August 31, 2010

ఆయన వీసినా? వీళ్ళు లెక్చరర్లా?

ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు వీసీకి కూడా మెదడు అరికాలినుండీ మోకాలుకు చేరిపోయిందదని అనిపిస్తోంది. ఎందుకంటే జరిగిన దానిని తప్పు అని చెప్పే దమ్ము లేకపోయినా, వారిపై చర్య తీసుకునెందుకు మనసు రాకపోయినా పర్వాలేదు, కానీ దీనిని మీడియా దుశ్చర్య అని మీడియా అనవసర ప్రచారం చేసిందని చెప్పడం సిగ్గుమాలిన తనం. తెలంగాణా గొడవల్లో కూడా మీడియా అదే పాత్రను పోషించింది. సదరు వీసీని ఎవరైనా చెప్పులతో సత్కరించి ఉంటే వీరికి అభిమానం అంటే ఏమిటో తెలిసి ఉండేది. పైగా విద్యార్ధులకు నష్టం జరగకుండా వీరు చూస్తారుట. అంటే దీని అర్ధం ఆంధ్రా ప్రాంతం నుండీ వచ్చిన లెక్చరర్లు వీరికి నష్టం కలుగ చేశారనా వీరి ఉద్దేశ్యం? తోటి లెక్చరర్లను చెప్పులతో కొడితే సానుభూతి తెలపవల్సింది పోయి విద్యార్ధులపై కేసులనెత్తి వేయాలని అక్కడి లెక్చరర్లు ఆందోళన చేశారట. వీళ్ళు లెక్చరర్లా? వీళ్ళ బతుకులు చెడ! వీసి పదవికి, లెక్చరర్ మాటకి తలవంపులు తీసుకు వచ్చారు. ఇంతకన్న వెధవలు ఉండరేమో? చదువుకున్నవాళ్ళే ఇలా చస్తే, చదువు లేనివాళ్ళు మరింత మూర్ఖంగా ప్రవర్తించడం పెద్దవిషయం కాదేమో? ఇది కేవలం కాష్టాని రగిలించడానికి చేసిన ప్రయత్నమేగానీ మరోటి కాదని అనిపిస్తోంది. దానిలో కిరాయి విద్యార్ధులతోబాటు లెక్చరర్లు చేరడమే మారుతున్న విలువలకు నిదర్శనం.

6 comments:

తుంటరి said...

ఇవన్నీ ఒకవేళ తెలంగాణ విడిపోతే జరిగేవి మచ్చుకు చూపించడానికి.సీమాంధ్ర వాళ్ళకి frustration పెరిగి విడిపోతేనే మంచిది అన్న అభిప్రాయం కలిగించడానికి.పులకేసి రాజకీయనిరుద్యోగి అయిపోకుండా ఉండడానికి.

Alapati Ramesh Babu said...

భయంకరమయిన దారుణం.మరి ఇదీ వారి విధానం.

Sravya V said...

అత్యంత హేయమైన విషయమిది .ఇక ఏమీ జరగకముందే గగ్గోలు పెట్టే కొంతమది బ్లాగర్లు కి ఈ విషయం అసలు పట్టినట్టే లేదు . ఒకటి మాత్రం నిజం ఇవాళ ఇది వేరే ప్రాంత అధ్యాపకులు అని వాళ్ళు చెప్పే వాళ్లకు జరిగింది రేపటి రోజున వీళ్ళకే జరగచ్చు .

విశ్వామిత్ర said...

@ తుంటరి: వాళ్ళ స్వార్ధం కోసం తగులబెట్టుకోమనండి లేక వెరే పొమ్మనండి, కానీ పూర్తిగా నైతిక విలువలు లేకుండా మృగాలుగా ప్రవర్తించడం మాత్రం సహించకూడదు.

@ రమేష్ :వీరికి మరో పర్యాయపదం గులాబీ మూర్ఖులు

@ శ్రావ్య గారూ బ్లాగింగ్ చేసేవాళ్ళంతా మేధావులనా మీ ఉద్దేశ్యం? ఇక్కడ కూడా గులాబీ మూర్ఖులు ఉన్నారు.

భాస్కర రామిరెడ్డి said...

విశ్వామిత్ర గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారం

Nagaraju said...

విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను కొన్నైనా మేధస్సుతో గమనించండి
రేపటి సమస్యల పరిష్కారానికి నా భావాలు ఎంతో ఉపయోగపడుతాయి
ప్రతి జీవి సమస్యల కారణ భావాలను గమనించే జ్ఞానం నా భావాలలోనే
విజ్ఞాన భావాల విశ్వ భాషలో నా జీవితాన్ని లెక్కించుట లేదు ఎందుకో
నా జీవితం కన్నా విశ్వ జీవుల జీవిత విజ్ఞానం నా మేధస్సుకు శ్రేయస్సు

Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read my blogs for spiritual information and universal intents
Thanks,
Nagaraju