October 20, 2017

కడుపుమంటకు కారణాలు!!

ఊరందరిదీ ఒక దారైతె ఉలిపిరికట్టది మరో దారి అన్నది సామెత అని విన్నట్టు జ్గ్యాపకం. అందరిలా మనమూ ఉంటే ఎలా అని అనిపించినప్పుడు..మనల్ని ఎవరూ గుర్తించట్లేదు అనిపించినప్పుడు...జివితం లో కొత్తదనం కావాలి అనిపించినప్పుడు...జివితం మరీ సాదాసీదాగా పోతోంది అనిపించినప్పుడు... ఏదో ఒక చిలిపి చేయాలి అని అనిపించినప్పుడు....కడుపు మండినప్పుడు... తలలో నిషా ఎక్కినప్పుడు....పక్కవాడి పెరుగుదల మన మనసుని చిద్రం చేస్తున్నప్పుడు...మనమీద మనకే విసుగుపుట్టినప్పుడు... కళ్ళు మండి కడుపు మండి మెదడు చిట్లినప్పుడు...ఎవరో ఒకరిని దుమ్మెత్తి పొస్తే కాస్త మనసుకి శాంతి కలుగుతుంది. అది కూడ సెలబ్రటీనో లేక ఒక  కులాన్నొ దుమ్మెత్తి పొస్తే ఉండే ఆ కిక్కే వేరు. చేతి  దురద తగ్గేదక రాసెయ్యాలి, నోటి దూల తీరేదాకా వాగాలి. కంఠ సోష తగ్గేదాకా నిందలు వేయాలి. ఇక చూస్కో  సోషల్ మీడియాలో బోలెడు పబ్లిసిటీ, లత్కోర్ చానల్లో బోలెడు చర్చలు, పనికీమాలిన పేపరోళ్ళ పబ్లిసిటీ. మొబైల్స్‌లో,  వాట్సప్‌లలో,  రోడ్లమీద, కార్లమీద, ఆఖరికీ టాయిలెట్లలో కూడా బోలెడు పబ్లిసిటీ. నా భావ స్వేచ్చను హరించే హక్కు ఎవ్వరికీ లేదు. నన్ను కాదంటే నీలో ఏదో దురహంకారం ఉన్నట్టే. నీ ఛాందసవాదంతో నన్ను ఆపలేవు. ఇరోజు రాష్ట్రమంతా కాదు కాదు దేశమంతా నాగురించే చర్చ. నేను అనుకున్నది సాధించా. నేను అనుకున్నది సాధించా !!   రేపొమాపో ఏకో ఒక పార్టీ నన్ను తమలోకి  ఆహ్వానిస్తుంది. ఏందుకంటే నేను ఈరోజు వార్తల్లో వ్యక్తిని. నా చర్మం మందం. నా నాలుక మందం. నా బుద్ధి మందం. నా కళ్ళు చూడలేవు. నా మెదడు ఆలోచించదు. కుళ్లిపోయి కంపుకొడుతున్న భావ ప్రపంచంలో పొర్లాడడం నాకు ఆహ్లాదకరం. ఇదే నా ప్రపంచం!!           

No comments: