April 15, 2010

మీడియా చేసేది వ్యాపారమే...!!


ఈ మద్యకాలంలో చర్చలకు వేదిక కల్పించాల్సిన మీడియానే చర్చనీయాశమైంది. ముఖ్యంగా బ్లాగుల్లో మీడియా ముఖ్యవిషయమైంది. మీడియాపైన ఎక్కువమంది వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు అన్నది సత్యం. వీరికీ వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్నయం వచ్చినా పత్రికా స్వాతంత్ర్యం మంటగలిసిపోతోంది అని పెడబొబ్బలు పెట్టే వ్యక్తులు దానికి కారణాలు శొధించాల్సినప్పుడు ఆ బాధ్యతను యాజమాన్యంపై నెట్టివేస్తూ అందులో తమ బాధ్యత లేదంటూ కప్పదాటుధోరిణి ప్రదర్శించడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రజా పక్షాన నిలబడవలసిన పత్రికలు లేద చానల్స్ ప్రభుత్వ పక్షమో లేక ప్రతిపక్షంవైపో ఉంటున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇలాటి సమయంలో పత్రికా విలువలు అంటూ అంటూ సూక్తులు చెప్పడం ప్రజల్ని వెర్రివాళ్లని చేయడమే. మీడియా అనేది ఒక సేవాసంస్థ కాదు అందులో పనిచేసేవాళ్ళు ప్రజా సేవకులు కాదు. మీడియాలో అన్నీ వ్యాపార సంస్థలే అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదికూడా ఒక రియల్ ఎస్టేట్ లాంటిదే. ఒక పత్రిక బలపరిచే పార్టీ అధికారంలో ఉంటే ఆ పత్రికకు మంచి బూం ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనలలో సింహభాగం ఆ పత్రికకే వస్తాయి. అందులో పనిచేవాళ్ళంత కేవలం ఉద్యోగస్తులు. కేవలం ఉద్యోగస్తులు. తమ పత్రికకు చదువరులు ఎక్కువ ఉంటే ప్రకటనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అందులో పనిచేవాళ్లంత చదువరులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో సేవాతత్పరత, విలువలు అనేవి ప్రస్తుతం లేవు. ఇది కాదని ఏ ఒక్కరైనా చెప్పగలరా? మరి అటువంటప్పుడు జర్నలిస్టులంటూ వీరికి ప్రత్యేక హోదాగానీ ప్రత్యేక సదుపాయాలు గానీ ఎందుకు? మీడియా అనేది నిజానికి ఒక "వాచ్ డాగ్" (తెలుగులో చెపితే కొంతమంది బాధ పడతారెమోనని)లాగ పనిచేయాలి. మీడియా నిజంగా ఆపని చేస్తోందా? దానిలో ఎన్నో స్వలాభాలు ఉంటాయి. ఆ లాభాన్ని పంచుకోవడం జర్నలిస్టుతో మొదలై యాజమాన్యంతో ముగుస్తుంది. ఆ లాభాన్ని పొందుతున్నప్పుడు కష్టాన్ని కూడా భరించాలి. ఆ కష్టం నిజంగా ప్రజలకోసం పడితే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు మీడియా వెంట ఉంటారు. కానీ జర్నలిస్టులంతా ప్రజలకోసం పనిచేస్తున్నారు, ప్రజలకోసం కష్టపడుతున్నారు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీరు మాకు దూరంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాము అనేది ప్రస్తుత పరిస్తితి.
ఒక మిత్రుడు మద్యపానం చేసి రాత్రి బైక్‌మీద ఇంటికి వెడుతూ ఉంటే ఒక పోలీసు అతడిని అపేడు. నేను జర్నలిస్టును నన్ను ఆపడానికి నీకెంత దమ్ము అని ప్రస్నిస్తే తిక్కపుట్టిన పోలిసులు అతగాడిని స్టేషన్‌కు తీసుకుపోయారు. అతడు మరో సీనియన్ జర్నలిస్టుకు ఫోన్ చేసి విడిపించమని చెపితే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్‌తొ మాట్లాడటమేమిటి? నాది ఎస్పీ లెవెల్..రేపు ఎస్పీతో మాట్లాడతాను అని చెప్పేడు. అది సంగతి!!

జర్నలిస్టులు వేరు పత్రికా యాజమాన్యం వేరు అంటూ జరుగుతున్న తతంగంలో మా బాధ్యత లేదు మేము నిమిత్త మాత్రులమంటే కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

విలువలను పాటిస్తూ ప్రజాభిప్రాయాన్ని మన్నించే, ప్రజాహితం కోసం పాటుబడే నిజమైన జర్నలిస్టులు ఒక శాతమైనా ఉండిఉంటే వారికి నా వందనాలు.


7 comments:

Sravya V said...

బాగా చెప్పారు !

Anonymous said...

మీడియా గురించి మీరు చెప్పివవన్నీ నిప్పు లాంటి నిజాలే

Anonymous said...

అసలు తప్పు లేదు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Well said,sir.

Krishna K said...

సేం టు సేం ఫీలింగ్స్ నావి కూడా.
బ్లాగ్ లోకం లో, మీడియా విలువలు పాడయి పోతున్నాయి, వాళ్లని పీకాలి , గీకాలి అనే ఓ పెద్దయన బ్లాగ్లో ఆ మద్దెన దీని మీదే ఇలాంటి కామెంట్ పెడితే వేసుకోలేదనుకోండి :)
ఏదయినా రంగం లో, విలువలు నిలబడి మీడియా రంగం లో దిగజారుతుంటె గుండెలు బాదుకోవాలి కాని, అన్ని రంగాల తో పాటే, మీడియాలో కూడా దిగజారుతుంటె వాళ్లమీద పడి, గుండెలు బాదేసుకోవటం అవసరమా అనిపిస్తుంది? అంతెందుకు, పాఠాలు చెప్పల్సిన పంతుళ్లు ఎంతమంది నిబద్దతతో చెబ్తున్నారు? అందుకని వాళ్లని పీకేద్దామా పాఠాలు చెప్పే పంతులుగారు? అని ఆయన్నే అడిగా లెండి:)

ఇక, ప్రతిదానికి మీడియా ఓనర్లె కారణం అని చెప్పటం, ఓ రవిప్రకాష్ మీదో, నరెంద్ర చౌదరి మీదో పడటం కూడా చూస్తుంటే నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్లు లాభాలకోసం పెట్టారా లేక సమాజసేవకోసం పెట్టారా వాళ్ల వ్యాపారాలు? మరి ఆ "మెరుగయిన సమాజం" కోసమనె క్యాప్షన్లు ఎందుకంటే అవీ వ్యాపారంలో భాగం కాదా?
అంతకంటే నవ్వు వచ్చేది ఏమిటి అంటే, మామూలు జర్నలిస్ట్లు చేసే ప్రతి కార్యక్రమానికి ఆ మీడియా అధిపతులే కారణం అన్నట్లు చూపటం? TCS లో పనిచేస్తున్న మిత్రుడు తన పొగ్రాం లో బగ్గులు ఉండటానికి "రతన్ టాటా" కారణం అన్నట్లు!!
ఇక మీరు చెప్పినట్లు జర్నలిస్ట్లు ఎమయినా నీతి నియమాలు విలువలతో నిబద్దత గా నిజ జీవితం లో ఉంటున్నట్లు అధిపతుల మీదో, హేడ్ ల మీదో, ప్రతి వెధవపని తోసేయటం :)

అన్నిటికంటే అతి ఏమిటి అంటె వీళ్ల పాత కోపాలను, పత్తిత్తుల ఫోజులతో, ఆయా బాసులమీద పాత పగలు తీర్చుకోవటాం తమ తమ బ్లాగ్లలో, కొందరయితే మారు పేర్లతో, "చూ మంత్ర కాలీ" అంటూ!!

మీడియాను విమర్శించటం తప్పు కాదు కాని, తమ తమ ఇగో లు సంతృప్తి పరుచుకోవటానికో, లేక పాత కసులు తీర్చుకోవటానికో, అసూయతోనో విమర్శించటం చూస్తుంటే మాత్రం ఎక్కడో కాలుతుంది:(.

విశ్వామిత్ర said...

@కృష్ణగారూ....సాఫ్ట్‌వేర్ రంగాన్ని మించి మీడియాలో ఉద్యోగులు ఒక చోటనుండి మరోచోటుకు మారుతూ ఉంటారు. దానికి కారణాలు ఏమైనాగానీ మరి వారికి జనానికి చెప్పే నైతిక విలువలు, పవిత్రమైన జర్నలిజం వృత్తి లాటి విషయాలు వర్తించవేమో? దేవదూతలుగా తమను తాము చిత్రించుకొని జనాన్ని హారతులు పట్టమనడం ఏంతవరకు భావ్యమో? ఒక్క మాటలో చెప్పాలంటే జర్నలిస్టుకు ఉండే అహం బహుశా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉండదు.

Krishna K said...

"ఒక్క మాటలో చెప్పాలంటే జర్నలిస్టుకు ఉండే అహం బహుశా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉండదు." మా బాగా చెప్పారు. ఆ అహం తృప్తి పడక తోటి మీడీయా వాళ్లమీదో, అధిపతులమీదో బురదచల్లుడు కార్యక్రమాలు బ్లాగ్లోకం లో చూసే నేనా కామెంట్ వేసింది అండి, పత్తితుల కబుర్లు చెప్పె ఈ (మాజీ) మీడియా వాళ్ల మెడలో గంట కట్టినందుకు నా అభినందనలు.