December 12, 2009

రోశయ్యా ఇదేమిటయ్యా?

అయ్యా రోశయ్యగారూ...సమైక్య ఆంధ్రా నినాదంతో కోస్తా రాయలసీమ ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. మీ సొంత పార్టీ ఎంఎల్ఏలు డబ్భై ఐదు మంది రాజీనామాలు చేశారు. మరో ఇరవై మంది మంత్రులుకూడా రాజీనామాలు చేయడానికి సిద్దపడుతున్నారు. మరి మీ సంగతేమిటి? తమిళనాడు, కర్నాటక గుంటనక్కలు రాష్ట్రాన్ని మీకు తెలియకుండానే ముక్కలు చేయాలని చూస్తున్నాయి. ఆపాటి ప్రాంతీయ అభిమానం మీకు లేదా? ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటున్న ఈ సమయంలో సమైక్యతకోసం ఆంధ్ర రాయలసీమ ప్రజల పోరాటం సబబు కాదా? మీరు ఎంతో కాలంగా రాజకీయలలో ఆరితేరిన వ్యక్తి. ప్రజల మనొభావాలు మీకు అర్ధం కాలేదా? మీరూ ఒక ఆంధ్రుడే, తరువాతే ముఖ్యమంత్రి. మీ పదవికి మీ పెద్దరికానికి మీ పార్టీపెద్దలే గౌరవం ఇవ్వనప్పుడు మీరు మీ ప్రతినిధుల స్వరాన్ని నిర్భయంగా ఢిల్లి కి తెలియచేయండి. మంత్రివర్యులు రాజీనామాలు చేస్తే మీ పదవి నుండీ మీరెలాగూ తొలగక తప్పదు. అది జరిగేలోగా మెజారిటీ ప్రజల మనోభావాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసి సగర్వంగా మీ రాజీనామాను కూడా తెలియచేస్తే ఢిల్లీ దిగిరాక తప్పదు. అప్పుడు ఆంధ్రా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మరువరు.

జై సమైక్య ఆంధ్రా !!


9 comments:

Sravya V said...

I heard that he sent his resignation already.

Anonymous said...

కె.సి.ఆర్ ను, రోశయ్య ను, సొనియాను ఆడిపోసుకొవడం తప్పు.

6 months back, ఈ సిగ్గులేని సమైక్య నాయకులు, సమైక్య వాదులు తమ తమ పార్టీలు తెలంగాణకు అనుకూలం అన్నప్పుడు ఏమి చేసారు ?

శరత్ కాలమ్ said...

అవును. వారు రాజీనామా చేస్తే గౌరవనీయంగా వుంటుంది.

Nrahamthulla said...

100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

శిశిర said...

అలా కలవడానికి యానాం ప్రజలే ఒప్పుకోవడంలేదండి. ఇంకా యానాం పుదుచ్చేరి ప్రభుత్వంలో ఉండడం వల్ల వచ్చే లాభాల కోసం చాలా మంది అక్కడికి వలస పోతున్నారు కూడా.

విశ్వామిత్ర said...

@a2zdreams:
సిగ్గులేని నాయకులు నాటకాలు ఆడారు. కాని వారి నాయకత్వాన్ని ధిక్కరించి రాజీనామాలు జరిగాయి. అటు కాంగ్రెస్, తెలుగుదేశం, పీఅర్పీ కూడా తమ పార్టీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఆడిన నాటకాలకు వారికి తగిన శాస్తే జరిగింది.

Bolloju Baba said...

యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
see this link for answers

http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html

bollojubaba

Anonymous said...

@viswamitra
అధినాయకులదే బాద్యత కాదు. వాళ్ళ నిర్ణయాన్ని అప్పుడు ఒప్పుకొని, ఇప్పుడు కాదంటున్న సమైక్య నాయకులది కూడా అంతే బాద్యత.

మీరు ఇదే పోస్ట్స్ తెలుగుదేశం, ప్రజారాజ్యం లు ప్రత్యేక తెలంగానకు ఓకే చెప్పినపుడు వేసి ప్రజలలో అవగహాన కలిపించి వుంటే బాగుండేది.

విశ్వామిత్ర said...

@a2zdreams:
నాయకులనే వారి పెద్దలు మాట్లాడనివ్వలేదు. ఇక ప్రజాభిప్రాయాన్ని ఎవరు అడిగారు? అందుకే ఇప్పుడు పార్టీలతో సంభంధం లేకుండా రాజీనామాలు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. మీరు ఆంధ్రా ప్రాంతం వారైనా తెలగాణా ఏర్పాటును మీరు సమర్ధించే హక్కు మీకెప్పుడూ ఉంటుంది. విమర్శించే హక్కు నాకు ఉంటుంది. :) )