లాయర్ పెట్టుకో అన్నప్పుడు వాడి తరపున లాయర్లు సిద్దమైనప్పుడు అనిపించింది. వాడి మీద నేర నిరూపణకు సాక్ష్యాధారాలు కోర్టులో పెడుతున్నప్పుడు అనిపించింది. సిన్సియర్ పోలీసు ఆఫీసర్లు తూటాలకి బలి అయినప్పుడు అనిపించింది. పాకిస్తాన్, కసబ్ మా జాతీయుడు కాదు అన్నప్పుడు అనిపించింది. ఒకతల్లి తన ఒళ్ళొ బిడ్డ తుపాకీ తూటకు బలి చేసింది వాడే అని గుర్తించి అక్రోసించినప్పుడు అనిపించింది. భారత ప్రతిష్ట దిగజార్చడానికి విదేశీయుల్ని చెరపట్టి చంపారని తెలిసినప్పుడు అనిపించింది. ఇన్ని అకృత్యాలకు ప్రత్యక్ష సాక్ష్యాలున్నా వాడిని శిక్షించాడానికి మీన మేషాలు లెక్కపెడుతున్న వ్యవస్థ మీద కసి ఉక్రోషం పుడుతున్నయి. మన నేతల ఉదాసీన వైఖరి మీద కసి ఉక్రోషం పుడుతున్నయి. భారత సమైక్యతకోసం ఎన్ని త్యాగాలకైన సిద్దం అని నేతలు ప్రకటించిపన్నుడు కసి ఉక్రోషం పుడుతున్నాయి. ఎన్ని దారుణాలు జరుగుతున్నా బీరాలు తప్ప చేతలు లేని నాయకుల ప్రవర్తన మీద కసి ఉక్రోషం పుడుతున్నాయి. అదె మరొక దేశమైతే వాడి కుత్తుక కత్తిరించి పాకిస్తాన్ ఇంటిముందు వేలాడదీసేది. ఇది నా ఆక్రోశం. మరి మీరేమంటారో నాకు తెలియదు.

5 comments:

కత్తి మహేష్ కుమార్ said...

మీ కసీ ఉక్రోషాలు ఇలాగే ఉండుగాక!

Indian Minerva said...

This is toooooo..... much. అసలు చట్టమేంచెయ్యాలో మీరే ఇక్కడచెప్పేసేప్రయత్నం చేసారు. అసలు ఏ విషయంలో మనమేంచెయ్యాలంటే
1) దాన్ని (అంటే చట్టాన్ని) దాని పని చేయనివ్వాలి అప్పుడేమవుతుందంటే
i) ముందుగా ఖైదీకి ఒక number ఇవ్వాలి (అఫ్జల్ గారి విషయంలో ఇది 234 అని ఈ మధ్యనే ఎవరో సెలవిచ్చారు)
ii) ఆ number ప్రకారం తీరిగ్గా (దీన్ని క్షుణ్ణంగా అని చదువుకోగలరు) విచారిస్తారు.
iii) వాడి ఖర్మకాలి(??) వాడు బ్రతికివుండగానే విచారణపూర్తయి నేరస్తుడనితేలితే అప్పుడు మళ్ళీ ఇలా చేస్తారు.
a) ఆ శిక్షని అమలుచేయటానికి అమెరికా AND/OR పాకిస్తాన్ అనుమతికోసం ఉన్నత స్థాయి సమా"వేషా"లు వగైరా జరిపి అక్కడ జాతీయత, వయస్సు మరియు లింగం తదితర అతిముఖ్యమైన విషయాలమీద ఏకాభిప్రాయం సాధించాక.
b) రాష్త్రపతిచే ఆమోదించబడిన క్షమాభిక్ష ప్రతిపాదనమీద ప్రజాగ్రహం పెల్లుబుకకుండా వుంటే.....


అప్పుడు.... అప్పుడు... నాయనలారా అప్పుడు... మరణశిక్ష(?) అమలుచేయబడుతుంది.


ఒకవేళ అలా జరగలేదనుకోండి అదికూడా మనమంచికే పాకిస్తాంతో మన దౌత్యసంబంధాలు మెరుగుపడిపోతాయన్నమాట. అందుచేత మీ ఆక్రోశము అర్ధరహితము.

Q.E.D. అనబడు Quod erat Demonstrandum.

Sujata said...

Kasab .. పేరు మీద ఒక సినిమా అయినా రావాలి. దానికి రొమాంటిక్ ఎడ్జ్ వుండాలి. స్విజ్జర్లాండు లోనీ, న్యూజీ లాండ్ లో నీ పాటలుండాలి. ఆ తరవాత ఏమో.. అలా ఎందుకు చేసాడో - అమాయకుడే ! అని పబ్లిక్కు ఒపీనవ్వాలి.

నాకూ కోపం వచ్చింది ఎప్పుడంటే - అసలు కసబ్ మీద కాదు. సాధారణ ఎన్నికల సమయంలో ముంబాయి లో సెలెబ్రిటీలు తప్ప సాధారణ జనతా పోలింగ్ రోజుని సెలవు రోజుగా పరిగణించి, భాధ్యతా రహితంగా వ్యవహరించినపుడు. దేశంలో ఎక్కడెక్కడో - ముసలమ్మలూ, వికలాంగులూ - కష్టాలు పడి పోలింగ్ రోజున నానా లిస్టులూ వెతుక్కుని ఎండల్లో వోటు వెయ్యడానికి వెళ్ళొచ్చినట్టు వచ్చిన వార్తల పక్కనే, ముంబయి ప్రజల అలసత్వాన్ని కూడా మీడియా ప్రకటించినపుడు - నిజంగా కోపం / నిస్సహాయత లాంటిదీ, అనిపించింది.

Subrahmanya Chaithanya Mamidipudi said...

వాడిని అడ్డంగా నరకడం కాదన్నా అపరిచితుడు రేంజ్లో చిత్ర హింస చూపాలి అన్నది నా కోరిక. వాడిని చంప కూడదు ఒక 15 ఏళ్లు అదే జీవితం అవ్వాలి వాడికి

Dharanija said...

enduku mana nayakulu ila unnaru?naku mamooluga avesam ekkuva antaru .nenu loksattaparty tarapuna pracharam cheste okkaroo nammaledu avineetirahita samajam vastundi ante.enduku prajallo inta udaseenata.?literates n illiterates are thinking in the same way. I dont know why this is happening like this?