February 1, 2010

వైష్ణవిని చంపేశారు దుర్మార్గులు!!


చినారి చిట్టితల్లి, టీవీలో చిత్రాలలో చిరునవ్వులు ఒలకబోస్తూ అమాయకమైన కళ్ళు గోళీల్లా తిప్పుకుంటూ పుట్టినరోజుగాబోలు జరుపుకున్న కన్నతల్లి, నిండా పదేళ్ళనా లేని పసిమొగ్గ దుర్మార్గుల కర్కశత్వానికి బలైపోయింది. కిడ్నేపైన ఆ చిన్నారి గుంటూరులో నిర్జీవంగా దొరికింది. ఆమె మృతదేహాన్ని కునుగొన్నారని టీవీలో చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. దారికాచి కారు డ్రైవర్‌ను హత్యచేసినప్పుడే కిడ్నాపర్ల రాక్షసత్వం తెలిసింది. అటువంటి రాక్షసులను ఎంతో సున్నితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్నారి వారి చేతుల్లో ఉందికాబట్టి. ఆ చిన్నారి ప్రాణాలతో బైటకు వచ్చేదాకా ఓపికబట్టి తరువాత దోషులను దొరకబుచ్చుకోవాలి. మీడియా చేస్తున్నది మంచో చెడో తెలియని పరిస్తితి. మీడియా చూపిన అత్యుత్సాహంకూడా ఆమె ప్రాణాలమీదకు తెచ్చిందేమో అనిపిస్తోంది. ఆమె ఫొటోను చూపిస్తూ గంటలు లెక్కిస్తూ పోలిసులు చేస్తున్న గూఢచర్యాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఆ సంఘటనను ఒక పెద్ద వివాదంగా మార్చకుండా ఉంటే ఆమె తండ్రివద్దనుండీ కొంత సొమ్ము దొరకబుచ్చుకొని ఆమెను వదిలేశేవారేమో? అప్పుడా చిన్నారి ప్రాణాలతో బైటపడి ఉండేదేమో. కానీ పోలీసుల చేతలు ఎప్పటికప్పుడు చెప్పివేస్తూ వారి ఆచూకీ దొరికే అవకాశం ఏర్పడిందన్న సందర్భములో తప్పించుకోవీలులేక దుర్మార్గులు ఆ చిన్నారిని చంపివేసి ఉంటారు. వారు క్షమార్హులు కారు. ముమ్మాటికి వారిని పట్టి ఉరికంబం ఎక్కించాలి. ఇప్పుడు మీడియావాళ్ళు ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదనలు క్లోజప్‌లో బంధించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు. మీడియాకు ఎప్పుడూ ఒక విషయం కావాలి. వైష్ణవి తల్లిదండ్రులకు మన సానుభూతిని తెలియచేయడంతప్ప మనమేమి చేయగలం?

9 comments:

రమణ said...

అయ్యో!

Indian Minerva said...

తప్పన్నయ్యా... ఇలాంటిరాక్షసులను "ఉరికంబం ఎక్కించడం" కాదు "ఉరితీసుంటే చాలా హాయిగా ఉండేది" అని ఆ హత్యలు చేసిన వాళ్ళే అనుకొనే "సుదీర్ఘజీవితా"న్నివ్వాలి. ఆత్మహత్యకనుకూలించని నరకప్రాయమైన పరిస్థితుల్లోకి తోసెయ్యాలి. అదిచూసి ఒంకొకడు ఇలాంటి పని చేయడానికి కల్లోకూడా భయపడాలి.

The art of policing is to punish severely in order to punish less frequently
-Napolean Bonaparte

Unknown said...

ఈ సంఘటనలన్నీ చూస్తుంటే... భగవద్గీత లో "సంభవామి యుగే యుగే" అనే శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకుంటాను.
కృష్ణయ్యా!...ఎప్పుడు జన్మిస్తావయ్యా ఇలాంటి దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి....

durgeswara said...

హరి హరీ......... వినటానికే తట్టుకోలేకపోతున్నాము .ఆతల్లిదండ్రుల కడుపుకోత తలచుకోలేకపోతున్నాము

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Indian Minerva I agree with you.

Sravya V said...

అయ్యో !

Nrahamthulla said...

చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్‌ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.

శ్రీనివాస్ said...

పాప తండ్రి కూడా చనిపోయారు

Nrahamthulla said...

http://epaper.sakshi.com/Details.aspx?id=373788&boxid=28596068