కాంగ్రెస్ అనుకున్నది సాధించింది.తెలంగాణాకు జైకొట్టి సీమాంధ్రుల నోట్లో మన్ను కొట్టింది. సరే వారి కోరికమేరకు విభజన చెసినా సీమాంధ్రుల భయాలకు తగిన ధైర్య వచనాలు కూడా చెప్పకుండా తోసిరాజు అనడం కేవలం ఒక్క సోనియాకే చెల్లింది. నాకు కేసీఅర్ని చూస్తే ముచటేస్తోంది. పార్టీ్కోసం తెలంగాణాకోసం సోనియాను ముప్పుతిప్పలు పెడుతూ తనకోర్కెలన్నీ తీర్చుకుంటున్న కేసీఅర్ని చూస్తే ముచ్చటేస్తొంది. 2014 సంవత్సరానికి ఉత్తమ ప్రజా నాయకుడు ఎవరు అని పోటీ పెడితే ఖచ్హితంగాం కేసీఆర్ అని తెలంగాణా ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు కూడా వోటు వేస్తారు. ఉత్తమ ప్రజా వ్యతిరేక నాయకుడు ఎవరా అని పోటీ పెడితే సీమాంధ్రలో చాలా మంది తన్నుకు చావాలి ఆ స్థానం కోసం. వీళ్ళ మొహాలు మండ.. వీళ్ళు ప్రజా నాయకులా? సిగ్గు శరం అనేవి వీళ్ళలో ఒక్కరికైనా ఇసుమైంతైనా లేవు. విభజనకు అడ్డుపడలేకపోయినా కనీసం సీమాంధ్రాకు కావలసిన వసతులు తెచ్చుకోవడంలో కూడా వీరు ఘోరంగా విఫలమయ్యారు. వ్యక్తిత్వం లేని అనామకులు, పార్టీకి బానిసలు, పదవికి ఈసులు. వచ్చిన అరాకొరా ప్రయోజనాలు కేవలం బీజేపీవల్ల వచ్చాయి. అదికూడా వెంకయ్య నాయుడువల్ల అనే చెప్పుకోవచ్చు. బీజేపీకూడా సీమాంధ్రులను వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. సుష్మా గారికి చిన్నమ్మగా పిలుపించుకోవాల్నే ముచ్చట వల్లే వారు ఎటువంటి షరతులు లేకుండా తెలంగాణాకు సై అనడం అద్వాణీని కూడా కలవరపరచింది. ఇదంతా సీమాంధ్రుల ప్రారబ్ధం. పార్టీలను అమ్ముకుంటూ, నోటికి నరం, ఒంట్లొ రక్తం, బుర్రలో గ్జ్యానం లేని నాయకులను ఎన్నుకోవడంవల్ల జరిగిన విపరీతం. శ్రీకాకుళం పల్లెల్లో పెట్టిన 124 సెక్షన్ చెబుతుంది, ఈ నాయలుకు మనల్ని ఏంత కలవరపరిచారో. అక్కడి అల్లరులు చెబుతాయి మనల్ని ఈ నాయకులు ఏంత వంచించారో. కానీ సీమాంధ్రులు కష్టపడేవారు. ఇదొక్కటి చాలు మనల్ని మనం నిర్మించుకోవడానికి. ఇప్పుడైనా నోటుకోసం వోటు కాకుండా మన భవిష్యత్ కోసం వోటు వేద్దము. మనకోసం పనిచేయనివారి నడ్డి పగలగొడదాం. పదండి ముందుకు...!! జై ఆంధ్ర....జై తెలంగాణా !!
11 comments:
జై ఆంధ్ర....జై తెలంగాణా !!
"జేపీ ప్రతిపాదనల్లో కొన్ని కేంద్రం ముందుంచాం - వెంకయ్య" ఇదీ, 22న ఎంటీవీలో వచ్చిన న్యూస్. ఎవరేమన్నా సీమంధ్ర విషయంలో ఒక్క జేపీ గారే చిత్తశుద్ధితో ఎవరికీ అందని చక్కటి పరిష్కారం వెలికి తీసారు. మిగిలిన పార్టీలన్నీ నాటకాలాడాయి. మనస్పూర్తిగా మనకోసం పనిచేసిన వారిని మర్చిపోకూడదు.
ఉత్తమ ప్రజా వ్యతిరేక నాయకుడు ఎవరా అని పోటీ పెడితే సీమాంధ్రలో చాలా మంది తన్నుకు చావాలి ఆ స్థానం కోసం. వీళ్ళ మొహాలు మండ.. వీళ్ళు ప్రజా నాయకులా? సిగ్గు శరం అనేవి వీళ్ళలో ఒక్కరికైనా ఇసుమైంతైనా లేవు. విభజనకు అడ్డుపడలేకపోయినా కనీసం సీమాంధ్రాకు కావలసిన వసతులు తెచ్చుకోవడంలో కూడా వీరు ఘోరంగా విఫలమయ్యారు. వ్యక్తిత్వం లేని అనామకులు, పార్టీకి బానిసలు, పదవికి ఈసులు. ________ Rightto!!
హ హ .. వీళ్లని తిట్టడానికి తెలుగు లో తిట్లు కూడా తోచట్లేదు. మొహాన ఉమ్మేస్తే అది కూడా వృధా అయిపోతుందేమో!
కె సి ఆర్ తెలంగాణా ప్రజలని తర్వాత ఎందులో ముంచినా రాష్ట్ర సాధనలో మాత్రం మడమ తిప్పని వీరుడై నిలిచాడు.
ఎవరైనా అభినందించాల్సిందే!
@ విశ్వకర్మగారూ...జేపీ ప్రతిపాదనలు చేయడం నిజమే..కానీ వాటిని అందిపుచ్చుకున్నది కాంగీకన్నా వెంకయ్య నాయుడే అన్నదికూడా నిజం. వెంకయ్యనాయుడుకు సుష్మ & జెట్లీ పూర్తిమద్దతు ఇచ్చిఉంటే సీమాంధ్రులకు మరికాస్త ప్రయోజనం కలిగిఉండేది.
@సుజాతగారూ...కేసీఅర్ తరువాత ఏమిచెసినా చేయకపోయినా తెలంగాణా ప్రజల ఆకాంక్షకు(?) అనుగుణంగా నడుచుకున్నడనే చెప్పుకోవచ్చు.
జై తెలంగాణా, జై ఆంధ్ర, జై హింద్!
అదేంటో యెప్పుడు కాంగ్రెసు(అధినేత్రి)ని కలిసినా పార్టీ నుంచి మరో పురుగుని కూడా రానివ్వకుండా ఒఖ్ఖడే(!?) వెళ్తాదు. అక్కడ పొర్లు దండాలే పెడుతాడో గుక్క పట్టి యేడుస్తాడో పీక కోసుకుంటానని బెదిరిస్తాడో యెవరికీ తెలీదు.బయట కొచ్చి ద్డవిలాగులు మాత్రం దంచేస్తాడు.ఒక్క నెల రోజులే ఇంకొక్క నెల రోజులే అంటూ డేకించుకొచ్చి ఆఖరికి ఖాజీ సాయెబు గారు తురకల్లో కలిసి పోయాడన్నట్టు కాంగ్రెసులో కలిసి పోతున్నాడు.
కె.సి.ఆర్. కి అభినందనలు.
good one Viswa. mana rashtranni ela abhyudaya parachaalo ani naaku tochina konni amsalani neenu raasanu.. veelaite chudandi..
http://aakasam.blogspot.com
అధికారానికీ, అవినీతికీ అలవాటు పడ్డ హస్తిన పార్టీ మోసం, అడ్డగోలు విధానం అవలంబించైనా, అధికారం దక్కించుకుంటుంది. స్కాములకి అలవాటుపడ్డ కొత్తబ్బాయి పార్టీకి అధికారం ఇస్తే, మళ్ళీ స్కాములపైనే దృష్టి పెడతాడు. ఇక పుష్కర కాలంగా ప్రజల ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టీ కోట్లు దండుకోవడం మినహా ఆ ప్రాంతానికి ఏమీ చెయ్యని ముక్కాయన పార్టీ, అధికారంలోకొచ్చినా మరింకెలా ప్రజలను రెచ్చగొట్టచ్చని ఆలోచిస్తూ మందు కొట్టీ ఫాం హౌసులో పడుకుంటాడు. ఇక రెండు కళ్ళతో నిత్యం గోడమీదుండే పిల్లులు గాలెటు వీస్తుందా అని చూస్తుంటారే గానీ ఆదుకోరు. వాళ్ళ దృష్టి గాలి వీచే దిశ మీదే తప్పా జాతికి పడుతున్న దశ మీద ఉండదు. పాడు పనులు చేసేవాళ్ళు మంచి పనులు చేయ్యరు. కాబట్టీ మంచి జరగాలంటే మంచి చేసే పార్టీలే రావాలి.
జరుగుతున్న భీబత్సానికి సీమంధ్ర నాయకుల్ని తిట్టి ప్రయోజనం లేదు.విషయం చాలా జటిల మయినది.కేసీఆర్ ఆంధ్రా వాళ్లని తిట్తిన తిట్లు పెద్దగా పట్తించుకోవలసినవి కావు.అసలు ఆ రాజకీయ పార్టీ లన్నీ ఇంత సంఘీభావంతో యెన్నికలకు లోపే విభజనకు దాని తర్వాత విలీనానికీ ఇంతగా సహకరించుకుంటున్నది యెందుకో తెలుసా? 2014 యెన్నికల్లో తెరాసా లోని నక్సలైట్లని చట్టసభల్లోకి రాకుండా చెయ్యటం.ఒకసారి వాళ్ళు అధికారానికి వస్తే సహేంద్ర తక్షకాయ స్వాహా అంటూ లగడపాటి నుంచీ కేసీఆర్ వరకూ యెవ్వర్నీ వదలరు.ఉద్యమంలో ఈ చవక బారు తిట్లని యెవడూ (అన్నవాళ్ళే కాదు పడ్దవాళ్ళు కూడా)పట్టించుకోవడం లేదు కానీ ఆంధ్రా అధిపత్య వర్గాలు, ఆంధ్రా దోపిడీ దార్లు అంటూ రెచ్చిపోతున్న వాళ్ళని కట్టడి చెయ్యటమే అసలయిన చక్రవ్యూహం. నేను మొదట్లో చక్రవ్యూహం తెరాసా కి వేశారనుకున్నను నిన్నటి వరకూ. కానీ ఆ వ్యూహం అసలు టార్గెట్ తెరాసా లోనూ విభజన ఉద్యమం లోని ఆ భావజాల ప్రేరితుల్ని కట్టడి చెయ్యటం.
భాజాపా యెన్నికల తర్వాత వచ్చేది మేమే, మేము వచ్చాక అప్పుడిస్తాం అనే వ్యూహాన్ని కూడా మార్చుకుని ఇప్పుడే కాంగ్రెసు వ్యూహానికి అనుకూలంగా బిల్లుని పాస్ చేసింది కూడా అందుకే, అలోచించండి.ఇప్పుడే విడగొట్టాలి, విలీనం ద్వారా తెరాసా లోని నక్సలైటు భావజాలం తో ఉన్న వాళ్ళని 2014 యెన్నికల లో దూరంగా ఉంచాలి. అది యెన్నికల ముందు విభజించి విలీనం ద్వారానే సాధ్యం. కాంగ్రెసు, భాజపా, తెదేపా అనే ఈ మూడు పార్టీల ప్రధాన మార్గం. ప్రతిపాదించింది కేసీఆర్. అందువల్లనే కాంగ్రెసు అధిష్టానం తన సొంత పార్టీ వాళ్ళని కూడా కాదని అతనికీ అతని వ్యూహానికీ అంత ప్రాధాన్యత నిస్తున్నది.
Post a Comment