April 1, 2010

మీడియా ట్రెండ్ మారుతోందా?


గత కొన్నిరోజులుగా హైదరాబాదులో జరుగుతున్న అల్లర్లకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చెప్పకపోయినా పండగ చేసుకొనేది మాత్రం మీడియానే. ఈ అల్లర్లలో కేవలం ఇద్దరే చనిపోయారు. పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనైతేనేమి ప్రభుత్వ కృతనిత్చ్యయం వల్లనైతెనేమి బాగానే అదుపులోకి తేసుకొచ్చారు. కానీ జరిగిన అల్లర్లు మీడియాకు తగినంత వార్తలను అందించలేకపోయింది. అందువల్ల జరుగుతున్న అల్లర్లలో మషలా సరిపోక ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు తవ్వి ఆ క్లిప్పింగులను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు కలిపి బంపర్లు చేసి చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే. కాని వీటికి భిన్నంగా "జీ-24 గంటలు" స్పందించడం కొంత సంతోషకరం. "NO EXCLUSIVE, NO SENSATION" అంటూ మీడియా బాధ్యతను అందరికీ గుర్తు చేస్తోంది. సందులో సడేమియాలా దీనికి తెలంగాణా రంగు పులమడానికి అరాచకీయ నేతలు ప్రయత్నాలు నిజంగా సిగ్గుచేటు. కోదండరాం, గద్దర్ " ఇది సమైక్యవాదుల కుట్ర" అని ప్రకటించి వారి కుటిల రాజకీయాన్ని బయటపెట్టుకున్నారు. ఇలాటి సందర్భాలలో ప్రజలకు బాసటగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన తరుణంలో ఇలాటి పేలాపనలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయని తెలియని ఈయన ప్రజా గాయకుడెలా అయ్యాడో? ఏది ఏమైనా ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా ఎంతో సంయమనం పాటించాలి. దానిలో తొలి అడుగు జీ-24 గంటలుదైతే అది శుభ పరిణామమే.

2 comments:

మంచు said...

మీది కొద్ది అత్యాసే అనుకొవాలి.. TV 9 , ABN జ్యొతి లాంటి తోలుమందం చానల్స్ జీ 24 ని ఫాలౌ అవుతాయా :-))

నిజం said...

ఇలాంటి సంగటనలు జరిగినప్పుడు లైవ్ చూపించ కూడదని బుద్ది లేని TV9 వాడికి తెలియదంటార....దీని వెనక ఎవరు వున్నా కటినముగా శిక్షించాలి