November 27, 2009

నే సచ్చిపోతా...నన్నాపకండి ! !

చాలా సినీమాల్లో మనం చూసాము వేణుమాధవ్ కోపంగా నే సచ్చిపోతా నన్నాపకండి అని గింజుకుంటూ ఉంటే వెనుకాల స్నేహితులు పట్టుకొని ఆపుతూ ఉంటారు. విసిగిపోయిన స్నేహితులు సరే సచ్చిపో అని వదిలేస్తే సరే మీరు చెప్పినాక నేనెందుకు చస్తాను అంటూ వాయిదా వేస్తాడు. నిన్న న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే నాకెందుకో షడన్‌గా అది గుర్తుకు వచ్చింది. తెలంగాణా సాధన కోసం మధువును కూడా త్యాగం చేసిన కేసీఅర్ నిన్నటినుండి అప్పగింతల కార్యక్రమం మొదలు పెట్టారు. ముందు ఇంటివారి వీర తిలకం అందుకున్నారు. తరువాత తెలంగాణా భవన్‌లో అప్పగింతలు చివరికి ప్రెస్ వారికి కూడా మళ్ళీ కలుస్తానో లేదో అంటూ సెలవు తీసుకున్నారు. 29న జరగబోయే నాటకానికి రిహార్సల్స్ మొదలయ్యాయని చెప్పకనే చెప్పారు. వారు స్వయంగా వధ్యశిలకు వెడుతున్న ఆవులా అనుకున్నా ఇదంతా ఫక్తు నాటకీయ పరిణామలా ఉంది. మధ్యలో వారిని వారు పొట్టి శ్రీరాములు తో కూడా పోల్చుకున్నారు. వారి ముందస్తు ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తమ మరణ దీక్షను ఆపుతుందో లేదో అనే అనుమానంతో కావచ్చు. నాకెందుకో ప్రభుత్వం కేసీఅర్ దీక్షను నిరవధికంగా కొనసాగనివ్వాలని కోరుకుంటున్నాను. ముందుగానే వారిని అరెస్టు చేస్తారని కేసీఅర్ కి తెలుసు. కొంత రసాభాసతో అది ముగుస్తుందని నాకు మీకు వారికి కూడా తెలుసు. ఐనా కూడా వారు తమ నాటకాన్ని విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ ప్రత్యేక తెలంగాణా అవసరమా కాదా అన్నది సమస్య కాదు, ప్రజల ఆశయాలకు తగ్గ నాయకుడా కాదా అన్నది ప్రధాన సమస్య. అది కేసీఅర్ తొ ఎన్నటికి కాదు అన్నది నగ్న సత్యం.

10 comments:

శేఖర్ పెద్దగోపు said...

చూద్దామండీ...ఈ కే.సి.ఆర్ నాటకంలో క్లైమాక్స్ రొటీన్ కి భిన్నంగా ఉండాలని కోరుకుందాం...అప్పుడే కదా మనకి ఎంటర్టైన్మెంట్..:)

Sravya V said...

:)

Uyyaala said...

ఈ వెటకారాలూ , బాధ్యతా రహితమైన వెకిలి రాతలకూ ఏం గాని...
ఈ సమస్యపై తెలంగాణా ప్రజల ఆవేదనను అర్ధం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవాల్టి ఆంధ్ర జ్యోతి లో (28 -11 -2009 ) అల్లం నారాయణ గారు "భద్రత - కుట్ర " అనే పేరుతొ (4 వ పేజీలో) చదవండి. ఆంధ్ర జ్యోతి సైట్ కి వెళ్లి ( http://www.andhrajyothy.com/index.asp ) ఈపేపర్ లో రిజిస్టర్ అయి ఈ ఆర్టికిల్ ని చదవొచ్చు.

విశ్వామిత్ర said...

@ ప్రభకర్ మందర: నేనూ అదే అంటున్నాను. వెకిలి వేషాలు వద్దు అని. ఆశయాలొక్కటే కాదు ఆచరించేవాళ్ళూ కుడా చక్కగా ఉండాలి. ఇప్పటికీ మీలాంటి వాళ్లు వారిని నమ్ముతున్నారంటే...? ముగింపు నే చెప్పినట్టు కాకుండా మరోలా ఉంటే అప్పుడు దానిపై తీవ్రంగా చర్చిద్దాం ! !

Uyyaala said...

విశ్వమిత్ర గారూ
తెలంగాణా మిత్రగా తెలంగాణా ప్రజల ఆశయాలకు తగ్గ నాయకులు ఎవరో ... ఏ పార్టీలో వున్నారో ....ఎవరిని నమ్మాలో ... ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా వుందో ... కాస్త మీరే వివరించండి.

ముందు, దయచేసి, ఒక్కసారి అల్లం నారాయణ గారి ఈ నాటి ఆంద్ర జ్యోతి వ్యాసం (భద్రత - కుట్ర) చదవి ఆ తరవాత స్పందించండి. ధన్యవాదాలు.

Krishna K said...

@ప్రభాకర్ మందార, ఎవరు వెటకారపు మాటలు అంటున్నది, ప్రొద్దున లేస్తే ఆంద్ర వాళ్ళ మీద పడిఏడవటం తప్ప, ఇంకేమీ చేయలేని బక్క కేసియారా, లేక పైన టపా వ్రాసినవాళ్లా? ఎ ఆంధ్రా వాళ్ళ మీద పడి ఏడుస్తాడో అదే ఆంధ్రా వ్యాపారస్తుల దగ్గర మాముళ్ళు వసూళ్లు చేసి వాటితో హెలికాప్టర్లో తిరిగేవాడా తెలంగాణా ప్రేజలను వెఱ్ఱి వెంగలప్పాలను చేస్తుంది ,వేరే వాళ్ళా?

దాదాపు కోటి మంది ఉన్న హైదరాబాద్ మాత్రం కావాలి, కాని అందులోని జనాలు, వారి ఎన్నికలు మాత్రం ముఖ్యం కాదు అనే సొల్లు మాటలు చెప్పేవాడా తెలంగాణాను అవాహేళన చేస్తుంది, లెక బయటి వారా?

ఇక మీరు చెప్పే అల్లము, జయశంకర్ లాంటి మెతావులు kcr వరకు వచ్చేటప్పటికి, ఆ బక్కోడి కామేడీ తింగరి వేషాలు వచ్చేవరకూ ఎందుకు నోర్లు, పెన్నులు, (ఇంకా వేరేవి కూడా) మూసుకొని కూర్చుంటున్నరో సెప్తారా?

kcr లాంటి బఫూన్ లీడ్ చేసినంత కాలం, తెలంగాణా వాదాన్ని ప్రతేకంగా ఎవ్వరూ అవహేలణ చెసే అవసరం రాదు, తన కామెడీ చేస్టలతో ఆ అవకాశం కూడా ఇంకెవరకీ ఇవ్వడు, మీకా అనుమానము అక్కర్లేదు.

సరే సివరాఖరుగా, పోయిన సారి "అమరణ" దీక్ష అని చెప్పి గంటలో ఎందుకు లేచిపోయాడో సెప్తారా?

విశ్వామిత్ర said...

కృష్ణగారూ చక్కగా చెప్పారు. తెలంగాణాలో నివసించే సాధారణ పౌరుడెవ్వరూ తెలంగాణా అడగట్లేదు. కలిసుండాలనే కోరుకుంటూ అభివృద్ది మాత్రం చెందాలని కోరుకుంటున్నారు. టీఅరెస్ తరపున ఎంతొమంది ఏంల్యేలు ఎంపీలు సంఖ్యా బలం ఉన్నప్పుడు పనులు చేయించుకోవడం మానేసి కేవలం మూటలకోసం వెంపర్లాడిన వీళ్ళు వేసే వేషాలు ఎవరు నమ్మరు. 29న ఉద్రిక్త పరిస్తితులు తలెత్తి పోలీసు కాల్పులు లాంటివి జరిగితే నష్ట పోయేది సాధారణ పౌరులే. అప్పుడు ఈ కేసీఅర్ మళ్ళీ కల్లబొల్లి కన్నీళ్ళు తప్ప చేయగలిగింది లేదు.

Sravya V said...

ఈ వెటకారాలూ , బాధ్యతా రహితమైన వెకిలి రాతలకూ ఏం గాని..>> ఎవరివి వెకిలి రాతలు, ఈ పోస్టు లో రాసినవే వెకిలి రాతలంటే మరి కెసిఆర్ గారు మీడియా లో పబ్లిక్ గా మాట్లాడే వాటిని ఏమ్మంటారు ? ఆయన నోటికి హద్దు అదుపు ఎమన్నా ఉందా ? మీకు అలాంటివి తప్పు గా అనిపించతంలేదా ? లేటెస్ట్ అయ్యగారి చెబుతున్నారు ప్రజల పాపాలు కర్నూల్, గుంటూరు, కృష్ణ జిల్లాల వరదలకు కారణమట , ఎమన్నా తెలివుండి మాట్లాడుతున్నారా ఆయన , మరి అదే లెక్కలో తెలంగాణా వెనకబాటు కు కారణం అనుకోవాలిన్సింది . ఐనా కెసిఆర్ ని విమరిస్తే తెలంగాణా ని విమర్శించటం అనా ఇదెక్కడి లాజిక్.

విశ్వామిత్ర said...

శ్రావ్య గారూ టీఅరెస్ తరపున ఉన్న నాయకులకులు ఎంత గౌరవనీయులో వారి మాటలు వింటే తెలుస్తుంది. వీళ్ళు చేసేదంతా ఒక డ్రామ. వీళ్ళకి ఒక ఇష్యూ కావాలి. తెలంగాణా కోసం పోరాడుతున్నామన్న భ్రమ కల్పిస్తున్నారు. కొంతమంది అది నిజమని నమ్ముతున్నారు. వీళ్ళంతా డబ్బు మనుషులు. ఆ విషయం వారి వెనుకనున్నవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ?

Sravya V said...

విశ్వామిత్ర కరెక్టు గా చెప్పారు !