August 10, 2009

సంస్కారం కులాన్నిబట్టి వస్తుందా?

విద్య నేర్పే గురువు సాక్షాత్తూ భగవత్ స్వరూపంగా చెపుతారు. అలాంటి భగవత్ స్వరూపమే మా మాస్టారు. ఆజానుబాహుడు. ఎప్పుడూ ఖద్దరు బట్టలే కడతారు. పొడవైన అంగీ, పంచె కట్టు, భుజంపై మువ్వన్నేల రంగుతో ఉండే కండువా, మొఖంలో తేజస్సు, గాంభీర్యం, ఏ విషయాన్నైనా తెలియ చెప్పగల విఙ్నానం ఆయన సొత్తు. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ పుస్తకాలుండేవి. అవేమిటో తెలుసుకొనే సాహసం మాకు ఉండేది కాదు. ఆయన క్లాసులోకి వస్తే చాలు పిల్లలందరమూ బుద్ధిమంతులుగా కూర్చుండి పోయేవాళ్ళం. అలాగని మమ్మల్ని ఎప్పుడూ మందలించిన పాపాన కూడా పోలేదు. ఆయన చెప్పేది చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉండేవి. ఊరి పెద్దలలో ఆయన ఒకరు. అనేక సలహాలు సంప్రదింపులు ఆయనతో జరిగేవి. రోడ్డుపై ఆయన నడిచి వెడుతూ ఉంటే గౌరవంతో అందరూ పక్కకు తప్పుకొనే వాళ్ళు. ఇన్ని విశిష్ట లక్షణాలున్న ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు. వారికి కులాన్ని అంటగట్టి పాపం మూటగట్టుగోవడం నా ఉద్దేశ్యం కాదు. సంస్కారం అనేది కులాన్ని బట్టి రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. గొప్ప వ్యక్తులకు మతం రంగు, కుల కంపులు అంటవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. వ్యక్తిత్వం అనేది కేవలం పుస్తకాలు చదవడంవల్ల రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మర్యాద అనేది అడిగి తీసుకొనేది కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. సంఘంలో మనలని ఎవ్వరూ పట్టించుకోరు అనడం బ్రమ అని చెప్పడమే నా ఉద్దేశ్యం. నీ మాటలు, నీ నడవడికే సంఘంలో నీకొక స్థానన్ని కల్పిస్థాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మహాత్మ గాంధీ కూడా జాతి వివక్షను చవి చూశాడు. దానివల్ల ఆయన్లోని నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయికాని నశించి పోలేదు. ఇలాటి ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు!!

సాంఘీకంగా ఏర్పరచుకున్న కట్టుబాట్లని పాటించాలని రాజ్యాంగంలో రాసి లేదు. ఎవరి చిత్తము వచ్చినట్ట్లు వారు నడుచుకోవచ్చు. బ్రాహ్మలు మాంసాహారము తింటానన్నా, మరొకళ్ళు మా సంస్కృతి ప్రకారం గొడ్డు మాంసము తింటానన్నా నిరభ్యంతరంగా తినచ్చు. దొరికితే కుక్క మాంసము కూడా తినొచ్చు. ఈశాన్య ప్రాంతాలలో బంధువులు వచ్చినప్పుడు ప్రత్యేక వంటకంగా కుక్క మాంసమే వండుతారు. నీ స్వేచ్చని కాదనే హక్కు ఎవరికీ లేదు. వండుకు తిన్నా పచ్చిది తిన్నా కూడా కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ నీ అలవాట్లని మరొకరిపై రుద్దటం అనుచితం. నీ స్వేచ్చ నీ వరకే పరిమితం. సాంఘీకంగా సర్వోన్నతుడివి కావాలంటే మాత్రం మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి. వారి అభిప్రాయాలతో నీకు పని లేనప్పుడు నువ్వెప్పటికీ ఒంటరివే!!

18 comments:

కొత్త పాళీ said...

Interesting.

"సాంఘీకంగా సర్వోన్నతుడివి కావాలంటే మాత్రం మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి."

ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నాయకుడైనవాడికి ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్ది సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుందని నేను నమ్ముతాను. కేవలం మెజారిటీ మన్నించి తలవొగ్గేవాడు తాత్కాలిక నాయకుడైతే కావచ్చు గానీ చరిత్రకెక్కే నాయకుడు కాలేడు.

విశ్వామిత్ర said...

కొత్తపాళీగారూ

చరిత్రలోనూ మాకు స్థానం లేకుండా చేసారు అనేవాళ్ళగురించే నేను చెప్పేది :)

ఒకళ్ళు ఇవ్వడానికి మరొకళ్ళు పుచ్చుకోడానికి అది వస్తువు కాదు.

విశ్వామిత్ర said...

మీరు చెప్పింది నిజమే. నాయకత్వ లక్షణాలు లేనివాడిని నాయకుడిని చేసినా అది శునకపు సింహాసనమే అవుతుంది :)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

బాగుందండి మీ పోస్ట్.
----------------------------------------------
>> నీ స్వేచ్చ నీ వరకే పరిమితం. సాంఘీకంగా సర్వోన్నతుడివి కావాలంటే మాత్రం మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి.
---------------------------------------------
మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాలని ఆలోచిస్తే సూర్యుడి చుట్టూ భూమి తిరుగోతోందని తెలేసేది కాదేమో? ఏమంటారు?

Kathi Mahesh Kumar said...

" కానీ నీ అలవాట్లని మరొకరిపై రుద్దటం అనుచితం. "....Exactly నేను చెప్పిన పాయింటూ అదే. ఎవరి సంస్కృతి వారు పాటిస్తుంటే "ఇది మన సంస్కృతి కాదు" అని అభ్యంతరం పెట్టింది ఎవరు?

ఎవరు మెజారిటీ ప్రజలు? ఏమిటి రాజ్యాంగాన్ని మించిన వారి అభిప్రాయాలు? అవెక్కడ దొరుకుతాయి?

Praveen Mandangi said...

నేను శూద్రుడిని కానీ నాన్ వెజ్ ముట్టుకోను. నాన్ వెజ్ అంత చవకైనది కాదు. గొడ్డు మాంసం పేరుతో మహేష్ వ్రాసే వ్యాసాలు దళితులకి ఆర్థికంగా ఎలా మేలు చేస్తాయో అతనికే తెలియాలి.

జీడిపప్పు said...

Hats off to Mahesh garu for smartly achieving what you need.

విశ్వామిత్ర గారు, you are doing the same mistake i did. మహేష్ గారి "గజ్జి" గురించి మీకు ఇప్పటికే బాగా తెలిసి ఉంటుంది. దురదపుట్టినప్పుడల్లా ఆ గోక్కుంటారు. తాను గోక్కోవడమే కాక పక్కనోళ్ళ చేత గోకుతుంటే ఇంకా హాయిగా ఉంటుంది. తన "గజ్జిని" బయట కక్కుతుంటే మనలాంటోళ్ళు మహేష్ గారి మాటలకు అనవసరపు విలువనిచ్చి సమయాన్ని, తెలివిని వృథా చేసుకుంటున్నాము. Just treat him like a piece of ... and stay away from it. బ్లాగులు చదివే వందలమంది ఆలోచనల్లో ఆఫ్టరాల్ ఒక గజ్జి ఉన్నవాడి పోస్టులవల్ల ఏమీ మార్పు కలగదు.

Once again, I hope you won't do the same mistake I did.

Praveen Mandangi said...

నాన్ వెజ్ అంత చవకైనది కాదు. గొడ్డు మాంసం పేరుతో మహేష్ వ్రాసే వ్యాసాలు దళితులకి ఆర్థికంగా ఎలా మేలు చేస్తాయో మహేష్ సమాధానం చెప్పగలడంటే డౌటే.

Praveen Mandangi said...

ఇతను గొడ్డు మాంసం తినమని అడ్వొకేట్ చేస్తున్నది మెక్ డొనాల్డ్స్ లాంటి బహుళజాతి కంపెనీలకి లాభం కలిగించడానికి.

విశ్వామిత్ర said...

@ గణెష్: కేవలం అభిప్రాయాలలో బేధం ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదు. ఆచరణలోకి వచ్చినప్పుడు ఇబ్బంది. నీ పరిధిలో నువ్వు స్వేచ్చగా ఉండవచ్చు. నీ స్వేచ్చ మరొకరికి ఇబ్బంది కాకూడదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందన్నా లేక సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడన్నా వ్యక్తిగతంగా ఒకరికి వచ్చే నష్టం లేదు.

@ మహేష్: మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకు తిరగరు కదా? అందులో మరీ పెద్దవి .. :) ఆంధ్రాలో చాలా చాలా తక్కువ మంది గొడ్డు మాంసాన్ని తింటారని తెలుసు. మీరు పోరాడి మరీ ఒక స్టాల్ కోసం ప్రయత్నించారంటే... మీ ధైర్యం...!!

విశ్వామిత్ర said...

@ జీడిపప్పు గారూ: :) నాకు ఎండు చేపలంటే ఇష్టం కావచ్చు. కానీ మీకు ఆ వాసనంటే అసహ్యం అనిపించవచ్చు. అలాంటప్పుడు మీ ఎదురుగా కూర్చొని నేను కాల్చుకొనె తినడం ఎంతవరకు సమంజసం? మీరు ఒప్పుకోకపోతే నా స్వేచ్చను హరించినట్లా? Simple logic!!

Praveen Mandangi said...

గొడ్డు మాంసం గురించి ద్విజేంద్ర నారాయణ్ ఝా గారు వ్రాసిన పుస్తకం చదివాను. మహేష్ పంది మాంసం కూడా తింటానంటున్నాడు. పంది మాంసం తింటే టేప్ వ్యాధి వస్తుందని అతనికి తెలియదేమో.

విశ్వామిత్ర said...

Praveen i feel you are better... some times!!

:)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

విశ్వామిత్ర గారు మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను.
మీరన్నట్టు ఎవరి అభిప్రాయలు వాళ్ళవి, కాని అవతల వాళ్ళ స్వేచ్ఛ కి భంగం కలగనంతవరకు.
నేను విభేదేన్చినది ఏమిటంటే మెజారిటీ ప్రజలు ఎలా అలోచిస్తునారో అలానే ఆలోచించాలి అనే పాయింట్ తో మాత్రమే.
ఏమైనప్పటికీ వాదులాట నా ఉద్దేశ్యం కాదు. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.

Praveen Mandangi said...

ఈ లింక్ చదవండి: http://sahityaavalokanam.net/?p=227

విశ్వామిత్ర said...

@ గణేష్ గారూ.. ఆర్గ్యుమెంట్ అనేది హుందాగా లాజికల్‌గా ఉండాలి. మీరు చెప్పింది కరక్టే. కానీ ప్రజాభిప్రాయం అనేది ఎంచుకున్న విషయాన్ని బట్టి ఉండాలి. And we should not forget that man is a social animal.

Praveen Mandangi said...

అతను గొడ్డు మాంసం తింటాను, పంది మాంసం తింటాను అంటే అతని ఇష్టం. అవి అలవాటు లేని వాళ్ళ చేత కూడా తినిపించాలనుకుంటే మాత్రం అతని మొహం మీద ఉమ్మాల్సిందే.

Kathi Mahesh Kumar said...

http://parnashaala.blogspot.com/2009/08/blog-post_31.html