June 25, 2009

విశ్వామిత్రుడి మొదటి రాతలు - అంతా గోలే!!

నేను కూడా రాయడం మొదలెట్టేశాను. ఇప్పటివరకు నేను తెలుగు బ్లాగులని చదువుతూ ఉండేవాడిని. దేనికైనా మార్పు కావాలి కదా? రాసేస్తే పోలా అనిపించింది. అంతే! టపుక్కున ఒక బ్లాగు సృష్టించాను. నన్నెప్పుడూ అందరూ వాగుడుకాయ అంటారు. అంటే ఒకటికి పది మాటలు మాట్లాడటమన్న మాట. కొంతమంది నా కంపెనీని ఎంజాయ్ చెస్తే మరికొంత మంది నా ధాటికి భయపడటం కూడా నేను ఎరుగుదును. చిన్నప్పుడు నాకు మా అమ్మ వస ఎక్కువ పోసిందని మా అమ్మమ్మ కుడా అనేది. వాగుడుకాయ, సోదిగాడు, మాటలమూట, నోటిదురదగాడు ఇంకా చాలాపేర్లు నాకున్నాయి. నాకు చిన్నప్పటినుండి స్నేహితులుకూడా ఎక్కువే. వారెవ్వరికి నాతో పోట్లాడకుండా పొద్దు గడవదంటే మీరు నమ్మాలి. హాస్యం అంటే ఇష్తపడతాను. ఎందుకంటే నవ్వుతూ జీవిస్తే మరో పది రోజులు ఎక్కువ బతుకుతారని నాకు మా గురువుగారు చెప్పేరు. జీవితాని సీరియస్‌గానూ జీవనాన్ని ఖుషీగాను బతకాలని నా ఫిలాసఫీ. కొద్దిపాటి చదువుకు చిన్నపాటి ఉద్యోగం వచ్చింది. కులాసాగా ఉద్యోగం చేసుకుంటూ ఖుషీగా సినీమాలు చూసుకుంటూ ఇలాగే జీవితాన్ని గడిపేయాలని నా ప్రగాఢ కోరిక. కొద్దిగా చలం పుస్తకాలు, కొన్ని పురాణాలు, యండమూరి నవలలు అన్నీ, మల్లది నవలలు చదవడం నా సరదాల్లో ఒకటి. ఊళ్ళు తిరగడమన్న సరదానే. పల్లెటూళ్ళలో ఉండాలంటె మరీ మరీ ఇష్టం. దిగుడు బావుల్లో స్నానాలన్న,కాలవల్లో ఈతలన్నా,గాలి పటాలన్నా, ముంజికాయ బళ్ళన్నా, గేదెలమీద సవారీలన్నా చాలా చాల ఇష్టం. జీవితంలో మరీ పైకి ఎదిగెయ్యాలని అనుకుంటే ఇవన్నీ కష్టంగానీ, ఎందుకంటే ఎక్కువ చదివేస్తే అమెరికాలో ఉద్యోగం వచ్చేస్తుందని మా అమ్మమ్మ అంటూ ఉండేది. అమెరికా వెళ్ళడం ఏమాత్రం ఇష్టంలేని నేను సరిగ్గా చదివేవాడిని కాదు.:) ఎప్పుడూ అత్తిసరు మార్కులే. కాబట్టి హాయిగా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇకనుండీ మిమ్మల్ని తరచుగా విసిగిస్తాను. సరేనా?

3 comments:

Jess said...

ఇరగదీసెయ్ తమ్ముడు నిన్ను చూస్తుంటెయ్ నన్ను నన్ను నేను అద్దం లొ చూస్తున్నట్టుంది నెనైతెయ్ నీకన్నా కొంచెం ముందు బ్లాగటం మొదలు పెట్టాననుకొ. Best of Luck

viswamitra said...

కాస్త కొత్తగదా, మోడరైజేషన్ గొడవలో రెండు కామెంట్లు ఫట్!

జ్యొతిగారు అన్నారూ ఒబామా మీద ఒట్టేసి చెప్పండి అంతా ఇలాగే రాస్తానని అన్నారు!!

@ జ్యోతిగారూ ఒబామా వాళ్ళ బామ్మ మీద ఒట్టు, అంతా సర్దానే రాస్తాను. సీరియస్ మాటే ఉండదు.

@ జెస్‌భాయ్ సపోర్టు ఇచ్చావుగదా.. ఇక చూస్కో...

మనోహర్ చెనికల said...

ఈ వాగుడుకాయ, వసపిట్ట ఇలాంటి బిరుదులకి పడిపోయే రెండురెళ్లు ఆరేంటి మనం తలుచుకుంటే పది కూడా చేసేయగలం అని పెద్ద బిల్డప్పిచ్చి బ్లాగు మొదలెట్టేశా. చివరికి ఒకటి + ఒకటి=మూడు అనిపించేలా కూడా రాయలేకపోయాను.

మీరైనా కృతకృత్యులవ్వాలని ఆశిస్తూ......